శ్రీ యోగ వాసిష్ఠ సారము - 80 / YOGA-VASISHTA - 80
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 80 / YOGA-VASISHTA - 80 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 7 🌻 దేవతలను పూజించువారు దేవతలను, యక్షులను పూజించువారు యక్షులను; బ్రహ్మను ఉపాసించు వారు బ్రహ్మను పొందుచున్నారు. కాని ఏది యుత్తమమైనదో దానినే ఆశ్రయించవలెను. ప్రాపంచ వ్యసన కోశములున్నంత వరకు తాను ప్రధమమున పొందిన రూపమే గల్గి యుండును. అన్యము కాదు. విజ్ఞానులు శమదమముల చేతనే ముక్తి లభించునని అందులకు విరుద్ధముగు నెద్దాని చేతను, ముక్తి లభించదని సిద్ధాంతీకరించారు. వేపలో చేదు, చెరకులో తీపి, అగ్నిలో వేడిమి మొ.వన్నియు, వారివారి భావనలను బట్టి, అభ్యాసమును బట్టి మారు చుండును. చంద్ర సూర్య మండలము లందు నివసించు దేవతలకు వాటి వలన, బాధ కల్గుట లేదు. బ్రహ్మనందము కొరకు యత్నించు మనుజులు, తనువును, మనస్సును బ్రహ్మమయ మొనర్చిన బ్రహ్మ ప్రాప్తి కల్గును. చైతన్యము, దృశ్యమగుటచే బంధ హేతువగు కర్మ, అదియె మాయ, అవిద్య. మేఘములచే కప్పబడిన సూర్యుడు కనిపించనట్లు, ఈ బాహ్య దృష్టి వలన మనుజుడు, బ్రహ్మమును దర్శించలేడు. దృశ్యము అవిద్య...