శ్రీ యోగ వాసిష్ఠ సారము - 64 / YOGA-VASISHTA - 64
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 64 / YOGA-VASISHTA - 64 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. మనస్సును జయించు - 1 🌻
చిత్తమను ఘోరవ్యాధిని నిర్పూలించుటకై ఒక గొప్ప యౌషదమును వసిష్టుడు రామునకు చెప్పుచున్నాడు.
పురుష ప్రయత్నముచే వాంఛిత వస్తువునుత్యజించుట ద్వారా చిత్తమును శీఘ్రముగ జయించవచ్చును. ఇష్ట వస్తువులుత్యజంచుట ద్వారా, ఎనడు రాగద్వేషాది చిత్త దోషములు లేక యండునో యట్టి వాని మనస్సు జయించబడును. ఆత్మ సాక్షాత్కార యత్నముచే, చిత్తమును, సాంసారిక పదార్ధ సముదాయము నుండి తొలగింపబడి, ఆత్వస్వరూపమును, సత్య వస్తువు నందు నియోజితుడైన, జ్ఞానయుక్తుడగుచున్నాడు.
దు:ఖముతో పరిత పించు మనస్సును, శాస్త్ర, సత్ సంగములతో ఛేదించి వేయవలెను. లాలన, తాడనాదులచే బాలుడు ఒక కార్యము నుండి మరియొక భావమునకు మరలించవలెను. ఉత్తమ ఫలదాయకమైన సమాధి యందు మనస్సును నియోగించి తద్వారా చిదాత్మతో మనస్సు నైక్య పర్చవలెను. రమణీయమగు విషయములను గూడ, ఆత్మసాక్షాత్కార రూపభావనచే, పరమోత్తమ మగు బ్రహ్మరూపముగనే భావించవలెను.
పురుష ప్రయత్నముచే, ఆత్మసాక్షాత్కారమొందిన, చిత్తము జయింపబడి, అప్రయత్నము గనే, బ్రహ్మమును పొందును. మనోనిగ్రహము లేనిచో, మోక్షరూపమగు సద్గతి మిగుల దుష్కరము. మనోనాశముచే, కామాది శతృ రహితమై, స్వారాజ్య సుఖము పొంది, జీవన్మక్తుడవుకమ్ము. మనోనాశములేనిచో, గురూపదేశము, శాస్త్రవిచారము, మంత్రములు మొదలగు యుపాయములన్నియు తృణప్రాయములు, వ్యర్ధములు.
సంకల్ప రహితుడై, చిత్తమును సమూలముగ ఛేదించిన, జీవుడు సర్వ వ్యాపియు, శాంతమునగు బ్రహ్మరూపము చెందును. ప్రారభ్ధమును పట్టించుకొనక, ఆత్మసాక్షాత్కారమగు, పురుషప్రయత్నముచే చిత్తము అచిత్తముగా మారును.
చిరకాలాభ్యాసముచే యుత్తమ బ్రహ్మపదమును పొంది, చైతన్యముచే అవిద్యను సంపూర్ణము నశింపజేసి, చిత్తమునాత్మయందు లయింపజేసి, పూర్ణాత్మరూపమును పొందుము. అందుకు ముందుగా, చిద్వస్తు భావన చేసి, బుద్ధిను పయోగించి, దానిని స్ధిరపరచి, పరమాత్మయందు నిలకడ కల్గియుండుము.
భయరాహిత్యము ద్వారా మనోజయము పొందిన, త్రిలోకములు జయించినట్లే. నేను పురుషడను, మరణించితిని, జీవించియున్నాను మొదలగు కల్పనలన్నియు, చంచల చిత్తము యొక్క వృత్తులే. యదార్ధముగ, నెవరు మరణించుట లేదు, ఎవరు పుట్టుట లేదు.
మోక్ష ప్రాప్తి కల్గునంత వరకు ఈ మనస్సు లోకసంచారము, రూపముల మార్పు చిత్తభ్రమ వలన కల్గుచున్నది. ఏ కోరిక లేని, శక్తి వంతమైన, సర్వహితమైన, మాయాదోషరహితమైన, పరమాత్మను చిత్తములో లయమొనర్చుటచే తప్ప, మరి ఏయుపాయము చేతనైనను, పొందలేము.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 64 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 34 🌴
🌻 6. THE STORY OF MANAS (MIND) - 3 🌻
Here Rama asked Rishi Vasistha to give the underlying meaning of this story. At which the great Muni thus continued.
(1) The interminable forest referred to in the story is nothing but this Samsara (mundane existence) which is devoid of beginning, middle or end, is associated with Maya (or is illusory) and is lofty, dire and replete with excessive Vikalpas.
(2) The Purusha (personage) residing in this forest of the universe filled with the vapour of fiery ire stands for the mind whirling with pains.
(3) He who checked the impetuous passage of the mind represents the incomparable discrimination.
(4) The mind attained through its enemy of discrimination the quiescent state of Para Brahm.
(5) The mind at first turned its back upon discrimination and hence entangled itself in the folds of Vasanas of objects.
(6) The well into which the egos sink after macerating their bodies is Naraka (hell);
(7) but the plantain garden symbolises Swarga loka (or Heaven) full of enjoyments.
(8) The forest of trees abounding with thorns is this Bhu loka (earth) filled with the two sexes of beings of excessive passion.
(9) Then the fact of that personage who, after toppling down into the well, was not able to rise from it for a long time and then (in another incarnation) entered the city, stands for the mind not yet freed from its sins.
(I0) The long-pointed thorns represent the males and females of this world full of passions.
(11) The words You are my enemy though paltry and It is only through you that I have identified myself with the pains and pleasures, I have been suffering from are the outbursts of the mind in its last gasp of death through discrimination.
(I2) The cry set up is when the desires are sought to be annihilated.
(I3) The bewailing and the invocation for aid are through the pains which the mind with halfdeveloped Jnana feels when it relinquishes all desires.
(I4) The final cool joy and the laugh consequent upon it, is the bliss arising from the mind merging into the stainless Jnana.
(I5) And the real bliss is that one which arises when the mind, divested of all desires through the eternal Jnana, destroys its subtle form.
(I6) The bridling of the mind through excessive power, refers to the concentration of the same through initiation into Jnana.
(I7) The scourging of the body refers to the pains created through the excessive misconceptions of the mind.
(I8). The peregrination of the personage over a vast field is the roving over the world, unconscious of the Reality that can be attained only through the mastery of the perishable Vasanas.
Hence it is that all the Sankalpas and Vasanas, which a man generates, enmesh him as in a net. All become subject to bondage through their own Sankalpas and Vasanas like a silk-worm in its cocoon. Having delved into your mind through your stainless mind and thoroughly sifted it, may you destroy your impure mind. So said the illuminated Vasishta to Rama of clear mind.
End of Chapter 6
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment