శ్రీ యోగ వాసిష్ఠ సారము - 253 / YOGA-VASISHTA - 253
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 253 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 50 🌴
🌻. 132. పంచభూతములు, జీవుడు 🌻
ఓ రామచంద్రా| ఆకాశము శబ్ధ తన్మాతమ్రు, వాయువు, స్పర్శ తన్మాత్రముకాగ, ఆయాకాశవాయువుల సంఘర్షణచే రూప తన్మాత్రయగు తేజము, తేజముయొక్క ఉష్ణ శాంతిచే రసతన్మాత్రయగు జలము, వీటన్నిటియొక్క సంయోగము వలన గంధతన్మాత్రయగు పృధివి ఏర్పడుచున్నవి. నిరాకార ఆకాశమునుండియే ఇవన్నియు ఏర్పడినవి.
బ్రహ్మమే సర్వపదార్ధ స్వరూపమైయున్నది. ఈ పంచభూతములు అసత్యములైనను స్వప్న దశయందువలె సత్యములుగ అనుభూతములగును.
జాగ్రత్ స్వప్న రూపములతో చైతన్యమే ప్రకాశించుచున్నదనియు, చిత్ స్వభావముచే ఈ రెంటికి భేదములేదనియు నిచట వర్ణింపబడినది.
స్వప్నమందు వాస్తవముగ జగత్తులేదు.
చిత్ రూపమగు ఆత్మయే అట్లు
ప్రకాశమయ స్వరూపముతో భాసించుచున్నదనియు, అట్లే జాగ్రత్‌నందు, ప్రకాశించుచున్నదనియు, స్వప్నపదార్ధములవలె అసత్తయినను, ఈ త్రిలోకముల భాసించుచున్నది.
కావున స్వప్నమందు జగత్తు శూన్యమైనట్లు, జాగ్రత్తును శూన్యమేయైయున్నది. సూర్యుడు గత దినమున, నేడు ఒకడే అయినట్లు, మనుజుడు నిన్న నేడు కూడ ఒకడే అయినట్లు, జాగ్రత్ స్వప్నములు రెండు ఒక్కటే.
స్వప్నమున మరణించినయాతడు స్వప్నమునుండి యోగముపొంది, మరియు జాగ్రత్ నందు మేల్కొనుచున్నాడో, అతడు నిద్రనుండి విముక్తుడాయెనని చెప్పబడుచున్నది.
పూర్వజన్మమందలి బంధువులు ఈ జన్మలో కనబడకయున్న, బాధపడుటలేదు. అట్లే జాగ్రత్‌యందు జీవుడు అన్యదేహమును మాత్రమే గైకొనుటచే, పూర్వపు స్వప్న పదార్ధములు దానిచే బాధింపబడవు కదా'
స్వప్నమందు ద్రష్ట అనేక సుఖదుఃఖములను పెక్కు మోహములను, దినరాత్రుల భేదములు అనుభవించి మరణించినప్పటికి, మేల్కొన్న తదుపరి నిద్ర అంతముకాగ, ఇచ్చట జనించుచున్నాడు. అపుడు స్వప్న అనుభూతులు అసత్యమని తలచును.
జీవుడు జాగ్రత్ ప్రపంచమున మరణించి మరియొక జాగ్రత్ ప్రపంచమున జన్మించునపుడు, పూర్వజాగ్రత్ ప్రపంచరూపమును గ్రహించక ఇప్పటి జాగ్రత్‌నే గ్రహించును.
ఇట్లు జీవుడు జాగ్రత్ స్వప్నములను రెండవస్ధలందు వాస్తవముగ జన్మించుటలేదు, మరణించుటలేదు. అయినను ఆయా దేహమందలి యనుభవముచే జన్మించుచున్నాడు, మరణించుచున్నాడు.
వర్తమానమున స్వప్నము జాగ్రత్‌వలె ప్రత్యక్షముగ భాసించుచున్నది. భూతకాలిక జగత్తును, స్వప్నమువలె కన్పించుచున్నది. కాని వాస్తవముగ ఆ రెండును అసత్యములైయున్నవి. కేవలము చిదాకాశమే అట్లు స్ఫురించుచున్నది.
ఏది దేనిమయమైయున్నదో అది లేక ఎట్లు లభించగలదు. కావున స్వప్న జాగ్రత్తులందు వికల్పములైనట్టి ఏకమగు చిన్మాత్రయే శేషించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 253 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 NIRVANA PRAKARANA - 83 🌴
🌻 THE CONCLUSION OF NIRVANA PRAKARANA - 4 🌻
The first stage of Subechcha arises in the mind, like the analogy of a crow and the Palmyra fruit, through the association with the stainless wise and the performance of all virtuous actions without any desires for the fruits thereof.
This will irrigate his mind with the waters of discrimination and protect it. This stage will be developed with nonattractions (or indifference).
With the development of this indifference every day through proper efforts, it will be found that the first stage is the substratum of the other stages like low-caste men cultivating lands for others sustenance.
From it, the next two stages Vicharana and Tanumanasi will be reached. With the cultivation of special indifference, the third stage is reached. A person who has reached this stage will be void of all Sankalpas.
Here Rama remarked: How can salvation be obtained by those who are of degraded family, without intelligence, performing bondage-giving Karmas, of vicious tendencies and without Jnana?
Moreover if, I person dies having reached the first, second or third stages, what will be his future fate? Please enlighten me on these points, Oh immaculate Lord.
To which the wise Vasistha replied thus: To the ignorant who are subject to many frailties, there will arise many re-births of diverse kinds. These rebirths will not cease till the first Jnana stage is reached.
Besides, if the virtuous path be strode, there will arise the stainless indifference, like the analogy of a crow and the Palmyra fruit; or with the association with the wise, this indifference will arise; and when there is indifference, the Jnana stage will not but be reached.
Through it, all rebirths will cease. All the significance of the Sastras point to this goal only.
Again, hearken to the fates of those who, being in one or other of these Jnana states, breathe their last. Should one satisfy quite the qualifications required of him in the three Jnana states, then all his former Karmas will cease to exist.
Then Devas will conduct him on their divine vehicle to Deva-loka and other places, where he will feast his eyes upon the pleasant sceneries of Meru, Elysian gardens, caves and beautiful damsels.
With the expiry of their enjoyment, all the old two-fold Karmas will perish completely, and then they will at once redescend upon earth as Jnanis.
They will incarnate in a family of the wise replete with enormous wealth, good qualities and purity of mind and body) and will unerringly follow the path of Jnana, since they had already subjected themselves to a rigid course of discipline.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment