శ్రీ యోగ వాసిష్ఠ సారము - 254 / YOGA-VASISHTA - 254

Image may contain: 2 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  254 🌹
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 51 🌴
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ 

🌻 133. చిదాకాశము(బ్రహ్మము) 🌻

ఓ రామచంద్రా| ఏక కాలమున జన్మించిన, ఇద్దరు సొదరులకు వేరువేరు పేర్లు పెట్టబడినట్లు, జాగ్రత్‌ స్వప్నరూపుడగు అఖండ చైతన్య ప్రతిబింబములను రెండు ప్రపంచములు; జాగ్రత్‌ స్వప్నమని వేరువేరు పేర్లు పెట్టబడినవి. 

క్షణమాత్రములో, ఒక ప్రదేశమునందే, అతి దూరమునున్న మరియొక ప్రదేశమునకు దృష్టి జనినపుడు, ఆరెండు ప్రదేశముల మధ్మనుండు నిర్విషయమగు జ్ఞానముయొక్క స్వరూపమే చిదాకాశమని చెప్పబడుచున్నది. 

కోర్కెలన్నియు శమించినట్టి శాంతచిత్తుడగు మనుజునకు, సర్వవైషమ్య రహితమైనట్టి ఏ స్వాభావిక సుఖస్వరూపముయొక్క యనుభవమగుటచే, అట్టిదే చిదాకాశ రూపమగును. వర్ష రుతువునకు ముందుగాని, శరదృతువునందుగాని వృద్ధిపొందు తృణ,గుల్మ,లతాదులయొక్క మమత్వరహితమగు యానందభావమే చిదాకాశము. 

రూపసంకల్పాది సమస్త బాహ్యాంతర విషయ ముక్తుడగు జీవిత పురుషునియొక్క నిర్మల ఆనంద భావమేదికలదో, అదియే చిదాకాశము. బ్రహ్మదేవుడు; కాష్ట శిలలు, పర్వతములందు చేష్ట రహితమగు ఏ స్థితిని నిర్మించెనో, అదియే చిదాకాశము. 

అవస్ధానత్రయమైన జాగ్రత్‌,స్వప్న,సుషుప్తులందు; ద్రష్ట,దర్శన,దృశ్యములు ఎవనియందు గల్గునో మరల దేనియందు లయించునో అదియే బ్రహ్మము. 

ఎవరు సాక్షియై, పదార్ధ అనుభవములను పొందునో, ఎవనియందు సంకల్ప వికల్ప విచారములుదయించునో, అదియే చిదాకాశమగు బ్రహ్మము. దేనియందు సమస్తము కలదో, ఉద్భవించుచున్నదో, ఏది సమస్తమైయున్నదో, వ్యాపించియున్నదో ఏది సర్వస్వమై వెలుగుచున్నదో అదియే చిదాకాశము. 

స్వర్గమందు, భూమియందు,ఇతర నామరూపములందు ఏది ప్రకాశమైయున్నదో అదియే బ్రహ్మము. దేనినుండి సృష్టి ప్రళయాది వికారములన్నియు ఉద్భవించుచున్నవో, లయించుచున్నవో అదియే చిదాకాశము. 

నేతి నేతియని సర్వము నిషేదించగ, చివరకు మిగిలినదే చిదాకాశము. ఏది సర్వమైన్నప్పటికి, వాస్తవమునకు ఏదికాకయున్నదో అదియే చిదాకాశము. 

ఓ రామచంద్రా| నీవు వాసనారహితుడవై, శాంతచిత్తుడవై జీవించుచున్నను శిలవలె నిత్యము మహామౌనము ధరించి ఆత్మానందమున నిమగ్నుడవై వ్యవహరించుము. ఈ దృశ్యము యుత్పన్నము కాలేదు, ఇపుడు లేదు, ముందు నుండబోదు. 

దీనికి నాశనమేమి? భావనకు భావనత్వము, శూన్యమునకు శూన్యత్వము, ఆకాశపదార్ధములకు ఆకాశము, అట్లే ఈ చిదాకాశమునకు జగత్తును నైయున్నది. 

ఓ రామచంద్రా| స్వాత్మయగు చిత్‌ ప్రకాశము, దాని రూపుడైన ఈశ్వరుడు స్వయముగ నిపుడెట్లు భాసించునో, మరియు ప్రాణికోటియొక్క కామ,కర్మ వాసనానుసారము,స్వయముగ ఎట్లు భాసించునో అట్లే కాననగును. 

ఈ కార్యకారణ భావములు చిదాకాశమే, తద్రూపుడగు ఈశ్వరుని ఎగిరినపుడు, సమస్తమును చిదాకాశమని తలచి మోహము పొందకుండును. 

బ్రహ్మము మొదలుకొని సమస్త జీవులకును ఈ దృష్టి భ్రాంతి కల్గుచునేయుండును. కాని ఎపుడు అది అసత్యమని ఎఱుంగబడుచున్నదో అపుడది తక్షణము బ్రహ్మమే అగును. 

నిరాకార ఆత్మయందు, ఈ జగత్‌ రూపత్వము అసత్యమేయయినను, స్వప్నమందు పర్వత నగరాదులనుభవించబడుచున్నట్లు, చిదాకాశముచే నది సత్యముగనే అనుభవించబడుచున్నది. 

కల్పవృక్షము, చింతామణియు చింతించినంతమాత్రమే అభీష్ట పదార్ధములొసంగునట్లు, చైతన్యమును జీవుడు తనయందు దేనిని భావించునో దానిని తక్షణమే పరిపూర్ణమొనర్చబడుచున్నది గాని తద్భిన్నముగ అణుమాత్రమైనను లేదు. 

సర్వము చిదాకాశమగుట, స్ధావరజంగమ రూపములగు సమస్త పదార్ధములను, వ్యవహారయుక్తములైన్నప్పటికి, మృతునివలెను, కాష్టమువలె, నిశ్చలముగను మౌనముగను నున్నవై వెలయుచున్నవి. 

కార్యకారణ,కాలాది కల్పనచే వ్యాకులమైనట్టి చిత్తముగల వారియందు, పృధ్వాదు లిట్లు సత్యములై వర్తిల్లుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 254 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 84 🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 5  🌻

As this universe is seen without anything special as in the walking state by a Jnani in these three stages, they can well be termed the waking state. 

It is persons in these three stages that pass for Acharyas to the work-a-day world. To the ignorant, they appear like those who have attained Moksha and are extolled. They instil spirit into the ignorant to tread the path of Jnana. 

They will do only things fit to be done, and omit to do things which ought not to be done. They will act consistently with the working of nature. Such men alone are the greatest of men. 

Those only are the Supreme men who load their lives according to Acharas (the religious observances), the Sastraic injunctions and the non- noble actions of the world with firmness.  

In the first stage of matchless Jnana, the nature (or qualities) of an Acharya will germinate; in the second stage they will bloom; and in the third stage, they will fructify. 

Should a Jnani die while in this (last) state, he will remain in Swarga, for a long time; and after satiating himself with the enjoyments therein which perish on account of their Sankalpa, will reincarnate on earth again as a Jnani. 

After Ajnana (ignorance of Truth) perishes through the development of these three stages, the exalted Jnana will dawn fully in his mind and settle itself firmly there as all- pervading and without beginning and end, like the light of a full moon. It is with this mind associated with Jnana that Yogis shine.  

Those who have reached the fourth stage will look steadfastly and coolly upon all things in the universe with an equal eye and like a dream. 

Oh Rama, all the above three stages can be classified under the Jagrat state, while the abovementioned fourth can be included under the Swapna state. In this last stage, the mind will perish like the array of clouds in the autumnal season. 

Then it will remain in the transcendent Sat-Bhava alone which survives all. With the destruction of the mind, all Vikalpas will notarise.  

Then passing over to the fifth stage which will come under Sushupti, he will remain in the absolute certitude of non- duality, when all the specialties of gunas will disappear. Such a person will be with full Jnana shining in the heart and free from the gloom of duality. He will ever remain in the Sushupti state. 

He will always rejoice in the possession of the matchless introvision. Though engaged in external actions, he will ever be quiescent, as if in a brown study. 

The sixth stage being reached, the Turya state ensues, in which he will be engaged in the practices appurtenant to that stage, being completely divested of all the regularly accrued Vasanas. 

Then he spends his time mindless as the Kevala (one) free from all ideas of differences or non-differences, „I‟ or non-I, being or non-being. 

A Jiva in this state unaffected by the knot of Ahankara and being neither with the idea (of attaining) Nirvana nor without it, will be within, like the steady and unflickering light of a lamp. 

All the worldly creation having then no externals or internals, shines all-full both inside and outside through Brahmic vision, like a pot filled to the brim in the midst of the ocean seething with waves. 

This personage, though he, to all appearances, seems to have everything is really with nothing. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31