శ్రీ యోగ వాసిష్ఠ సారము - 256 / YOGA-VASISHTA - 256

Image may contain: 3 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  256 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 53 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ 

🌻 134. విపశ్చి దుపాఖ్యానము - 2 🌻

ఓ రామచంద్రా| ఇట్లు ప్రళయమువంటి మహాయుద్ధమునందు కొన్ని సైన్యములు ఓడిపోవుచు కొన్ని జయించుచుండ, భేరి మహాశంఖముల శబ్ధములు ప్రతిధ్వనులతో నాకసమున ఖడ్గములు శబ్ధమొనర్చు చుండగ రాజు నాల్గు దిక్కులకు జనెను. తన సైన్యము దుర్భలముగను, శత్రుసైన్యము బలయుక్తముగ నుండెను.

ఆ సైన్యము మహా సముద్రము వలె నుండుట రాజు వీక్షించెను. అంతట రాజు ఆ శత్రుసైన్యమును నిర్మూలింప, శివుడు అస్త్రమును సంధించినట్లు బాణములను నలువైపుల సంధించెను. 

తన సైన్యము హితము కొరకు, శత్రు సైన్యము దమనము కొరకు నాతడు అగ్నిదేవునికి ప్రణమిల్లి, మంత్రము జపించి శీఘ్రముగ దారుణాస్త్రమును ప్రయోగించెను. 

అట్లేదాని సహాయము కొరకు, శత్రు జనిత తాపశాంతికొరకు, అస్త్రములన్నింటికి ప్రభువగు పర్జన్యాస్త్రమును గూడ ప్రయోగించెను. అపుడా భయంకరమైన ఆయుధములు నదులవలె ప్రవహింపజొచ్చెను. 

అపుడు ప్రళయకారులైన మహా వాయువులు వీవదొడగెను. శత్రుసైన్యము శీఘ్రముగ నెగురగొట్టబడెను. యుద్ధభూమినుండి పరుగెడుచున్న శత్రుసైన్యము రక్తధారలతో గూడినదై అన్నిదిక్కులకు పరుగిడుచు దోమలవలె శీఘ్రముగ నశించిపోయెను. 

ప్రచండ దావాగ్నివంటి యా ఆయుధములవలన, శత్రుసైన్యము వ్యాకులము పొందెను. అట్లు ఛేది సైన్యము, పారశీక దేశపు యోధులు నశించిరి. దర్ధ దేశీయసైనికులు దశార్ణ దేశీయులగు యోధులు సమస్తమును, రాజుయొక్క బాణప్రయోగముచే నిర్జింపబడిరి. 

ఆ రాజు చైతన్యపూరితుడై, ఈశ్వరునిచే ప్రబోధితుడై, సమానశక్తియుక్తులు కల్గిన నల్గురు దిగ్విజయము గాంచిరి. అత్తరి ఆ ఆయుధములన్నియు తమతమ స్ధావరములకు చనెను. ఆకాశము సూర్యప్రకాశముచే గంభీరముగ నున్నదై, నిర్మలముగ విరాజిల్లుచుండెను. 

ఓ రాజా| ఆకాశముననే సర్వజగంబులు యుద్భవించుచున్నవి. ఆకాశముననే ఉపస్థితి పొందుచున్నవి. మరల ఆకాశముననే అవి లయమగుచున్నవి. ఈ విధముగ ఈశ్వరుని లక్షణము ఆకాశమందు గన్పించుచున్నది. కావున ఆకాశమే ఈశ్వరుడైయుండెను. 

తదుపరి లవణ సముద్రముయొక్క పూర్వతీరమునుండి పశ్చిమ తీరము వరకు, ఉత్తర తీరమునుండి దక్షిణ తీరమువరకును, జంబూద్వీపము యుద్ధమున మిగిలిన రాజులెవరు గలరో, వారందరు అనుగ్రహింపబడుదురు గాక. మరియు రాజనీతిననుసరించి, శాంతబుద్ధితో శాసనములు గావింపుడు. సైన్యమును సమకూర్చుకొనుడు అని రాజు ప్రకటించెను. 

అంతట ఆ నలుగురు రాజులు, సముద్ర తీరముయొక్క భూమిపై కూర్చుని, మంత్రులచే నివేదింపబడిన రాజ మర్యాద స్ధాపన యను కార్యమును బూర్ణముగ నొనర్చిరి. తదుపరి ఆ నలుగురు విపశ్చితులగు రాజులు, అగ్నిదేవుని ఆహ్వానించిరి. 

ఆ అగ్నిదేవుడు వారిని దీవించి వెడలిపోయెను. జీవాత్మ ఒకటియే అయినను నాల్గు శరీరములతోటి యా విపశ్చితుయొక్క వివిధ, ద్వీపపర్వతములందు విహరించుట, వ్యవహరించుట జరిగినది. 

ఆ విపశ్చితులు జ్ఞాన,అజ్ఞాన దృష్టుల మధ్య నూగులాడుచున్నారు. వారిలో వివేకము, రాగము కన్పించుచున్నది. ధారణాపరిపాకముచే వారు అగ్నిదేవుని కృపవలన, వరదానముచే సిద్ధులబడసిన యోగులే అగుదురు. 

వారియందవిద్య యుండియేయున్నది. కావున వారు ఆత్మ విచార శూన్యలేయని ఎరుగనగును. మోక్షము చిత్తముయొక్క ధర్మమే గావున నది చిత్తమందే స్థితి కల్గియున్నదే కాని దేహమందు కాదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 256 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 86  🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 7 🌻

 If  a  disciple  whose  mind  is  cleansed  of  all  its illusions  which  make  it  real  is  initiated  into  the sacred  mysteries  by  a  Guru,  then  it  will  get quiescence  like  a  drop  of  oil  over  a  glass  surface. 

Through  the  illumination  of  Jnana  this  mind  which was  originally  of  the  form  of  the  seed  of  desires gives  up  all  the  delusion  of  re-births;  and  there arises  in  it  nothing  (of  the  worldly  desires)  through its  Asamvedana  (non-receptivity).  

If  the  desires which  bring  in  their  train  manifold  mischief  arise at  any  time  in  you,  you  should  destroy  them  at once  through  Asamvedana.  

Though  a  host  of desires  manifest  themselves  in  you  in  diverse ways,  yet  the  Vasanas  which  are  inseparably associated  with  body  will  never  fail  to  be  re  moved by  Asamvedana.  Do  not  fall  in  love  with  your  de sires  but  regard  them  in  the  light  of  a  carcase  to  be loathed.  

When  the  mind,  through  the  powerful Pratyahara 144  mode,  hankers  not  after  desires which  should  be  thought  of  as  nothing  but Vasanas,  then  the  mind  will  remain  still.  This  effort is called  Asamvedana.   

The  wise  say  that  the  ideas  of  „mine‟  and  „thine‟  are only  the  foul  creations  of  the  mind.  If  all  objects vanish  through  the  contemplation  of  Jnana,  the wise,  oh  stainless  Prince,  say  that  all  the  unreal illusions  will  disappear.  

The  existence  of  Manas  is itself  Sankalpa;  but  its  non-existence  is  Siva  itself (auspiciousness  or  bliss).  The  contemplation  of feeling  and  non-feeling  after  crossing  all  objects  is the  true  one.  

May  you,  after  abandoning  all  ideas of  intelligence  and  non-intelligence  and  becoming oblivious  of  all  things,  remain  steadfastly  and firmly,  like  a  decayed  tree,  with  great  Jnana  and  in an  unchanged  state.   

Note : 144.  One  of  the  eight  parts  of  Yoga  for  restraining  the  organs. 

Now  addressing  the  assembly,  Vasistha  said  thus In  order  that  all  persons  in  this  hall  may  without exception  understand  the  drift  of  what  we  say,  we shall  now,  with  our  hands  raised  on  high,  proclaim to  all  thus  It  is  only  Sankalpa  destroyed  beyond resurrection  that  constitutes  the  immaculate Brahmic  seat.  Why  should  not  men  then contemplate  silently  and  secretly  in  their  hearts upon  the  destruction  of  this  Sankalpa?  

Then  it  will so  betide  that  even  the  throne  of  an  Emperor,  who sways  his  sceptre  over  the  whole  earth,  will  be regarded  by  them  as  but  a  paltry  bauble.  This Brahmic  seat  is  obtained  by  those  only  who observe Mauna  (silence  towards  material pleasures).  

Like  a  person  who  journeys  on  to  a great  city  in  complete  reverie  within  himself unconscious  of  the  pains  which  his  feet  underwent in  the  exertion  of  walking,  so  an  Atma-Jnni performs  all  Karma,  without  his  being  conscious  of the  performance  of  them.    

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31