శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA

Image may contain: 2 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 90  / Yoga Vasishta - 90 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻.  సృష్టి ఎలా యుత్పన్నమయినది  🌻

శ్రీరాముడు సత్యమైన పరబ్రహ్మము నుండి సృష్టి ఎలా వుత్పన్నమయినదో తెలుపు మనగా వసిష్టుడిట్లు చెప్పెను. 

బ్రహ్మమే ఈ జగద్రూపమున, బ్రహ్మముననే యూహింపబడుచున్నది. బ్రహ్మమందే వివిధ కల్పనలు సంభవించును. కారణము అవి సర్వశక్తి వర్జితము. చిదాత్మ ప్రధమమున, చిత్త సహిత జీవరూపము చెందుచున్నది. చిత్తము చేతనే అది కర్మమయ, వాసనా మయ మనోమయ శక్తు లన్నింటిని సంచయ మొనర్చుచున్నది. పిదప అట్టి శక్తులను ఫలరూపమున దర్శింపజేయుచు, మరల తిరోభావముచే నశింపజేయుచున్నది. జీవు లందలి, వివిధ సృష్టులై, సమస్త పదార్ధముల యొక్క ఉత్పత్తి బ్రహ్మము నుండియె నిరంతరముగ గల్గుచున్నది. మరల అతని యందే లయమగుచున్నది. 

అంతట శ్రీరాముడు, అగ్ని యందు, శీతలత్వము, జలమందు దహనశక్తియు, సంభవించిన విధమున, జడత్వమగు, అదృశ్యమగు బ్రహ్మము నుండి, యీ జగత్తు ఎట్లు ఉత్పన్నమగు చున్నది? బ్రహ్మము నుండి యుత్పత్తి అయిన, యీ బ్రహ్మము, బ్రహ్మము వలె గాక మనస్సు యింద్రియములుగా ఎట్లు మారుచున్నది. దీపము నుండి దీపము, మనిషి నుండి మనిషి, ఆవు నుండి ఆవు, యుత్తన్నమగును గాని, బ్రహ్మము నుండి యీ జగత్తు ఎట్లు యుత్పన్నమైనది, అని ప్రశ్నించగా వసిష్టుడిట్లు చెప్పుచున్నాడు. 

శ్రీరామా! సముద్రజలమున, తరంగములు స్పురించునట్లు ఈ సమస్తమునూ, బ్రహ్మండము నుండియె స్పురించుచున్నవి. అగ్ని యందు, వుష్ణత్వమున్నట్లు, యీ ప్రపంచమున బ్రహ్మము తప్ప, భిన్నమేమియు లేదు. 

అంతట శ్రీరాముడు, ఈ బ్రహ్మము రహితము అయిన, ఈ జగత్తు దు:ఖమయమై యుండనేల అని పశ్నించెను.

పూర్ణజ్ఞానము పొందని, బుద్ధిగల వానికి, ఇదంతయు బ్రహ్మమే అని ఎట్లు తెలియును? ఆత్మ శుద్ధి గల వానికిమాత్రమే అది అర్ధము కాగలదు. యింద్రజాలికులు, మాయచే అనేక క్రియల నొనర్చుచు; సత్తును అసత్తుగను,అసత్తును సత్తుగను జేయునట్లు, ఆత్మ మాయారహితమైనను, మాయామయముగనై, గొప్ప ఇంద్రజాలికునివలె, ఘటమును పటముగను, పటమును ఘటముగను చేయుచున్నది. ఆత్మ స్వరూపము గాని వస్తువు స్ధితి గల్గి యుండదు. ఆత్మకు బంధన స్ధానమగు, ఈ సంసార వృక్షమును, వివేకమను ఖడ్గముచే భేదించి, అద్దాని నుండి విముక్తి చెందవలెను. 

శ్రీరామా! బ్రహ్మము నుండి, జీవ శక్తులెట్లు ఉత్పన్నమగునో వినుము. సర్వశక్తి స్వరూపము, నిర్మల మగు బ్రహ్మమునకు చెందినదగు చిద్‌శక్తి సంకల్పముతో, ప్రధమమున, బహ్మదుల దేహాదుల రూపమున, విషయాకారమును బొందుచున్నది. అట్టి సంకల్పముచే, చైతన్యము, ఘనత్వము చెంది, జీవ, మనో,ఉపాది రూపమును పొందుచున్నవి. ఈ చిత్‌ స్వరూపము బాహ్యదృష్టికి శూన్యముగనే యున్నది. తదుపరి దశ, ప్రజాపతి సహితముగా, జగత్‌ కల్పన జరుగుచున్నది. ఓరామా! పదునాల్గు లోకము లందలి, అనంత ప్రాణి కోట్ల రూపమున ఈ సృష్టి యంతయు, చిత్తము నుండియే యేర్పడినది. 

ఈ బ్రహ్మండమున కొన్ని జీవులు, అజ్ఞానమందును, కొన్ని జ్ఞానమందును, మరి కొన్ని, జ్ఞాన అజ్ఞానములతోను యున్నవి. క్రమముగ, యీ జీవ జాతులందు, సత్వ, రజో, తమో గుణములు కల్గియున్నవి. వికారము, అవయవ నిర్మాణము మొదలగునవి ప్రత్యక్షముగ కన్పించుచున్నను, పరమాత్మ యందు, లేవు. కాని పరమాత్మ నుండియె, యుత్పన్నమగుచున్నవి. అగ్గి నుండి అగ్నియె యుత్పన్నమగునట్లు, పరమాత్మ నుండి ఆవిర్భవించునది, పరమాత్మ స్వరూపమే. భేద కల్పన కేవలము, మిధ్యయె అగును. మనస్సు యొక్క దృఢభావన చేతనే, జగత్‌ వ్యవహారము సంభవించుచున్నది. 

ప్రత్యగాత్మ, మనోబుద్ధులు, శబ్దార్ధముల చైతన్యము, ఇవన్నియు బ్రహ్మమే. బ్రహ్మము లేనిచో, నిదియుత్పన్నము కాదు. మాలిన్యము నశించిన పదార్ధము యొక్క యదార్ధ స్వరూపము, ప్రకటితమగుచున్నట్లు, రాత్రి యందలి అంధకారము నశింప, దృశ్యజగత్తు గోచరించునట్లు, అజ్ఞానము నశించిన, బ్రహ్మపదము వ్యక్తమగును. ఓరామా! అనేక జన్మలందలి సుకృతములచే, శుద్ధాంత:కరణ రూపమున పరిణమించిన అవిద్య, ఉపదేశాది వాక్కుల ద్వారా, సర్వదోష నివారిణి యగు జ్ఞానము (విద్య) లభించుచున్నది. మాయ వివేకమును కప్పి వేయుచున్నది. అనేక జగత్తుల నుత్పన్నము చేయుచున్నది. ఈ మాయను దర్శించిన, అది నశించుచున్నది. యీ మాయ అసత్యమైనను, సత్యముగనే భాసించుచున్నది. 

పరమార్ధ స్ధితి యందు మాయ, లేదను నిశ్చయము గల్గి; క్షరమును, విశాలమును నగు యీ బేద మంతయు కలుగ జేయుచున్నది. మనస్సంబంధమును, మనస్సు యొక్క మననముచే, విశాల రూపమున నుదయించినదియు నగు, ఈ దృశ్యమంతయు,మనో విలాస రూపము మాత్రమే అగుటచే, అసత్యమైనది. దేహేంద్రియాదు లందెవనికి, అహంభావము కలదో, యాతడే బ్రహ్మము నెఱుగక అవిద్యావంతుడగును. దు:ఖముల ననుభవించును. ఆత్మ జ్ఞానా నుభవము, శాస్త్రార్ధములచే, సంప్రాప్తించుచున్నది. అది లేనిచో, అవిద్యానది నెవ్వరు దాట జాలరు. ఇది హృదయ స్ధానము నాక్రమించినది. అవిద్యను బల పూర్వకముగ నశింపజేయుము. అట్లొనర్చిన మఱల జన్మ దు:ఖమున నిన్నుబడ ద్రోయకుండును.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 90 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 STHITHI-PRAKARANA - 10 🌴

🌻 THE STORY  OF DAMA, VYALA AND  KATA - 5 🌻

It  is  only  through  desires  that persons,  whether  they  are  pure  or  omniscient  or all-puissant,  do  get  trammelled  in  this  world.  Even persons,  who  are  in  a  high  state,  fall  low  through their  desires,  like  a  lion  in  a  cage.  Therefore  do  not be  disheartened.  With  these  words,  Brahma instantaneously  disappeared  at  the  very  spot where he was.   

The  Devas  having  heard  these  words  of  Brahma, while  in  the  full  possessions  of  their  five  faculties of  organs,  departed  for  Deva  loka  and  there  caused large  kettle-drums  to  be  sounded  for  war  so  as  to reverberate  through  earth  and  the  rest  of  the  whole universe*.  Having  heard  these  sounds,  the  Asuras rushed  with  great  ire  from  Patala  to  Deva  loka  and hurled  at  their  enemies  all  kinds  of  destructive weapons  -  The  latter,  who  were  bent  upon  merely eking  out  the  time  according  to  Brahma  s injunctions,  made  the  pretence  of  fighting  and retreating  again  and  again.  Thus  did  a  long  period of  time  elapse,  the  war  being  waged  in  diverse ways,  when  the  insidious  desire  of  „I‟  stole  into  the hearts  of  the  three  Asuras  through  such  a  process of  warfare,  and  their  minds  got  trammelled.  Then fear  was  generated  in  their  hearts  and  all  kinds  of delusions  took  firm  hold  of  them.  Being  drowned in  the  pain-giving  Maya  and  emaciated  through pains,  they  were  at  a  loss  what  to  do.  Then  in  order to  preserve  their  body  from  deterioration,  they began  to  deliberate  upon  the  many  means  of enjoying  happiness  through  the  illusory  worldly things.  Being  ever  engaged  in  this  thought,  their minds  got  enthralled  and  unsteady.  On  the battlefield,  consternation  and  depression  of  mind arose  in  them  and  they  were  appalled  at  the  idea  of death-  Hence  they  were  greatly  agitated  in  their hearts  and  looked  about  for  a  safe  asylum.  Being completely  denuded  of  all  powers,  they  were  not able  to  face  even  an  antagonist,  should  he  face them.  Were  there  no  fuel,  will  Agni  (fire)  be  able  to consume  anything  and  offer  oblations  to  the Devas?  To  cut  the  story  short  without  many  words, the  three Asuras  fled  away panic-struck and  died.   

Now  Rama,  we  have  related  the  story  of  the Asuras,  Dama  and  others  in  order  that  you  may attain  Jnana  thereby  (through  not  falling  into  their wrong  path).  If  the  minds  of  persons  should sportively  associate  themselves  with  Ajnana  (or worldly  things)  without  any  impediment,  then  the pains  of  existence  arising  through  such  Ajnana, will  never  affect  them.  Therefore  you  should  not follow  the  path pursued  by the  above three Asuras.   

Continues..
🌹 🌹 🌹 🌹 🌹

Date: 25/Oct/2019  

------------------------------------ x ------------------------------------



∙∙·▫▫ᵒᴼᵒ▫ₒₒₒ▫ᵒᴼᵒ 𝐌𝐨𝐫𝐞 𝐦𝐞𝐬𝐬𝐚𝐠𝐞𝐬: 𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐬𝐨𝐨𝐧.... ᵒᴼᵒ▫ₒₒₒ▫ᵒᴼᵒ▫▫·∙∙

------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------

------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------
------------------------------------ x ------------------------------------


░▒▓ శ్రీ యోగ వాసిష్ఠ సారము - 𝟐𝟑𝟑 / 𝐘𝐨𝐠𝐚 𝐕𝐚𝐬𝐢𝐬𝐡𝐭𝐚 - 𝟐𝟑𝟑 ▓▒░

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 30 🌴
🌻. అహంకారము - 1 🌻

జ్ఞాని, అజ్ఞానులయొక్క అహంకారమును గూర్చి విశేషజ్ఞానమును, జ్ఞానముచే బోధితమగు దృశ్యమును వర్ణించుట జరిగినది. 

నిర్వాణ ముదయించిన జ్ఞానిని కూడ, అహంభావమెట్లు బాధించునని శ్రీరాముడడుగగా, వసిష్ఠుడిట్లు చెప్పెను. 

ఓ రామచంద్రా| ఈ విశేషమును వినుము. అందువలన చిత్తము విశ్రాంతినొంది అహంకారము శమించిపోవును. 

దీపముగల వానికి అంధకారము లేనట్లు, విచారించి చూచినచో అజ్ఞానము జ్ఞానికి లభించజాలదు. కాన వాస్తవముగ అది లేనిదే అగును. పంచేంద్రియములతో గూడిన ఈ జగత్తు, మనస్సు వలన నిరాకార బ్రహ్మమునెట్లు గాంచగలదు. 

ఎచట బీజము లేదో, అచట అంకురములేదు. కావున కారణములేక కార్యములేదు. సృష్ట్యాదియందే నిష్కంటకమగు బ్రహ్మాండముయొక్క అనుభూతి శూన్యమే అగును. చిదాకాశమే, చిదాకాశమున స్థితికల్గియుండ నిక సృష్టి ఎచట, అవిద్య ఎచట, అజ్ఞానమెచట. 

అంతయు శాంతమై,చిన్మయమైనట్టి బ్రహ్మమే అయివున్నది. ఇట్లు అహంభావమను పిచాచమును, నేనెపుడు పూర్ణముగ నెఱిగియుంటినో, అపుడది నాకు యున్నప్పటికి లేనిదేయగును. ఓ రామా| నేనహంభావమునకు చెంది యుండలేదు. 

ఓ రామా| ఈ దృశ్యభావమంతటిని తొలగించి శిలామధ్యభాగమువలె, ఆకాశమువలె, నిర్మలాకృతి గల్గి స్థిరాత్మరూపమున స్థితిగల్గి యుండుము. 

దృష్టిభేదముచే సృష్టిశోభ సదా సర్వత్రయున్నది. లేకయున్నది. ఈ ప్రకారముగ పాషాణాఖ్యాయిక నిచట వర్తింపబడినది. 

రంధ్రములు లేని, ఘనశిల మధ్యభాగ మందు పరబ్రహ్మమందు అనేక సృష్టులు గలవని ఇందు తెలుపబడుచున్నది. అట్లే శూన్యాకాశమందు, అనేక సృష్టులు గలవని తెలుపబడుచున్నది. అలానే అంకుర, లతలు సమస్త ప్రాణులందు, వాయుజలాగ్నులందు కూడ అనేక సృష్టులుగలవని తెలుపబడుచున్నది. 

ఈ దృశ్యము ఆదియందు ఉత్పన్నము కాలేదు, ఇపుడును ఉండి యుండలేదు. ఈ భాసించునదంతయు బ్రహ్మమే, బ్రహ్మమందు స్థితిగల్గియున్నవి. అలాగే ఈ గాఢమగుప్రతి పరమాణువునందు సృష్టి సమూహములు గలవు. 

కాని నిజానికి ఈ పృధివి సృష్టులేవియు లేవు. అట్లే అగ్ని, జల, వాయువు, ఆకాశమందు పంచభూతములు బ్రహ్మాండములచే పూర్ణములైయున్నవి. కాన అవన్నియు చిదాకాశములే. స్వయముగ బ్రహ్మదేవునియందు, బ్రహ్మాండములందు, బ్రహ్మమే కలదు. సృష్టియే పరబ్రహ్మము, పరబ్రహ్మమే సృష్టి. 

ఓ రామ| నీవు నేను పర్వతశిఖరములు, దేవతలు, అసురులు మొదలగు సమస్త దృశ్యమును కేవలము చిదాకాశమే. 

సమాధి యొక్క విరామమున సూక్ష్మమైన ధ్వనిని వినుట, దానిమూలమును అన్వేషించుటలో అనంతకోటి జగత్తులు ప్రతీతియగుట ఇచట వర్ణించబడినది. 

సమాధి నుండి బయల్వెడలిన పిదప ఒక సూక్ష్మమైన ధ్వని స్త్రీ కంఠమునుండి బయల్వెడలిన దాని వలె, ఆనంద జనకమైనదియు, రోధన పఠనము కానిది,భ్రమరశబ్ధముతో సమానమైనదైయుండును. 

అట్టి శబ్ధము ఈ శూన్యాకాశములో ఎచటినుండి వచ్చుచున్నదని, అదియును స్త్రీ శబ్ధమువలె యున్నదని, ఇట్లు విచారించుచు తుదకు ఈ శరీరమును త్యజించి, చిదాకాశమై ఆకాశముతో ఏకమై, భూతాకాశ శబ్ధమును దాని అర్ధమును గ్రహించెదనని తలచి అటులనే చిదాకాశముగ మారి ఆకాశముతో యైక్యము కాగ, క్రమముగ ఆకాశమునుండి విడివిడి బుద్ధిరూపమును పొంది, పిమ్మట దానిని వదలి చిదాకాశమున జగత్తుకు తర్పణమైతిని. 

ఆ జగత్తులోని భూతాకాశరూపమును పొందితిని. తదుపరి చిదాకాశ రూపుడనైతిని. అందు నే ననేక ముల్లోక సమూహములను, వందలకొలది జగంబులు, లక్షలకొలది బ్రహ్మాండములు, వీక్షించితిని. 

ఆ బ్రహ్మాండములు పరస్పరము గాంచబడకయున్నవి. నిద్రించుచున్న మనుజుని స్వప్నమందు, ఆకారములు శూన్యములతో కూడియున్నవి. 

అచ్చట లనేక బ్రహ్మాండములలు పుట్టుచు గిట్టుచున్నవి. అందు వివిధ జగములచే గావింపబడిన వివిధ మనోరాజ్యముల వంటివి,వివిధ ఆవరణములు గల్గిన బ్రహ్మాండములు గాంచితిని. 

వివిధ భూతలములు, భూమి, వివిధ ప్రాణులు, దిక్కులు,కాలము, సిద్ధ, విద్యాధరులతో గూడియు, దేవతలు బ్రాహ్మణులు మనుష్యులు కీటకములతో కూడినవైయున్నవి. 

అరటి పట్టువలె ప్రతి పరమాణులను, మరల దాని లోపల, ఇంకను దానిలోపల ఎన్నియో బ్రహ్మాండములు ఉత్పన్నమై, వర్తించుచున్నవి. పరస్పరము వేరువేరు స్థితులు, క్రియలుగల్గి, అన్నియు చిదాకాశరూపమైయున్నవి. 

వాటి అనుభవము, భ్రమాత్మకమగుటచే, ఉన్నవి లేనివిగా నున్నవి. పరమాత్మ,పృధివి స్వర్గాది లోకములను నిర్మించెనని, ఇవలన్నియు చిదాకాశరూపమగు బ్రహ్మఏ అనియు,అవి స్వతసిద్ధమగు రూపముగలవగును. 

పదునాల్గులోకములు, పదునాల్గు విధములుగ (దేవయోనులనుబట్టి) మనుష్యజాతి, పలువిధములుగను,ఇట్లు వివిధ రీతులును, భూతకోట్లతోగూడి అనేక జగంబులు మరల మరల యుత్పన్నమగు చున్నవి. 

ఇతరములు కూడ యుత్పన్నమగుచున్నవి. స్వర్గ, నరక పాతాళములతో కూడినది; బంధు మిత్రాదులమయమగు ఈ జగత్తులన్నియు శూన్యరూపములేయై యున్నవి. 

ఓ రామా| అట్లు నేను ఆ సమాధి స్థితిలో ఆనంతాకాశమందు కారణములేకయే జనించునవి, కారణములేకయే నశించునవి, భ్రాంతి మాత్రస్థితమునగు, అనేక జగత్తులను వీక్షించితిని. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 ░▒▓ 𝐘𝐨𝐠𝐚 𝐕𝐚𝐬𝐢𝐬𝐡𝐭𝐚 - 𝟐𝟑𝟑 ▓▒░ 🌹

✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 63 🌴
🌻 9. THE STORY OF SIKHIDWAJA - 29 🌻

To which the lady replied: Observing you drooping under the many actions of Tapas (penances) in the forest, I came with great effort in quest of you to elevate you above Samsara. Hence there is no necessity for you to eulogise me thus, as I but did my duty. 

Have you not, O my husband, freed yourself from all petty worldly actions, Sankalpas (thoughts) and Vikalpas (fancies)? Then the King said: „All doubts have now vanished out of my mind. 

I am devoid of desires and the idea of heterogeneity. I have become as immaculate as Akasa. I shall never hereafter fall through becoming of the form of (or, thinking about) objects. 

I have attained the incomparable Samadhi, the highest thing worthy of being attained. I am free from mental joy or dire pains. I shall never here after shine as this or that (object). 

I am like the pure light of the resplendent sun s sphere, which does not come into contact with any medium such as a wall, etc., and is therefore subject to no increase or diminution. I am like the Akasa which permeates all objects, and is yet undefiled. 

I am of the nature of Absolute Consciousness. I can now cognise my Reality to be no other than That. Therefore you are my wellfavoured Guru. I worship your lotus feet‟. At which Chudala asked him as to his future course of action. 

To which the King said: I am free from all love and hatred. From this day forward, I shall daily perform my duties strictly according to your dictates, like a crystal tinged with the five colours. 

Then Chudala said thus: If you are willing to act up to what I say, it behoves you then to now give up all your ignorance and resume the regal duties once relinquished by you. 

Let us both wield the sceptre of our kingdom for some time as Jivanmuktas and then attain Videhamukti, after the body is thrown aside. To this the King acquiesced. Then Chudala rose up and, through dint of her concentrated San- kalpa, she acted as follows: 

She then and there first anointed him by bathing him in jewelled vessels full of the waters of the seven oceans, and then, having installed him on an effulgent throne bedecked with rubies, etc., blessed him with a long life. 

Then the King and his wife Chudala, who were both of one mind, mounted upon a decorated elephant and went back to their town with their four-fold army amidst great rejoicings. 

As soon as they reached the outskirts of their town, the four-fold army in their town came in advance to meet them. Thus both the armies joined together and went gaily along. 

There the King reigned with true love along with his wife for I0000 years, and then attained a disembodied emancipation. 

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

16.Mar.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 234 / Yoga Vasishta - 234 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 31 🌴

🌻. అహంకారము - 2 🌻

ఆ శబ్ధమొనర్చిన స్త్రీని వసిష్ఠుడు సమాధియందు దర్శించుట, ఆమెనుపేక్షించి అనేక విచిత్ర జగంబులను గాంచుట.

ఓ రామా| అట్లా స్త్రీయొక్క శబ్ధకారణమునన్వేషించుచు నలుదశల వెదకుచు, చాలాకాలము వెదకి చివరకు ఆ శబ్ధము వీణానాదమువలె వింటిని. 

ఆ శబ్ధము కలుగు ప్రదేశమున నా యోగదృష్టి పడగనే, సువర్ణ ప్రకాశము వంటి కాంతిచే ప్రకాశించు ఒకస్త్రీని జూచితిని. ఆమె చంచలములైన వస్త్రములు, ఆభరణములు ధరించియున్నది.

అందమైన కురులతో రెండవ లక్ష్మివలె, అతి రమణీయములైన సువర్ణమువలె, గౌరవర్ణముగల, అవయవలముతో, నవయౌవనముతో వనదేవతవలె పూర్ణచంద్రునివంటి ముఖముతో, ఆ విలాసవతి, మందహాసముతో నాసమీపమునకు మృదుమధుర స్వరంతో, ఆర్యశబ్ధముతో పలకరించెను. రాగద్వేష, కామ, క్రోధాది ద్వేషములు లేనట్టి సంసారమును చరించువారికి ఆలంబనమైన నోమునేంద్రా, మీకివే నానమస్కారములు, యని పల్కగా నేను ఆస్త్రీని గాంచి, ఈమెతో నాకేమి ప్రయోజనమని తలచి ఆమెను పేక్షించి అచటనుండి వెడలితిని. 

తదుపరి అనేక జగత్‌రూపములగు మాయను,అంలోకించి ఆశ్చర్యమొందితిని. ఆ మాయను కూడ ఉపేక్షించి ఆకసమున సంచరించుటకు ఉద్యుక్తుడనైతిని. 

ఇంతలో ఆ ప్రపంచములన్నియు, స్వప్న సంకల్ప కథాజగత్తువలె శూన్యముగ గన్పట్టినవి. 

ఈ జగబుంలు బ్రహ్మాండముల కల్పాంతములన్నియు, ఒకదాని వృత్తాంతము మరొకదానికి తెలియక యున్నవి. ఈ బ్రహ్మాండములందు, వేలకొలది రుద్రులు కోట్లకొలది బ్రహ్మదేవులను, లక్షలకొలది విష్ణువులను గాంచితిని. 

ఈ జగత్తులందొకచోట సూర్యరహితమై రాత్రి పగలులేని చిద్వస్తునందు, సంకల్ప, వికల్పముల ఊహామాత్రముచేతను సమస్తముయొక్క క్షయోత్పత్తులు సంభవించుట నేను గాంచితిని. అట్లు చైతన్యమొకింత నామరూపాత్మకముగ నగుట ఏదికలదో, నదియే పదార్ధముల యుత్పత్తియగును. 

ఎపుడా చైతన్యమే ఆకాశముకంటే శూన్య తమమైనట్టి రూపముచే చెప్పబడునో, అపుడు నామరూప రహితమగుటచే పదార్ధముల క్షయమగును. 

ఆ సమాధియందు అంతిమ సాక్షాత్కార వృత్తిరూపకమగు ఆకాశమున, నావిర్భూతమైన చిదాకాశముతోటి ఏకత్వమొందినవాడనై సర్వవ్యాప్తినై, అనంతరూపుడనైనప్పుడు నిస్సంకల్ప పూర్వకముగ సమస్తమును బ్రహ్మాకాశరూపమే అనుభవమును పొందితిని. 

ఆయా జగంబులందు నావంటివారు,వసిష్ఠుడను పేరుగలవారు, బ్రహ్మపుత్రులు అనేక మునీశ్వరులను గాంచితిని. 

ఓ రామచంద్రా| రామావతార సహితములగు డెబ్బదిరెండు త్రేతాయుగములు,నూరు కృతయుగములు,నూరు ద్వాపరయుగములనుగూడ గాంచితిని. శిలవలె మౌనరూపమై నామరూపవర్జితమై, జ్యోతి స్వరూపమైనట్టి బ్రహ్మమే ఇట్లు జగద్రూపముగ నున్నదని చెప్పబడినది. 

అనేక జగత్తులందు, కొన్నిచోట్ల చంద్రబింబములు ఉష్ణముగను, సూర్యబింబములు శీతలముగను అనుభూతమగుచుండెను. అచట కొందరు శుభకర్మలచే నాశము,అశుభకర్మలచే స్వర్గమునకు జనుచుండిరి. కొందరు విషభక్షణముచే జీవించుచుండిరి. కొందరు అమృతభక్షణముచే మరణించు చుండిరి. 

సత్యాసత్యములు చిరకాల దృఢ అభ్యాసముచే హితము అహితము ఎట్లు నిర్ణయించబడుచున్నదో,అది కర్మ వశముచే భోగకాలమున శీఘ్రముగ ఆ రూపమునే పొందుచున్నది. కొన్నిచోట్ల ఇసుకనుండి తైలమును అట్లే శిలనుండి పుష్పములు లభించుచుండెను. 

కొన్ని జగంబులందు అనేక విధములగు ప్రాణులు,మరికొన్ని ఒకే విధములగు జీవులతోడను గూడియుండెను. కొన్ని చోట్ల సంకేతములతో వ్యవహరించు మూగజీవులు, కొన్ని జీవులు నేత్రేంద్రియములు లేనివారు ఉండిరి. 

కొన్నిచోట ఘ్రానేంద్రియములు లేక, పిచాచముల వలె వెలయుచుండిరి. ఇట్లు చిదాకాశమున అనేక జగంబులు భాసించుచున్నవి. ఓ రామచంద్రా, చిదాకాశమునగల దిక్కులందు,అనేక బ్రహ్మాండములందు అనేక విధముల జీవులు గలవు. 

బ్రహ్మమునెరుగనిచో,జగత్తు నశించినను, నశించనిదే అగును. బ్రహ్మనెరిగిన భూత, భవిష్యత్‌, వర్తమానములందు జగత్తు లేనిదే అగును. 

మహా కల్పాంతమున పృధివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు తదితర పదార్ధములు నశింప, బ్రహ్మమొదలు స్ధావరముల వఱకు గల సమస్త ప్రాణులు ముక్తిపొంద, మిగిలినది బ్రహ్మమే అయిన పరమాత్మ తన హృదయమును జగత్తుగ ఎరుగుచున్నారు. వినోదమాత్రము కొఱకే,మేము దానిననుభవించెదము. 

ఆకాశమందును, పరమాణువుయొక్క సహస్రాంశమందును గూడ, ఏ శుద్ధ చిన్మాత్ర సత్తుగలదో అదియే ఈ పరబ్రహ్మము. చిదాకాశము యొక్క అవయవమే ఈ సృష్టి. ఈ సృష్టియొక్క అవయవములే, నాశోత్పత్తులు. 

ఈ పరమాత్మ చైతన్యము భేదింపబడదు. దహింపబడదు, తడుపబడదు, ఎండింపబడదు. దీనిహృదయమే జగత్తు. మహాప్రళయాదులు ఆ బ్రహ్మముయొక్క అవయవములే యైయున్నవి. 

మనస్సుచే కల్పింపబడిన యక్ష,గంధర్వ నగరాదులు, మనోరూపమునే పొందుచున్నట్లు, చైతన్య సంకల్పమైన ఈ జగదృశ్యము నిరాకారమై నిర్మలమైనట్టి చిన్మాత్రరూపమునే పొందుచున్నది.

వృక్షముయొక్క యునికికి,వృక్షచైతన్యమే మూలమైనట్లు పదార్ధ ఘనమగు,ఈ జగత్తు యొక్క యునికికి, చైతన్యమమే మూలమైయున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 234 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 64 🌴

🌻 10. THE STORY OF KACHA - 1🌻

Summary: Again is illustrated that Chitta- Tyaga alone constitutes the renunciation of all. 

In the previous story I have related to you the story of Sikhidhwaja, the most enlightened of persons. 

If you art as ripe as he, you will never be affected by dire pains. Following the same path is the learned Kacha, the son of Brihaspati, the Deva-guru 137. 

You should be acquainted with his story also. Rama asked: Please throw light upon the path through which Kacha came into direct cognition of the Supreme. 

Note : 137 Brihaspati, Jupiter is the Guru or priest of Devas.

Vasistha replied: Muni Kacha, the son of Brihaspati, who had known the substratum of all things through a know ledge of the higher seat, approached the Deva-guru, his father for enlightenment upon the best means of divorcing the dire elephant of Prana from the care of mundane existence. 

Deva-guru said thus „This large expanse of the ocean of births, wherein do live the countless hosts of crocodiles, fishes, etc., can be bridged over only by the incomparable power of all-renunciation, involving great troubles and responsibilities.‟ 

At these words of his father, Kacha abdicated all things and retiring into the forest, lived there for eight years, at the end of which period, he was visited by his father. 

Having greeted his father with due respects, he asked him the reason why in spite of the renunciation of all for about eight years, his mental pains had not subsided- To which his father replied merely that he should give up everything and departed. 

After the departure of his father, he denied himself of even the barks of trees, cloths, etc., he had on. Thus was he stark naked, like a clear sky in the autumnal season, when the sun, moon, stars, etc., are clearly visible in the skies. 

Again did Kacha visit his father and having prostrated himself lovingly before him, laid before him in plaintive tones the fact of his inability to get quiescence of mind, albeit the complete renunciation of all things. 

Thus did he consult his father who gave him the following advice „It is the opinion of the great that the mind is the all-in-all and that its mastery leads to the renunciation of all. Through such a mental abnegation it is, that you will be able to free yourself from ail pains.‟ So saying, Brihaspati (Jupiter) vanished. 

Thereupon the resplendent Muni Kacha soliloquised to himself thus „I have been inquiring as to what mind is and have not been able to come to any conclusion. 

If the body with its parts is different from the mind, then all our efforts to separate them both are useless; for how can the separation take place between the mind and the body, while they are themselves different from one another?‟

All his doubts about mind not being resolved, he again applied to his father to aid him in the solution of his doubts. 

Continues......
🌹 🌹 🌹 🌹 🌹

17.Mar.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 235 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4.  నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 32 🌴
🌻. అహంకారము - 3 🌻

ఒకచోట భవిష్యత్‌ కాలరూపమునగు, ఒకచోట వర్తమాన కాలరూపమునగు, ఒకచోట భూతకాలరూపమునగు, ఒకచోట సృష్టి, ఒకచోట ప్రళయము ఇట్లు వివిధ కల్పనారూపములచే ఆత్మయగు బ్రహ్మమే నిశ్చలముగ స్థితిపొందుచున్నది. 

ఈ సమస్త జగత్‌ భ్రమలకు ఆత్మజ్ఞానము లేకపోవుటయే కారణమైనది. దృశ్యమునుండి మరలించి, ఆత్మవైపు దృష్టి నిలిపిన ఈ జగత్‌భ్రమ నశించిపోవుచున్నది. 

ఈ ప్రకారముగ వివేకదృష్టిచే నిశ్చయించి, అధికారియగు జీవుడు, అణిమాధ్యష్ట సిద్ధులను, ఈశ్వరత్వమును కూడ మాయామాత్రమని ఎఱిగి,యద్దానిని తృణమువలె జూచుచు నిరతిశయానంమయుడై, స్వాత్మయందే సుస్థిరుడైయుండును. 

చిదాకాశరూపుడగు వసిష్ఠుడు బ్రహ్మాండములన్నింటిని తన దేహమువలె గాంచుట, తమ స్వప్న సదృశ్యమైన ఆకాశరూపిణియగు స్త్రీతో సంభాషించుట. 

నేనెపుడైతే చిదాకాశరూపుడనైతినో,నేను గమనశీలుగనైయుండలేదు. నేనచట స్థితినొందియుండలేదు. నా ఆత్మయందే ఈ జగత్తుల గాంచితిని. నాకు చర్మనేత్రము లేకున్నను, చిద్రూపనేత్రముచే, నేనపుడు అనేక జగంబులను నాయందు చూచితిని. 

(ఆత్మ) ఆ స్థితిలోననున్నపుడు స్వకీయ జ్ఞాననేత్రముచే నేనాజగంబులనన్నింటిని, నా అవయవములుగ గాంచితిని. జగంబులను నాయందు గాంచితిని. నేనేకాదు,బోధ స్వరూపమగు ఆత్మతోటి ఏకత్వమొందిన వివేకులందరును, నాతోటి సమములుగ ఏకరూపులైయుందురు. 

ఇట్లు సర్వాత్మ స్వరూపదృష్టి పరిపక్వముకాగ నపుడు విజ్ఞాన స్వరూపమగు ఆత్మలో, సమస్తము యొక్క ఏకత్వమనుభవించును. 

యోగాదులచే సిద్ధులబడసిన మనుజుడు,పర్వతము పైనుండి తన దివ్య దృష్టిచే,కోట్లకొలది యోజనముల దూరమున ఉన్న, బాహ్యాభ్యంతర సదార్ధములనెరుగునట్లు, నేనున్ను సమస్త లోకముల నెరిగితిని. అపుడు మున్ను ఆకాశములో నన్ను ప్రసంసించిన యాస్త్రీ, ఆకసమున దేవివలె నాసమీపముననుండెను. 

నావలె ఆమెయు చిదాకాశమే. స్వప్నమందు చిదాకాశమే బాహ్యాభ్యంతర రూపములుగ ఉదయించినట్లు, ఆ సమాధియందాదృశ్యము చిదాకాశరూపముగనే యుండియుండెను. 

స్వప్నమందు యుద్ధ కోలాహలములు, వాస్తవముగ లేకున్నను మనుజులు అనుభవించుచున్నట్లు, ఈ జగత్‌స్వరూపము లన్నియు అనుభవింబడుచున్నవి. 

బోధ కొరకు స్వప్నమని చెప్పినప్పటికి వాస్తవముగ ఈ దృశ్యము సత్తు,స్వప్నము కాదు. కేవలము బ్రహ్మమేయగును. అటు పిమ్మట అనురాగవతియు, దృశ్యరూపిణియునగు ఆ స్త్రీయొక్క అభిప్రాయము నెఱుగగోరి, నేనామెను తన అభిప్రాయమడిగితిని. 

ఈ జగత్తు ఆత్మతో స్వప్నమే అగును. స్వప్నమందలి ఏ ద్రష్ట,దర్శన,దృశ్యములు నిర్మల చిదాకాశములే అయినట్లు, జగత్‌రూపమును నిర్మల చిదాకాశమే. 

సాకారులైన జీవుల స్వప్నము చిదాకాశమైన నిరాకార బ్రహ్మము యొక్క ఈ జగత్తు, చిదాకాశమనుట సత్యము. ఓ రామా| వాస్తవముగ కర్తృత్వముగాని, భోక్తృత్వముగాని, జగత్తుగాని లేవు. బ్రహ్మమే కలదు. ఈ శరీరము ప్రారబ్ధ శేష పర్యంతముండినను లేకున్నను సరియే. 

అజ్ఞాని దృష్టియందు, అనంతములైన దృష్టులు గలవు. జ్ఞాని దృష్టిలో చిద్ఘన మాత్రమే యైన ఏకమగు బ్రహ్మము కలదు. అంత శ్రీరాముడిట్లు ప్రశ్నించెను.

నిరాకారమగు దేహముచే, ఆ స్త్రీతో తమ వ్యవహారమెట్లు సంభవించినది? తామెట్లు మాట్లాడగల్గిరి? అని అడగగా వసిష్ఠుడిట్లు పలికెను. చిదాకాశమే శరీరము కాగ, శబ్ధములనుచ్ఛరించు అవసరములేదు. 

అవి కల్పనలే. స్వప్నమున శరీరాదులు లేకనే వచనాది వ్యవహారము సంభవించుచున్నది. మరియు మృతునకు శరీరమున్నప్పటికి వచనములేదు. స్వప్నమందు వచనమున్నచో,అతని సమీపమునందున్నవానికి, అవివినబడునుగదా. 

కాన స్వప్నమందలి విచారణ నిజము కాదు. భ్రాంతియే స్వప్నదేహములందు చిదాకాశమే, శబ్ధరూపము పొందుచున్నది. ఈ జగత్తులన్నియు నిక్కముగ స్వప్నరూపములే. స్వప్నమువలె అవి ఆత్మకంటే భిన్నము కావు. స్వప్నమందు మరల స్వప్నము తోచినట్టు, ప్రతి జగంబులోను మరల పరస్పరము ఒకదానికొకటి గాంచకున్నవి. 

అటనిద్రించు జీవులు, స్వప్న జగత్జాలముపొంది అచట కల్పింపబడిన పగటియందు, సర్వ వ్యవహారములు నాచరించుచున్నారు. అట్లు నిద్రించుచున్న మనుష్యులు, వారి వారి స్వప్నములందు వ్యవహారములు గావించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 235 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 65 🌴
🌻 10. THE STORY OF KACHA - 2 🌻

Brihaspati said: 

The wise who have understood what mind is, say that it is no other than Ahankara (the idea of „I‟). The idea of I existing within all creatures is the impure mind.‟

Kacha asked: „It is indeed difficult to avoid this idea of „I‟. How is this adamant to be splintered to pieces?‟ 

Brihaspati replied: Pains does not really exist. It is very easy to remove this Ahankara. Within the time taken in the squeezing of a flower or the twinkling of an eye, this Ahankara can be easily eradicated. No long dissertation is necessary in this topic. 

One only Principle alone is, which is the nondual, the endless, the supreme Jnana, the immaculate, and the Plenum purer than Aka.sa. 

Meditate upon It without fluctuation of mind and free yourself from all pain with true calmness of mind. Being quite unreal, Ahankara will perish (through efforts). 

How ran Ahankara grow in the atmosphere of the meditation of the eternal? Can dust arise out of the waters, or waters, out of the fire? Contemplating upon the Eternal, may you be free from the differentiated conceptions of * I, he, etc. 

Tatwa Jnana is that non-dual one which is subtle, immaculate, the supreme self-light, and the all which is not subject to the forms generated by the quarters, time, etc., and is not obscured or sullied by pains, etc. May you be in this certitude of Atmic Reality.‟ So Brihaspati revealed the highest of mysteries. 

May you be, Oh Rama, in that self-same desireless state in which Muni Kacha was, who having abandoned the idea of „I,‟ „you,‟ etc., and destroyed all internal attractions, was full of Atmic meditation as a Jivanmukta without any Vikalpas in his mind. In Kaivalya (or emancipation), this Ahankara is nothing but unreal. 

Therefore do not set your heart upon giving or taking it up. Who will dream of taking hold of or letting go the horns of a hare which are unreal. 

Here Rama asked: How in the Plenum of BrahmaJnana did there arise an element foreign to it? 

Vasistha replied: The laying hold of heterogeneous ideas which are unreal tends to the paltry re-births; but the merging of the ideation into the one Reality without any doubts is the emancipation from rebirths‟. 

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

18.Mar.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 236 / Yoga Vasishta - 236 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 33 🌴
🌻. అహంకారము - 4 🌻

మోక్షరహితులు,శరీరశూన్యులు, వాసనాసహితులు,జాగ్రత్తును పొందనివారు, స్వప్న జగత్తునందు మాత్రమే నివసింపగలదు. 

మనము జాగ్రత్తు ననుభవించుచున్నట్లు, వారు తమ స్వప్పమందలి పర్వత, సముద్ర, పృధివి,జన సముదాయ సహితమైనట్టి సమస్త దృశ్యములను చిరకాలము సత్యముగ నమ్మియనుభవించుచున్నారు. కావున వారి స్వప్నము,మన ఈ జగత్‌ రూపమేయగుచున్నది. నీ స్వప్నమందు ఏ నగరములను నివాసములను గాంచితివో, వారావిధమున నిపుడును అచ్చటనే ఉన్నారు. 

ఏలన బ్రహ్మము సర్వరూపమైనది. ఎట్లు స్వపదార్ధములు జాగ్రత్తునందు నశించునట్లు అనుభూతమగుచున్నవో, అట్లే అవి స్వప్నమందు స్థితిగల్గియున్నట్లు అనుభూతమగుచున్నవి. 

మరణించినను జీవించినను మోక్షము పొందువరకు, జీవులకు అనంతములైన జగంబులు అక్షయముగను, వేరువేరుగను నుండుచున్నవి. జీవుల వాసనలయందు అసంఖ్యాక జీవులు కలవు. యొక్కక్క జీవుని మనంబునందు, అసంఖ్యాకములైన జగత్తులు కలవు. 

ఈ యొక్క జగత్తునందలి ప్రతి జీవి మనస్సునందు, మరల అనేక బ్రహ్మాండములు కలవు. ఇట్లు దృశ్య భ్రమ కొనసాగుచునేయున్నది. దీనికి హద్దులు లేవు. బ్రహ్మజ్ఞానిదృష్టిలో ఇదంతయు బ్రహ్మరూపమే యైయున్నది. 

తదుపరి ఆ కమలనయన అగు స్త్రీని, నీవెవరు? ఇటకేల చనుదెంచితివి? ఎవరి కొమరితవు, భార్యవు, ఏమి ప్రార్థించుచున్నావు, నీ నివాసమేది అని అడుగగా; ఆ స్త్రీ తన వృత్తాంతమును యధాతదముగ ఇట్లు పలికెను. సంసారదుఃఖముచే పీడితనై, తత్‌దుఃఖముచేత, ఆ దుఃఖనివృత్తికై తమవద్దకేతెంచితిని. 

ఓ మునీంద్రా| చిదాకాశమున ఒకానొకచోట తమ జగద్రూప గృహమున, పాతాళ, భూలోక, స్వర్గములను మూడు లోపలి గదులు కలవు. 

అట్టి గృహమున మాయ ఒక కన్యను సృజించెను. ఆ గృహమున సప్తద్వీపములు, సముద్రములు కలిగి, సర్వదిశలందు వ్యాపించి, పదివేలయోజనముల విస్తీర్ణము గల్గిన సువర్ణమయమగు భూప్రదేశము గలదు. అందు రాత్రియందు స్వప్రకాశముగల, కోర్కెలన్నిటిని తీర్చగల చింతామణిగలదు. మరియు ఆ భూమి సంకల్ప మాత్రముచే సమస్త భోగములు కలుగజేయునదైయున్నది. 

అప్సరపలు, దేవతలు,సిద్ధులకు స్ధానమైయున్నది. అచట లోకాలోకమను ప్రసిద్ధ పర్వతమొకటిగలదు. ఆ పర్వతమందొకచోట, అంధకారము వ్యాపించియున్నది. ఇంకొకచోట ప్రకాశము విస్తరించియున్నది. 

ఒక్కొక్కచోట సాధు జనులు, మూర్ఖులు, బుద్ధిమంతులు, జనశూన్యము, జనసమృద్ధము, దేవతలు. అసురులు ఇత్యాది వివిధ పరిస్థితులు కలవు. అట్టి లోకాలోక పర్వత శిఖరముపై, అనేక రత్నమయములైన శిలలు గలవు. ఆ శిలలపై సింహములు, వానరములు సదా విశ్రమించుచుండును. అందొక దృఢమైన శిలయొక్క యుదరభాగమున నేను నివసించుచుంటిని. 

బ్రహ్మదేవుని ఆజ్ఞచే, నేనచట బంధింపబడి, అనేక యుగములు అచట గడిపితిని. నాతోపాటు నాపతియు నచట బద్ధుడైయున్నాడు. మేమిరువురము అచట చిరకాలము గడిపితిమి. 

కామదోషములచే మేమిరువురము, మోక్షము పొందకయుంటిమి. మాతో పాటు మాపరివారమంతయు నచట గలదు. బ్రాహ్మణుడైన నాపతి, బాల్యమునుండి బ్రహ్మచర్యముతో, కపటము లేని ఇంద్రియ చాపల్య రహితుడై పడియున్నాడు. 

అతని వ్యసన పరురాలనగు, భార్యనగు నేను అతను లేకుండ ఒక నిమిషమైనను దేహమును ధరింపజాలకున్నాను. అతడు నన్నెట్లు తన భార్యగా గ్రహించెనో ఇరువురికి ఇట్టి స్నేహమెట్లు వృద్ధిపొందినదో వచించెదవినుడు. 

ఓ రామచంద్రా| ఉత్తమ కులస్ధుడు, సజ్జనుడు, జ్ఞానసంపన్నుడగు నా భర్త పూర్వకాలమున, తన నివాసమందు తనకు తగిన యుత్తమ కులవతియు సౌందర్యాది గుణవతియునగు స్త్రీని, తన మనస్సునందు చిరకాలము భావించగ నేను జనించితిని. మనస్సుచే జనింపబడిన నేను అతని మానసికభార్యనై వృద్ధిపొందితిని. 

క్రమముగ నేను పూమొగ్గవంటి ఎతైన స్థనములతో శోభించుచు,పల్లవములను హస్తములతో, సమస్త గుణములతో, హరిణివంటి దీర్ఘ నేత్రములతో, మన్నధునికి కూడ ఉన్మాదము కలుగజేయ గలదానను, సర్వజీవులను నిరంతరము హరించుదాననైయున్నాను. 

ఇంకను నేను లీలావిలాసములందు ప్రీతిగల్గి, గాన వాయిద్యములందు భోగములందు అనురాగముగల్గి, తృప్తిపొందకమున్నాను. 

మనోమయరూపిణి నగుటచే, నాతని ప్రియసఖివలె సంపదను, దారిద్య్రమును సమముగ చూచుదానను. నేను కేవలము నా పతి గ్రహమునందే గాక, నాతనిచే కల్పితమగు ముల్లోకములందు చరించుచున్నాను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 236 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 66 🌴
🌻 11. THE STORY OF MITHYA PURUSHA, THE ILLUSORY PERSONAGE - 1 🌻

Summary: This Ahankara is concreted in the shape of a Mithya-Purusha and illustrated. 

May you attain Atma-Jnana and enjoy supreme bliss after giving up all conceptions of diversities. Do not afflict yourself, oh Rama, like the MithyaPurusha. 

So said Vasishta, when Raghava asked him thus: 

How did Mithya-Purusha rove about with an afflicted heart and without the least benefit to himself? Please explain it to me lucidly; however surfeited it may be, with the ambrosial Jnana. 

Vasishta continued: This story will be provocative of great laughter and marvellous in its incidents. In a certain retired nook of Chidakas where there is not the universe, a certain male personage arose. 

He was accoutred in full with the panoply of Maya and replete with Ajnana. He was base in his tendencies, puerile and of dull head with the lowest intelligence. 

He arose like rolls of hair appearing in the Akasa or water in a mirage. He was nothing I but a void out of a void. He went by the name of Mithya-Purusha. 

Unobservant of his own growth and the Chit (Consciousness) that manifests itself as if distinct from the universe, he contracted the Sankalpa (or thought) of creating the highest Akasa without any impediments and did create one. 

Then in order to set a limit to it, he constructed (an enclosed) abode. With the idea that the Akasa was pent up and protected by him in that habitation, his desires were bound by that Akasa as identical with it. 

In course of time, it began to grow dilapidated and at last gave way, like a hill worn away by (Manvantaric) gusts of wind or like rain ceasing with the close of the rainy season. 

Then this Mithya-Purusha bewailed the disappearance of the Akasa in the following manner, „Oh Akasa, in an instant have you vanished with the disappearance of my house. 

Where have you gone?‟ Having finished his lamentations over this house Akasa, he created a fresh well and entering into it without any disturbance from without, became fondly attached to the Akasa therein. 

Being disappointed as ever in this second effort of his, when the well became quite useless with time and was gradually filled up, he again was afflicted in mind and cried aloud. 

Then again to preserve the Akasa, he created a fresh pot; and enamoured with its beautiful structure, he gladly entered it and was chained in it with affection. Time, oh Rama, set again its hands on this vessel and disposed of it. 

Finding that all the things, he created with great belief in their permanency, became the victims of time, he dug a pit in the ground and becoming greatly attached to the Akasa therein, lived in it, as if permanent. 

Even this was done away by the elephant of time, like light dispelling darkness. Crying over its loss as usual, he built again a circular abode with the four quarters in it and dwelt in it with great joy. 

When the time of destruction arrived for doing away with this house and all the other mundane eggs, he drooped like a dry leaf in a whirlpool of wind. 

The usual cries being over, he created a grange for the Akasa, which having served him for a time succumbed to time. Thus did he grieve for a long period over the loss of these many creations of his, namely house-Akasa, well- Akasa, etc.

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

19.Mar.2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 5 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 237 / Yoga Vasishta - 237 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 34 🌴
🌻. అహంకారము - 5 🌻

నేను పుత్రపౌత్రులను ముల్లోకముల భారమును, వహింపశక్తి గలదానను. వికసించిన ఫలపుష్పములతో కూడిన సరసయుక్తమగు లతవలె, ఉన్నత స్థనములతోగూడి యౌవనావస్ధలోనున్నాను. 

నా పతి వేదజ్ఞుడు, తపోనిరతుడగుటచే మోక్షాపేక్షవలన నన్ను వివాహము చేసుకొనకయున్నాడు. అతనిని స్వయముగ భర్తగ వరించి, భోగములననుభవించ ఇచ్ఛగలదానను. 

ఇట్లు నిజయౌవనమును లోలోన నిందించుకొను దీనురాలనగునేను విషయాసక్తి తీరకనే నాయౌవ్వనదినములు వ్యర్థముగ గడచిపోవుచున్నవి.

అట్లు చాలాకాలమునకు నా విషయానురాగము వైరాగ్యదశను పొందెను. మొదట నా భర్త వృద్ధుడు, నీరసుడు, స్నేహవర్జితుడు, ముని యగువానివలన ప్రయోజనము లేదు. 

స్త్రీకి రసికుడు, యువకుడునగు భర్త లభించుటయే జన్మసాఫల్యము. పతిననుసరించునట్టి స్త్రీయే స్త్రీ. సజ్జనుటచే ననుభవింపబడు సంపదయే సంపద. శమదమాది సంపత్తియైన బుద్ధియే బుద్ధి. 

సమదృష్టి కల్గిన సాధుత్వమే సాధుత్వము. పరస్పర అనురాగము కల్గిన దంపతుల మనస్సునకు అధివ్యాధులు గాని, ఆపదలు అతివృష్టి, అనావృష్టివంటి ఉపద్రవములు బాధను కలిగించవు.

ఓ మునినాయకా| నాదౌర్భాగ్యముయొక్క విలాసము చూడుము. స్థిరయౌవనములో అనేక వత్సరములు ఎట్లు గడచిపోయినవి. ఇట్లు వైరాగ్యముతో విరాగినై, తమ ఉపదేశముతో ముక్తిని కోరుచున్నాను. 

ఇష్టపదార్ధము పొందనివానికి పరబ్రహ్మయందు విశ్రాంతిని పొందనివానికి, దుఃఖ ప్రవాహములందు కొట్టుకొనిపోవువారికి, జీవితముకంటే మరణమే శ్రేష్టము. 

నా పతి నన్నుకోరక, ఆత్మయందే స్థితి కల్గియుండ నాకు జగత్తుయెడ వైరాగ్యము కల్గెను. అప్పటినుండి సంసారమందలి కోరిక నశింప, ఆకాశగమన సిద్ధినొసగు ఖేచరీ ముద్ర దృఢముగ నవలంబించితిని. దానివలన ఆకాశగమనమున సిద్ధులతో సంభాషణాదులు సలుపుచుంటిని. 

పిమ్మట బ్రహ్మాండముయొక్క అంతర్గత సమస్త పదార్ధములు దర్శించి, తుదకు జగత్తు నిలయమైన ఈ స్థూల లోకాలోక పర్వత శిలనుజూచితిని. 

నా భర్త కోర్కెలేనివాడై శుద్ధ పరమాత్మయొక్క, ధర్మముయొక్క అనన్యచింతన వలన,భూతభవిష్యత్‌ వర్తమానములను తదంతర్గత పదార్ధముల నెరుగకున్నాడు. 

కాని ఇంతవఱకు బ్రహ్మత్వమును వాస్తవముగ తెలుసుకొనకయే యున్నాడు. కావున తమరు మా ఇరువురకు తమ ఉపదేశమువలన పరమపధమును కోరుచున్నాను. 

కావున మహాత్మ| తమవంటి సజ్జనులు, అర్థించువారి అభీష్టమునుబూర్ణమొనర్తురు. కాన తమ్ము శరణు పొందిన మమ్ము ఉపేక్షింపజనదు అని పల్కగా| 

వసిష్ఠుడు, అవకాశములేని శిలలో నెట్లుంటివి, అచట నీగృహమెట్లున్నది అని ప్రశ్నింపగ| అది విని విద్యాధరి ఇట్లు పలికెను. 

ఓ మునీంద్రా| తమ యొక్క విశాలమగు జగత్తెట్లు విరాజిల్లుచున్నదో, అట్లే ఈ శిలయందు,సంసారయుక్తమగు జగత్తు ఇలా విరాజిల్లుచుండెను. 

ఇచట ఎట్లున్నదో అచటను అట్లే అన్నియును స్ఫురించుచన్నవి. వాయువు, పర్వతములు, జలము సముద్రములు, సమసభూములు, సమస్త వస్తువులు,పదార్ధములుగలవు. 

ఇచట జరుగు ప్రతి వ్యవహారము, అచట జరుగుచున్నది అని చెప్పగ వసిష్ఠుడు కుతూహలముతో అచటికేగి, శిలాంతర్గత ప్రపంచమును ప్రత్యక్షముగ తిలకించుట జరిగినది. 

కాని అచట శిలలు తప్ప వేరే జగత్తు కనిపించలేదు. అంతట ఆ స్త్రీ, తాను చిరకాలము ఆ శిలలో ప్రవేశించి ఆ జగత్తునందు నివసించుటచే నాకు అందు ప్రవేశించుట జరిగినది. 

ఇప్పుడు తమతోటి సంభాషణవలన, ఈ రాతియందలి జగత్తుభ్రమ క్షీణించినది. కాన అభ్యాసముయొక్క ప్రభావమును వీక్షింపుడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 237 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 67 🌴
🌻 11. THE STORY OF MITHYA PURUSHA, THE ILLUSORY PERSONAGE - 2 🌻

Now this personage was no other than an ignoramus in that he enclosed the Akasa within an earthly tenement and having identified himself with the house, etc., fancied he worked and lived and died with it. 

Rama asked: What do you drive at, in this story? What do you mean by enclosing the Akasa? 

Vasistha said: The Mithya-Purusha is no other than the idea of „I‟ Ahankara arising in the void which is like a sable-coloured cloud. 

This Akasa, in which all the universes exist, is self-existent before creation, all full and endless. In it the idea of „I‟, arises like the sense of touch in Vayu (air); and then this void of Ahankara fancied itself protecting the Chid-Akasa of Atman. 

Then encased in the several bodies of well, etc., which he created himself, he again and again subjected himself to pains. With his body, he contracted the thought arising from Bhutakasa that he imprisoned the Chidakasa Atman. 

Through it, he rendered himself obnoxious to all sufferings. Therefore, oh lotuseyed Rama, do not render yourself liable to pains, like Mithya-Purusha who, being imprisoned in the different bodies of house-Akasa. etc., identified himself with Bhutakasa. 

The imperishable Siva who is more all-pervading than Akasa, stainless and immaculate and cannot be gauged by the mind, is the natural Atma-Tatwa. 

Can this AtmaTatwa be easily visited or attained by all? Such being the case, the ignorant despond that the „I‟, the heart-Akasa perishes while the body perishes. Will the indestructible Akasa disappear when pots and others which seem to limit it are destroyed? Akasa will never vanish with the disappearance of the pot? 

So with the destruction of the body, Atman will never be destroyed. It is only through direct spiritual vision that Brahmic-Reality which is the transcendental Chinmatra and Sat, more subtle than Akasa and the atom of atoms will shine everywhere; but Ahankara which is the idea of „I‟ is destroyed like a pot. 

There is really no such thing, as birth or death in any place or time. It is only Brahman which manifests itself as the universe through forms. 

Therefore having considered all the universes as the supreme Principle without beginning, middle or end, without differences or non-differences, without existence or non-existence, may you be without pains. 

Should this idea of I be destroyed through the desireless Atma-Jnana this idea which is the source of all accidents, non-eternal, dependent, discrimination-less, seed of all sins, Ajnana and the seed of birth and destruction then this very destruction is the seat of the stainless Jivanmukti state. 

End of Chapter 11...

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

20.Mar.2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 238 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 35 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 1 🌻

ఆ విద్యాధరి ఇట్లు పల్కెను. నేను మీ శిష్యురాలను, అబలను అయినప్పటికి, అభ్యాసముచే, నేను శిలాంతర్గతమగు జగత్తును గాంచుచున్నాను. 

తాము సర్వజ్ఞులగు గురువులైనప్పటికి, అభ్యాసలేమిచే, అద్దానిని గ్రహించుటలేదు. 

కావున అభ్యాసముయొక్క ప్రభావమును తిలకింపుడు. అభ్యాసముచే అజ్ఞానియు, జ్ఞానియగుచున్నాడు. పర్వతమును మెల్లమెల్లగ పిండిచేయబడుచున్నవి. 

అచేతనమైన బాణము సూక్ష్మమై లక్ష్యమును ఛేదించుచున్నది. అభ్యాసమువలన కొందరికి కారపు వస్తువు ఇష్టముగుచున్నది,కొందరికి చేదు,కొందరికి తీపి రుచించుచున్నది. 

సమీపమున నివసించు అభ్యాసముచే, బంధువుకానివాడు బంధువగుచున్నాడు. అభ్యాసముచే స్థూలశరీరము, కారణ అభ్యాసముచే పక్షివలె ఆకాశమున ఎగురుచున్నది. గొప్ప పుణ్యము నిష్పలముగా వచ్చును గాని, అభ్యాసము నిష్పలముకాదు. 

దుస్సాధ్యకార్యములు అభ్యాసముచే సాధించబడుచున్నవి. శత్రువులు మిత్రులుగను, విషము, అమృతముగను అగుచున్నది. సంసారము అసారమైనదని వివేకము గల్గినవారు, ఆత్మవిచారమను అభ్యాసముచే మనుజులు మాయానదినిదాటుచున్నారు.

పదునాల్గులోకుములందు ప్రాణసమూహ మధ్యమందే, దానియొక్క అభిమత వస్తువును సహజమగు అభ్యాసములేక సిద్ధింపదు. మరల మరల ఆత్మ విచారము గావించుటయే,అభ్యాసమనబడును. దానిని పురుషప్రయత్నమందురు. అది తప్ప ముక్తికి వేరు గతిలేదు. 

ఓ మునీంద్రా| అభ్యాసమను సూర్యుడు ప్రకాశింప, జితేంద్రియుడగు వీరునకు భూమిపైగాని, వనమందుగాని, జలమందుగాని, ఆకాశమందుగాని సిద్ధింపని అభిషిత పదార్ధమెయ్యుదియు నుండదు. 

స్థూలదేహమును గూర్చిన భ్రాంతిని నశింపజేయు సమాధిచే సత్యమగు, సూక్ష్మశరీరముయొక్క స్థితి ఇచట సమర్థింపబడుచున్నది. 

సత్యమగు పదార్థమందు సర్వజ్ఞత్వము కలుగజేయు, సమాధిరూప ధారణచేయుటచే, ఈ శిలయందలి జగత్తు ప్రకటితముకాగలదు. అపుడు వసిష్ఠుడు సమాధిస్థితుడయ్యెను. స్థూలదేహభావనలు వదలి, తత్‌ సంస్కార మలము వదలి, చిన్మాత్రనే భావించును. 

తదుపరి దివ్యదృష్టిని పొందితిని. నా ఆత్మయే ఆ శిలారూపమున భాసించుచున్నది. వాస్తవముగ అక్షయమగు బ్రహ్మతత్వము తప్ప, జగత్‌ స్వప్నములం దన్యమగునదిలేదు. 

కాన నేను శిలయందు నిర్మలమైన చిదాకాశమునే గాంచితిని. అనాదియై శాశ్వతమైనట్టి, బ్రహ్మరూపమే ఈ సమస్త ప్రాణలయొక్క, యదార్ధరూపమగుటచే అజ్ఞానులకు మనోరాజ్యమును సంకల్పమనియు జగత్తనియు చెప్పబడుచున్నది. 

ప్రధమమున చైతన్యమున స్ఫురించుటనుబట్టి సూక్ష్మశరీరమే ప్రత్యక్షమైనదగును, దానినే నీవు సత్యమని, సర్వవ్యాపకమని ఎఱుగుము. 

భౌతికమగు స్థూలశరీరము మిధ్యయైనది. తత్వవిచారముచే, ఈ స్థూలశరీరము లభించదు. 

సూక్ష్మశరీరము మోక్షపర్యంతము ఇహ పరలోకములందు అక్షయమగును. సూక్ష్మశరీరముతో కూడిన, స్థూలశరీరము ప్రకటితమైన, అది మృగతృష్ణయందలి జలమువలె మిధ్యయైయున్నది. 

సూక్ష్మశరీర రహితమైన చైతన్యమునందు, స్థూలశరీరమునుగూర్చిన దృఢసంస్కారముచే, స్థూలబుద్ధి దృఢత్వము పొందినది. అవివేకముచే, జీవుని మోహముయొక్క అసత్తును సత్తుగను, సత్తును అసత్తుగను గాంచును. క్షణకాలములో నశించు విషయ సుఖము దుఃఖమనియు, ఆత్మజ్ఞాన జనిత సుఖము వాస్తవమని జ్ఞానులునమ్ముదురు. 

ముల్లోకముల అనుభవమునొసంగునట్టి, సూక్ష్మశరీర ప్రత్యక్షమును వదలి, ఐహిక మాయాస్వరూపమైన, స్థూలశరీరాదులను, ప్రత్యక్షముగ గ్రహించువాడు మూఢుడు. 

వాస్తవమునకు, జీవులకు సూక్ష్మశరీరమే గలదు అందు స్థూలశరీరమును గూర్చిన వ్యాప్తి అసత్యము. శిలాభావనతోగూడిన వానికి శిలారూపము కన్పించినప్పటికి అది వాస్తవముగ చిద్రూపమైయున్నది. 

మద్యము త్రాగినవానికి, వృక్ష పర్వతాదుల నృత్యము సత్యముగనే నున్నట్లు, అజ్ఞానికి జగత్తు భ్రాంతి సత్యత్వము పొందినది. 

శిలయందలి బ్రహ్మాండమున ప్రవేశించి, అచట బ్రహ్మదేవుని దర్శించి సంభాషించుట.

సశేషం 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 238 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 68 🌴
🌻 12. THE STORY OF BHRINGISASA - 1 🌻

Summary: This story will illustrate the fact that acting, actor, etc., arise through the idea of „I‟. 

Such is the true nature of this universe. It manifests itself out of Atma-Jnana, like the misconception of serpent arising in a rope and is no other. 

To those who contemplate upon the rays of the sun as no other than the sun itself, the sun alone exists. This is the much-longed-for Nirvikalpa state. 

But if the sun and its rays are considered as two separate ones, then there will appear a diversity between the sun and its rays- Having given up all heterogeneities, may you, oh Rama, be in that direct spiritual experience wherein is not the universe. Like the wind agitating the waters, Brahman produces the fluctuating motion of Sankalpa. 

As soon as Sankalpa was set afloat, it expanded itself and differentiated itself into this form-world, when it became the Manas which began to see itself through itself. 

Therefore know this universe to be nothing but replete with Sankalpa. This universe is neither real nor unreal; but it manifests itself like dream creations. 

Know that the seer, hearer, speaker, feeler, smeller, walker and doer are no new creations; but are the one Truth. All acts of yours are no other than the stainless Jnana itself. 

As the real nature of Mahat is Brahmic Reality itself, there is really no such thing as the universe. As all things are no other than the aspect of Chit, the sable clouds of universes are no other than Chinmatra. 

As the one Chit pervades all objects without any illusion, all objects do not really exist. Where then is Bandha (bondage) or Moksha (emancipation)? 

Having therefore abandoned firmly all the differentiated conceptions of bondage and emancipation and having observed Mauna (taciturnity) without the least tinge of Ahankara, may you, oh Rama, be engaged in the performance of your higher actions without Ahankara, pride and others. 

Having cleared up your mind of all doubts arising from illusion and clinging fast to certitude, may you live as the great actor and enjoyer, but yet as the great renouncer of all. 

At these words of Vasistha, Rama queried: What are these: actorship, enjoyment, and renunciation? 

To explain which, Vasistha began thus To understand the real significance of these three and thus attain the supreme seat without any delusion, Lord Bhringisa went to the northern summit of Mahameru and having worshipped and eulogised Parameswara who was like Chidakas itself, submitted the following  „Moving in worldly delusion and not getting quiescence in Jnana, I have in vain roved about in perfect ignorance. How can I live with a quiescence of mind in this decayed body of the world? Please throw light upon the path of certitude which I can tread without any the least fear?‟ 

Parameswara deigned to answer in the following terms: „If after destroying your doubts, you cling to Truth, you will become the great actor, the great enjoyer, and the great renouncer.‟ 

Bhringisa queried him thus: What dost you mean by the great (true) actor, the great enjoyer, and the great renouncer? Parameswara replied 

He is the incomparable great actor who is indifferent to the inevitable fruits or otherwise of dire love and hatred, pleasures and pains, Dharma and Adharma and performs actions in that manner without any desires. 

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

21.Mar.2020

------------------------------------ x ------------------------------------

Image may contain: ‎2 people, ‎text that says "‎נסם 1000O !! भजन !! !! जय राम कृपा कर भव भय हर Helo‎"‎‎
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 239 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 36 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 2 🌻

సమాధిద్వారా బ్రహ్మమును దర్శించి అందు పర్వత, నది,లోక,లోకాంతర రూపభ్రమలను గాంచును. విద్యాధరియు,వసిష్ఠుడు సంకల్పముతో ఆ శిలయందు ప్రవేశించెను. 

తదుపరి వారు శిలయందలి బ్రహ్మలోకమును చేరి అచట బ్రహ్మదేవునియెదుట కూర్చుండి, నాతో విద్యాధరి ఇట్లు చెప్పెను. 

ఓ మునీంద్రా| యీతడే నాభర్త. వివాహనిమిత్తము నన్ను సృష్టించి, వృద్ధాప్యమును పొందెను. ఇంకను వివాహమాడలేదు. కావున నాకు వైరాగ్యము జనించినది. యీతడు కూడ విరాగియై ముక్తి కొరకు సాధనచేయుచుండెను. 

కావున మునీంద్రా| నన్ను, నా పతిని తత్వోపదేశముచే ప్రబోధమొనర్చి, బ్రహ్మమార్గమున నియోగింపుము, అని పలికి తన పతిని సమాధినుండి లేపుటకై అతనితో నిట్లు చెప్పెను. 

నాధా| మునిశ్రేష్టులగు వసిష్ఠుడు నేడు మనగృహమునకు విచ్చేసిరి.యీతడు మరొక బ్రహ్మాండమునకు ప్రభువైన బ్రహ్మదేవునికుమారుడు. వారిని పూజించవలసి యుండును. అని పల్కగ అతడు మెల్లగ కండ్లు తెరచి జాగ్ర్‌ స్థితికి వచ్చెను. అంతట నన్ను, ఆ విలాసినిని గాంచి మధురస్వరముతో నిట్లు పలికెను. 

ఓ మునీంద్రా| తాము ప్రయాణ బడలికచే అలసియున్నారు, ఇచట విశ్రమింపుడు అని పలికి, మణిమయ ఆసనమున కూర్చుండేసి తదుపరి నన్ను పూజింపగ నేనిట్లంటిని. 

ఓ మహాత్మ| ఈ విద్యాధరి తమ ఇరువురకు ప్రబోధమొనర్చుటకునన్నిచ్చటికి గొనితెచ్చినది. అది యుక్తమా| ఏలన తమరు సకల జ్ఞానపారంగతులు, సర్వభూతలములకు ప్రభువులు. ఈమె కామాంధయై యున్నది. 

కాబట్టి ఈమె యొక్క ఉపదేశప్రార్ధన ఉచితముకాదు. కావున ఈమె ఇట్లెందుకు వచించుచున్నదో కారణము తెలియజేయకోరెదను. మహాత్మా| భార్యకొరకీమెను జనింపజేసితిరి. 

అపుడు ఆ బ్రహ్మ ఇట్లనిరి. 

సజ్జనులకు వృత్తాంతమంతయు యధార్ధముగనే వచింపవలయును. నేను కేవలము చిద్రూపాకాశమునుండి ప్రకటితమైన స్వయంభువమను పేరుగలవాడను. యధార్ధముగ నేనుత్పన్నము కాలేదు. ఆవరణరహితుడను, చిదాకాశరూపుడను. 

నీవు నేను వారు, ఈ సంభాషణంతయు, సముద్రమందలి తరంగములవంటిది. నా అంతరంగమున నేను నాది యను వాసన, ఈ కుమారికి, మీకు,ఇతరులకు చైతన్యముకంటే భిన్నముగ భాసించుచున్నది. 

కాని నాదృష్టియందుభిన్నముగనే యున్నది. నేను కేవలము ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొనిఉన్నాను. ఈమె నాసంకల్పముచే దేహరూపిణియై వెలయుచున్నది. ఈమె నాగృహిణికాదు. 

కాని ఈమె బ్రహ్మదేవుని గృహిణియను భావము కల్గియున్నది. ఆమెయే అంతరంగమున సర్వజగత్తు వాసనయగుటచే వ్యర్ధముగ దుఃఖమును పొందుచున్నది. 

వాసనాదేవియొక్క వైరాగ్యకారణమున, జగత్తు ప్రళయము, మిద్యా భ్రమత్వము ఏర్పడుచున్నది. 

ఓ మునీంద్రా| నాయొక్క సంకల్పముచే నా ఆయువు పూర్తియగుచున్నది. నేను కైవల్యస్థితిని పొందదలచితిని. కాని నా వాసనాకల్పితమగు ఈ జగత్తునకు ప్రళయము సంభవించనున్నది. ఈ చిత్తకాశము వీడి బ్రహ్మకాశము పొందిన పిదప, మహా ప్రళయము, వాసనాక్షయము నగుచున్నది. 

అందువలన ఈమె నన్ననుసరించుచు ఈ ప్రళయమున న శింపనున్నది. కమలమలు సరస్సునుండి విడిపోవ, వాటి వాసన లేనట్లే గదా| ఈమె ధారణాభ్యాసమోగముచే మా బ్రహ్మాండమును గాంచగల్గినది. 

ఏ పర్వత గృహమందు జగత్తు గలదో ఈ పర్వతములందు, బెక్కు జగత్తులు గలవు. యోగదృష్టిచే వాటిని గాంచగలము. స్వప్న నగరమువలె ఈ జగత్తు, మిద్యయై, భ్రాంతిరూపమైయున్నది. 

ఏవరీ జగత్తునెరుగుదురో వారికది చిదాకాశమే. తక్కినవారు భ్రమభాసులే. ఆధ్యంత రహితమైనను ఈ చైతన్యము శివాదుల రూపమున దోచుచున్నది. నిరాకారమైనను సాకారముగ కన్పట్టుచున్నది. స్వప్నమునందువలె, జాగ్రత్తునందు చిదాకాశమే తన స్వరూపమును పర్వతశిలలుగ గాంచుచున్నది. 

కావున ఓ వసిష్ఠ మునీద్రా, మీరిపుడు మీబ్రహ్మాండమునకు బొండు. అచట సమాధిద్వారా ఆత్మ సుఖమును పొందుడు. నా చే కల్పించబడిన ఈ జగత్తు ఇపుడు ప్రళయముచే అవ్యక్తమగును. మేము కైవల్యము పొందబోవుచున్నాము. 

ఓ రామచంద్రా| భగవంతుడగు బ్రహ్మదేవుడిట్లు వచించి సమాధియందు స్థితుడయ్యెను. విద్యాధరియు నట్లే ఆకాశరూపిణియైయుండెను. నేనును సమాధియందు స్థితుడనై, చిదాకాశరూపుడనై, యారహస్యమంతయు గాంచితిని. 

ఆక్షణమున అతని సంకల్పము క్షీణింప, దాని ప్రభావమైన పర్వత,సముద్రాది సహిత పృధివి మెల్లగ క్షీణింపసాగెను. బ్రహ్మదేవుడు సమాధియందు నిశ్చలుడైయుండ, పృధివి నీరసమయ్యెను. 

ఇట్లు బ్రహ్మదేవుని విరాట్‌రూపమందలి చైతన్య ముపసంహరింపబడుటచే, ప్రళయమేతెంచి, పృధివి రసహీనమయ్యెను.

సర్వజంతుజాలము, చైతన్యము కోల్పోయి క్షయమొందెను. సముద్రములు ఉప్పొంగెను. అందు జీవజాలము నశించినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 239 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 69 🌴
🌻 12. THE STORY OF BHRINGISASA - 2 🌻

He is the great actor who, being silent, is free from the ideations of „I‟ or self-identification with objects or from surprise, performs actions without any despondency or fear or without any desires in objects so as to be merely a witness to all, is never affected by fear or happiness and does not rejoice or repine, through an equal vision over all. 

Know also that his mind will be undisturbed, whether in birth or death, appearance or disappearance (of objects). 

He is the great true enjoyer who does not, through anger, long for or reject anything but enjoys fully only those things that befall him. 

We shall say more about him. He will not lose his equilibrium of mind even in the enjoyment of the illusory pleasures and pains productive of excessive fear and no bliss; he will consider in the same light and enjoy things productive of dotage or death, regality or adversity; he will taste, with neither joy nor sorrow, dainties of all tastes whether bitter, sour, sharp, or saltish. Like salt, he will associate with both the virtuous and the vicious. Such is the true enjoyer.‟ 

„Now hearken to the description of the great or (true) renouncer. You should know that such an intelligent person age will abandon, in toto the stainless Dharma and Adharma, pleasures and pains, birth and death. He will not have even a scintilla of desires, doubts, actions, and certainties. 

Oh Bhringisa, the Srutis also say that his heart will be free from Dharma and Adharma, mental thoughts and actions. He will also have rooted away from his mind all thoughts of the visible things.‟ 

So said Parameswara of the form of grace to Lord Bhringisa in days of yore. Having developed through practice this kind of vision over all, may you, oh lotus-eyed Rama protect your subjects. 

Brahmic reality alone is that which is ever shining, has neither beginning nor end and is immaculate and non-dual. Nought else is. 

Thus shall you contemplate and being filled with bliss, perform all actions, so that the stainless quiescence of mind may be in you and thereby in all. 

The Jnanakasa alone is which is Brahman, devoid of the impure pains, the seed of all illusions, Paramatman the great, the grand One in which all thoughts merge. 

Here there is none else but „That‟. Destroy all Ahankara with the firm conviction that there is nothing else foreign to „That‟ and that Sat and Asat will never affect It. 

You will therefore relieve yourself of this formless Ahankara through developing Introvision, making the internals harmonize with the externals and being unaffected by the pains of past actions. 

End of Chapter 12...

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

22.Mar.2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 4 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 240 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 37 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 3 🌻

ఓ రామచంద్రా| సమస్త జగత్తు, పరస్పరహితులగుచున్న ప్రాణుల కోలాహలముతోగూడి చిన్నాభిన్నమై శిధిలమయ్యెను. 

అంతట శ్రీరాముడిట్లు ప్రశ్నించెను. 

ఓ మహాత్మ| విరాట్టును, బ్రహ్మశరీరుడును, చైతన్యము యొక్క సంకల్ప, వికల్ప మాత్రమున సృష్టి, స్థితిలయములు జరుగునట్లు తెలియుచున్నది. అట్టి స్థితిలో, సమస్త లోకములు అతనియందు; మరియు అతనియందు బ్రహ్మాండము, సత్యలోకములెట్లు స్థితికల్గియున్నవి అని ప్రశ్నించెను. అపుడు వసిష్ఠుడిట్లు పల్కెను. 

ఓ రామచంద్రా| సృష్యాదియందు ఈ జగత్తు సత్మముకాదు. పిమ్మట,ఆ విశాలమగు సంకల్పరూపమైన మనస్సునందు, అభిమానరూపమగు భావనచే అహంకారము స్ఫురించుచున్నది. కాని వాస్తవముగ నది నిర్మలమై, నాశరహితమైనట్టి చిదాకాశమైయున్నది. తదుపరి చిదాకాశరూపుడై, చిదాభాసుడు ఎట్లు భావించిన అట్లే సృష్టి జరుగును. 

జ్ఞానము యొక్క నిర్మలత్వముచే, ఆ పరమాత్మ స్వసంకల్పిత జగత్తుననుభవించి, పిమ్మట తన ఇచ్ఛచేతనే, దానిని శమింపజేయుచున్నాడు. 

కాన ఓ రామచంద్రా| మనయందెవరికి బ్రహ్మతత్వముయొక్క వాస్తవపరిజ్ఞానము కల్గునో, అపుడతనికి జగత్తు దృశ్యశూన్యమై ఆత్మయే మిగులును. 

కావున ఈ జగత్తు మిధ్యగనే జనించినది, మిధ్యగనే కాన్పించుచున్నది. మిధ్యగనే ప్రియ,మప్రియమగుచు, చిదాకాశమున జగత్తుగా భాసించుచున్నది. 

ఓ రామచంద్రా| సత్యమగు పరమాత్మ అనుభూతము కాగ అనాదియై నిత్యానుభవరూపమై, ఏకమైనట్టి పరబ్రహ్మమేదికలదో, అదియే ఈ దృశ్యమనియు వేరుగ లేదనియు తెలియుచున్నది.

మహాపర్వతముకంటె బ్రహ్మము అతి సూక్ష్మము. స్థూలమైన బ్రహ్మము బ్రహ్మాండముకంటే అతి సూక్ష్మమైనది. 

స్వప్నమందొక జీవాత్మ తన స్వరూపముననే, తన్ను మృతునిగా గాంచునట్లు, తదుపరి ఆ మృతుడే మృతునియొక్క ధ్రష్టయై యాతనిని భిన్నముగ గాంచును. ఈ చిదాకాశమే తన అద్వైతరూపమును ద్వైతముగ గాంచుచున్నది. 

ఈ ప్రకారముగ చైతన్యాణువగు, జీవుని ప్రతిరూపమగు ఆకాశమే ఘనస్థితిని బొంది స్థూలదేహమగుచున్నది. అందు పంచేంద్రియములను నొందుచున్నది. అట్లే సంకల్ప వికల్పములచే మనస్సును, అభిమానముచే అహంకారమును జీవుడు పొందుచున్నాడు. 

ఇట్లు చైతన్యము స్వయముగ, మొదట సూక్ష్మశరీరముగ పిమ్మట దేశకాలవస్తు క్రియావిభాగమును, క్రమముగ జగత్‌ శరీరమగుచున్నది. తదుపరి ఆ చైతన్యాణువగు జీవుడు, హస్తపాదాది చిత్‌కల్పనతోగూడి, స్వయంకల్పితమగు ఆకృతిని వీక్షించుచున్నాడు. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులకును, క్రిమికీటకాదులకును గూడ సంకల్పవశముచేతనే దేహాదికల్పన సిద్దించుచున్నది. కాని యధార్ధముగ నేమియు యుత్పన్నము కాలేదు. మనుజుడు స్వప్నమున సముద్రములు, మేఘములు, యుద్ధములు, సింహగర్జనలతో కూడియున్నను, వాస్తవముగ మౌనముగనే యున్నాడు. 

ఒక పరమాణువు నందు అనేక లక్షలయోజనములు, విస్తీర్ణమైన ముల్లోకములు, మాయచే కన్పించును. చిన్న అద్దమందు పర్వతము కన్పించుచు కదా.

ఈ జగత్తునందు కల్పమువరకు వ్యవహరించునట్టి, సమస్త జీవులయొక్క వాసనలచే అట్టి ప్రధమ బీజము, ఈ బ్రహ్మదేవుడే. ఆ బ్రహ్మదేవుని, శ్లేష్మ, పిత్త వాయువులే చంద్ర, సూర్య వాయువులైయున్నవి. గ్రహ నక్షత్రాదులుగ ఒప్పుచున్నవి. 

ఓ రామ| ఈ జగత్తు సంకల్పరూపుడగు విరాట్‌పురుషుని కల్పనామయమగు శరీరమేయని యెఱుంగుము. మనస్సుచే గల్పింపబడిన పదార్ధము సత్యమైనప్పటికిని కానేరదు. 

బ్రహ్మదేవుడు నిజకల్పిత బ్రహ్మాండమును రెండుగ విభజించెను. 

అందు ఊర్ధ్వభాగము ఆకాశముగను అథోభాగము సృష్ట్యాది లోకములుగను నాతడు కల్పించెను. బ్రహ్మాండము ఊర్ధ్వభాగము శిరస్సు, అథోభాగము పాదములు, మధ్యభాగము పిరుదులుగను ఉన్నది. 

ఈతడు స్వయముగ సర్వేంద్రియ రూపుడైనను, కల్పనామాత్ర జగత్తునందలి సమస్త క్రియలు అతని క్రియలే. ఏలనగా, అతని సంకల్పములే సర్వజీవుల వ్యవహారములు. సమస్త జగత్తు వుత్పత్తి నాశనములే యా బ్రహ్మదేవుని జనన, మరణములని ఎఱుగుము. 

జగత్తు, విరాట్‌,బ్రహ్మము ఒకే అర్ధము కల్గియున్నవి. నీవు ఈ స్థూలదేహమందు, ఎట్లు స్థితిపొందియున్నావో, అట్లే సంకల్పరూపుడగు బ్రహ్మదేవుడు ఈశ్వరునియందు స్థితుడు కాలేడు. 

వృక్షాది స్థావరము నందును తన బీజము నెలకొనియున్నది కదా| ఆ బ్రహ్మదేవుడు బాహ్యమున బ్రహ్మాండుడుగను, అభ్యంతరమున అహం గను, ఆత్మయందు ఆత్మారామునిగను, స్వాత్మయందు విరాజిల్లుచున్నాడు. 

విరాట్‌పురుషుడే కాదు తత్వజ్ఞానులందరు, క్రోధరహితులై మౌనముగ నుందురు. 

బ్రహ్మదేవుడు ధ్యానపరుడు కాగ, ద్వాదశాదిత్యులుద్భవించి, జగత్తునంతయు దహించివైచుట, ప్రళయాగ్ని స్వరూపమును వర్ణింపబడినది. 

బ్రహ్మదేవుడు ధ్యానస్థితుడైనపుడు, పశ్చిమదిశయందు అరణ్యములోని దావాలనమువలె, రెండవసూర్యుడుదయించెను. 

తదుపరి సముద్రమునందలి పగబాగ్నిలె మరొకసూర్యుడు నైరుతిదిక్కుయందు, దక్షిణదిశయందు అగ్నివలెనున్న వేరొకసూర్యుడు, అట్లే ఉత్తరవాయువ్యములందు సూర్యుడుదయించుట గాంచితిని.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 240 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 70 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 1 🌻

Summary: In this story, another means of meditation besides the three modes mentioned in the previous story is given to cognize that all is Brahman. 

Rama asked: When the Ahankaric mind is divested of its illusory form and maintains its real state, what is its distinguishing characteristic? 

Vasistha replied: Now listen attentively to the characteristics of a mind which has perished, while yet its (spiritual) form survives. 

No amount of desires, illusions and other stains will unsettle a person who is firmly under the influence of his Atman, like water on a lotus leaf. 

The good qualities of benevolence, etc., will ever sweetly beam in his face. All sins he will destroy; the bondage of Vasanas will gradually loosen their hold on him. 

Anger will be slain; the tendency of the mind towards desires will be lost; all the bad impulses of Kama (passions) will be dispelled. All illusions in him, will look about for some befitting quarters elsewhere. 

The five organs will not be active in the discharge of their functions. Neither pains will arise and afflict him nor will pleasures increase. 

Through internal contentment and freedom from pains, there will arise in him equanimity of mind over all and in all places. 

Even when pains and the rest attaching themselves to his body, exhibit themselves on his face, his mind will never writhe under them or their antitheses. If the mind should only perish, then Devas even will contract his friendship through sheer love and he will enjoy great felicity. 

He will then regard all equally. A perfect harmony and beauty will prevail in him, rendering cool even his very marrow and he will be glorified everywhere. 

Samsaric illusions, oh gracious Rama of large expanding eyes, will never affect those painless wise person ages, however much such illusions are productive of great surprises, or make them oscillate ever with their never- ceasing changes of birth and destruction or generate many myriads of pleasures and pains. 

Fie on those low-minded persons of the world who do not long for and attain that Supreme Principle which can be cognized through Jnana. Vision only and wherein all accidents are unknown. 

Now hear the means through which persons cross this ocean of existence of bondage replete with the rubies of pains, arising through the conjunction of some periods of time. 

It is thus; who am „I‟ that has the potentiality of getting the quiescence of mind which will enable it to wade through this ocean of fleshy existence? 

What is the nature of this universe? Who is that supreme One sought after? Of what avail are material enjoyments? Such a discriminative enquiry is, according to the Vedas, the best of means. 

Therefore, you shall hear from me, how Ikshwaku 138, the foremost and the first king of your race, managed to attain Jnana, the Moksha. 

While the graceful king was ruling over the seeming earth through the path of the ancients, he held secret communion within himself thus „

What is the stainless cause of this world teeming with dotage and death, pleasures and pains, fancies and misconceptions, etc., beyond number?‟ In spite of his deep thought over the same, he was unable to solve it. 

Note : 138. He was the first of the Solar Kings and Son of the present Manu Vaivasvata. 

Continues......
🌹 🌹 🌹 🌹 🌹

23/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 4 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 241 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 38 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 4 🌻

ఇంతలో సముద్రమునుండి బగబాగ్నివలె వేరొకసూర్యుడు ప్రకటితమయ్యెను. మరియు దిక్కులమధ్య యాకాశమున పదునొకండవ సూర్యుడు, పిదప మరొకసూర్యుడు, ఇట్లు పన్నిద్ధరు సూర్యులుదయించిరి. 

ఈ పదకొండవ సూర్యునియందు, సమస్త సూర్యుల ప్రతిబింబమువలె మరి మువ్వురు సూర్యులుదయించిరి. 

ఆ మువ్వురు సూర్యులు, రుద్రుని శరీరము, అందు మూడునేత్రములు గలవు. అదియే ద్వాదశాదిత్యస్వరూపమై,దిక్కులన్నింటిని అరణ్యములను అగ్నివలె భస్మీభూతమొనర్చినది. తదుపరి గ్రీష్మముదయించి జగత్తును శోషింపజేసెను. 

నేనావేడికి అచటనుండి ఆకాశప్రదేశమున జేరితిని. అచటినుండి, ద్వాదశాదిత్య సమూహమును వీక్షించితిని. అపుడు ఆ వేడికి సర్వ జీవులు, పదార్ధములు కల్లోలితములై , అన్ని దిక్కులకు జనినవి. 

ప్రళయాగ్నియను నటుడు జగత్తును, శిధిల కుటీరమున నృత్యమొనర్చసాగెను. అందు అరణ్యములు, గ్రామములు, నగరములు దగ్ధముకాగ, సర్వ ప్రదేశములు, పదార్దములు, సాగరములు, పర్వతములు, వనములు దగ్ధములైనవి. 

ఆ ప్రళయాగ్నికి కైలాసపర్వతము దహింపకయుండ, రుద్రుడు కుపితుడై దానిని తన నేత్రాగ్నిచే భస్మీభూతమొనర్చెను. ఇట్లు సమస్త జగంబులు, అగ్నులు ప్రకాశింపజేయ, వాయువులు ప్రచండముగ వీచెను.

పశ్చిమదిక్కుయందు, ఊర్ధ్వభాగమున, పుష్కరావర్తములను ప్రళయమేఘములు, దక్షిణమున అగ్ని శమించుట వర్ణింపబడినది. 

ఓ రామచంద్రా| అటు పిమ్మట ప్రళయభయంకరములగు ప్రచండవాయువులు వీచగా పుష్కరావర్తములను మేఘములు ''గులుగులు'' శబ్ధమొనర్చెను. 

అవి బ్రహ్మదేవునిచే బగులగొట్టబడిన బ్రహ్మాండమున గొప్ప ధ్వనివలెనున్నది. ఈ ప్రళయాగ్నియందు మేఘములెట్లు స్థితి పొందినవని విస్మయుడనైతిని. 

పిదప పశ్చిమ దిశనుండి కల్పాంత వాయువు వీచగ, వింధ్య,మేరు, హిమాలయాది మహాపర్వతములును, దానియందు తృణమువలె ఎగిరిపోజొచ్చెను. అగ్ని జ్వాలలతోకూడి ఆ దుష్టవాయువు, రెక్కలతోగూడిన మేరు పర్వతమువలె ఆగ్నేయదిశకు జనుచుండెను. 

పిదప ఆకాశమను బ్రహ్మాండముయొక్క విస్పోటనము''చటచట'', ''గడగుడ'' జలపాతములచే, లోకములను బడగొట్టగల్గిన కుంభవృష్టి గురిసెను. ఆ వృష్టి పృధివిపైగల అగ్నిని కూడి, స్థితిపొందెను. 

ఓ రామచంద్రా, ఆకసమున మేఘముయొక్కయు అగ్నులయొక్కయు సమావేశము గొప్ప ''చటచట'' శబ్ధములచే దిక్కులను పూరించునదై, గొప్ప సంగ్రామమువలె భయంకరమై వెలసెను. 

పుష్కరావర్త మేఘములచే కురియబడిన వర్షదారలచే, శిధిలభూతమై సమస్త సముద్రముల క్షోభచే, వినాశన మొనర్చబడిన జగత్తు; పృధివి, అగ్ని, జలము, వాయువు, ఈ నాల్గు భూతములు మహాక్షోభము చెందగా, ముల్లోకములు అతలాకుతలములైనవి. క్రిందను పైనను తిరుగాడుచున్న, పదార్ధములతో కూడిన ''ఖణఖణ'' శబ్ధములతో మునుగుచున్న పర్వతములు గలదియునగు బ్రహ్మకోటమపుడు వినాశమొందినది. 

ఓ రామచంద్రా| వాయువు, వర్షము, హిమము, ఉత్పాతములు మున్నగు వానిచే భూతము నశింప, కలియుగమున దుష్ట రాజులవలె, జలవేగము వృద్ధిపొందినది. 

ఆ సమయమున ఆకాశముగాని దిక్కులు గాని, ఊర్ద్వ అథో భేదములుగాని, భూతకాలముయొక్క సృష్టిలేక, కేవలము జలముమాత్రమే యుండియుండెను. 

ఈ జగత్తు వలన స్వప్నము బోధింపబడునట్లు, జగత్తు బాధితముకాగ, ఋషి దేవగణములు సహితము బ్రహ్మదేవునియందు నిర్వాణమునొందెను. ఆ బ్రహ్మలోకములో సాలోక్యముక్తిని పొందినవారు, పరిజనులు, బ్రహ్మదేవుని గాంచితిని. 

వారితోపాటు శుక్రాచార్యులు భృహస్పతి, ఇంద్రుడు, కుబేరుడు తక్కిన దేవతలు అచట గలరు. ద్వాదశాదిత్యులు వారి వారి స్థితులలో నిమగ్నులైయుండగా, బ్రహ్మదేవుడు అంతిమ సాక్షాత్కారము పొంది,తదుపరి సర్వులు విదేహముక్తినొందిరి. 

బ్రహ్మలోకము జనశూన్యమై అరణ్యమువలె గోచరించెను. వాసనలు నశించుటచే, వారందరు అదృశ్యులై బ్రహ్మమున కలిసిరి. 

స్థూల సూక్ష్మ దేహములు రెండును వాసనాక్షయముచే నశించినవి. వాసనలవలన సంసారమను పిచాచము ఉదయించుచున్నది. 

జ్ఞానముదయించిన పిమ్మట,సమస్త జగత్తును అవాసనయు, పరబ్రహ్మరూపమే అగును. బ్రహ్మజ్ఞానముచే, తత్వజ్ఞులు నిర్వాణమొందుదురు. ఆ జ్ఞానములేనిచో, బంధము ఏర్పడును. 

ఓ రామచంద్రా| నీవు విక్షేపరహిత సుఖముకొరకు వాసనారహితమైన బ్రహ్మస్వరూపములో స్థితి కల్గి బంధరహితుడవు కమ్ము. 

పిదప నేను ఆకాశమునుండి వెడలుచుండగ, ఇంతలో నటనొక భయంకరాకారము,పంచముఖములును, త్రినేత్రములును, దశభుజములు కల్గి ఉగ్రరూపమును, ఏక స్వరూపమును గల్గి భయంకర రూపమును దాల్చినాడు. అతడే రుద్రుడు. 

అతడు ప్రళయమహాసముద్రమును బానమొనర్చి, మరల తిరిగి ఏ రూపమును ధరింపక, పరమశాంతిని పొందియుండెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 241 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 71 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 2 🌻

Therefore having visited and paid due respects to the Lord, the first Manu 139 who came down from Satya-loka, he addressed him thus Oh mine of mercy who deigned to descend easily to this earth from Satya-loka, vouchsafe to enlighten me as to my real self through the attaining of the eternal and the giving up of pains. 

Whence the origin of this universe? What is its form? How long does it last? To whom does it owe its origin? 

At what period and through what cause did it arise into existence? Like a bird getting out of a snare, may I get out of this universe of different gradations. 

Note : 139 Swayambhu Manu 

At these words Manu replied: „Very wonderful. Your question arising through your excessive discrimination and extending over long eons of period will (when answered) destroy all Maya. All these paltry universes do not exist, appearing like a Gandharva city or the mirage in an oasis. 

It is only Atmic Reality that ever is beyond the reach of the organs, more subtle than Akasa, unlimited by space and indestructible. 

All the visibles of objects composed of the five elements are but reflections in this great mirror of Atman. Some effulgent Saktis (potencies) arising out of Brahman, commingled together and became of the form of the mundane egg. 

Some were of the form of Siva s hosts. Some assumed the Deva-lokic form. Thus is the truth about the manifesting Saktis. There is no such thing as bondage or Moksha. 

Brahman alone is. It is the eternal Jnana that shines as the world of variegated objects, like waves differentiating the water into many kinds of foam, etc. 

Nought else is but the one Brahman.‟ „Having dispelled the thoughts of bondage and Moksha from arising (in you) and mastered them, may you be free from all fears and be as firm as a rock. 

But if you should associate yourself with thoughts of Sankalpa, then the Chinmatra Jnana will reach the state of a Jiva (in you), like water transformed into waves, etc. 

Then the Jivas will ever be whirling in the cycle of re-births, existing from a remote period. All the delusions of pains and pleasures are the attributes of the mind and not of Atma. 

Like Rahu 140 which, though not visible at other times, is manifested in conjunction with the moon, Atman, when it comes into direct experience, will be seen visibly. 

This Brahman which cannot be cognized through Jna‟na-6astras and Acharyas alone can be directly perceived in its own state through one self and his intelligence. Look upon your enemy, the organs in the same listless manner in which a wayfarer regards objects in his way. 

It is not proper on your part to love or hate the organs, since the body and other objects, being but the result of Karma, will inevitably come to take shape. 

Therefore having given them up mentally and made your mind cool (without the feverish thirst for it), may you be Brahman itself.‟ 

Note : 140 One of the nodes of the moon producing eclipses. 

Continues..... 
🌹 🌹 🌹 🌹 🌹

24/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 6 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 242 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 39 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 5 🌻

అపుడు అచట కేవలము ఆకాశమువలె నిర్మములై నిశ్చములైనట్టి, నీ నాల్గు పదార్ధములు మాత్రమే గన్పించుచుండెను. 

అందులో ఒకటి రుద్రుడు, రెండవది బ్రహ్మాండముయొక్క అధోభాగము పృధివి భాగముగ వ్యాప్తి చెందినది. మూడవది బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వభాగము. నాల్గవది బ్రహ్మాండముయొక్క మధ్యనున్న అనంత సర్వ వ్యాపకమైన బ్రహ్మాకాశము. ఈ నాల్గు తప్ప మరేదియు నచట కన్పించుటలేదు. 

ఈ బ్రహ్మాండమున కావల పది రెట్లు విశాలమైన జలము కలదు. పిదప ఆ జలముకంటే పది రెట్లు అధికముగ జ్వాలామయమగు అగ్ని కలదు. తదుపరి అగ్నికంటే పదిరెట్లు అధికము గల శుద్ధ ఆకాశము గలదు. 

ఆ పిమ్మట పరమపవిత్రమైన నిర్మల బ్రహ్మాకాశము గలదు. అది అసత్యమైనను సత్యముగ దోచునట్లు భ్రాంతిచే చిదాకాశమున స్ఫురించునట్టి ఈ జగత్తుయొక్క ఆధారాదులగూర్చిన గణనమొనర్ప ఎవరి తరము. 

ప్రళయమున నృత్యమొనర్చుచున్న, భైరవరుద్రుని గూర్చి, అతని ఛాయయు, జగత్‌రూపిణియు నృత్యమొనర్చుచున్న కాలరాత్రిని గూర్చిన వర్ణన.

ఆ రుద్రుని నిత్యముననుకరించుచు ఛాయ, అతని శరీరమునుండి బయలువెటలుటను నేను గాంచితిని. ఆ ఛాయ నృత్యమొర్చుచు, రుద్ర భగవానుని సముఖమున నిలబడెను. ఆ ఛాయారూపిణి కృష్ణ వర్ణము కలిగి కృశించినదియు, అతిదీర్ఘమైన భయంకర ముఖము గలదియునగు ఆ కాలరాత్రియని గ్రహించితిని. 

విలాసముగ నృత్యమొనర్చుచు, పర్వతము లామెను గాంచి, ఒకప్పుడామె నృత్యము సల్పకున్నను ఆమెయందు వివిధ, వనపర్వతాది సహితమగు జగత్తు నశించి మరల పునర్జన్మ పొంది నృత్యము సల్పుచున్నట్లు వుండెను. ఆమె దేహమను సరోవరమున సమస్త ద్వీపములు తృణమువలె సముద్రములు వలయములవలె, దేవలోకములు కమలములవలె భాసించుచుండెను. 

మరియు ఆ భగవతియొక్క దేహమందు, సృష్టి, ప్రళయ సమూహములు, దినరాత్రులవలె అల్పముగ భాసించుచుండెను. కాని అవ్వన్నియు సత్యము కాదు. ఆ కాళీ, భైరవుల యాకృతులును వాస్తవముగ లేనివేయైయున్నవి. 

అనాదియైన, శాంతమైన బ్రహ్మమే వారిరువురు. ఏ చిన్మయమగు పరమాకాశమును గూర్చి, నీవు వచించితివో, అదియే సనాతనమగు శివుడని పేర్కొనబడినది. 

ఈ శివరూపుడగు పరమాత్మయే, బ్రహ్మ, విష్ణు, చంద్ర, సూర్య, ఇంద్ర, వరుణ మున్నగు రూపముల ధరించుచున్నాడు. అవిధ్యచే పరమాత్మయే, ఇట్లు స్ఫురించుచున్నాడు. 

జీవుడెంతవరకు, తన స్వరూపము నెఱుంగకుండునో అంతవరకు నాతడు సంసారమను మహాసముద్రమున, జనన మరణాది భ్రమణములుగ కల్పన గావించుచుండును. 

ఓ రామచంద్రా| జ్ఞానము కల్గుగా ఈ జీవుడు తరంగరహిత సముద్రమువలె శాంతినొందును. ఆ భైరకాకారుడు శివుడు, కాళీ భగవతియు చిన్మాత్ర స్వరూపులేయని, ఆయాకృతులు వాస్తవముగ సత్యములు కావలని బోధకొరకై కల్పనాదృష్టిచే వారట్లు భాసించుచున్నారు. 

వాస్తవముగ ఆ భైరవులు, ప్రళయములు గాని లేవు. అదియంతయు భ్రాంతియే. చైతన్యమెచ్చటగలదో, అచట స్వభావముగనే స్పందన ధర్మము కల్గియుండును. 

కావున ఓ రామచంద్రా| భయంకరాకృతి దాల్చి నృత్యము సల్పునట్టి శివరూపుడగు రుద్రుడు, చిద్ఘనముయొక్క స్పందనయే యగును. స్వప్నమందు, చిత్‌స్వరూపమే నగరాదుల రూనమును ధరించుచున్నది. అచట అవి లేవు. 

అది చిదాకాశమే అయి వున్నది. కావున వాస్తవముగ నిక ద్వైతముగాని, ఏకత్వముగాని, శూన్యత్వముగాని, చైతన్యముగాని, మౌనముగాని, లేవు. కేవలము చిన్మాత్రయే యగును. 

ఓ రామచంద్రా| సమస్త వాజ్మయ ప్రపంచమందును నిర్వికల్ప సమాధియే సిద్ధాంతమైయున్నది. ఆ భైరవుడు చిదాకాశమగు శివరూపుడని చెప్పబడుచున్నాడు. ఆ కాళికాదేవి అతనికంటే వేరుకానిదిగను, అతని స్పందనశక్తిగను, మనోమయ రూపిణిగను ఎఱుగుము. 

నిరాకారమైన శివుని ఇచ్ఛయే ఈ జగత్తును నిర్మించుచున్నది, మరియు సర్వజీవుల యొక్క జీవహేతువగుటచే,ఆ ఇచ్ఛారూపములగు బీజాకాశములను తనయందు ధరించి వాని యుత్పత్తి పాలనాది క్రియలు సల్పుచున్నది. అద్దములందలి ప్రతిబింబమువలె, బ్రహ్మ పదార్ధములు పూర్వ వాసనాది కారణములచే, చైతన్యమున సత్యరూపములుగనే ప్రతిబింబములై యున్నవి. 

భూత భవిష్యత్‌ వర్తమానములందలి పదార్ధ స్వరూపము, స్వప్న సంకల్ప నగరాదులును, సమస్తము ఆయా దశలందు సత్యమే అగును. అట్లు కానిచో ఆత్మ తత్వము సర్వరూపమెట్లగును. 

కావుననే యోగులు, ఇతర స్వప్నములందు ప్రవేశించియు, పరకాయ ప్రవేశాదులద్వార, యా మనుజుల మనోభావము పొంది, అనుభవించుచున్నారు. స్వప్న పురము ఇపుడు సత్యము, ఎపుడు మిధ్య, ఎపుడు నశించినది, ఎపుడు స్థితిపొందినది. 

వాస్తవముగ చైతన్యమందు నేను, జగత్తు ఇత్యాది వ్యవస్థలేదు. ఇదంతయు భ్రాంతియే. చిత్‌ స్వరూపమును తెలుసుకొన్నచో ఈ భ్రాంతి శమించిపోవుచున్నది. 

అట్లు నృత్యము చేయుచున్న దేవి, శివుని గాంచి యాతనిని స్పృజించి ప్రేమచే నాతని శరీరమందు లయించి, ఏకీభావముపొందెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 242 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 72 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 3 🌻

The identification of „I‟ with this body, produces the bondage of existence. But this idea is foreign to an aspirant after salvation free from all pains, who becomes of the nature of Chinmatra. 

An impartial intelligence of such a person, which is more subtle than the all-pervading Aka6a, will destroy existence. 

Then Atman which shines in all objects, will be like the sun s rays, shining both in clear water and out of it. It will enter the heart of all forms and shine everywhere, like gold appearing in all (golden) ornaments. 

It is only his ripened and part-less form (or aspect) that manifests itself, as this world pervaded by the Atmic Satta (Be-ness). Know also Atman to be like Kumbha-Muni, Agastya who sipped the whole of the waters in this ocean of terrific time, pervaded by the destructive Vadava-Agni, full of the waves of the many rivers of the universes flowing into It. May you be according to your free will and with great intelligence, having first dispelled, through your intelligence, the countless array of objects such as body, etc., which are non-Atman and as such pertain to the world and being quite humble, through the development of Jnana. 

Like a mother who, utterly unmindful of the child that rests on her lap, becomes of an afflicted heart, by causing search to be made everywhere for it, so all people, without cognizing Atman within which is without dotage or death, indulge in all sorts of griefs to the effect that they are utterly spoiled, or have-no protector or they are destroyed with the destruction of their body nourished by food. 

Like water which, through agitation in it, generates waves and others, so also through the excess of Sankalpa, the delusions of Chit greatly increase; but should the stains of Sankalpa be removed and the expanded Chitta be concentrated firmly upon Atman, you will be able, oh King, to rule your realm long without any fluctuation, even in the tossing waves of (Samsaric) ocean and being immovable in your Atman, to be eternal and blissful. 

Then Atman, which, remains after all, will through its Sankalpic (or voluntary; potencies create diverse sports like children in this world.‟ „Through its destructive potency, all things will be destroyed and will rest in It. 

The potency of bondage, also will arise of its own accord in this Atman and will merge into that from which it arose. The destructive potency also will arise voluntarily in this Atman. 

Like rubies shining with lustre fn conjunction with the rays of the sun or the moon, or the fruits, leaves, etc., of a ripened tree or drops of water In mountain torrents, this illusory world of Buddhi, (fee., producing motion, etc., in it, arises out of Brahman. 

To those who have not cognized Atman, this universe will be generative of pains and will appear as if it was not a delusion. 

Such is the miraculous working of the diversity of Maya. Though Atman is ordinarily partless and permeates all parts of the body, yet it, (through Maya) deludes men from cognizing their own Atman. 

After contemplating upon the worlds as the Paramakasa and freeing yourself from all de sires, you shall be a Jivanmukta of great bliss accoutred with the panoply of Brahman. 

After destroying the idea of I, may you contemplate upon all objects through the idea of Abhava (nonexistence) as formless, without attraction and as Chit and the quiescent. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

25/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 2 people, people standing
🌹.శ్రీ యోగ వాసిష్ఠ సారము - 243 / Yoga Vasishta - 243 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 40 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 6 🌻

నిర్వికారచైతన్య శక్తియయిన క్రియారూపిణియైన ఆ దేవి స్వభావముగనే నృత్యము చేయుచుండును.

వాయువునందు, స్పందనవలె, శివునియందు ఇచ్ఛారూపిణియగు ఆ భైరవీదేవి కలదు. 

నిరాకారమైనను వాయువు ఆకాశమందు శబ్ధసంచలనాది ఆడంబరము గావించునట్లు, నిరాకారమైనను శివేచ్ఛ జగత్తును విస్తరింపజేయుచున్నది. 

ఇట్లు నృత్యమొనర్చుచు ఆ దేవి కాకతాళీయ యోగముచే ప్రేమవశమున సమీపమున నున్నట్టి శివుని సృశింప, తత్‌స్పర్శమాత్రము క్రమముగ తన రూపముకోల్పోయి శివునియందైక్యము కాజొచ్చెను. 

తదుపరి భవాని సహితుడై, సర్వ సంహారకర్తయు, శాంతుడును, సర్వోపద్రవ వినాశకుడను, అద్వైతరూపుడునగు శివుడు మాత్రమే ఆకాశమంతయు యొప్పుచుండెను. 

ఓ రామా| శివుని స్వాభావిక స్పందన శక్తియగు ఆ దేవి ప్రకృతియనియు, పరమేశ్వరియనియు, జగన్మాతయనియు వచింపబడుచు,వివిధ నామములచే ప్రసిద్ధికెక్కెను. పరమేశ్వరుడు ఆ ప్రకృతికంటే పరమైనవాడు. 

ఈ ప్రకృతి పురుషుని స్పృజించి తన ప్రకృతి రూపమును త్యజించినదై; నది సముద్రమున లీనమైనట్లు అతనితో ఏకత్వరూపమొందుచున్నది. ఈ ప్రకృతి వాస్తవముగ చైతన్యరూపమై పరమపధమై, నిర్వాణరూపమైయున్నది. 

కాబట్టి ఆ పరమ పురుషుని పొంది, ఎవడు అద్దానిని త్యజించును. దేనిచే జనన మరణ మోహమాయములగు, సమస్త దుఃఖములు శాశ్వతముగ శమించిపోవునో, అట్టి ఆత్మామృతము ననుభవించి ఎవడు అద్దానిని మరల వదలి వేయును? 

ఓ రామచంద్రా| అచట మహాకాశమునందున్న, రుద్రభగవానుడు తన దేహమందలి భ్రాంతిని వీడి ఎట్లు శమించునో ఈ కథద్వారా వినుము. 

నేను వీక్షించుచున్నపుడు, రుద్రభగవానుడు; ఊర్ధ్వ, అధో బ్రహ్మాండములును నిశ్చలముగనుండ, ఆ భగవానుడు ఆ రెండు బ్రహ్మాండ ఖండములను అవలోకించెను. ఆ తదుపరి వాటిని ఆకర్షించి తాను వాటిని భరించెను. 

అంతట నాతడు లఘురూపమును ధరించెను. అంగుష్ట ప్రమాణముగను తదుపరి పరమాణువుగను అగుట నేను దివ్యదృష్టిచే గాంచితిని. అనంతరము అంతర్థానమయ్యెను. 

మరియు ఆకలిగొనిన జింక, చిన్న ఆకులను మ్రింగినట్లు, ఆ రుద్రభగవానుడు బ్రహ్మాండముల రెండింటిని మ్రింగివైచెను. అట్లు జీవులు పుట్టుచు గిట్టుచు స్వర్గ నరకములందు, ఊర్ధ్వలోకములందు మరల మరల జనుచున్నాడు. 

సూక్ష్మరూపమగు ఇంద్రియాదుల యుత్పత్తిచే వసిష్ఠుడు తనయందే హిరణ్యగర్భరూపత్వము పొందుట. తన శరీరమందే జగత్తును గూర్చి కల్పనగావించుట నిచటవర్ణింపబడినది. 

అంతట వసిష్ఠుడు ఇట్లు పలికెను.

రామచంద్రా| చిదాకాశ రూపుడనైన నేను ఏకాగ్ర చిత్తుడనై నాదేహమును పరికింప ధాన్యపు గరిసెయందు వర్షముచే తడుపబడిన బీజమందంకురమువలె నందొకచోట సృష్టిని గాంచితిని. నా యొక్క హృదయమున సృష్ట్యాదియందు సృష్టి యుదయించినది. 

శిలయందు అనేక సృష్టులను గాంచిన నేను, నాశరీరములో సృష్టి దర్శనమును గూర్చిన సంకల్పముతో మేల్కొలిపితిని. స్వప్నమునందు, జాగృతియందు ఎట్లు జగత్తును గాంచెదమో అట్లే నాయందు ఆకాశమును,దిక్కులను,చిత్తమును నేనుభావమొనర్చితిని. 

అనగా బుద్ధి ఏర్పడినది. అదియే సంకల్ప వికల్పములచే మనస్సని చెప్పబడినది. తదుపరి శబ్ధమాత్రముగ స్థూల,సూక్ష్మ పంచేంద్రియములు, దుఃఖము ఉదయించినది. క్షణమందు కల్పమువలె, పరమాణువునందు దీర్ఘప్రదేశమువలెను కల్పనచే నేనచట బ్రహ్మాండరూపమగు, చైతన్యాత్మను అనుభవించితిని. 

వాయు చలనము వలె మనస్సును,స్వభావముగ సర్వత్రా శరీరాదుల నేత్రములు, దృశ్యమును జూచుచుండును. చూచిన సమయము, కాలము, చూచు విధానము, శ్రమ, ప్రదేశము, ఆకాశము దేశము నిత్యాది కల్పన ఆత్మకు సిద్ధించెను. 

అదంతయు చైతన్యము యొక్క స్ఫురణయే. చూచుట,వినుట, స్పర్శ; ఇట్లు సర్వేంద్రియములు, రస, జ్ఞానేంద్రియములు సంభవించెను. కాని వాస్తవముగ నేమియు జరుగలేదు. 

ఆ ఇంద్రియముల భోగము అనుభవించితిని. అంతట బ్రహ్మదేవుని శరీరమున భావన చేయగ, చతుర్ముఖ వేషధారినైయున్నాను. 

నేను మొట్టమొదట ఉద్భవించిన శబ్ధమే ప్రపంచమున ఓంకార రూపమైనది. తదుపరి గాయత్రీ మంత్రము,వేదములు ఉచ్ఛరింపబడినవి. 

ఇట్లు నేను సృష్టికర్త, జగద్గురువు, బ్రహ్మదేవుడనైతిని. అపుడు నేను అనేక స్వప్నములు కంటిని. అట్టి బ్రహ్మరూపుడనైనను, బ్రహ్మాండమును, దాని స్వరూపమును గాంచితిని. 

వాస్తవమునకు అది లేనిదైయున్నది. ఇట్లు నా సృష్టి వలననే సమస్త సృష్టులు శూన్యములైయున్నను, జగత్తుగ భావించబడుచున్నవి. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 243 🌹

✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 73 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 4 🌻

The mere conception of differentiation that this is good or that is bad, will be the seed of a series of pains. Should this seed be burnt up by the fire of equal vision, then where will be the room for generation of pains? Gently wear, through diverse human efforts, the sword of Abhava (non-existence) in you.‟ 

Oh King Ikshwaku wearing a garland in this dire forest of Karmas performed through your mind, sever all (differentia ted thoughts) through Abhava, attain the supreme seat and being filled with discrimination through the abandoning of Karmas, be immovably seated in that state. 

Only he who, having merged within himself all the variegated differences of the universe and having crossed all the variety of thoughts, is free from the desires of the ever-agitating women and wealth and from the gloom of Ajnana generating the idea of * I and thus has developed true discrimination, will illuminate Brahmic bliss in himself. He alone will be free from pains. 

May you meditate ever upon that Jnana Reality which is quiescent, equal in all and immaculate.‟ Again  Manu continued „First Jnana should be developed through a deep study of Jnana Sastras and association with the wise. 

This Subechcha (or good desire) forms the first Bhumika (or stage) of Jnana. It does not apply to Karma  Yogis (who indulge in rituals alone). 

The ceaseless AtmaVichara (Atmic enquiry) constitutes the second stage. Asanga-Bhavana is the third. In the fourth stage, Satvapatti will destroy to the root all Vasanas. 

Ananda-Swarupa (the blissful Reality) replete with the non-illusory and immaculate Jnana is the fifth stage (of Asamsakti). This stage in which there is not the Upadhi, (vehicle) of waking or sleeping is the Jivanmukti stage. 

In the sixth stage, it is like the Sushupti state of replete bliss, wherein there is nothing but the nature of non intelligence (or ignorance). 

The exalted stage of the seventh is the isolation of Moksha which is part- less, equal in all, immaculate, beneficent, quiescent and the pure Turya. 

This seventh state free from all objects and replete with bliss is stated by some to be the Turyatita state of Moksha which is Chit itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

26/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  244 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 41 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 7 🌻

సంకల్ప మనోరాజ్యము వలె జగత్తు అసత్తేయగుచు, హృదయమున వ్యాపించియున్నది. ఆకాశమువలె, పృధివియందు వివిధ సృష్టులు కలవని యోగదృష్టిచే నేనెరుగితిని. 

అట్లు జీవునియొక్క బుద్ధిలో తాదాత్మ్యముపొంది దీప పర్వత సమస్త పదార్ధములు నాయందు అద్దములోవలె ప్రతిబింభించినవి. 

భూతలమున, నచట నున్నవి, నాచే వీక్షింపబడిన విశేషములిచట వర్ణించబడినవి.

ఒకచోట, పతిపుత్రాదుల మరణముచే నేడ్చుచున్న స్త్రీల రోదనలు, ఒకచోట స్త్రీ నృత్యగానాదులు, ఒకచోట క్షామమున నేడ్చుచున్న జనులు, ఒకచోట ధాన్యాగారములు, ఇంకొకచోట అగ్నిదమనములు, పక్షుల, జంతువుల సమూహములు, చీమలు, దోమలు; ఇట్లు నా భూతల శరీరమును అనుభవించితిని. ఇవన్నియు నాయొక్క మనోవికారములగుటచే మానసికములే గాని రూపములు గావు. 

ఈ విధముగ భూమండలము నా యొక్క సంకల్పము మాత్రమై మనోమయమై ధారణాభ్యాసముచే పరిపూర్ణమైనది. ఇది చిదాకాశమైనను, తన స్థూలరూపముచే చిరకాలమున్నది. 

చిరకాలాభ్యాసముచే ఈ జగత్తంతయు స్థిరముగనున్నది. స్వప్నమందు చైతన్యము, నగరాదులరూపమున భాసించునట్లు, సృష్ట్యాదియందు చైతన్యమే జగత్తు రూపునొందినది. 

ఓ రామచంద్రా| జనన మరణ రహితమైన, చిన్మాత్రయైన పరమాత్మతత్వమే, అజ్ఞాన దశయందు తన ఆత్మరూపమును త్యజింపకయే, అనేక చరాచర ప్రపంచములను గాంచుచున్నది. 

పృధివియందనేక జగత్తులు గాంచుట, జలధారణచే సంపూర్ణజల లీల దర్శించబడుట. పర్వత శిలలందనేక రెట్లు బ్రహ్మాండము లేవిధముగ గాంచితినో అటఈ భూమియందు, సర్వత్ర అనేక జగత్‌ సమూహములుండి యుండును. 

సర్వత్ర జగంబులు, సర్వత్ర బ్రహ్మము కలదు. సృష్టికి పూర్వము అహంకారాది జగత్తు చిదాకాశమే. సృష్ట్యానంతరము చిదాకాశమున కల్పించినను, నయ్యది స్వప్నపురమువంటిదే అగును. 

పృధివి యందెట్లు అనేక జగంబులున్నవో, అట్లే జలమందును అనేక జగంబులు కలవు. నేను జలరూపము పొంది ''గులగుల'' శబ్ధము గాంచితిని. 

జలపానము చేసినపుడు, ఆ జలము నోటనుండి హృదయమున ప్రవేశించి అన్నిభాగములకు ప్రసరించితిని. పిపీలకాది అతిసూక్ష్మశరీరులందు, నాడులందు పరమ సూక్ష్మమైన జలరూపముతోటి, సర్వరూపుడగు బ్రహ్మదేవునివలెనుంటిని. 

మధు రసాదిరూపములు ధరించి, నేను జిహ్వాది యొక్క పరమాణువులతో కలసి, వాటి అనుభవమును పొందితిని. ఇదియంతయు మోహానుభవమగును. అట్టి దశయందు పరమాణువులందు సంపూర్ణమైన జగత్తును గాంచితిని. 

అరటి పట్ట వలె ఒకదానిలోనొకటి వర్తించుచున్న లక్షల కొలది బ్రహ్మాండములను, వాని అనేక నాశోత్పత్తులను నేనచట గాంచితిని. 
తేజముయొక్క ధారణచే, సూర్యచంద్రాగ్నులను గాంచితినని వసిస్ఠుడు పల్కెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 244 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 74 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU  - 5 🌻

„Of these seven stages, the three first may be included under Jagrat Avastha (or the waking state). The fourth stage, in which all the universes do appear like a dream, will fall under Swapna (the dreaming state). 

The fifth stage which is filled with uniform bliss alone comes under the category of Sushupti. That which is of the nature of bliss with intelligence is the sixth stage coming under the head of Turya. 

Then comes the Turyatita, the seventh stage which is above the reach of the fluctuating mind and speech, self-shining and of the nature of Sat. If through the control of Chitta (mind) within the heart, all the visibles are destroyed by one past all resurrection, then there is no doubt that he will become a Jivanmukta through the great Be-ness. 

If one without suffering from the pleasures or pains of enjoyments becomes of a high intelligence and merges into Atman and enjoys the beatitude there, then to the certitude of such a being, the supreme Moksha will ensue. 

Such a person is a Jivanmukta, no matter whether he involves himself in many actions or not, or whether he is a householder or an ascetic, or whether he is disembodied or embodied. 

Such a sturdy person will never droop in spirit, since he is convinced that he neither dies nor lives, neither exists nor non-exists, neither is one nor another. 

Such a sturdy person, will never be afflicted in mind, being without grayness or desires or mind or egoism or any such and never clinging to any. 

Such a person being without the three gunas, birth and death and being a pure person and a Jnani of eternal quiescence and equal vision, will not in the least be afflicted. 

Such a person knowing that he is that which pervades all things such as straw, Akasa, Sun, Devas, Nagas or men, will never give way to despondency of heart. 

Those who have cognized through enquiry that Chit (consciousness) pervades everywhere in the world, warp-wise and woof-wise, up and down, are the indestructible Ones.‟  

An object enjoyed firmly through one‟s Vasanas brings immediately in its train pleasures; but when it perishes soon with its terrific results, it will of itself be productive of pains. 

 It is indeed a notorious fact that the majority of mankind do not relieve themselves from pleasures or pains. 

But when Vasanas are either destroyed completely or do decay little by little, no joy will be experienced in sensual objects. 

Pleasures and pains are so inseparably interblended that they both manifest themselves together when they originate or disappear together when they perish. 

When the Vasanas of the mind decay, then the Karmas done by it will never generate pleasures or pains, like a burnt seed. 

Diverse Karmas have arisen through the separate appearance of the body and its organs. Whoever will like to come forward as the cook and the enjoyer therein? 

One who through his great intelligence, is not attracted by the created objects will be of a heart as cool as the moon and of the lustre of the rays of the sun. 

Then by the whirlwind of wisdom, the cotton pods of Karmas, Sanchita and Agami 141 will be broken and scattered away from the cotton plant of this body with its nine gates. 

Note : 141. Agami are the Karmas now enacted.  

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

27/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people, people standing and outdoor
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  245 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 42 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 8 🌻

తేజోరూపుడనై, అనేక దశల విహరించుచు, జిహ్వాదులద్వారా, ప్రతి గృహమందు సమస్త జీవులందు సమస్త లోకములను ప్రకాశింపజేయుట యందు, సూర్యచంద్రాదుల కిరణములచే అంధకారమును తొలగించుట గాంచితిని. 

ఆ ప్రకారము, సర్వపదార్ధములను ప్రకాశింపజేయునదియు మరియు ధాతువులందు సువర్ణము, మనుజులందు పరాక్రమము, మెరుపులు, దావాలనమువలె కనిపించినది. 

ఎపుడీ దృశ్యమంతయు నాకు నిరామయమగు బ్రహ్మరూపమే అగునో, అపుడు బ్రహ్మరూపస్ధుడనగునేను నవ్విధముగ గాంచితిని.

ఈ విధముగ తేజోరూపములో నేను పరమాణువు యొక్క దేశమందును, అనేక జగత్తులను గాంచితిని. 

అవియును, జగత్తు చిదాకాశముకంటే భిన్నములు కావు. అట వాయుధారణచే వాయురూపమొంద, అద్దాని కర్మయొక్క విస్తారము; పిదప ఆకాశధారణచే ఆకాశరూపముగ స్వయంలో స్థితినొందుట వర్తించబడినది. 

వాయుధారణ ద్వారా వ్యాపించి విస్తరించిన వాడనై, లతలను, కమల, వుత్పల, కుందాది పుష్ప సమూహముయొక్క సుగంధముల నాస్వాదించితిని. శీఘ్రముగామియగుటచే, అవయవరహితమైనను సర్వావయవములందు యున్నది. 

సంచలనముచే చందనవనమునకు ఆనందమును గొల్పునది, సమస్త శబ్ధములలో సోదరునివంటిదియగు వాయువునందు, ప్రతిసూక్ష్మాణువునందు అనేక జగత్తులను నేను వీక్షించితిని. ఆ జగత్తులందు, వివిధ రూపధారిణినై నేనే యుంటిని. 

ప్రతి పరమాణువునందు సృష్టిసమూహములు చలించుచుండెను. తదుపరి ఆకాశరూపములో ప్రతి పదార్ధములోను,ప్రతి అణువు పరమాణువునందును ఆకాశమునందు నేను గాంచితిని. 

ఇట్లు సమస్త ప్రదేశములందు, పంచభూతములందు సర్వరూపమైయున్నప్పటికిని, నేను చిన్మాత్రుడనై యుంటిని. ఈ విధముగ పంచభూతములందు చైతన్యమువలె నుంటిని. 

ఆహా| మాయయొక్క ప్రభావము అమోఘము. ఆకాశమందలి ప్రతి పరమాణువునందు అసంఖ్యాకములగు జగములు గాంచితిని. ప్రతి పరమాణువునందు ఆకాశము గలదు. 

అట్లే ప్రతి ఆకాశపరమాణువునందు అసంఖ్యాక జగములను గాంచితిని. యధార్ధముగ అనంతమైన, సద్రూపమగు బ్రహ్మమే గలదు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 245 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 75 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU  - 6 🌻

All the thoughts of Jivas will flit away from them, they not having had practice in the direction of concentrating their minds; but knowledge in those having the eye of Jnana, will be firmly imprinted in their minds, though arising only once and will ever be on its increase through ardent love for it, like seeds sown in a fruitful soil. 

Like waters in a full river or ocean, Atman which is of all forms and non-dual will shine in all potencies. Know yourself as that essence which merges all the worlds into the non-dual Sat without the hosts of ceaseless thoughts.‟

Again the Muni continued „So long as Alma rests in the desire for sensual enjoyments, so long is it termed Jiva. 

These material desires arise through Aviveka (non-discrimination) and will not arise voluntarily. Desires will become extinct with the rise of discrimination. 

When desires cease, Jiva s state becomes extinct and Atman attains the state of the stainless Brahman. This (Jiva) Atman has been going from heaven to hell and vice versa. 

Oh King, do not become the water-pot swinging in the cord of thought in the picotta of existence. 

What sensible man will approach the illusions of actions which confirm him in the conception that such and such an object is his or that he is the agent therein? Such deluded persons, deserve to go to still lower depths. 

But persons who have eliminated from themselves, through their higher intelligence, the diverse delusions of agency and ownership of objects or the differentiation of that person, or this person, I or others are able to journey on to Moksha, the Highest of the high.‟  

„Having a firm grip of your Reality, the self-shining Atman, may you look upon this universe as your all-full form. 

Only when Jnana dawns thus in your heart as non-dual, without any heterogeneities only then can you free yourself from re-births and become Parameswara (the supreme lord) himself. 

Know also the fact that I am also working my way up to merge into this Jnana which Brahma, Vishnu, the victorious Rudra and others with their five 142 Krityas (actions) attain, after merging into the one Tatwa. 

Whatever appearances take place at stated times and whatever truths are said to occur therein, all these are no other than the sweet sport of Jnana. 

Those who are of a stainless mind and have conquered time (death), having the attribute of Chinmatra, will have none to compare with them in the alt- full bliss they enjoy.‟ 

 „Know that this universe neither exists nor nonexists; is neither of the nature of Atman nor nonAtman. When the Reality is reached, Maya existing from the archaic period will perish. 

But Moksha has neither space nor time in itself; nor is there (in it) any state, external (or internal). If the illusory idea of I or Ahankara perishes, then the end of Bhavana (thoughts) which is Maya is Moksha. 

He alone will earn Salvation who does not undergo the diverse pains arising from the study of Sastras which do entail ever-fluctuating pleasures in trying to understand their meaning. 

Such a person will ever be in his indestructible and equal Atman and enjoy bliss. He alone will shine as an emperor over all the world, who is indifferent as to what he wears or eats or where he sleeps. 

Note : 142. The five Krityas are creation, preservation, destruction, disappearance and grace.  

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 2 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  246 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 43 🌴
🌻.  సిద్ధుని దర్శనము  🌻 

వసిష్ఠ మునీంద్రముని కుటీరమున,ధ్యానస్తుడగు సిద్ధుని దర్శనము, ఆ కుటీరపతనము, సిద్ధుని వృత్తాంతము.  అట్లు కుతూహలముతో వివిధ జగంబులు దర్శించిన పిదప. 

ఇట్టి క్రియనుండి ప్రయత్నపూర్వకముగ తొలగి, నా పూర్వఆకాశమందున్న, సమాధి కుటీరమునకు వెళ్ళగా, నాశరీరమచ్చట గాన్పించలేదు. సమాధి నిష్టుడగు ఒక సిద్ధుడచ్చట గలడు. 

అతడు బ్రహ్మపధమును పొందినవాడు, బ్రహ్మరూపియు, పద్మాసనమున కూర్చుని శాంతుడు, నిశ్చలుడు క్షోభరహితుడు నిర్మలుడై యొప్పుచుండెను. అతని గాంచి నేనిట్లు భావించితిని. ఈతడు మహాసిద్ధుడై, విశ్రాంతి కొరకై ఇచటకు అరుదెంచినట్లున్నది. 

నా స్ధూలశరీరము నశించుటచే, సూక్ష్మశరీరముతో నేను నిజ సప్తర్షి లోకమునకు బోవ నిశ్చయించుకొనగ, వెంటనే ఆ కుటీరము నశించిపోయి కేవలము ఆకాశము మాత్రమే మిగిలియున్నది. అతడు నిరాధారుడై క్రింద పడెను. అపుడు నేను సూక్ష్మశరీరముతో, అతనితో పాటు పృధివికేతెంచితిని. 

అతడు యోగబలముచే దృఢమైన వజ్రశరీరము కల్గియు, దూదివలె లఘువైనట్టియు దేహము కల్గియుండుటచే అతడు దూరమునుండి పడుట జరిగినప్పటికి భగ్నశరీరుడు కాకయుండును. చిత్తము అన్యముగ సంలగ్నమైయుండుటచే సమాధినుండి మేల్కొనకయుండెను. 

అపుడు అతనిని మేల్కొలుపుటకు, మేఘము నుత్పన్నము చేసి వర్షము కురిపించితిని. మరియు బిగ్గరగా గర్జన గావించితిని. వడగండ్లవాన కురిపించి, స్వబుద్ధిచే అతనిని బోధితుని జేసితిని. అంతట అతనినిట్లు ప్రశ్నించితిని. 

ఓ మునివర్యా| మీరెవరు? యునికినేల గమనించకుంటిరి అని ప్రశ్నింప, యాతడు తన పూర్వస్థితిని స్మరించి ఇట్లు పల్కెను. తన పూర్వస్థితిని స్మరించుకొని నేనిపుడు మిమ్ములను గుర్తించితిని. తమకు నమస్కారము. 

ప్రధమమున నేను భోగములతో మోహాతుడనై వివిధ ప్రదేశములందు, చిరకాలము పరిభ్రమించ, తుదకు వ్యాకులుడనై నిట్లు చింతించితిని. సంసారపాగరమున వ్యాకుల చిత్తముతో దుఃఖము పొందితిని. 

భోగములందు అజ్ఞానము తప్ప ఏమిగలదు| కావున సర్వదుఃఖములు త్యజించి, జ్ఞానరరూపమగు ఆకాశమందు స్థితిగల్గియుంటిని. 

ఈ భూమిపై శబ్ధ, స్పర్శ, రూప, రస, గంగాదులతో కూడిన పదార్ధములు తప్ప,ఇచట అన్యమైనదేమిగలదు. సమస్తము చిన్మాత్రయేయైయున్నది. 

ఈ శరీరము శీఘ్రముగ నవించునట్టి, దీపశిఖవంటిది. ప్రతిక్షణము ఆయువుయొక్క ఖండండములు ఆరిపోవుచున్నవి. ఇచట అనేక పదార్ధములు భుజించితిని,త్రాగితిని, పెక్కు వనభూములందు సంచరించితిని. 

సుఖదుఃఖానుభవముననే భోగేచ్చ నశించినది. పర్వత శిఖరముందు, వనభూములందు, మహానగరములందు సంచరించినను, సంతృప్తినొందకుంటిని. సుందరస్త్రీలు, కామములుగాని, ఐశ్వర్యములుగాని నాకిపుడు రమణీయమై తోచుటలేదు. ఇపుడు మోహము మందగించినది. 

ఈ దేహమువలన ప్రయోజనములేదు. విషయమందాసక్తి లేకుండుటయే ఉత్తమస్థితి. ఇచట జనులు,నదులు సముద్రములవైపు పరుగెడుతున్నట్లు విషయములవైపు పరుగిడుచున్నారు. 

సంపదలన్నియు ఆపదలే, సుఖము కేవలము దుఃఖముకొరకే, జీవితము మరణముకొరకే. ఆహా| మాయ ప్రభావమెట్టిది, విషయభోగములు,పాము పడగలవంటివే. సంపదలు, స్త్రీలు తరంగములవలె క్షణభంగులరములైనవి. 

సర్పము పడగయను గొడుగుక్రింద నీడయందు ఎవడు క్రీడింపనెంచును. యవ్వన శోభనశ్వరమైనది. మహాత్ముల జీవితమును మృత్యువు హరించివేయుచున్నది. 

వార్ధక్యమును పొందిన జీవుని కేశములు, దంతములు శిధిలమగుచున్నవి. కాని తృష్ణ క్షయించకున్నది. దోసిలియందలి జలమువలె జీవితము శీఘ్రముగ నశించిపోవుచున్నది. గడచిన జీవితము తిరిగిరాదు. 

వాసనారహితములగు మనుజులకు ఆత్మశాంతి లభించుటచే పొందు సుఖము మరెచ్చటను ఏ భోగములందు గాని ప్రాప్తింపనేరదు. వైరాగ్యరహితుడును, అహంకార రహితుడనునగు నేనిపుడు దీర్ఘకాలమునుండి స్వర్గమోక్షములయెడ విరక్తి పొందితిని. 

కావున, తమవలె నేకాంతమున చిరకాలము ఆత్మయందు విశ్రాంతినొందదలచి, తమకుటీరమందు వసించితిని. అది తమదని ఎఱిగితిని. ఇట్లు నా వృత్తాంతమంతయు తమకు నివేదించితిని. నాయీ అపరాధమునకు తమరు ఉచితమగునట్లు ప్రవర్తించుడు అని వేడుకొనెను. 

వసిష్ఠుడు, ఆ సిద్ధుడు, సిద్ధలోకమునకేగుట. పిచాచముల, దేవతల మనోమాత్రము ననుసరించిన స్థితి ఇచట వర్ణింపబడినది. 

తదుపరి నేను ఆ సిద్ధునితో నిట్లంటిని. మీరేకాదు, నేను కూడ ఏకాగ్రబుద్ధితో ఆలోచించలేదు. దేహధారియగు యోగులును, ఏకాగ్రతతో ధారణచేయనిచో త్రికాలజ్ఞానము కలుగనేరదు. 

నేను అనాలోచితముగ, ఆకాశకుటీరమును శిధిలమొనర్చితిని. కాన నీవు నీ సిద్ధలోకమునకు నేను నా సప్తర్షిలోకమునకు జనెదము. అట్లు వారు విడిపోగా-------

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 246 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 76 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU  - 7 🌻

Like a lion escaping from its iron cage, free yourself from the castes, orders of life and the Dharmas of the world, and having lightened yourself of the load of worldly concerns, reach that state which is indestructible and free yourself from re-births, with an incomparable quiescence of mind, like a clear sky. 

Then you will be like deep and crystal water in a mountain ravine. 

Then you will enjoy within yourself the essence of Brahmic bliss without any the least disturbance of the equilibrium of your mind.‟

„Such a person will be indifferent to all fruits of actions. He will be all-full without any deterioration. 

He will be proof against the attacks of the Vikalpas of actions, virtuous and sinful. His mind will not cling to any. Like a crystal which, though reflecting the five colours, is yet not discoloured by it, so though in his mind are reflected the fruits of actions, yet it will not be tinged with them. 

In common with other men, he will be worshipping with true devotion; and though his body is cut asunder through malice, he will be unaffected by pleasures or pains, they being merely like reflections in his mind. 

Though engaged in worldly actions such as eulogies (to God) and the celestial sacrifices, whether worshipped by others or not, he will ever be conforming to the dictates of the Vedas and be utterly disconnected in mind with worldly concerns. 

He will neither be the object of fear to those with whom he comes in contact nor will be terrified by any in the world, Such a full-minded person will rest in the Supreme Seat, whether he associates or not with desires, anger, fear and contentment, whether he refrains from being in the state mentioned before or is in a childlike state or whether he dies in Benares or in a Chandala‟s (the lowest caste-man‟s) house.‟ 

Persons should worship this lofty soul, seeing that with the reaching of the Absolute Consciousness in Moksha, he has destroyed his mind and that inasmuch as bondage is caused by the gloom of Ajnana, he has destroyed this gloom.  

It is the duty of those who wish to destroy rebirths, to venerate such an exalted personage by ever praising, saluting, worshipping, glorifying and visiting him with entreaties. 

Not even Yajnas or ablutions, Tapas or gifts will confer, on one, the same effects as those derivable from the services rendered with true love to those who have glorified themselves in a state of never-fluctuating Jnana, free from Samsaric-existence. 

Having thus taught him with true love, Brahma now passing under the pseudonym of Manu, departed to his effulgent mansion in Satya loka. 

Oh Rama, with feet tinkling with bells, thus did the famous King Ikshwaku cling fast to this kind of vision and rest in the certitude of Atman.‟ So said Vasistha. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 2 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  247 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 44 🌴
🌻.  పిశాచములు - 1 🌻
 
వసిష్ఠుడు తన శరీరము శిధిలమైయుండగా, సిద్ధునితో ఎట్లు సంభాషణవ్యవహారములు గావించెనో శ్రీరామునకు తెల్పుట. 

నేను మొదట జగత్తున సంచరించుచు, సిద్ధుల సేవలందును, నగరములందును తిరిగి తుదకు ఇంద్రుని పట్టణము చేరితిని. అచట నాకు స్థూలశరీరము లేకపోవుటచే, సూక్ష్మశరీరమున నున్న నన్నెవరు గాంచలేదు. మనోమాత్రుడనగు నేను, మనోమయ ప్రాణులతో మాత్రమే వ్యవహరించుచుంటిని. 

ఇచట స్వప్నానుభవమే అఖండ దృష్టాంతము. స్వప్నమున నున్నవారిని అతని గృహమందలి ఇతరులెవరు జూడజాలనట్లు, ఎదుటనున్నప్పటికిని నేను దేవతలచే జూడబడలేదు. 

నేను సర్వులను చూడగలను గాని, నన్నెవరు గాంచలేరు. గాని యోగసిద్ధులు గాంచగలరు. దేవతల స్థానములందు నేను అనిర్వచనీయమైన పిచాచత్వమును గాంచితిని. ఈ ప్రపంచమున పిచాచములెట్లుండునో వినుము. 

మంచి నడవడిలేనివాడు, ప్రపంచానుసారము మాట్లాడనివాడు, సూక్ష్మదేహమును ధరించి స్వప్నమువలె మనఃకల్పితములగు హస్తపాదాదులు కల్గియుందురు. వారు తక్కిన ఆకారములను గాంచుదురు. 

ఆ పిచాచము ఇతరుల చిత్తములందు ప్రవేశించి, భ్రమ రూపమును భయధాయకమగు తమ ఛాయచే వారలనాక్రమించి, వివిధ దుఃఖాదుల నొసగు చేష్టలచే, వారి ఆశయములు నెరవేర్చుకొందురు. 

మరికొందరు జీవులందు ప్రవేశించి, శీఘ్రముగ వారిని జంపుదురు. ఋణానుబంధముననుసరించి, వారి దేహదాతువులను భుజింతురు. రక్తాదులను పానము చేయుదురు. వారా చిత్తమునాక్రమించి తేజమును నశింపజేయుదురు. 

పిచాచములలో కొన్ని అతి సూక్ష్మములు, కొన్ని హిమము వంటి ఆకృతి కల్గి స్వప్న మనుజులవలె నుందురు. పిచాచములు బుద్ధిమయ, మనోమయ శరీర ధారులైయుందురు. వారు పరస్పరము గాంచుకొందురు. 

శీతోష్ణాది జనితములగు సుఖదుఃఖములు వారనుభవించుదురు. బాహ్యమున జలాదులను ద్రావుటగాని, భుజించుటగాని, ఏ పదార్ధమునైన ఆధారముగ గైకొనుటగాని, ఇచ్ఛ వచ్చినట్లు దానగ్రహణాదులను వ్యవహరించుటగాని చేయలేరు. 

మరియు వారు ఇచ్ఛ, ద్వేష, భయక్రోధ, లోభ, మోహయుతులై యుందురు. మంత్ర, ఔషద, తపోదానధర్మములచే వారు వశీకృతులగుదురు. 

భూతవిద్యనెఱిగినవారికి వశులై వారికి కనిపించి సేవచేయుదురు. కొందరు దేవతలవలె, మనుజులవలె, శునకములు, నక్కలవలె, కొందరు అపవిత్ర స్థానములందు వశింతురు. వారు సంకల్పము కల్గి, మనస్సుగను పురుషునిగను నెఱిగి జీవుడగను. 

అహంకార యుతులుగ నుందురు. 
బ్రహ్మదేవుడు, చిదాకాశరూపుడై నామరూపాత్మకమగు ఈ జగత్తంతయు స్వప్నతుల్యమై,బ్రహ్మదేవుని సంకల్పమేయైయున్నది. 

ఈ సమస్త జగత్‌ స్వరూపము మనోరాజ్యమనియే చెప్పబడుచున్నది. యధార్ధముగ ఈ చిదాకాశమందు క్షేత్రముగాని, బీజముగాని లేవు. ఏదీ నాటబడలేదు, ఉత్పన్నము గాలేదు. మాయచేతనే ఇట్లున్నది. 

దీర్ఘకాలాభ్యాసమున స్వప్నము, జాగ్రత్‌ దశనొందునట్లు; చిరకాలాభ్యాసముచే ఆ ప్రాణి భూతములన్నియు ఆదిభౌతిక రూపత్వము పొందినవారై, సంసారమున విహరించుచు స్వజాతియోగ్యములగు భోగములచే సంతుష్టులగుదురు. సృష్టిలోక వాసులు పరస్పరము గాంచునట్లు, కొన్ని పిచాచములు పరస్పరము వ్యవహరించుకొనును. 

ఓ రామచంద్రా| ఈ ప్రపంచమున, పిచాచాది దుష్టజాతులవలె, యక్షప్రేతాది జాతులు గలవు. మధ్యాహ్నసమయమున పిచాచముయొక్క నీడ పడును. ఆ నీడను, సూర్యుడు నశింపచేయడు. ఆ నీడ ఇతరులకు కనిపించదు. ఆ పిచాచమునకే కనిపించును. 

పిచాచాదులకు అంధకార మండలము కలదు. గుడ్లగూబవలె పగలు నిర్భలులై అంధకారమున ప్రభలురై యుందురు. 
సత్యసంకల్పముచే, మరల జనులతో తన వ్యవహారము, వసిష్టనామప్రాప్తి, ఇచట వర్ణింపబడినది. 

ఓ రామా| పంచభూత వర్జితుడనై,పిచాచమువలె తిరుగుచున్న నేను ఎవరికి కన్పించకుండుటవలన విచారించి, తదుపరి తాము సత్యకాములమగుటచే, ఆ విషయము స్మరించి ఇక తాము ఇంద్రాదులందరకు కన్పించునుగాక అని సంకల్పముచేయగ అట్లు భావించిన తదుపరి, అందరు నన్ను గాంచగల్గిరి. 

అపుడు యధాతధముగ సంభాషణ వ్యవహారము సల్పగల్గితిని. క్రమముగ నా యొక్క సూక్ష్మశరీరము స్థూలాకారము పొందినది. నా దృష్టియందు; స్థూల సూక్ష్మశరీరములు రెండును చిదాకావరూపముగనే యున్నవి. 

అదియే ఆత్మభావన. విదేహముక్తుడు, చిదాకాశబ్రహ్మ మాత్రుడై స్థితికల్గియుండునట్లు, జీవన్ముక్తుడును వ్వయహారమందున్నను చిదాకాశరూపుడై వెలయుచుండును. కాని బ్రహ్మరూపత్వము అలానే ఉన్నది. కేవలము జగత్తు కొఱకే నేను వసిష్ఠుడను. 

ఎఱుకవలన, స్వప్నమందలి ధనము పొందుబుద్ధి తొలగునట్లు, ఎఱుగబడిన పిదప, అహంకారరూప స్థూలత్వము తొలగి శమించుచున్నది. వాసిష్ట రామాయణమువంటి శాస్త్రము దర్శనముచేతనే, ఇట్టి జీవన్ముక్తత్వము సంప్రాప్తించుచున్నది. 

కావున ఇది ఏ మాత్రము కష్టతరము కాదుకదా| ఎవరిబుద్ధి సంసారవాసనలచే, దేహేంద్రియ పదార్థములందు ఆసక్తి కలిగియుండునో, అట్టి మూర్ఖులు శునకము లేక కీటకములతో సమానులు.

సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 247 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 77 🌴
🌻 14. THE STORY OF A MUNI AND A HUNTER - 1 🌻

Summary: This story is meant to illustrate the Turya enjoyment. 

On being questioned by Rama as to what the wondrous traits are in those Jivanmuktas who have worshipped the eternal Brahman through their great wisdom (but without the psychical powers of Anima, etc.) 

Vasistha said thus The in comparable intelligence of a Jnani will ever find wonders (or delight) in the non-dual Atman. 

With stainlessr.ess, fullness and quiescence, the Jivanmukta will be in Atman only. What wonder is there in walking in the skies and other psychical powers developed out of Mantras, Tapas and other means? 

Anima and other powers accrue only to those persons who expand their minds gradually in this world with intense efforts. But Atma-Jnanis long not for these Siddhis. 

There is one thing peculiar to them. They have not the minds of the base. Their minds are immaculate, being free from desires. 

Without the characteristics of caste and orders of life and through the freedom from the trammels of the delusion of the longstanding births and deaths, they will be the enjoyers of partless bliss. Besides, desires, anger, pains, greed, accidents, etc., full of Vasanas, will daily dwindle into nothing.  

Vasistha continued: Like a Brahmin who after giving up his noble status, degrades himself into a Sudra, Isa (the Lord) degrades himself into a Jiva. The myriads of Jivas will, at every creation, shine beyond number. 

Through the flutter of that causal ideation, the Jivic Iswaras will be generated in every stage (of evolution). But the cause is not here (in this world). 

The Jivas that arise from Eswara and flourish thereby, subject themselves to repeated rebirths through the Karmas performed by them. 

This, Rama, is the relationship of cause and effect, (though there is no cause for the rise of Jivas), yet existence and Karmas, are reciprocally the cause of one another. 

All the Jivas arise, without cause, out of the Brahmic State; yet, after their rise, their Karmas are the cause of their pleasures and pains. 

And Sankalpa arising from the delusion of the ignorance of Atman is the cause of all Karmas.  As the cause of bondage is Sankalpa, you should root it away from you as completely as possible. 

The destruction of this primeval (cause) Sankalpa is itself Moksha. This destruction of Sankalpa should be intelligently practised. 

Where the conception of the objects and the enjoyer of the objects exist you should, my son, gradually and at all times destroy this Sankalpa without losing* sight of the same. 

Do not become of the form of objects or the knower, enjoying the same. Having destroyed all the slighted Sankalpas, may you become „That‟ which remains. 

When the five organs get into objects (along with the mind), the desires engendered therein do constitute bondage; but the non-attraction towards them is Moksha. 

If you are even in the least tinged with the desires of objects, then it will involve you in the meshes of existence. Oh beautiful Rama, if you are not pleased with objects, then you were be free from existence. 

Do not in the least bestow any de sires upon the hosts of objects, movable and fixed, from straw up to gold.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 4 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  248 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 45 🌴
🌻. పిశాచములు - 2 🌻

ఈ గ్రంధముయొక్క దర్శనముచేతనే మనుజులకు మంచువలె సమస్త పదార్ధములందు అంతఃకరణ శీతలత్వముదయించుచున్నది. 

మనుజులు స్వభావముగనే విషయములచే వశీకృతులగుచున్నారు. కనుకనే యుద్ధ,శౌర్యాదులచే ధన, స్త్రీ సంపాదనకు కృషి సల్పుచున్నారు. అట్టి వారు ఎపుడు వాటియందు విరక్తులై తత్వజ్ఞానము పొంది సుఖపడుదురుగాక. 

పాషాణాఖ్యానము వలన, జగత్తు భ్రమయని బ్రహ్మాండమయిన చిద్రూపమగు ఆత్మయొక్క వర్ణనను ఇచట తెలుపబడినది. 
ఈ జగత్తేదియు నెచ్చటను ఎపుడును యుండియుండలేదు.

 ఏకరసమై,చిద్ఘనమైనట్టి బ్రహ్మమే, బ్రహ్మమందు అఖండరూపమున యధారీతి స్థితికల్గియున్నది. 

స్వప్నమందలి నగరములు చిద్రూపములే యగునట్లు, ఈ జగత్తున్ను, బ్రహ్మము చిన్మాత్రమేయని ఎఱుగుము. బ్రహ్మదేవుని (సమిష్టిజీవుని) రూపములో స్థూల సూక్ష్మ జగత్‌రూపమను దృశ్యముయొక్క పరిస్థితి ఏర్పడినప్పటికి, జన్మరహితమగు చిదాకాశము తన చిత్‌స్వరూపమును, త్యజింపకయే స్థితినొందియున్నది. సువర్ణమందు సువర్ణమ్‌ కలదుగాని శిలాత్వములేనట్లు స్వప్నపర్వతమున చైతన్యమేగాని పర్వతములేనట్లు ఇట కేవలమొక చైతన్యమే కలదు గాని సృష్టియనునది లేదు. 

ఓ రామచంద్రా| జీవుడు నీవు నేను ముల్లోకములు చిదాకాశములే. చిదాకాము లేనిచో శరీరము నిర్జీవమగును. మరియు ఈ చిదాకాశము దేనిచే భేదింపబడదు. దహింపబడదు. ఎన్నడును శమింపబడదు. కావున సర్వము చిన్మాత్రయగుటచే నేవియు మరణించుటలేదు, జనించుటలేదు. 

ఇది కేవలము చైతన్యము యొక్క స్ఫురణమే అయియున్నది. అద్వితీయమగు చిన్మాత్రయే నేను. నాకు శరీరాదులు లేవు అని ఇట్లు విచారించుచో, నిక జనన మరణాదులెచట గలవు. 

గొప్పశిలను, బాణముచే ఛేదింపజాలనట్లు, చిన్మాత్రమై శుద్ధమైనట్టి ఆత్మనవలంభించి స్థిరత్వముగ నుండువానిని మానసిక వ్యధలు ఛేదించజాలవు. నేను దేహమును అను భావన, బలము బుద్ధి తేజమును నశింపజేయును. 

నేను చైతన్యమును అనుభావనచే బలము బుద్ధి తేజము వర్ధిల్లును. నేను చిదాత్మను నాకు జనన మరణాదులు లేవు అని భావించిన, లోభ, మోహమధాదు లుదయించవు. 

స్థూల సూక్ష్మ బుద్ధిచే నెవడుండునో వాడు లోభమోహాదులు గల్గియుండును. ఆత్మబుద్ధిగలవానికి, మృత్యువు తృణమువంటిదే యగును. 

ఆ చైతన్యము దేనిని, ఏ రీతిగ ఎరుగుచున్నదో ఆ రీతిగనే దానిని శీఘ్రముగ గాంచుచున్నది. అను విషయము ఎల్లరకు అనుభవనీయము. కావున నది ఎపుడును ఎచటను నశించకయేయున్నది. ఆ చైతన్యమే సంసారమును ముక్తిని కూడ పొందుచున్నది. అట్లే సుఖదుఃఖముగ నెరుగుచున్నది. 

కాని ఆ భిన్నదశలందును నది తన చిత్‌ స్వరూపముకాని వేరుకాదు. నిజరూపమెరుగకయున్న, బంధముతెలిసిన మోక్షమును స్వయముగ ఆ చైతన్యమే ధరించుచున్నది. 

ఓ రామచంద్రా| ఈ చైతన్యాత్మ ప్రపంచమున నేయే పదార్ధము నేయే రీతినెఱుంగునో, ఆ రీతిగనే దానిని అనుభవించుచున్నది. అనుభవసిద్ధమైనది. ఎట్లన ఒకే పదార్ధము దేశకాలాది స్థితులను బట్టి మార్పు చెందుచుండును. 

ఈ జగద్రూపము, కాన్పించుటచేత, అధిష్టానమగు మహాచైతన్యము కాన్పించక పోవుటచేతను చిదాత్మ స్వయముగ అదృశ్యమై, దృశ్య భ్రమ కార్యరూపముచేతనే స్వసత్తును ప్రకటించుచున్నది. కనుక ఈ జగత్తుయొక్క సత్యత్వమును తగియేయున్నది. 

విచారణవలన, సమస్త పదార్ధములయొక్క స్వరూపమును బ్రహ్మముగను అనుభవించుటచే ఈ దృశ్య జగత్తు బ్రహ్మముయొక్క మార్పేయని, వేదాంతవాదుల మతము సత్యమే అయియున్నది. 

ఇహలోకమందును, పరలోకమందును నేవిధముగ జూడబడుచున్నదో, అది ఆవిధముగనే నుండియున్నది. ఇది సత్యముకాదు, అసత్యము కాదు. అనిర్వచనీయమే యగును. ఇట్లే జగత్తు మనస్సుయొక్క కల్పనారూపమే యైయున్నది. 

అట్లే చార్వాకుల మతమున, భూత చతుష్టయము మాత్రమే కలదు. దానికతీతమైన ఆత్మలేదనుభావము వారిదృష్టిని బట్టి సత్యమేయగును. అట్లే ప్రతిక్షణము పరివర్తనచెందునది, క్షణభంగురమనుటయు సత్యమేయగును. 

వారివారి అనుభవములు అంతవరకే కాన వారికి అవి సత్యమే అగును. జీవుడు కర్మ క్షయము కాగానే, పరలోకమున కెగిరిపోవును అనునది సత్యమే. 

అంతట సమబుద్ధిగలవాడు, సన్మాత్రుడగు జ్ఞాని, జనన మరణాదులందు ఏకభావంతో సమత్వముతో నుండును. వారి దృష్టియందు ఈ జగత్తు బ్రహ్మమే అగును. 

సర్వత్రా ఈశ్వరుడొక్కడేయని, ఈశ్వరార్పిత చిత్తుల మతము సత్యమైనది. ఓ రామా| ఇహలోకమువలె పరలోకము సత్యమైనదే కాన; స్నాన అగ్నిహోత్రాదులు నిష్ఫలముగావు అనుభావన సత్యమే. 

బౌద్ధుల, ఈ జగత్తు శూన్యభావనయు సత్యమే. ఇట్లు చిదాకాశ రూప చైతన్యము, చింతామణి కల్పవృక్షములవలెను జీవులకు వారివారి అభిలషితములును వారియందు ఫలించుచున్నవి. 

అట్లే ఈ జగత్తు శూన్యము కాదు, అశూన్యము కాదు అనిర్వచనీయమైనదను భావము సత్యమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 248 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 78 🌴
🌻 14. THE STORY OF A MUNI AND A HUNTER - 2 🌻

Where there is no desire, what is there to feed upon or to perform or abandon? You are neither the agent nor the enjoyer. You art alone the quiescent personage with your mind extinct. 

Again, the wise will never grieve for things past, or about things of the future; but they will perform their present Karmas duly, and be a master of them. 

Pride, illusion and desires are so many binding- cords of the mind. Through the discriminative mind, the lower mind is powerfully mastered by the wise. 

Having developed much discrimination, may you destroy the delusions of the heterogeneous mind through the one pointed Manas (mind), like an iron severing another iron. The intelligent cleanse a dirty cloth with the dirty earth only. 

A murderous Agni-Astra (missile) is counteracted by Varunaastra. The venom of serpent-bite is removed by its antidote of an edible poison. So also is it in the case of Jiva.  

The Jiva has three forms (or aspects). The first two are the base ones, namely the gross and the subtle. The third is the supreme Brahman. 

Having gained this Brahman, may you free yourself from the first two forms. The gross body was designed for the purpose of enjoyment with hands and feet, eyes and the rest. 

The painful mind which is of the form of Sankalpa and produces the conception of Samsara is the subtle mental body. The third aspect is, to all Jivas, the Jnana Reality which is without beginning or end or heterogeneities. 

Oh Rama with lotus hands, the immaculate Turya seat is above this. Being absorbed in this Turya seat, may you not identify yourself with the first two forms but destroy them both altogether.  

At these words of Vasishta, Raghava asked the Muni thus: Please describe to me in detail this Turya or Brahmic state which is higher than the three Avasthas (Jagrat, Swapna, and Sushupti). 

To which Vasistha, with words shed ding ambrosial showers, replied Remaining in the certitude of Atman without desires and with an equal vision over all, having completely eradicated all conceptions of differentiations of „I‟ or he‟, existence or non-existence is Turya. 

That state of Jivanmukti free from delusions, wherein there is the supreme certainty of Atman, equal vision over all and the witness-ship to all worldly acts is Turya state. Being without the painful Sankalpa, it is neither the waking state nor the sleeping state. 

Nor is it the ordinary Sushupti state, as there is (in Turya) the absence of the knowledge (of enjoyment). All the world becomes then absorbed in the beneficent Atman. 

To ripe Jnanis, this world is itself Turya (or they can enjoy the Turya state in this state); but to the ignorant, the universe is their settled abode (or they pinion their minds to the visibles only). 

If after the idea of „I‟ vanishes, the mind sees all things equally and performs all actions in such a manner that it cannot be said to perform them, then that is the Turya state to it.  

Though you are the prince of men full of Jnana, please hearken, oh intelligent Rama, to a story that occurred in days of yore. In a spacious forest, a Tapaswin was in a state akin to that of a Mauni 143.

Note : 143. A person engaged in a vow of silence. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 31/Mar/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  249 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 46 🌴
🌻. పిశాచములు - 3 🌻


ఆత్మజ్ఞానము పొందువరకే, ఆయా సిద్ధాంతములన్నియు సత్యములగును ఆత్మజ్ఞానము పొందిన పిదప ఆత్మయే సత్యము కాని మరొకటి కాదు. 

కావున సత్‌ శాస్త్రము ననుసరించి వ్యవహరించువాడు విచారముతో, సజ్జనుడు, నిషిద్ధ ఆచరణ లేనివాడుయగు మహాత్ముని ఆశ్రయించవలెను. అట్టి వ్యక్తులు దుర్లభమగుట సత్యమే. కాని ప్రయత్నపూర్వకముగ వెదకిన అట్టి వారు మనుష్యులందు, దేవతలందు యుందురు. 

వారు నిత్యము ఆనందస్థితిలోనుందురు. మూఢులగు తక్కినవారు సంసారసాగరమున, భోగములందు తృష్ణాదులయందు క్రింద పైన బడి కొట్టుకొనిపోవుదురు.

ఇక గంధర్వులు, విద్యాధరులు యక్షులు రాక్షసులు ఆత్మ వివేకము లేనివారై, ఐహిక కర్మలనాచరించుచు అహంకారాది లక్షణములతో పుట్టుచు గిట్టుచుందురు. 

దేవతలందు కేవలము; యమ,చంద్ర, రుద్ర,సూర్య, వరుణ, బ్రహ్మ, విష్ణు, బృహస్పతి, శుక్రాచార్యులు, అగ్ని, ప్రజాపతులు మొదలగు సత్‌ పురుషులు జీవన్ముక్తులై వివేకులైయున్నారు. మనుష్యులందు రాజులు మునులు బ్రాహ్మణులు మున్నగువారు కొద్దిమంది జీవన్ముక్తులు .

 ఓ రామచంద్రా| ఫల, పల్లవాదులతోగూడిన వృక్షము లెల్లెడల కలవు కాని కల్పవృక్షములు మాత్రము కొలదిగనే యుండును. దోషయుక్తములను వదలి, సజ్జనులగు తత్వజ్ఞులనాశ్రయించి, జ్ఞానముపొందవలెను. 

ఓ రామచంద్రా| వివేకులు విరక్తులు పరమాత్మమార్గముననున్న వారు, తమ లోభ మోహాదులను తొలగించుకొందురు. 

వివేకులు ప్రసన్నులుగను, క్రోధరహితులు ఆసక్తిరహితులై, భోగములనాశింపక, యుద్వేగరహితులైయుందురు. ఆచార శీలురుగను, సామాన్యులుగను ప్రశాంతముగను ఉందురు. 

శాస్త్ర విరుద్ధములందు వ్యతిరేకులు, శాంతస్వభావులుగను, శీతల హృదయముతోనుందురు. పైన తెల్పిన యుత్తమ గుణములందొక్కటి ఎవనియందుండునో అతనినే ఆశ్రయించవలెను. 

పిమ్మట స్థూలదోషములుగల పరిజనులను పరిత్యజించవలెను. దుస్సాంగత్యముచే చిత్తశద్ధి మలినమగుచున్నది. సాధువులు అనాధులగుదురు. 

కావున సర్వకర్మలను త్యజించి, సజ్జనసాంగత్యమునే ఆచరించవలెను. అట్టి వారు ఇహపరలోకములందు బాధారహితులై యుందురు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 249 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 79 🌴
🌻 14. THE STORY OF A MUNI AND A HUNTER - 3 🌻

A warlike hunter, who was a veteran in archery approached this Muni, and addressed him thus: 

„Through the infliction of my arrows breathing fire, a stag ran up to this place. Will you please tell me where it fled to?‟

To which the stainless Tapaswin replied thus: Oh person of good qualities, we are only a band of Tapaswins, tenanting this forest, having equal vision over all. 

We never involve ourselves in the impure Ahankara prompting men to worldly actions. Is it not the mind that associates itself with the actions of the organs in objects? 

 It is long since the mind of the form of Ahankara left me truly and completely. I now know nothing of the waking, dreaming, or the sleepless dreaming states. 

I am now become of the Turya state. All the diverse visibles do not exist in the pure Turya state.‟ The hunter without understanding the disquisitions of the Muni quitted that place.

Therefore please listen to me attentively. There is no state other than Turya; Jnana divested of all its impure diversities is Turya. Nought else is in this world but It. 

The Jagrat state is coupled with terrible actions; the dreaming state, with becalmed actions and the dreamless sleeping state, with Ajnana (ignorant) actions. These are the three states of consciousness to a discriminative mind. 

If the lower mind perishes, it becomes the Sat and the non-dual and the all-equal state. Such certitude of mind it is, the Jnanis develop and attain. 

In that Turya state in which the differenceless and ancient Jivanmuktas do abide as the great and the transcendent Rishis without any bondage, may you, my son, ever live firmly without the painful Sankalpas and Vikalpas and free yourself from all pains.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Apr/2020

-------------------------------------- x --------------------------------------

Image may contain: 4 people, people standing, text that says "జై జైశ్రీరామ్ 2 april 2020 శ్రీ రామనవమి మ శుభాకాంక్షలు Helo"
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  250 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 47 🌴
🌻.  129. క్రిమి కీటకముల అనుభవము 🌻

క్రిమి,కీటక, తిర్యక్‌,స్ధావర, జన్మలందు ప్రపంచమున ఎట్టి అనుభవముండును. 

ఓ రామాచంద్రా| సమస్త స్ధావర జంగమ ప్రాణులును, వానివానికి యోగ్యములగు భోగములయొక్క సుఖ సంపత్తినందు స్థితిగల్గియుందురు. అల్పప్రాణులకు, మనకు భోగేచ్ఛ కలదు కాని, మనకు అట్టి భోగములందు అల్ప విశ్వాసములు కొద్ది విఘ్నమును మాత్రమే గలవు. 

ఓ రామచంద్రా| బ్రహ్మాండ శరీరుడగు విరాట్‌, స్వభోగముకొరకై ఎట్లు ప్రయత్నించుచున్నాడో, అట్లే సూక్ష్మములైనట్టి క్రిమి కీటకాదులును తమ శరీరములందు ప్రయత్నించుచున్నవి. 

పక్షులు, చీమలు,సూక్ష్మజీవులు, క్రిములు మున్నగువన్నియు, స్వభోగముకొరకై ప్రయత్నించుచున్నవి. వృక్షములు కొంత జాగరూకములై, శిలలు ఘోరనిద్ర యందు, క్రిములు కొంత జాగరూపులై, నిద్రాశీలురైయుందురు. సుఖదుఃఖములతో కూడియుండును. 

సుకుమారులైన మనుష్యులవలె, సుఖనిద్రయందు, శీతోష్ణస్థితులందు ఇట్టి దుఃఖము వేదన కల్గును. రాగద్వేష, భయ,ఆహార, మైధున జనితములగు సుఖదుఃఖములందును, జనన మరణాది భేదమందును, ఇంద్రునకు కీటకమునకు ఎట్టి భేదములేదు. 

ఆత్మ తత్వజ్ఞానము కలుగనంతవరకు ఈ జగత్తు ఉండును. పరమార్ధమున ఈ జగత్తు పూర్వమెట్లుండునో ఇపుడును అట్లే సమముగనుండెను. ఏకరూపముగనున్నది. 
స్వప్నమున అజ్ఞాన భ్రమ కల్గగా జ్ఞానము కల్గిన పిమ్మట అది ఎచ్చటను లభించుటలేదు. 

భూత భవిష్యత్‌ వర్తమానములు, జ్ఞానాజ్ఞానములును యధార్ధముగ లేనివైయున్నవి. తరంగములచేత తరంగము నశింపబడినను జలమునకు హాని లేనట్లు, దేహముచే దేహము నశింపబడినను అదిష్ఠానమగు ఆత్మకు ఏ హానియు లేదు. 

ఓ రామచంద్రా| మనోరాజ్యమున చిదాకాశ మాత్రసారమగు ఆత్మయే శాఖ, పత్ర,పుష్ప,ఫల రూపమైన సంకల్ప వృక్షమెట్లు స్పురించుచున్నదో అట్లే తత్వజ్ఞాని దృష్టిచే బాహ్యాంతరమునందు, చిదాకాశమొక్కటియే నీవు నేనను సర్వ జగద్రూపమై స్ఫురించుచున్నది. 

ఎంతవరకు జీవితముండునో అంత వరకు సుఖముగా జీవించవలయును. మృత్యువు ప్రత్యక్షమైనది. భస్మీభూతమై శమించునట్టి దేహమునకు మరల రాక ఎచట? ఆకాశమువలె చిదాకాశము సర్వ వ్యాపకమైయున్నది. శాంతమైయున్నది. 

సృష్టికి పూర్వము మహాప్రళయమున బ్రహ్మముకంటే వేరైన వస్తువు లేదు. ఇక సమస్త దేహేంద్రియాదులయొక్క, ప్రవర్తకమగు, ప్రత్యగాత్మ చైతన్యముగాని, మనస్సుగాని సర్వ శాస్త్రానుసారము కేవలముమొక బ్రహ్మమే. 

కావున ఓ రామా| ఆనందస్వరూపమగు ఆత్మకు విరుద్ధముగ నెవడు అంతఃకరణ వృత్తిచే''నేను దుఃఖి''నని దృఢముగ నిశ్చయించుచున్నాడో, అతడట్టి భావంతో తన్మయుడై అవశ్యము దుఃఖమునే అనుభవించుచున్నాడు. ఆకాశమున ధూళి అంటనట్లు, ఏకమైనట్టి చైతన్యము మాత్రమే గలదను నిశ్చయముగలవారికి సుఖదుఃఖములుండవు. 

ఆత్మజ్ఞానముచే ఈ అవిద్య నశించునదై, మరల ఎన్నడును ఉదయించదు. ఒకవేళ క్షణకాలమున మరల ఆవిర్భవించిన అపుడు జీవుని దుఃఖమిక ఎపుడు దేనిచే నశించును. 

ఎరుగబడిన ఆత్మ సంసారబంధమును ఛేదించివేయును. మనుజుడు నిద్రయందు జడత్వము పొందునట్లు, స్వప్రకాశమైన ఆత్మ జ్ఞానము వలన ఈ ప్రపంచమును పొందుచున్నవి. 

సంవిత్తు(ఆత్మ) లేదను చిశ్చయము గలవాడు, శిలవలె చిరకాలము విశేష జ్ఞానరహితుడై, జడప్రాయుడైయుండును. చిద్రూపుడగు ఏ జీవునిచే నేది ఎవ్విధముగ ఎఱుంగబడుచున్నదో, అది అవ్విధముగనే నాతనిచే పొందబడుట జరుగును.

 చిదాకాశమందును, సంసారముయొక్క వివిధ వైచిత్య్రము సంభవించుచున్నది. బ్రహ్మమును పొందిన మహాత్ములు, నిర్మలమైన చైతన్యరూపముతో వర్తించుచు తత్‌భిన్నమైన దృశ్య రూపముతో వర్తింపకుందురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 250 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 80 🌴
🌻 THE CONCLUSION OF NIRVANAPRAKARANA - 1  🌻

Summary: In this chapter is given a summary of all the foregoing fourteen stories leading to Brahman, the Turyatita State. 

Is it not the certain conclusion of all Atma-Jnana Sastras that all the whole world should be seen but as a dream? 

Neither Avidya exists nor the dire Maya generating the pains of actions. But Brahman alone is, which has not the least iota of pains and is quiescence itself. 

Diverse religionists, superimposing many attributes upon this Brahman which is the quiescent, Chidakasa, the equal in all, the immaculate, the Atman and having endless potencies in it, dub it with different appellations, Some call it a void. Some Parameswara; and some others Maha-Vijnana. Therefore having avoided all things, may you rest in that great silence. 

May you rest ever in the full Jnana of the immaculate Atman with true introvision which is the Moksha devoid of the painful Manas, Chitta, Buddhi, and Ahankara and be like a deaf, mute and blind person. 

Having reached the Jagrat-Sushupti stage and thrust all things within (or made the mind to con template internally), perform all things externally according to your free will. With the growth of the mind, the pains increase; with its extinction, there will be great bliss. 

Having lorded over your mind, may you free yourself from this world of perceptions, in order that you may be of the nature of Jnana. 

Though surrounded by pleasurable or painful objects to disturb your equilibrium of mind, may you be immovable as a rock, receiving all things equally. 

So long as you free yourself from the delusions of the endless births, do not, oh mountain-like Rama endeavour to attain pleasures or pains, bliss or non-bliss through your efforts. 

Such kinds of efforts will enable you to get the endless Brahmic seat. One whose intelligence is filled with the cool ambrosia, like the moon replete with nectarine rays, will enjoy bliss. 

Having under stood first the Be-ness (Principle) of all the worlds, he is in Moksha, performing actions though not really performing them.  

Here Rama queried Vasistha thus: What are the means by which the seven Jnana states can be cognized? And what are the characteristics of those Jnanis who have cognized them? 

To which Vasistha replied thus: There are two classes of Jivas (or egos), those that get under the yoke of (material) enjoyments and that do not do so. Now listen to the characteristics of these two aspirants for enjoyment and Moksha. 

Not caring for the glorious Moksha, the first class will estimate greatly the worldly path and will perform actions therein with great certitude of mind. 

Their tendencies will be towards the vast enjoyments of the world. Such a path will render them liable to fresh re-births, generating discrimination to all. 

Like a tortoise thrusting its neck into the hole of an yoke floating on the surface of an ocean, he incarnates in repeated re-births associated with the dire organs and then through discrimination developed in them, begins to contemplate thus „These dire re-births have been utterly fruitless. Enough of the (worldly) delusion. 

Of what avail are these Karmas? All my days have been vainly spent in them. If there is a diminution in these excessive Karmas, then all pains will cease.‟ 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Apr/2020

-------------------------------------- x --------------------------------------

Image may contain: 2 people, text that says "မိမ်းမ lo"
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  251 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 48 🌴

🌻. 130. జీవన్ముక్తుడు 🌻

ఈ సంవిద్రూప ఆకాశమునే కొందరు బ్రహ్మమనియు, కొందరు విజ్ఞానమనియు, మరికొందరు శూన్యమనియు, కొందరు శివుడనియు, ఇంకొందరు ఆత్మయనియు వచించుచున్నారు. కాని చిన్మాత్రము మరొక రూపమును పొందకయేయున్నది. 

దుష్టకర్మలచే మరణానంతరము, నరకాది రూపమగు భయముగలదన్నచో, ఆ భయము ఇచట, రాజదండనాదులచే అట్టి దుష్కర్మలకుండనేయున్నది. 

కావున ఇహపరలోకములందలి శ్రేయస్సు కొరకు ఎట్టి దుష్కర్మలనాచరింపకుడు. నేను చచ్చెదనని ఏల బల్కెదవు. చిద్రూపుడునగుటచే, నేను మరణానంతరము ఉందును అని తలచవలెను. 

నిర్వికల్ప సమాధియందు నిమగ్నమైట్టి బుద్ధిగలవానికి క్షోభ,దుర్భిక్షాది దోషములు అంటవు. అట్టివాడు మరణముచే దుఃఖముగాని, జీవితముచే సుఖము పొందడు. దేనిని వాంఛించడు, దేనిని ద్వేషింపడు; కారణము అతడు వాసనారహితుడు. 

జీవన్ముక్తునకు శిలలు వన వృక్షములు మృగములు శిశువుల, స్ధావర జంగమాది సమస్త జీవులందును సమసదృష్టికల్గియుండును. 

జీవన్ముక్తుడు జాగ్రత్తునందున్నను సుషుప్తునివలె జీవించియుండును, మృతునివలె; సర్వాచారములు గావించుచున్నను ఏమియు గావింపనివాడుగ వెలయును. 

విషయసుఖము లందు ఆత్మ సుఖదృష్టిచే అతి రసికుడును, విషయదృష్టిచే విరసుడుగను,బంధువులందు ఆత్మబుద్ధిచే వాత్సల్యహితుడుగను, పరబుద్ధిచే స్నేహితుడుగను, దయావిషయములందు నిర్ధయుడుగను, పరిపూర్ణుడగుటచే తృష్టారహాతుడుగను ఉండును. 

సర్వులచే ప్రసంసింపబడు ఆచరణగలవాడై, అజ్ఞానుల దుఃఖములు గాంచి శోకయుక్తునివలె యుండును. అతడు లోకమువలన భీతిల్లడు. అతని వలన లోకము భీతిచెందదు. 

సంసారమున రసికుడుగ ఉన్నట్లున్నను వైరాగ్యమును బొందియుండెను. ప్రాప్తించిన దానిని గూర్చి సంతోషింపడు,ప్రాప్తింపని దానిని వాంఛింపడు. 

హర్ష విలాసముల ననుభవించును, వాటిని పొందకయుండును. దుఃఖములందు దుఃఖప్రసంగములు, సుఖములందు సుఖప్రసంగములు గావించును. హృదయమందు సర్వావస్థలందును సమముగనేయుండును. 

అతనికి పుణ్యకర్మ తప్ప మరేదియు రుచింపదు. శాస్త్ర విరుద్ధ కర్మనాచరింపడు. జ్ఞాని దేనియందు ఆసక్తి కల్గియుండడు. ప్రేమవర్జితుడైయుండడు. ధనము కొరకు యాచకుడుకాడు. రాగరహితుడైనను, రాగయుక్తునివలె గోచరించును. 

వారు సుఖములందు ప్రసన్నులుగను, దుఃఖములందు దుఃఖితులుగను నున్నట్లు పైకితోచును కాని లోన నిరతిశయానంద జనితమగు ధీరస్వభావమును కల్గియుండును. మరియు ధనాదులందు, పుత్రాదులందు క్షణికములగు బుద్బుదములవలె ఆసక్తిలేకయుందురు. స్నేహరహితుడైనను స్నేహితునిగనుండును. 

దేహాత్మ బుద్ధియందు ఉన్నట్లు విషయములందు విలీనములైనను, ఆ విషయములందు అనాసక్తి కల్గియుండును. బాహ్యమున సర్వ శిష్టాచారములు గావించినను అభ్యంతరమున సర్వ పదార్ధములందు శీతలుడై వర్తించును. 

అంతరంగమున నిత్యము దేనియందు ప్రవేశింపకయున్నను బాహ్యమున ప్రవేశించినవానివలె తోచుచుండును. జ్ఞానులగువారు రాగవర్జితులు, క్రియాఫలములందు ఆసక్తి లేనివారై యున్నను రాగయుక్తునివలె చేష్టలు సల్పుచుందురు. 

హాస్యరహితులైయున్నను అజ్ఞానులను గూర్చి నవ్వుచుందురు. 
చందనవృక్షముల సుగంధమును, జంతువులెరుగజాలనట్లు ఇట్టి జ్ఞానులు అంతఃకరణములందలి శీతలత్వమును, అజ్ఞానులు ఎరుగజాలరు. సర్వోత్తములగు జ్ఞానులు, తమ యుత్తమ భావములు నెపుడు దాచిపెట్టుదురు. 

అజ్ఞానులవలె తమ గొప్పతనమును వెల్లడిచేయరు. వారు పేరు ప్రతిష్టలందు రాగములేనివారు, వాసనావర్జితులు, ద్వైతశూన్యులై యున్నారు. వారికి ఏకాంతము, పూజాదులందభావము, మహాసిద్ధులు కూడ అతనిని సుఖపెట్టజాలవు. 

నాయీ గుణమును ప్రపంచమెరుగుగాక. జనులు నన్ను పూజింతురుగాక అను నిట్టి భావములు అహంకారులకే గాని జీవన్ముక్తులకుండవు. 

ఆకాశగమనాది సిద్ధి సమూహమంతయు తుచ్ఛమై, మనోభ్రమ మాత్రమే అయి ఉన్నది అని నిశ్చయించి కేవల చిదాకాశమును మాత్రమే ఎవరెరుగునో అట్టి వాసనారహితుడగు తత్వజ్ఞుడు, కర్మయందు ఆకాశగమనాది క్రియలను సాధించడు. అతనికి జగత్తంతయు తృణప్రాయమై,ఆత్మ కన్యముగ నేదియు గ్రహింపడు. 

మరియు జ్ఞాని అంతఃకరణ శుద్ధితో, మౌనియై, సత్యయుక్తుడై, పూర్ణ సముద్రమువలె నొప్పువాడై గంభీరముగనుండును. తనయందు నిత్యానందుడై ఇతరులకు ఆనందమును గూర్చును. జ్ఞానియై దుఃఖరహితుడైనప్పటికి, జ్ఞానము పొంది సమ మనస్కుడై, పరమ విశ్రాంతి పొందును. 

జ్ఞానికి అష్ట ఐశ్వర్యములు అరిష్టములై, తృణమువలె తోచును అని తలచి నవ్వుకొనుచుండును, గాని,గర్వము పొందకుండును. జ్ఞాని పర్వత గుహలందున్నను, ఆశ్రమములందు, గుహస్ధాశ్రమములందున్నను, సంచారము, భిక్షాటన, ఏకాంతము, మౌనము, ధ్యానముననుండును. 

పండితుడు, రాజు, బ్రాహ్మణుడు, అజ్ఞానివలెను సిద్ధులు పొందినను, శిల్పివలెను, పామరునివలె, పిల్లవానివలె, సన్యాసి వలెనున్నప్పటికి ఎప్పటికి నశింపడు. 

ఓ రామచంద్రా| తత్వజ్ఞానికి పాతాళమందును, ఆకాశమందున్నను అతడు నిత్యమై, అసంగమై, నిరతిశయానందము పొందుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 251 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 81 🌴
🌻 THE CONCLUSION OF NIRVANAPRAKARANA - 2  🌻

He who has an indomitable heart to find out this seat, will abandon quite (the world), and become a Nivarta (or freed personage). 

Engaged in ceaseless enquiry, overcoming all illusions and contriving means to cross this Samsara, such a person will every moment of his life be engaged in the renunciation of all his de sires, without devoting a special day to it.

Ever bent upon the higher spiritual pursuits, such a person will daily revel in the bliss of his own Self. 

He is loth to participate in frivolous and impure Karmas. He will perform, but slightly, virtuous actions and will never disclose them to others. 

He will be engaged secretly in those Karmas only which do not bring home fear in the hearts of the worldly. He will shrink from dire ones. 

 Never will he long for enjoyments. He will utter appropriate words only according to proper time and place and with great love, due respects, much endearment and prodigious intelligence. 

Such a personage who conducts himself thus will have reached the first stage of Jnana, vis., Subechcha. 

Moreover, he will, with his three organs (of mind, speech, and body) at one with one another, long to associate with (and worship) the transcendently wise personages. 

Being an ardent searcher after knowledge, he will study all spiritual books wherever they are. Such a personage who enters upon this line of enquiry after resolving, within himself, upon the destruction of this Samsara with which he is connected is indeed a knower of the first stage (or has reached the highest ladder of the first stage). A virtuous person, who is thus, is a great one indeed.  

The second stage is called Vicharana, free from ignorance.  In order to know all about the Dharmas (virtuous actions) in the Vedas, the proper path, Dharana, Dhyanas and good actions, he will sweetly associate with the wisest of great love, that will throw light upon the real significance of the stainless holy Vedic sentences and will, after discriminating between the real and the unreal, know what actions ought to be done and whatnot, like the master of a house acquainting himself perfectly with a knowledge of his domestic affairs. 

Those arising through Avidya (ignorance) such as all the perishable pride, envy, Ahankara, desires, delusion, etc., will be easily disposed of by him, like a serpent throwing off its slough. 

Such an intelligent person will realize truly the esoteric and mysterious significance of Jnana-Sastras and of the words of an Acharya or a wise personage.  

Then the third stage quite free from all attractions will be reached by him, where he will rest like one in a soft cushion of brand-new flowers. 

Such a person, after mastering all the observances inculcated by the Sastras, will spend his life in the hearing of Tatwa-Jnana stories in the abode of the noble Tapaswins and others. Broad slabs of stones will be his abode and resting place. 

By virtue of the control of his mind and the absence of attractions towards objects of bliss, he will live a nomadic life in the forest with an equal vision over all. Through a study of Jnana-Sastras and the performance of good Karmas, a true cognition of the Reality will arise.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Apr/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 4 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  252 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 49 🌴

🌻. 131. చైతన్యస్థితి 🌻

చైతన్యముయొక్క నిత్యత్వము, ఏకత్వము, స్వాతంత్య్రము, సత్‌శాస్త్రముయొక్క మహత్యము ఇచట వర్ణింపడినది. 
జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులగు త్రివిధ అవస్థలందు సాక్షియై, శాంతరూపియై ఖేద రహితమైనదగు శరీరము నశించినను,చిదాకాశము నశింపదు. 

దృశ్యమని ఎరుగబడుచున్న ఇదియంతయు చైతన్యముయొక్క వివర్త మాత్రమే. రామచంద్రా| ఉపదేశవాక్యములచే, అవిద్య ఉపశమించినప్పటికిని, జీవన్ముక్తి అభ్యాసములేక సంభవించదు. 

ఆత్మజ్ఞానము తెలిసియున్నపటికిని అహంభావాది దోషములతో యుండుటవలన; కథన, బోధన, చింతనాది అభ్యాసములు లేకున్న, మరపువలన తెలియనిదే అగును. ఎవడు ఏ వస్తువును గూర్చి ప్రార్ధించునో, దానికొరకై నిరంతరశ్రమ చేసిన తప్పక పొందగలడు. 

ఆధ్యాత్మ శాస్త్రముకంటే మించినది మరొకటిలేదు. దీనివలన సంసారమార్గముయొక్క భ్రమ తొలగును. సంసారబంధమై, అతి భయంకరమై,దీర్ఘమైనట్టి అజ్ఞానము, ఆత్మజ్ఞానము లేకుండ నశింపదు. 

ఆకలిగొన్న సర్పము, రసహీనమైన వాయువును భక్షించునట్లు, విచారములేని మనుజుడు శూన్యవిషయములను మధురముగా భావించును. వివేకులు ''స్వ'' తత్వజ్ఞానము మాత్రముచే చిదాకాశమున స్థితిపొందుదురు. అట్టి సర్వోత్కృష్టులు, సశ్చాస్త్రముల యుపేక్షద్వారా అజ్ఞానమును భరించలేరు. 

ఎవడు మరణమను ఆపదతో ఇపుడే చికిత్స యొనర్పడో, అట్టి మూఢుడు మరణము సంభవించినపుడు ఏమి చేయగలడు. ఆత్మావబోధయందు ఈ వాసిష్టరామాయణము తప్ప, మరియొక యుత్తమ గ్రంధము లేదు. కావున మోక్షసాధకులు దీని నిక్కముగ గ్రహింపవలెను. 

మరియు ఈ గ్రంధము దీపమువలె ఆత్మజ్ఞానమును ప్రకాశింపజేయును. తండ్రివలె శీఘ్రముగ బోధనయొర్చును. స్త్రీవలె బాగుగ నానందింపజేయును. ఇది సులభముగ బోధించునది, మనోహరమైనది. 

వివిధ అభ్యాసములు కథలతో విచిత్రమైన ఈ వాసిష్టరామాయణమను ఈ శాస్త్రము మనోరంజనముకొరకై విచారించుచో, నిక్కముగ పరమాత్మబోధన పొందును సంశయములేదు. 

అజ్ఞానముచే, మాత్సర్యముచే మోహముచే, శాస్త్రార్ధములను తిరస్కరించునట్టి విచారహీనులగు ఆత్మ హంతకులతో ఎన్నడు మైత్రి సల్పకూడదు. 

కావున మరణదినములు రాకముందే నన్ను ఆప్తునిగ నెఱిగి, నాయుపదేశముయొక్క సర్వ పదార్ధములయెడల వైరాగ్యము అనుదానిని సంపాదించడు. 

ఎవడీ లోకమున నరకమను వ్యాధికి చికిత్స గావింపకయుండునో, వాడు ఔషదములు లేని స్ధానమునకేగి, నరక రోగముచే బాధితుడై ఏమిచేయగలడు. సర్వపదార్ధములందు వైరాగ్యమెంతవరకు బొందకయుండునో అంతవరకును ఆ పదార్వములయొక్క వాన సన్నగిల్లనేరదు. 

కాననో రామా| ఆత్మను పూర్ణముగనుద్ధరించుటకై, వాసనలను సన్నగిల్లచేయుట తప్ప మరియొక ఉపాయమేదియలేదు. దేనియందు సాకారమగు బీజమొకింతయైన లేదో, దానినుండి ఈ జగత్తు కలుగుచున్నదనుట, అర్ధశూన్యమగు వాక్యమే అగును. 

పరమాణు సమూహములు కలిసి, తమ ఇష్టము చొప్పున జగత్తును నిర్మించుచున్నచో, తమ ఇష్టము చొప్పుననే అవి ఆకాశమున శిధిలములైపోవుచున్నవి. మరియు కిటికీగుండా ప్రసరించు సూర్యకిరణములందే త్రసరేణువులు కనిపించుచున్నవి. 

కర్తలేనిచో జగత్తు ఉత్పన్నము కానిదే అగుట వలన మనమందరమెవరము? ఎట్లు జగమునందున్నామో అన్నచో మనము, ఈ సమస్త జనులు చిదాకాశరూపులమే అయి యున్నాము. మరియు స్వప్నమందు స్వప్నమానవులు ఎట్లు స్థితికల్గియుందురో అట్లే మనమందరము ఇచ్చట స్థితికల్గియున్నాము. 

ఓ రామచంద్రా| ఒక ప్రదేశమునుండి దూరమునున్న మరియొక ప్రదేశమునకు, క్షణ కాలములో దృష్టి చనునప్పుడు, రెండు ప్రదేశముల మధ్యనున్న నిర్విషయమగు జ్ఞానముయొక్క స్వరూపమేదికలదో అదియే చిదాకాశముయొక్క స్వరూపము. చిదాకాశమే సమస్త పదార్ధములయొక్క పరమార్ధరూపమైయున్నది. ఆ చిత్‌స్వరూపమునందే జ్ఞానులెపుడును స్థితికల్గియుందురు. 

సృష్ట్యాదియందు, సమస్త పదార్ధములు, అభావము సంభవింప, నిక నిపుడు ఈ దేహమెచ్చటనున్నది. కావున శరీరాది రూపములన్నియు, చిదాకాశముయొక్క స్వప్నమేయైయున్నవి. మనోచైతన్యముయొక్క ప్రధమ స్వప్నము, బ్రహ్మదేవుని స్వరూపము. 

ఆ బ్రహ్మదేవుని శరీరమునుండి యావిర్భవించిన మనము ఆ స్వప్నము యొక్క, స్వప్నాంతర రూపులవలెనున్నాము. బ్రహ్మదేవుని మొదలుకొని, తృణమువరకు గల ఈ జగత్తంతయు, స్వప్నమువలె మిధ్యగనే యుత్పన్నమగుచున్నది. 

మరల స్వప్నమువలెనె శీఘ్రముగ నశించుచున్నది. ఆ నశించుటకూడ మిధ్యయే. ఏ నగరాదులు స్వప్నాదియందు యుత్పన్నము గాకయున్నవో అవి ఇపుడు జగత్తునుండి ఎట్లు యుత్పన్నములగును. 

స్వప్నమందు ఇటుక మున్నగునవి లేకయే నగరాదులెట్లు కన్పించుచున్నవో అట్లే ఈ జాగ్రదాకాశమందు గాన్పించుచున్నవి. జాగ్రదాకాశమందలి పురమెట్టిదో, స్వప్నాకాశమందలి పురమునట్టిదే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 252 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 82 🌴
🌻 THE CONCLUSION OF NIRVANAPRAKARANA - 3  🌻

Those who have reached the third stage can be divided under two heads in reference to their enjoyments without any attraction therein. Now mark well their divisions. 

They are termed the ordinary and the special. Again, oh Rama, born of the race of Manu, each of these has its two subdivisions. 

The ordinary indifference is the idea of non-association with objects such as I am neither the actor, nor the enjoyer, nor the learning disciple nor the teaching Acharya.

All the pleasures and pains experienced, arise through the old law of Eswara only, who is so pleased as to bless us all. How can agency be attributed to me? All the injurious excessive enjoyments are but fatal diseases. All our wealth is but a source of infinite dangers. 

Death is only for birth (again). The staggering pains of keen intelligence are but maladies and obstacles to progress. 

Yama (Death) will again and again endeavour to destroy the many universes. Therefore thought of objects will arise in their hearts without any desires. 

Those who thus are ever absorbed in trying to know the underlying significance of the sacred sentences are of the ordinary class in the third stage.  Through the path of non-desires, the association with the wise and not with the ignorant, the illumination within oneself of the Self-Chaitanya, one s supreme efforts and a ceaseless study of Jnana-Sastras, the great shore (or seat) of the vast waters of fleshly re-birth and the source (of all) will, oh Rama wearing garlands of gems and honey-dropping wreaths, be firmly and directly seen like a fruit in the palm of the hand. 

Oh you like a cloud showering grace, the special (or second) indifference arises, when one is in the certitude of quiescent silence, dispelling, truly to a distance, all Sankalpas bodying forth in words, he not being the actor, agency being attributable to Eswara or his own destiny. 

It also arises when there is no differentiation of thought of worldly objects or non-objects, Chit or non-Chit, internals or externals and height or lowness in the quarters or the Akasa and everything merges into the quiescent state free from thoughts or light or many re-births or beginning or end. 

This third stage will bring in its train the matchlesss lotus bud of Jnana which blossoms through the sun of Viveka (discrimination) arising in the heart and which is at the top of the stalk of the clear mind replete with the thorns of obstacles, arising in the mud of Vasanas. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Apr/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people, people standing
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  253 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 50 🌴

🌻. 132. పంచభూతములు, జీవుడు 🌻

ఓ రామచంద్రా| ఆకాశము శబ్ధ తన్మాతమ్రు, వాయువు, స్పర్శ తన్మాత్రముకాగ, ఆయాకాశవాయువుల సంఘర్షణచే రూప తన్మాత్రయగు తేజము, తేజముయొక్క ఉష్ణ శాంతిచే రసతన్మాత్రయగు జలము, వీటన్నిటియొక్క సంయోగము వలన గంధతన్మాత్రయగు పృధివి ఏర్పడుచున్నవి. నిరాకార ఆకాశమునుండియే ఇవన్నియు ఏర్పడినవి. 

బ్రహ్మమే సర్వపదార్ధ స్వరూపమైయున్నది. ఈ పంచభూతములు అసత్యములైనను స్వప్న దశయందువలె సత్యములుగ అనుభూతములగును. 

జాగ్రత్‌ స్వప్న రూపములతో చైతన్యమే ప్రకాశించుచున్నదనియు, చిత్‌ స్వభావముచే ఈ రెంటికి భేదములేదనియు నిచట వర్ణింపబడినది. 
స్వప్నమందు వాస్తవముగ జగత్తులేదు. 

చిత్‌ రూపమగు ఆత్మయే అట్లు 
ప్రకాశమయ స్వరూపముతో భాసించుచున్నదనియు, అట్లే జాగ్రత్‌నందు, ప్రకాశించుచున్నదనియు, స్వప్నపదార్ధములవలె అసత్తయినను, ఈ త్రిలోకముల భాసించుచున్నది. 

కావున స్వప్నమందు జగత్తు శూన్యమైనట్లు, జాగ్రత్తును శూన్యమేయైయున్నది. సూర్యుడు గత దినమున, నేడు ఒకడే అయినట్లు, మనుజుడు నిన్న నేడు కూడ ఒకడే అయినట్లు, జాగ్రత్‌ స్వప్నములు రెండు ఒక్కటే. 

స్వప్నమున మరణించినయాతడు స్వప్నమునుండి యోగముపొంది, మరియు జాగ్రత్‌ నందు మేల్కొనుచున్నాడో, అతడు నిద్రనుండి విముక్తుడాయెనని చెప్పబడుచున్నది. 

పూర్వజన్మమందలి బంధువులు ఈ జన్మలో కనబడకయున్న, బాధపడుటలేదు. అట్లే జాగ్రత్‌యందు జీవుడు అన్యదేహమును మాత్రమే గైకొనుటచే, పూర్వపు స్వప్న పదార్ధములు దానిచే బాధింపబడవు కదా' 

స్వప్నమందు ద్రష్ట అనేక సుఖదుఃఖములను పెక్కు మోహములను, దినరాత్రుల భేదములు అనుభవించి మరణించినప్పటికి, మేల్కొన్న తదుపరి నిద్ర అంతముకాగ, ఇచ్చట జనించుచున్నాడు. అపుడు స్వప్న అనుభూతులు అసత్యమని తలచును. 

జీవుడు జాగ్రత్‌ ప్రపంచమున మరణించి మరియొక జాగ్రత్‌ ప్రపంచమున జన్మించునపుడు, పూర్వజాగ్రత్‌ ప్రపంచరూపమును గ్రహించక ఇప్పటి జాగ్రత్‌నే గ్రహించును. 

ఇట్లు జీవుడు జాగ్రత్‌ స్వప్నములను రెండవస్ధలందు వాస్తవముగ జన్మించుటలేదు, మరణించుటలేదు. అయినను ఆయా దేహమందలి యనుభవముచే జన్మించుచున్నాడు, మరణించుచున్నాడు. 

వర్తమానమున స్వప్నము జాగ్రత్‌వలె ప్రత్యక్షముగ భాసించుచున్నది. భూతకాలిక జగత్తును, స్వప్నమువలె కన్పించుచున్నది. కాని వాస్తవముగ ఆ రెండును అసత్యములైయున్నవి. కేవలము చిదాకాశమే అట్లు స్ఫురించుచున్నది. 

ఏది దేనిమయమైయున్నదో అది లేక ఎట్లు లభించగలదు. కావున స్వప్న జాగ్రత్తులందు వికల్పములైనట్టి ఏకమగు చిన్మాత్రయే శేషించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 253 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 83 🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 4  🌻

The first stage of Subechcha arises in the mind, like the analogy of a crow and the Palmyra fruit, through the association with the stainless wise and the performance of all virtuous actions without any desires for the fruits thereof. 

This will irrigate his mind with the waters of discrimination and protect it. This stage will be developed with nonattractions (or indifference). 

With the development of this indifference every day through proper efforts, it will be found that the first stage is the substratum of the other stages like low-caste men cultivating lands for others sustenance. 

From it, the next two stages Vicharana and Tanumanasi will be reached. With the cultivation of special indifference, the third stage is reached. A person who has reached this stage will be void of all Sankalpas.  

Here Rama remarked: How can salvation be obtained by those who are of degraded family, without intelligence, performing bondage-giving Karmas, of vicious tendencies and without Jnana? 

Moreover if, I person dies having reached the first, second or third stages, what will be his future fate? Please enlighten me on these points, Oh immaculate Lord. 

To which the wise Vasistha replied thus: To the ignorant who are subject to many frailties, there will arise many re-births of diverse kinds. These rebirths will not cease till the first Jnana stage is reached. 

Besides, if the virtuous path be strode, there will arise the stainless indifference, like the analogy of a crow and the Palmyra fruit; or with the association with the wise, this indifference will arise; and when there is indifference, the Jnana stage will not but be reached. 

Through it, all rebirths will cease. All the significance of the Sastras point to this goal only. 

Again, hearken to the fates of those who, being in one or other of these Jnana states, breathe their last. Should one satisfy quite the qualifications required of him in the three Jnana states, then all his former Karmas will cease to exist. 

Then Devas will conduct him on their divine vehicle to Deva-loka and other places, where he will feast his eyes upon the pleasant sceneries of Meru, Elysian gardens, caves and beautiful damsels. 

 With the expiry of their enjoyment, all the old two-fold Karmas will perish completely, and then they will at once redescend upon earth as Jnanis. 

They will incarnate in a family of the wise replete with enormous wealth, good qualities and purity of mind and body) and will unerringly follow the path of Jnana, since they had already subjected themselves to a rigid course of discipline. 

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Apr/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 2 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  254 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 51 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ 

🌻 133. చిదాకాశము(బ్రహ్మము) 🌻

ఓ రామచంద్రా| ఏక కాలమున జన్మించిన, ఇద్దరు సొదరులకు వేరువేరు పేర్లు పెట్టబడినట్లు, జాగ్రత్‌ స్వప్నరూపుడగు అఖండ చైతన్య ప్రతిబింబములను రెండు ప్రపంచములు; జాగ్రత్‌ స్వప్నమని వేరువేరు పేర్లు పెట్టబడినవి. 

క్షణమాత్రములో, ఒక ప్రదేశమునందే, అతి దూరమునున్న మరియొక ప్రదేశమునకు దృష్టి జనినపుడు, ఆరెండు ప్రదేశముల మధ్మనుండు నిర్విషయమగు జ్ఞానముయొక్క స్వరూపమే చిదాకాశమని చెప్పబడుచున్నది. 

కోర్కెలన్నియు శమించినట్టి శాంతచిత్తుడగు మనుజునకు, సర్వవైషమ్య రహితమైనట్టి ఏ స్వాభావిక సుఖస్వరూపముయొక్క యనుభవమగుటచే, అట్టిదే చిదాకాశ రూపమగును. వర్ష రుతువునకు ముందుగాని, శరదృతువునందుగాని వృద్ధిపొందు తృణ,గుల్మ,లతాదులయొక్క మమత్వరహితమగు యానందభావమే చిదాకాశము. 

రూపసంకల్పాది సమస్త బాహ్యాంతర విషయ ముక్తుడగు జీవిత పురుషునియొక్క నిర్మల ఆనంద భావమేదికలదో, అదియే చిదాకాశము. బ్రహ్మదేవుడు; కాష్ట శిలలు, పర్వతములందు చేష్ట రహితమగు ఏ స్థితిని నిర్మించెనో, అదియే చిదాకాశము. 

అవస్ధానత్రయమైన జాగ్రత్‌,స్వప్న,సుషుప్తులందు; ద్రష్ట,దర్శన,దృశ్యములు ఎవనియందు గల్గునో మరల దేనియందు లయించునో అదియే బ్రహ్మము. 

ఎవరు సాక్షియై, పదార్ధ అనుభవములను పొందునో, ఎవనియందు సంకల్ప వికల్ప విచారములుదయించునో, అదియే చిదాకాశమగు బ్రహ్మము. దేనియందు సమస్తము కలదో, ఉద్భవించుచున్నదో, ఏది సమస్తమైయున్నదో, వ్యాపించియున్నదో ఏది సర్వస్వమై వెలుగుచున్నదో అదియే చిదాకాశము. 

స్వర్గమందు, భూమియందు,ఇతర నామరూపములందు ఏది ప్రకాశమైయున్నదో అదియే బ్రహ్మము. దేనినుండి సృష్టి ప్రళయాది వికారములన్నియు ఉద్భవించుచున్నవో, లయించుచున్నవో అదియే చిదాకాశము. 

నేతి నేతియని సర్వము నిషేదించగ, చివరకు మిగిలినదే చిదాకాశము. ఏది సర్వమైన్నప్పటికి, వాస్తవమునకు ఏదికాకయున్నదో అదియే చిదాకాశము. 

ఓ రామచంద్రా| నీవు వాసనారహితుడవై, శాంతచిత్తుడవై జీవించుచున్నను శిలవలె నిత్యము మహామౌనము ధరించి ఆత్మానందమున నిమగ్నుడవై వ్యవహరించుము. ఈ దృశ్యము యుత్పన్నము కాలేదు, ఇపుడు లేదు, ముందు నుండబోదు. 

దీనికి నాశనమేమి? భావనకు భావనత్వము, శూన్యమునకు శూన్యత్వము, ఆకాశపదార్ధములకు ఆకాశము, అట్లే ఈ చిదాకాశమునకు జగత్తును నైయున్నది. 

ఓ రామచంద్రా| స్వాత్మయగు చిత్‌ ప్రకాశము, దాని రూపుడైన ఈశ్వరుడు స్వయముగ నిపుడెట్లు భాసించునో, మరియు ప్రాణికోటియొక్క కామ,కర్మ వాసనానుసారము,స్వయముగ ఎట్లు భాసించునో అట్లే కాననగును. 

ఈ కార్యకారణ భావములు చిదాకాశమే, తద్రూపుడగు ఈశ్వరుని ఎగిరినపుడు, సమస్తమును చిదాకాశమని తలచి మోహము పొందకుండును. 

బ్రహ్మము మొదలుకొని సమస్త జీవులకును ఈ దృష్టి భ్రాంతి కల్గుచునేయుండును. కాని ఎపుడు అది అసత్యమని ఎఱుంగబడుచున్నదో అపుడది తక్షణము బ్రహ్మమే అగును. 

నిరాకార ఆత్మయందు, ఈ జగత్‌ రూపత్వము అసత్యమేయయినను, స్వప్నమందు పర్వత నగరాదులనుభవించబడుచున్నట్లు, చిదాకాశముచే నది సత్యముగనే అనుభవించబడుచున్నది. 

కల్పవృక్షము, చింతామణియు చింతించినంతమాత్రమే అభీష్ట పదార్ధములొసంగునట్లు, చైతన్యమును జీవుడు తనయందు దేనిని భావించునో దానిని తక్షణమే పరిపూర్ణమొనర్చబడుచున్నది గాని తద్భిన్నముగ అణుమాత్రమైనను లేదు. 

సర్వము చిదాకాశమగుట, స్ధావరజంగమ రూపములగు సమస్త పదార్ధములను, వ్యవహారయుక్తములైన్నప్పటికి, మృతునివలెను, కాష్టమువలె, నిశ్చలముగను మౌనముగను నున్నవై వెలయుచున్నవి. 

కార్యకారణ,కాలాది కల్పనచే వ్యాకులమైనట్టి చిత్తముగల వారియందు, పృధ్వాదు లిట్లు సత్యములై వర్తిల్లుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 254 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 84 🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 5  🌻

As this universe is seen without anything special as in the walking state by a Jnani in these three stages, they can well be termed the waking state. 

It is persons in these three stages that pass for Acharyas to the work-a-day world. To the ignorant, they appear like those who have attained Moksha and are extolled. They instil spirit into the ignorant to tread the path of Jnana. 

They will do only things fit to be done, and omit to do things which ought not to be done. They will act consistently with the working of nature. Such men alone are the greatest of men. 

Those only are the Supreme men who load their lives according to Acharas (the religious observances), the Sastraic injunctions and the non- noble actions of the world with firmness.  

In the first stage of matchless Jnana, the nature (or qualities) of an Acharya will germinate; in the second stage they will bloom; and in the third stage, they will fructify. 

Should a Jnani die while in this (last) state, he will remain in Swarga, for a long time; and after satiating himself with the enjoyments therein which perish on account of their Sankalpa, will reincarnate on earth again as a Jnani. 

After Ajnana (ignorance of Truth) perishes through the development of these three stages, the exalted Jnana will dawn fully in his mind and settle itself firmly there as all- pervading and without beginning and end, like the light of a full moon. It is with this mind associated with Jnana that Yogis shine.  

Those who have reached the fourth stage will look steadfastly and coolly upon all things in the universe with an equal eye and like a dream. 

Oh Rama, all the above three stages can be classified under the Jagrat state, while the abovementioned fourth can be included under the Swapna state. In this last stage, the mind will perish like the array of clouds in the autumnal season. 

Then it will remain in the transcendent Sat-Bhava alone which survives all. With the destruction of the mind, all Vikalpas will notarise.  

Then passing over to the fifth stage which will come under Sushupti, he will remain in the absolute certitude of non- duality, when all the specialties of gunas will disappear. Such a person will be with full Jnana shining in the heart and free from the gloom of duality. He will ever remain in the Sushupti state. 

He will always rejoice in the possession of the matchless introvision. Though engaged in external actions, he will ever be quiescent, as if in a brown study. 

The sixth stage being reached, the Turya state ensues, in which he will be engaged in the practices appurtenant to that stage, being completely divested of all the regularly accrued Vasanas. 

Then he spends his time mindless as the Kevala (one) free from all ideas of differences or non-differences, „I‟ or non-I, being or non-being. 

A Jiva in this state unaffected by the knot of Ahankara and being neither with the idea (of attaining) Nirvana nor without it, will be within, like the steady and unflickering light of a lamp. 

All the worldly creation having then no externals or internals, shines all-full both inside and outside through Brahmic vision, like a pot filled to the brim in the midst of the ocean seething with waves. 

This personage, though he, to all appearances, seems to have everything is really with nothing. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 06/Apr/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  255 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 52 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ 

🌻 134. విపశ్చి దుపాఖ్యానము - 1 🌻

అవిద్య నశించనిచో, జగత్తునకు అంతములేదు. అని తెల్పు అవిద్యోపాఖ్యానము వర్ణించబడినది. శ్రీరాముడు, ఈ అవిద్య ఎంతకాలముండును. ఎట్లు అది వర్తించును? అని అడుగగా వసిష్ఠుడిట్లు పలికెను. 

ఈ అవిద్య ఎవరికి ఉండునో, అట్టి అజ్ఞానులకు బ్రహ్మమువలె అంతమేయుండదు. ఈ విషయములో ఈ కథను వినుము. 

పూర్వకాలమున ఒకానొక వస్తువునందు, ఒకప్రదేశమున వివిధ అవస్థలలో ఒక త్రైలోక్యము కలదు. 

అందు ఒక భూభాగమందు మనుజులు, గజములు, అశ్వములతో యోగ్యమైన సమప్రదేవమున తతమితయను పేరుగల ప్రసిద్ధ నగరము కలదు అందు విపశ్చిత్తు అను పేరుచే విఖ్యాతి పొందిన భూపాలుడొకడు కలడు. అతడు సర్వ శాస్త్ర ప్రవీణుడగుటచే అతని సభకూడ ప్రసిద్ధి చెందినది. 

ఆ రాజుయొక్క అనంత గుణములు వర్ణించుటయందు, కవులు అసక్తులైరి. అయినను ఆ రాజు వారిని గౌరవించుచుండెను. అతడు బ్రాహ్మణులయందు, దేవతలయందు భక్తి కల్గియుండెను. 

అతని వద్ద సర్వ సమర్దులైన నల్గురు మంత్రులు మహా బలవంతులు ఉండిరి. రాజు ఆ మంత్రుల సాయంతో శత్రువులను జయించుచుండెను. ఒకానొక దినమున తూర్పుదిక్కునుండి ఒక చతురుడైన దూతవచ్చి కఠోర వాక్యముల నిట్లు పలికెను. 

ఓ రాజా| తూర్పుదిక్కున ఉన్న సామంతరాజు, జ్వరపీడితుడై మరణించుట జరుగగా తదుపరి, దక్షిణదిక్కునందలి సామంతుడు పూర్వ, దక్షిణ దిక్కులను జయించ నుద్యుక్తుడు కాగ అతని ఆసైన్యములు అతనిని హతునిగావించినవి. అపుడు పశ్చిమదిశయందలి సామంతులు పూర్వ దక్షిణ దిక్కులను జయించుట కుద్యుక్తులు కాగ, అతడు పూర్వ దక్షిణ దిక్కుల సైన్యముచే హతుడయ్యెను. 

అతడిట్లు పల్కుచుండ మరియొక దూత ఆ రాజభవనమున ప్రవేశించి ఉత్తర దిక్కునందలి సేనాని శత్రువులచే బాధితుడై, సేనాసమేతుడై ఇచ్చటికేతెంచు చున్నాడు. 

అది విని రాజు సమయమును వృధా చేయరాదనియు, అచటినుండి బయల్వెడలుచు ఇట్లనియే. 
రాజులను, సామంతులను మంత్రులను అందరిని యుద్ధమునకు సన్నద్ధులుగ జేసుకొని రండి. 

ఆయుద్ధశాలను తెరచి, సైనికులకు భయంకర ఆయుధములనొసగుడు, యోధులు కవచములు ధరించుడు. సర్వసైన్యమును సమాయత్తపరచుడు. నలువైపుల దూతలను పంపుడు. అంతలో ద్వార పాలకుడిట్లు పలికెను. 

ఓ రాజా| యుత్తర దిక్కునందలి సేనాపతి ద్వారముకడ వేచియున్నాడు. తమ దర్శనము కోరుచున్నాడు అని పల్కగ వెంటనే అతనిని కొని రమ్మని రాజు పల్కెను. అపుడు ఆ సేనాపతి రాజు సమీపమునకేతెంచెను. 

అతని శరీరమంతయు గాయములతో, బాణములతో బలరహితుడై ధైర్యముతో నిట్లు పల్కెను. పూర్వ,దోక్షిణ, పశ్చిమ దిశలందలి సేనాపతులు మృతులుకాగ మిగిలిన సైన్యము నన్ను వెంటాడుటకు అరుదెంచుచున్నారని పల్కి యూరకుండెను. 

ఇంతలో మరియొక పురుషుడచ్చటికేతెంచి రాజుతో నిట్లనియే ఓ రాజా| నలువైపుల గొప్ప సైన్యము వ్యాపించి యున్నది. వారు సమస్త ఆయుధముతో సిద్ధముగా నున్నారు. తమ సేనాపతి యుద్ధము సల్ప నుద్యుక్తుడై తమతో నిట్లు చెప్పమనెను. అంతట రాజగృహము యుద్ధప్రయత్నములలో మునిగెను. 

అపుడు అతని మంత్రులు రాజును సమీపించి; శత్రువులు సామధాన భేదములకు లొంగరనిన, దండోపాయమే శరణ్యమని పల్కగ అందులకు రాజు సమ్మతించి, తాను యుద్ధమునకు సిద్ధమయ్యెను. 
అతడు స్నానమాచరించి, అగ్నిదేవుని పూజించి ఇట్లు తలచెను. 

నేనిప్పటివరకు రాజ్యమును ప్రజలను సమర్దవంతముగ పాలించితిని. ఇపుడు నేను వృద్ధుడనైతిని. శత్రువులు రాజ్యమును చుట్టుముట్టిరి. విజయము నాకిపుడు సందిగ్ధముగ నున్నది. 

కావున నేను అగ్ని దేవుడైన నీకు నా శిరంబు, నాదరముతో ఆహుతి నొసంగెదను. అని మరియు ఈ అగ్నిగుండమునుండి,అతి బలవంతులును, నారాయణుని భుజబలమువంటివియగు నాల్గు శరీరములు నాకు యుత్పన్నమగును గాక. 

వాటిచే నాల్గు దిక్కులను వధించి వైచెను. నాకు తమ దర్శన మొసంగుడని పల్కెను. తదుపరి తన ఖడ్గముచే తన శిరస్సును ఛేదించివైచెను. అగ్నియందు ఆహుతి అయ్యెను. 

అగ్నిదేవుడు ఆ శరీరమును దహించి, తిరిగి నాల్గింతలుగ ఆ అగ్ని గుండమునుండి, నాల్గు శరీరములతో నారాయణునివలె బయల్వెడలెను. ఆ నాల్గు దేహములు సర్వాలంకార శోభితులై, సర్వశక్తి వంతులై తేజిల్లెను. మరియు ఆ దేహములు అశ్వములపై అధిరోహించి ఆ అగ్నిగుండమునుండి బయల్వెడలెను. 

అపుడు నాల్గు వైపుల ఘోరయుద్ధమారంభమైనది. ఆ యుద్ధరంగము అశ్వములు, గజములు కాల్బలములతో దిక్కులు పిక్కటిల్లునట్లు రణగణ ధ్వనులతో,అచట గుహలు ప్రతిధ్వనించుచుండెను. 

ఆ యుద్ధమందు ఏనుగులు చిన్నాభిన్నముగ ఆకాశమున ప్రసరింపబడిన ఆయుధములయొక్క టాంకారశబ్ధముల చేతను, అశ్వ,గజ చక్రముల మహాశబ్ధములచేతను వ్యాపించబడినదై యుండెను. ఇవ్విధమున ప్రళయమువంటి మహాయుద్ధ సంభ్రమము ప్రవృత్తము కాగ, ఆ యుద్ధరంగము చిందరవందరగా నైనది. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 255 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 85 🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 6  🌻

Having solitarily passed this sixth stage, the Jivanmukta reaches the seventh stage alone. It is in this seventh stage that disembodied salvation is attained. Thus is the final stage of the supreme Jnana reached, which is beyond al description.  

With regard to this seventh stage of Videha-Mukti, diverse religionists ascribe different names to this stage, Some say it is Paramatma, some hold it to be a void; some hold it to be Vijnana; some say it is Kala (time); and some Prakriti. 

Others there are who find it an up-hill work for them, through their Vikalpas and firm idea of differentiation of objects in this world, to cognize and describe this disembodied (or formless) state which, being homogeneous, is beyond the power of speech. 

If these seven Jnana stages are crossed in a nonillusory manner, pains will not in the least come in contact with such a person.  

There is a mad rutting elephant with tusks, like unto a white shell, which, showering rutting water as it goes, stalks with a beautiful gait with its long writhing proboscis spotted with white. 

If this animal which generates never-ceasing pains be slain, then mankind will cross with you all the various stages of the above mentioned Jnana. 

So long as this tremendous elephant oozing out rutting water be not slain through one s might, who will become a great warrior in the field of battle (in this universe) replete with pains?  

At these words of Vasistha, Rama of the form of grace accosted him thus: 

What is this powerful elephant you acquainted me with? where is the field of battle? How can it be annihilated? What is its residence?  To which Vasistha replied thus: 

This grand elephant showering rutting water is no other than the pains-genera- ting desires that ever try to appropriate to „I‟ all the things of the universe and disports itself with great mirth and joy in the spacious forest of the body. 

It has as its young ones, the dire Indriyas (or organs) full of anger and greed. It will articulate through its sweet tongue and perform its actions by being merged into the forest of the mind. 

The terrific and dire twin Karmas (good and bad) are its two tusks. The Vasanas are the rutting waters shed by it. It has a body which ranges everywhere and at all times. 

All the visible objects of Samsara are the battle field wherein the carnage takes place; the powerful desires being no other, as said before, than the elephant. 

This rutting elephant of desires which again and again invests persons with victory or defeat, puts an end to the myriads of poor Jivas. 

All the firm Vasanas having their own modifications, existence, Manas, Buddhi, Sankalpa, desires and the rest pertain to Antahkarana, the lower mind only. 

It is most conducive to the progress of a Jnani to conquer fearlessly by all means and as if in sport, this elephant of desires which is but a combination of all, through sheer might and the arrows of dauntless bravery. 

If through the imbecility of your mind, it longs after things of the world, please hear from me the means of arresting it. So long as these desires exist in you, so long will the poisonous disease of Samsara creep upon and affect you. 

The mind which expands itself everywhere, thus enmeshing itself in bondage can be called the despicable Samsara itself. Its destruction alone is Moksha. Such is the truth.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 07.Apr.2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 3 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  256 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 53 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ 

🌻 134. విపశ్చి దుపాఖ్యానము - 2 🌻

ఓ రామచంద్రా| ఇట్లు ప్రళయమువంటి మహాయుద్ధమునందు కొన్ని సైన్యములు ఓడిపోవుచు కొన్ని జయించుచుండ, భేరి మహాశంఖముల శబ్ధములు ప్రతిధ్వనులతో నాకసమున ఖడ్గములు శబ్ధమొనర్చు చుండగ రాజు నాల్గు దిక్కులకు జనెను. తన సైన్యము దుర్భలముగను, శత్రుసైన్యము బలయుక్తముగ నుండెను.

ఆ సైన్యము మహా సముద్రము వలె నుండుట రాజు వీక్షించెను. అంతట రాజు ఆ శత్రుసైన్యమును నిర్మూలింప, శివుడు అస్త్రమును సంధించినట్లు బాణములను నలువైపుల సంధించెను. 

తన సైన్యము హితము కొరకు, శత్రు సైన్యము దమనము కొరకు నాతడు అగ్నిదేవునికి ప్రణమిల్లి, మంత్రము జపించి శీఘ్రముగ దారుణాస్త్రమును ప్రయోగించెను. 

అట్లేదాని సహాయము కొరకు, శత్రు జనిత తాపశాంతికొరకు, అస్త్రములన్నింటికి ప్రభువగు పర్జన్యాస్త్రమును గూడ ప్రయోగించెను. అపుడా భయంకరమైన ఆయుధములు నదులవలె ప్రవహింపజొచ్చెను. 

అపుడు ప్రళయకారులైన మహా వాయువులు వీవదొడగెను. శత్రుసైన్యము శీఘ్రముగ నెగురగొట్టబడెను. యుద్ధభూమినుండి పరుగెడుచున్న శత్రుసైన్యము రక్తధారలతో గూడినదై అన్నిదిక్కులకు పరుగిడుచు దోమలవలె శీఘ్రముగ నశించిపోయెను. 

ప్రచండ దావాగ్నివంటి యా ఆయుధములవలన, శత్రుసైన్యము వ్యాకులము పొందెను. అట్లు ఛేది సైన్యము, పారశీక దేశపు యోధులు నశించిరి. దర్ధ దేశీయసైనికులు దశార్ణ దేశీయులగు యోధులు సమస్తమును, రాజుయొక్క బాణప్రయోగముచే నిర్జింపబడిరి. 

ఆ రాజు చైతన్యపూరితుడై, ఈశ్వరునిచే ప్రబోధితుడై, సమానశక్తియుక్తులు కల్గిన నల్గురు దిగ్విజయము గాంచిరి. అత్తరి ఆ ఆయుధములన్నియు తమతమ స్ధావరములకు చనెను. ఆకాశము సూర్యప్రకాశముచే గంభీరముగ నున్నదై, నిర్మలముగ విరాజిల్లుచుండెను. 

ఓ రాజా| ఆకాశముననే సర్వజగంబులు యుద్భవించుచున్నవి. ఆకాశముననే ఉపస్థితి పొందుచున్నవి. మరల ఆకాశముననే అవి లయమగుచున్నవి. ఈ విధముగ ఈశ్వరుని లక్షణము ఆకాశమందు గన్పించుచున్నది. కావున ఆకాశమే ఈశ్వరుడైయుండెను. 

తదుపరి లవణ సముద్రముయొక్క పూర్వతీరమునుండి పశ్చిమ తీరము వరకు, ఉత్తర తీరమునుండి దక్షిణ తీరమువరకును, జంబూద్వీపము యుద్ధమున మిగిలిన రాజులెవరు గలరో, వారందరు అనుగ్రహింపబడుదురు గాక. మరియు రాజనీతిననుసరించి, శాంతబుద్ధితో శాసనములు గావింపుడు. సైన్యమును సమకూర్చుకొనుడు అని రాజు ప్రకటించెను. 

అంతట ఆ నలుగురు రాజులు, సముద్ర తీరముయొక్క భూమిపై కూర్చుని, మంత్రులచే నివేదింపబడిన రాజ మర్యాద స్ధాపన యను కార్యమును బూర్ణముగ నొనర్చిరి. తదుపరి ఆ నలుగురు విపశ్చితులగు రాజులు, అగ్నిదేవుని ఆహ్వానించిరి. 

ఆ అగ్నిదేవుడు వారిని దీవించి వెడలిపోయెను. జీవాత్మ ఒకటియే అయినను నాల్గు శరీరములతోటి యా విపశ్చితుయొక్క వివిధ, ద్వీపపర్వతములందు విహరించుట, వ్యవహరించుట జరిగినది. 

ఆ విపశ్చితులు జ్ఞాన,అజ్ఞాన దృష్టుల మధ్య నూగులాడుచున్నారు. వారిలో వివేకము, రాగము కన్పించుచున్నది. ధారణాపరిపాకముచే వారు అగ్నిదేవుని కృపవలన, వరదానముచే సిద్ధులబడసిన యోగులే అగుదురు. 

వారియందవిద్య యుండియేయున్నది. కావున వారు ఆత్మ విచార శూన్యలేయని ఎరుగనగును. మోక్షము చిత్తముయొక్క ధర్మమే గావున నది చిత్తమందే స్థితి కల్గియున్నదే కాని దేహమందు కాదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 256 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 86  🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 7 🌻

 If  a  disciple  whose  mind  is  cleansed  of  all  its illusions  which  make  it  real  is  initiated  into  the sacred  mysteries  by  a  Guru,  then  it  will  get quiescence  like  a  drop  of  oil  over  a  glass  surface. 

Through  the  illumination  of  Jnana  this  mind  which was  originally  of  the  form  of  the  seed  of  desires gives  up  all  the  delusion  of  re-births;  and  there arises  in  it  nothing  (of  the  worldly  desires)  through its  Asamvedana  (non-receptivity).  

If  the  desires which  bring  in  their  train  manifold  mischief  arise at  any  time  in  you,  you  should  destroy  them  at once  through  Asamvedana.  

Though  a  host  of desires  manifest  themselves  in  you  in  diverse ways,  yet  the  Vasanas  which  are  inseparably associated  with  body  will  never  fail  to  be  re  moved by  Asamvedana.  Do  not  fall  in  love  with  your  de sires  but  regard  them  in  the  light  of  a  carcase  to  be loathed.  

When  the  mind,  through  the  powerful Pratyahara 144  mode,  hankers  not  after  desires which  should  be  thought  of  as  nothing  but Vasanas,  then  the  mind  will  remain  still.  This  effort is called  Asamvedana.   

The  wise  say  that  the  ideas  of  „mine‟  and  „thine‟  are only  the  foul  creations  of  the  mind.  If  all  objects vanish  through  the  contemplation  of  Jnana,  the wise,  oh  stainless  Prince,  say  that  all  the  unreal illusions  will  disappear.  

The  existence  of  Manas  is itself  Sankalpa;  but  its  non-existence  is  Siva  itself (auspiciousness  or  bliss).  The  contemplation  of feeling  and  non-feeling  after  crossing  all  objects  is the  true  one.  

May  you,  after  abandoning  all  ideas of  intelligence  and  non-intelligence  and  becoming oblivious  of  all  things,  remain  steadfastly  and firmly,  like  a  decayed  tree,  with  great  Jnana  and  in an  unchanged  state.   

Note : 144.  One  of  the  eight  parts  of  Yoga  for  restraining  the  organs. 

Now  addressing  the  assembly,  Vasistha  said  thus In  order  that  all  persons  in  this  hall  may  without exception  understand  the  drift  of  what  we  say,  we shall  now,  with  our  hands  raised  on  high,  proclaim to  all  thus  It  is  only  Sankalpa  destroyed  beyond resurrection  that  constitutes  the  immaculate Brahmic  seat.  Why  should  not  men  then contemplate  silently  and  secretly  in  their  hearts upon  the  destruction  of  this  Sankalpa?  

Then  it  will so  betide  that  even  the  throne  of  an  Emperor,  who sways  his  sceptre  over  the  whole  earth,  will  be regarded  by  them  as  but  a  paltry  bauble.  This Brahmic  seat  is  obtained  by  those  only  who observe Mauna  (silence  towards  material pleasures).  

Like  a  person  who  journeys  on  to  a great  city  in  complete  reverie  within  himself unconscious  of  the  pains  which  his  feet  underwent in  the  exertion  of  walking,  so  an  Atma-Jnni performs  all  Karma,  without  his  being  conscious  of the  performance  of  them.    

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 08/Apr/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 5 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  257 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 54 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌻. 135. జీవన్ముక్తులు - 1 🌻

దేహధర్మము అనగా వ్యవహారాధులు, జీవన్ముక్తునకు వర్తింపవు. ముక్త చిత్తము మరల ఎన్నటికి బంధింపబడదు. 

తొడిమనుండి పడిన ఫలము,మరల ప్రయత్నము చేసినను, ఎవని చేతను ఆ తొడిమ బంధింపబడజాలదు. కాబట్టి అట్టి వారు ఇతరులచే జీవన్ముక్తుని తెలియబడజాలరు. 

ధారణాదులచే గూడిన యోగులు, ఇతరులచే నెఱుగబడుదురు కాన మోక్షము ధారణాదులవలె ఇతరులచే నెఱుగబడినది కాదు. అది మధుర పదార్ధముల ఆస్వాద సౌఖ్యమువలె స్వాద్వైక వేద్యమే యైయున్నది. 

అభ్యంతరమున శీతలత్వముతో గూడిన(శాంతి) చిత్తమే ముక్తియని, సంతప్త చిత్తమే బంధమని చెప్పబడుచున్నది. కావున బంధమోక్షములు చిత్తాదీనములే గాని, దేహాదీనములు కావు. దేహమునందు బంధమోక్షములు లేవు. 

శరీరము ముక్కలు ముక్కలుగ కోయబడినను, ఏడ్చుచున్నను, నవ్వుచున్నను, జీవన్ముక్తునకు అంతఃకరణమున దేహసంబంధ దుఃఖము, సుఖము కొంచెమైననుండదు. 

నిత్యమై అశరీరమైన ఆత్మస్వభావము పొందియుండుటచే జీవన్ముక్తులకు దేహాదిభావన నెపుడును నుండనేరదు. దేహము మరణించినను, జీవన్ముక్తుడు మరణింపకయే యుండును. 

ఏడ్చుచున్నప్పటికి వాస్తవముగ ఏడ్వనివాడే అగును. నవ్వు, క్రోధము, రాగము ఉన్నను అవి లేనివారేయగును. మోహములచే చుట్టబడినను, మోహరహితుడేయగును. 

త్యజించుటకు సమర్ధుడైనను, పవిత్రాంతఃకరణ యుక్తుడగు శివుడు రాగమును త్యజించుటలేదు. ఆ శివునికి ఈ ప్రపంచమున, నేదేని కార్యము చేయుటచే కాని, చేయకుండుటచే కాని ప్రయోజనమేదియు లేదు. 

ఈ ప్రపంచమున నేది ఎట్లున్నదో అది అట్లే అగుగాకయని తలచి విష్ణుభగవానుడు ఆయా కార్యమును చేయుచున్నప్పటికి, వాసనారహితుడై ఏ కోర్కె లేక శుద్ధ చిన్మాత్ర రూపుడై పడియున్నాడు. సూర్యభగవానుడు, నిరంతరము తన్ను పరిభ్రమింపజేసికొనుచున్నాడు.

జీవన్ముక్తులైనను గురువులగు శుక్రాచార్య, బృహస్పతులిరువురు లోకమున పరస్పరము జయించుకొనుటగూర్చి అనేక అభిలాషలతో గూడియున్నారు. 

జీవన్ముక్తుడైనను జనక మహారాజు, యుద్ధములందు పాల్గొనుచు రాజ్యపాలన చేయుచున్నాడు. వ్యవహారమందు జ్ఞాని అజ్ఞానియు సమముగనే వర్తించుదురు. కేవలము వాసనలు, వాసనారాహిత్యములే బంధమోక్షములకు కారణమైయున్నవి. 

ఆకాశమున ఇంద్రధనస్సు, వివిధ వర్ణములు భాసించినను, వాస్తవముగ శూన్యరూపములే యైయున్నవి. అటులనే ఈ బ్రహ్మాండములును, పరమాణువులును శూన్యరూపములే యైయున్నవి. 

సర్వకల్పనావర్జితమై, సర్వత్రా ఏకరసమై, కేవల చిదాకాశ రూపమై, నిద్రారహితమైనట్టి సమాధి కాలమందలి ఏ స్థితి కలదో, అద్దానిచే ఈ జగత్తు వెలయుచున్నదని ఎరుగవలెను. 

ఓ రామచంద్రా| ఘనశిలవలె ప్రశాంతముగ, మౌనముగ నున్నట్టి బ్రహ్మరూపమే యగు ఈ దృశ్య సమూహమేదికలదో దానికి స్వాత్మయే జగత్తను పేరు విధించి, స్వ మాయచే మోహితమైన దానివలె నున్నది. 

ఆహా| మాయ ఎంత ప్రభలమైనది. 
శ్రీరాముడు- ఓ మునీంద్రా| ద్వీప,సముద్ర,వన, పర్వతాదులతో గూడిన ఈ దిగంతములందు ఆ విపశ్చిత్తు ఇపుడేమిచేయుచుండిరి. 

ఆ విపశ్చిత్తులందొకరిని, క్రౌంఛద్వీపమందలి ప్రసిద్ధమగు వర్ష సీమపర్వతముయొక్క పశ్చిమభాగమునగల ఒకానొకశిలపై నొక గజము తన గండస్ధలముచే, కమలములవలె చూర్ణమొనర్చెను. 

రెండవ విపశ్చిత్తును, ఒకరాక్షసుడు యుద్ధమున భగ్నశరీరుని గావించి, ఆకాశమునకు గొనిపోయి అటనుండి సముద్రమునందలి బడబాగ్ని మధ్యమున బడవేయ అచ్ఛట అతడు భస్మీభూతుడయ్యెను. 

మూడవ విపశ్చితుని, ఒక విధ్యాధరుడు స్వర్గమున ఇంద్ర సభకు కొనిపోవ అచ్చట, నమస్కారము గావింపనందున, ఇంద్రుడు కుపితుడై శపించి యాతనిని భస్మయొనర్చెను. 

నాల్గవ విపశ్చితుని, పుష్యద్వీపమందలి, ఒకానొక పర్వతము యొక్క సమీపమున గల నదీ తటమున ఒక ముసలి ఎనిమిది తునకలు గావించి చంపివేసెను. ఈ ప్రకారముగ వ్యాకులచిత్తులగు ఆ నల్గురు విపశ్చిద్రాదులు మృతినొందిరి. 

మరణానంతరము వారి సంవిత్తు ఆకాశరూపము పొంది, అచట పూర్వసంస్కారములచే, భూమండలమును వీక్షించెను. ఆ నల్గురు విపశ్చిత్తుల సంవిత్తు తన దేహములను, పూర్వమువలె గాంచిరి. 

వారు తమ సూక్ష్మ స్ధూల శరీరములను తమ ఎదుట గాంచిరి. ఆత్మ జ్ఞానము లేనియూ అవిద్య ఎంత పరిమాణము గల్గియుండునను విషయము నవలోకించుటకై వారు తమ పూర్వకాలిక సంస్కారములచే ప్రవృత్తులైరి. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 257 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 87  🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 8 🌻

There  is  no  use  gained  in dilating  farther  on  the  subjects.  Now  hear  from  me in  brief,  the  substance  of  what  I  said  before. Sankalpa  only  is  Samsara;  its  destruction  is Moksha.  

May  you  be  in  a  state  of  Elysian  bliss, perceiving  all  worlds  to  be  of  the  nature  of  Jnana which  is  the  one  quiescence  without  parts  or  end or  destruction  or  fluctuation  or  Samsara.  

That which  is  described  as  the  imperishable  state  of quiescent  Jnana  is  Asamvedana.  Perform  all  your allotted  works,  being  at  the  same  time  in  the  Jnana state  and  without  the  attracting  desires.  

That  Jnana which  tends  to  the  destruction  of  the  mind  a  great up-hill  work  truly  is  Asamvedana.  

May  you  be, through  this  path,  in  that  state  of  beatitude,  which is  the  quiescent  Jnana.  All  ideas  of  identification  of all  things  with  one‟s  Self,  will  not  free  him  from pains.  

Asamvedana  will  confer  upon  one  Moksha as  its  result.  Whatever  is  dear  to  you  (or  proper  in your  eyes),  that  you  shall  enact.  

The  non-dawning self-light  of  Siva  (the  auspicious)  is  the  allpervading  Sat.  It  alone  is  the  quiescent,  auspicious and  surpriseless  bliss,  shorn  of  all  objects.  It  alone is  Jnana  of  ever-dawning  Sat.  

It  is  this  firm  direct cognisance  of  non-duality  that  constitutes,  Oh Rama,  Karma  Tyaga  or  the  renunciation  of  all actions. 

Thus  did  Vasistha  initiate  Sree  Rama  into  Atman, which  was  again  repeated  by  Muni  Valmiki  for  the benefit of  Bharadwaja.  

🌻. End of Yoga Vasishta Laghu 🌻

OM TAT SAT.   
🌹 🌹 🌹 🌹 🌹

Date: 09/Apr/2020

------------------------------------ x ------------------------------------


Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31