శ్రీ యోగ వాసిష్ఠ సారము - 62 / YOGA-VASISHTA - 62

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 62  / YOGA-VASISHTA - 62 🌹
✍️ . రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 లవణోపాఖ్యానము - 3 🌻
  
కుటుంబ పోషణ నిమిత్తము, బుద్ధి హీనుడనై, దు:ఖపీడితుడనై, తిరుగాడుచు, చిరిగిన వస్త్రములు ధరించి, ఈగలు వ్రాలుచున్నట్టి దుర్గంధయుక్త కౌపీనము ధరించి, చెట్ల క్రింద చాలా కాలము విశ్రమించితిని. అనేక కలహముల వలన గల్గిన దు:ఖ తాపముచే, రాత్రు లనేకములు గడిపితిని, 

తదుపరి, అతి దు:ఖముతో దీనుడగు నేను, బాలబాలికల వెంట నిడుకొని, మరియొక చండాల గృహమునకు జని, అనేక సంవత్సరములు గడిపితిని భార్యతో కలహించుట, చండాలురతోటి సంఘర్షణ మొనర్చుట చేతను, చిరకాల మాపత్తుల ధరించితిని. దోషరహితుడనగు రాజపుత్రుడనైన నేను అవ్విధమున, అరువది సంవత్సరములు, అరువది కల్పముల వలె గడిపితిని. 

ఓ సభ్యులారా! మీ యీ కాలక్రమము కంటెను విలక్షణమైన, మరొక కాలక్రమమందు, దుష్ట వాసనలచే బంధింపబడి, క్రోధముచే యితరులను తిట్టితిని, యేడ్చితిని, నిందాన్నము భుజించితిని,నికృష్ఠస్థానము లందు నివసించితిని. నా దేహము వృద్ధాప్యముచే కృశించినది. భోజన విషయము మాత్రము గమనించుచు ఒక సంవత్సరము శక్తిహీనుడునై యుంటిని. 

ఇంతలో ఆవింధ్య పర్వత ప్రాంతమున దుర్భిక్షము వ్యాపించెను. వర్షము లేదు. అగ్నికణముల వలె ఉష్ణ వాయువులు వ్యాపించినవి. జను లాకటి బాధచే పరితపించుచుండిరి. జన పద మంతయు జనశూన్యమైనది. సకల ప్రాణులు, ఉష్ణాధిక్యముచే, తపించు చుండిరి. జనులు ఆకటి బాధచే, ఒకరినొకరు, కొఱికి తినుచుండిరి. రాళ్ళు రప్పులు తిను చుండిరి. 

ఆకటి బాధచే, అనేక ప్రాణులజీవము లెగిరిపోవుచున్నవి. ఆకలిచే, గజములు, సింహముల జంపి తినుటకు యత్నించుచుండెను. స్త్రీ, పురుషులు సంచరించుచు ఒకరినొకరు కొఱికి తినుచుండిరి. అట్టి యావింధ్యా ప్రాంత మంతయు శని, అగ్ని, సూర్యులకు క్రీడాస్ధలమై యున్నది. కొందరు దేశాంతరము వెళ్ళిరి. 

అపుడు నేను నా మామను తక్కిన వారిని, అచటనే వదలి, కుటుంబమును వెంటనిడుకొని, నాదేశమును వదలి బయలుదేరితిని. పుత్రులను భుజములపై ఎక్కించుకొని, కొంతదూరము. వృక్షముల క్రింద, కొంతకాలము గడపగా, నాకత్యంత ప్రియుడగు, కనిష్ట పుత్రుడు, ఆకలితో ఏడ్చుచూ, తినుటకు మాంసము నిమ్మని, త్రాగుటకు రక్తము నిమ్మని, అతిదీనముగ ఏడ్చుచుండెను. ఎంత ఓదార్చినను వినక, రక్త మాంసములు కోరుచుండెను. 

అంతట నేను విసిగి తన రక్తమాంసమును తినమని యంటిని. అంతట వాడు అందులకు ఆంగీకరించగా, నేను మృత్యవును ఆశ్రయించి చితి పేర్చుకొని అందులో పడదోయుటయె తడవుగ, అతివేగముగా, యిచట సింహాసనము నుండి క్రింద పడుచుంటిని. అపుడు, తూర్యనాద, జయ, జయ శబ్ధములచే, నేను ప్రభోధితునైతిని. 

ఇట్లు ఇంద్రజాలికుడు నన్ను మోహపర్చెను అని చెప్పగానే, నా యింద్రజాలకుడు అంతర్ధానమయ్యెను. అపుడు మంత్రులు రాజుతో, ధనాపేక్షలేని ఈ మాంత్రికుడు, ప్రపంచ స్ధితిని బోధించ వచ్చిన యొకానొక దైవ మాయయే కాని, ఇతడు ఇంద్రజాలికుడే కాదు. సర్వశక్తి మంతుడగు విష్ణు భగవానుని మనస్సే గద ఈ జగత్తు.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 62 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 32  🌴

🌻 6.  THE STORY  OF MANAS (MIND)  - 1 🌻

Summary :  
After  having  shown  that  the  mind manifests  itself  as  the  external  world  in  the  shape of  pains  or  pleasures,  the  author  now  illustrates  the fact  that  the  mind  subjectively  is  consciousness while  objectively  it  is this  universe.   

The  bliss  enjoyed  by  the  adulterous  couple  in  the previous  story  was  given  out  for  the  purpose  of giving  a  faint  idea  of  Brahmic  bliss.  All  persons have  two  bodies,  a  subtle  one  suitable  to  the  mind and  a  gross  one.  The  mind  performs  all  actions very  speedily  in  this  mental  body  and  fluctuates thereby.  But  the  gross  body  knows  not  anything and  is  inert.   

At  these  words  of  Vasistha,  Rama  asked  to  be enlightened  as  to  the  nature  of  this  inert  and formless  body  of  the  mind.  To  which,  Muni Vasistha  of  the  nature  of  Jnana  replied  thus,  in  the words  of  Brahma  „The  form  which  the  endless Atman  of  all  potencies  assumes  through  Sankalpa is  Manas.  

All  conceptions  associated  with  actions arising  out  of  that  (real)  state  which  is  intermediate between  the  powerful  Sat  and  Asat  are  nothing  but the  forms  of  the  mind.  No  matter  whence  that mind  proceeds  or  what  form  it  manifests  itself with,  if  it  is  made  to  tread  the  path  leading  to Moksha  or  to  merge  into  Atman,  then  it  will  be conducive  to its  progress.   

Now  hearken  to  an  archaic  story  related  by Brahma  of  old.  There  was  a  great  forest  of  dire illusion,  terrific  to  be  hold  and  replete  with  dire pains.  A  fractional  part  of  its  utter  most  limit measured  many  myriads  of  Yojanas (45) .  In  that  forest lived  a  Purusha  (personage)  with  eyes  and  hands untold.  He  had  a  Chitta  (mind)  which  flitted everywhere.  

He  had  the  all-distending  form  of Akasa.  Armed  with  many  carved  sticks  of  great speed  on  his  person,  he  scourged  himself  with them,  and  then  smarting  under  those  pains  and setting  up  a  vociferous  yell,  he  would  run  in  all directions  without  having  any  mastery  over himself.  

Dashing  himself  against  all  objects  in intense  gloom,  he  would  precipitate  himself  down the  deep  and  desolate  well  of  terrific  sins  and  there would  be  eking  out  a  life  of  misery.  Then  emerging out  of  that  well,  he  would,  as  before,  lash  his  body and  scream  out,  whirling  ever  on  his  heels.  In  his impetuous  haste,  he  would  entangle  himself  in  a forest  of  trees  full  of  long  brambles  and  being perforated  all  throughout  the  body,  would  flutter like  the  moth  in  a  flame.  

Then  running  to  a  fine plantain  garden,  he  would  run  to  the  other  extreme of  intense  exultation.  Again  and  again  would  he recur  from  this  pleasurable  gar  den  to  the  previous thorny  forest  and  thence  into  the  well  and  back again,  finding  pleasure  in  none.   

Note 45 : Yojanas are  reckoned  by some  to  be  I0  miles;  by others,  7  or  8  miles.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31