శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. కర్కాటియను రాక్షసి కధ - 4 🌻
వ్యవహారమున ధారణ, ధ్యానాదుల నవలంభించు యుందువు. న్యాయ మగు క్షుద్భాద నివృత్తి కొరకై నీవు ప్రాణులను హింసించెదవు. అని దీవించి బహ్మచనెను. అంత విషూచిక సంకల్ప సిద్ధురాలై తన పూర్వదేహముతో విలసిల్లెను. తన రాక్షస స్వభావము తొలగిపోయెను. ప్రాపంచిక వాసనలు వదలి పద్మాసనముతో స్ధిరముగ నున్నది. ఆరు నెలల తరువాత ఆ రాక్షసి సమాధి నుండి లేచి బాహ్మ వృత్తిలోకి రాగా, ఆకలి బాధ ఏర్పడగా ఈ శరీరమున్నంత వరకు ఈ బాధ తప్పదని భావించెను.
న్యాయబద్దమైన అన్నము లభించనిచో, అన్యాయార్జితము భుజించనని, ఈ శరీరము నశించినను పరవాలేదని నిశ్చయించుకొనెను. తనకు జీవితముచే గాని, మరణము చేగాని ప్రయోజనములేదని తలచెను. అంతట వాయువు కర్కటికి తరుణోపాయమును తెల్పెను. అజ్ఞానులకు జ్ఞాన బోధ చేయుమనియు, అట్లు బోధించినను ఎవరు జ్ఞానమును పొందరో, అట్టి వారు నీకు న్యాయముగా లభించు ఆహారమగుదురు అని చెప్పెను.
అంత కర్కటి సంతసించి, సమీపమున గల రాజ్యమున ప్రవేశించెను. అది సస్య సమృద్ధి కల్గి వివిధ జీవ జాలముతో శోభించు చుండెను. రాత్రి సమయమున అందలి రాజగు విక్రముడు దుష్టజీవుల సంహరించుకై యరణ్యమునకు బోయెను.
అచట రాజు, మంత్రులను కర్కటి గాంచెను. వీరిరువురు అజ్ఞానులు, ఆత్మజ్ఞానులయిన వారిని భుజించుట తగదు. కాన వీరిని పరీక్షించెదనని తలచెను. గుణవంతులను రక్షించవలెను అనితలచి, ఆ ఇరువురను నిలవరించి మీరెవరు అని ప్రశ్నించెను. అంతట రాజు విమ్రుడు ఆ మాటలకు భయపడక, మమ్ము భయపెట్టుటమాని, నీవు మా ఏదుటకు వచ్చి, నీ సామర్ధ్యమును జూపుమనెను.
అంతట వారు వాదోపవాదముల తదుపరి, కర్కటి, తన నిజ స్వరూపమును వారికి బహిర్గత మొనర్చెను. అంతట వారు, ఆ భయంకరమైన కర్కటిని గాంచి, క్రోధ దృష్టిని వీడుమని సమత్వమును, నిర్మలబుద్ధిని ప్రదర్శించి ఉచిత రీతిని వ్యవహరించమని కోరెను. నీకేమి కావలయునో కోరుకొమ్మనెను.
అంతట కర్కటి వారి భాషణా విధానము విని వీరు ఆత్మజ్ఞాన సంపన్నులని, బుద్ధిమంతు లనియుతలచి, వీరిని వధింపకూడదని, తన సందేహములను వీరి నుండి తెలుసు కొనగోరెను. అంతట కర్కటి మీర లెవ్వరు, నిర్మల చిత్తులుగ వున్నారు తెలుపు డనగా, మంత్రి తన పరిచయము చేసుకొని దుష్టులను దండించుటకు వచ్చితిమని తెలిపెను. అంతట రాక్షసి ఆత్మజ్ఞానులగు వారు నాకు స్నేహపాత్రులు, అలాకానిచో మిమ్ములను నేను మ్రింగివేయుదునని పల్కెను. నేనడుగు ప్రశ్నలకు సమాధానమిమ్మని కోరెను. రాజు సమ్మతించి ప్రశ్నించమని కోరెను. అంతట రాక్షసి ఇట్లు ప్రశ్నించెను.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 43 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 13 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
To which Saraswati of the form of Vedas thus said „This gross body of thine bred out of Karmas is an impediment in the way of your getting such knowledge. If you should become entirely oblivious of your body and know yourself as distinct from it and then become of the nature of Pure Bliss Enjoyer that is also Jnana light and Sat after being cleansed of all Maya impurities, then you shall be able to visit the hallowed Seat.
You shall then know, with delusions off your mind, that Brahman only is yourself and all the universe, like one gold converted into many ornaments. It is not the worldly desires but the pure Vasanas that tend to develop the true Jnana. You are not yet bereft of the easily performed (or the desires for) worldly objects. Therefore it is not possible for you to attain it.
Persons like myself can easily get into the pure Brahman. But those who are like yourself, have a subtle (lunar) body of the nature of mind, replete with desires and hence it, in turn, generates the gross body. Just as a snow ball melts with the rays of the sun and is converted into water, so your gross body will be changed permanently into the subtle body through development of the true Jnana and the abandoning of the Vasanas.
This is the Jivanmukti state. Then the all-full Jnana alone will prevail in you. Therefore you will have to perceive the former creation through your original subtle body (of Adhivahika), after stopping (or entrancing) then this body of thine.‟
When Saraswati had blessed her thus, the latter asked the former as to the efforts that should be made to realize that end.
To which Saraswati replied thus „Those only can cognize experimentally the higher states who have developed in themselves the processes of Sravana (hearing and study of spiritual books), Manana (contemplation) and Nididhyasana (reflection from all standpoints), uninterrupted bliss arising through concentration upon that ancient (one) Principle, renunciation of all, non- desires, and the intense reasoning practice followed through the path of Vedas that this great world is not everexistent.
Those only are in that path of Brahman, who are ever engaged in the intense practice of deriving bliss through the certain knowledge that the universes, which are no other than „I‟ or „It‟, do not really exist, as they did not exist from the very beginning and who are engaged in liberation, through such knowledge, free from the seer and the visual and from the enemies of love and hatred. After one is convinced that that knowledge which renders itself oblivious of all the visibles is the true one and the obtainer of Atman, ceaseless endeavours in the certainty of Brahman is alone Salvation. With such a practice, the pure Jnana will dawn.‟
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment