శ్రీ యోగ వాసిష్ఠ సారము - 73 / YOGA-VASISHTA - 73

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 73  / YOGA-VASISHTA - 73 🌹 
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము   🌴
🌻.  స్థితి 🌻

వసిష్ఠుడు శ్రీరామునకు, ఉత్పత్తి ప్రకరణము తరువాత స్ధితిప్రకరణమును గూర్చి తెలియపర్చుచున్నాడు. యుత్పత్తి ప్రకరణమున చెప్పబడిన అహంతో కూడిన దృశ్య జగత్తంతయు, ఆకార రహితమును శూన్యమును, భ్రాంతి మాత్రమేనని, ఇది యంతయు, కర్త రహితమై, చిత్రకారుడుగాని, రంగుగాని, లేకయె, దృష్ట్రి రహితమును, నిద్రావర్జితము అనుభవరూపమునగు, స్వప్నమువలె యాకసమున నుదయించుచున్నదని చెప్పెను. 

బ్రహ్మము కంటె, అభిన్నమైనను, భిన్నముగ కన్పించుచున్నది. అనుభూత మగు మనోరాజ్యమువలె, అన్యమును, ఇంద్రధనస్సు వలె మిధ్యా రూపమున, యీ జగత్తు వ్యక్తమగుచున్నది. పంచభూతమయుడనను, అనుభవము జీవునకు, ప్రత్యక్షముగ నున్నను, యదార్ధమునకు నిరాకారుడు మాత్రమే అగును.

బీజమందు అంకురము వలె, ఈ జగత్తు ప్రళయమున సత్య స్వరూపమగు పరమాత్మ యందుండు ననుమాట సరికాదు. అదంతయు భ్రాంతి మాత్రమే. ధాన్యము లందు బీజములు, ఇంద్రియ గోచరమగు చున్నవిగాని; మనస్సునకును, ఇంద్రియములకు కూడ అతీతము, సూక్ష్మమునగు పరమాత్మ, బ్రహ్మండము లన్నింటి యొక్క బీజ మెట్లగును. 

పరమాత్మ ఆకారము కంటె సూక్ష్మము, వాక్కుల కతీతము, నామ రహితము అగుటచే, దానికి బీజత్వము వుండదు. సూర్యుని యందు అంధకారము అగ్ని యందు మంచుగాని యుండవు గదా! కాన నోరామ! దుర్భుద్ధులచే కల్పింపబడిన కార్య, కారణ, ఉపాదాన, ఉపాధేయ భావముల మిధ్యత్వ మెరింగి, ఆది మధ్యాంత రహితమును, సత్యస్వరూపమును అగు, పరబ్రహ్మమే, జగత్‌ రూపముననున్నదని గ్రహించుము. 

సృష్ట్యాది యందు జగత్తు యందు, బ్రహ్మము, తన యందు తాను, స్ధితి పొందియున్నది. అట్టిచో అందు, జన్య జనన భావ మెట్లుండును. కామ కర్మ వాసనాది బీజములతో సహా, దృశ్యము శమించుటయే, యదార్ధ దృశ్యమనదగును. చిత్త శమనము గాక, పదార్ధశమనము కాదు, కావున మూల జ్ఞాన సహితముగ మనస్సును, సంపూర్ణముగ నశింపజేయుట అవసరము, ఆత్మ సాక్షాత్కారముచే, నీ జగత్తంతయు చిన్మాత్రమగు బ్రహ్మమే అనియు, జ్ఞాన మెపుడు పరిపక్వమగునో అపుడు జన్మ, మృత్యువు అను ఈ జగత్తులు లేనివేయగును. 

యదార్ధముగ ఈ సృష్టి రూప రహితమే అగును. నిరాకారమగు, ఆకాశమున, నిర్మలమగు ఆత్మ యందీ సృష్టులన్నియు, ఆత్మరూపముననే, స్ఫురించుచున్నవి. జలము నందు ద్రవ్యత్వము వాయువు నందు చలనము, గుణవంతుని యందు గుణము ఎట్లుండునో, పరమాత్మ యందు ఈ జగత్తు గలదు. 

అంత శ్రీరాముడు వసిష్టునితో నిట్లు పల్కెను. మహాకల్పాంత మందును, సృష్ట్యాదియందును, ప్రధమ ప్రజాపతి అనగా సంస్కార రూపమున నున్న మనస్సే, ఈ జగత్‌ రూపమున నుత్పన్నమగుచున్నదని భావించెదనని చెప్పెను. అందువలన వసిష్టుడు, అది జగమే ననియు ప్రజాపతి యొక్క స్మతి సంకల్ప రూపమున ఈ జగత్తని; సుషిప్తి తదుపరి, మేల్కొని జీవునికి, పూర్వ స్మృతియున్నట్లు, పూర్వ ప్రజాపతి యొక్క స్మృతి నశించదు. పూర్వము జనించిన బ్రహ్మాదులందరు జ్ఞానులేగాన, మహాప్రళయమున వారందరు ముక్తులైరి. 

మహా కల్పమున సర్వులుముక్తులైరి. బ్రహ్మము యొక్క నిజ రూప ప్రకాశమే ఈ బ్రహ్మండ దేహమునకు ఉపాదానము. మరియు సూక్ష్మ శరీరమును అగును. ఒక్క పరమాణువు నందే ఈ త్రిలోకములు భాసించుచున్నవి. మరల ఆ పరమాణువు నందే మరొక పరమాణువు కలదు అందుకూడ ఈ ముల్లోకములు భాసించుచున్నవి. జ్ఞానుల దృష్టి యందు, యీ ప్రపంచ మంతయు నాశ రహితము, శాంతమునగు కేవల పరబ్రహ్మము. అజ్ఞానుల దృష్టిలో చతుర్దశ భువన రూపమున నున్నది.

ఈ బ్రహ్మండ మెట్లు వృద్ధి నొంది, భాసించు చున్నదో, అట్లే, ఇంకను కోట్ల కొలది బ్రహ్మాండములు, ఒక్కొక్క పరమాణువు నందు భాసించుచున్నవి. పర్వతమందెట్లు అసంఖ్యాకమగు పరిమాణువులు గలవో అట్లే బ్రహ్మము నందును త్రిలోక రూప పరమాణువులు గలవు. సూర్య కిరణములు, జలము, ధూళియందనేక పరమాణువులు, పరిభ్రమించుచున్నట్లు, చిదాకాశమునకు, త్రైలోక్యములను పరమాణువులు అనేకం భ్రమణం సల్పుచున్నవి. సృష్టి రూపమును తెలుసుకున్నచో, అందు నరకాది అధోలోకములు గలవు. బ్రహ్మ రూపమును నెఱింగిన అదియె మోక్ష ప్రదమగుచున్నది.

 ప్రత్యగాత్మ స్వరూపుడగు జీవుడు, ప్రపంచ కారణ భూతుడు, నియామకుడు నగు, ఈశ్వరుడును, పరమార్ధ దృష్టిచే శోధింప, పరిపూర్ణమగు చిన్మాత్ర పరబ్రహ్మము. ఇంద్రియ జయుడు సంసారమును ఛేదించును. ఇంద్రియ వశత్వము సంసారమున బడదోయును. ఇంకను ఈ మనస్సె, కర్మయను వృక్షము యొక్క అంకురమని, దీనిని ఛేదించిన ఈ జగత్‌ వృక్షము ఛేదింపబడును. ఈ మనో దమనముచే, జగత్‌ సమూహము, దృశ్యము శమింపగలదు. 

మనస్సే దేహాంకురము. జ్ఞానముచే దృశ్యమును సంపూర్ణముగ, రహిత మొనర్చుటచే, దృశ్య పిచాచము శమించును. మనస్సే మొహము, మనస్సే బంధము. మరణించునది, జన్మించునది మనస్సే. సూర్యుని యందు కిరణములు, తేజము నందు ప్రకాశము, అగ్ని యందు ఉష్ణము యున్నట్లు, ఈ జగత్తు, మనస్సు నందే గలదు. మనస్సు నశించిన, జగత్తు లేదు. కాని జగత్తు నశించిన మనస్సు నశించదు.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 73 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 43  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 4  🌻

 To  which  Vasistha  of  immeasurable  Tapas  replied thus  It  is  the  transcendental  Jnana  of  Brahman which  does  not  manifest  itself  objectively  in  the visibles,  is  the  Plenum,  and  the  one  that  is, possessing  no  name.  All  the  things  in  the  world that  are  pointed  out  as  this  or  that  are  no  other than  the  eternal  Brahman  of  the  nature  of  Jnana. The  illusory  impure  mind  is  not.  

All  things  such  as birth  and  death  in  the  three  worlds  are  not  really  in them;  nor  are  the  six  changes (48.)  But  the  non-dual Absolute Consciousness  which can be  known by  its pervading  nature  is  alone  objectively  existent.  Out of  that  Jnana-Atman  which  is  absolute,  self-shining imperishable,  immaculate,  all-pervading,  impartite with  Jnana  alone  and  without  the  least  pains  and quiescent,  and  which  commingling  with  all  objects is  yet  unaffected  by  them,  arose  through  its  own power  an  intelligence  generated  through  its  desire of  Sankalpas.  

This  Jnana  generating  countless Sankalpas  permeates  all.  This  intelligence constitutes  the  mind  of  Brahman  itself.  In  this Brahman  are  infinite  Saktis.  In  this  fleeting  mind which  pervades  equally  in  all  without  a  second, arise  the  diverse  supreme  Saktis  like  waves  in water.  Now  this  mind  which  arises  through Sankalpa  perishes  through  it  alone  like  a  flame  of fire  which,  though  fanned  by  wind,  is  yet extinguished  by  the  same.  

The  non-cognition  of oneself  as  Brahman  which  is  the  Laya  (neutral) centre  of  all,  is  itself  the  bondage  of  the  mind;  but the  firm  cognition  of  oneself  as  Brahman  is  itself Moksha. 

Note 48 : The  six  changes are:  Genesis,  Existence,  alteration,  growth,  decay and destruction. 

The  conception  as  real  of  I,  Ajnana,  pains and  the  forms  of  bodies  having  limbs,  etc.,  and  the conduct  of  life  in  accordance  thereto,  generate desires  and  bondage;  but  if  such  thoughts  arise  in persons  as  „I  am  not  these  inert  objects,  I  am neither  the  flesh  nor  nerves,  nor  bones  nor  ulcer water,  etc.,‟  and  if  they  identify  themselves  with Brahman  which  is  beyond  all  bodies,  then  only they  disentangle  themselves  from  the  folds  of Maya  and  become  the  knowers  of  their  own  Self. 

The  base  Maya  of  Ahankaric  conception  which arises  through  the  identification  of  „I‟  with  bodies and  others  is  gifted  with  a  living  reality  only through  the  fancy  of  the  ignorant,  but  to  the  wise this  Maya  is  non-existent.  Like  a  minister  obeying  a king,  the  five  organs  of  the  body  act  in  accordance to  the  dictates  of  the  mind.  

Therefore  you  should, through  your  own  pure  mind  and  proper  efforts, eradicate  the  Vasanas  of  desires  for  objects.  All  the Vasanas  which  are  generated  in  one  through  his identifying  himself  with  his  sons  or  wealth  or creating  the  differences of  I,  he,  you,  this  or  that,  do wax  more  and  more  like  Indrajala  (psychological trick)  which  is  as  ephemeral  as  lightning.  

Having become  the  beneficent  knower  and  relinquished  all Ajnana  qualities,  may  you  abandon  all  thoughts  of the  visibles.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31