శ్రీ యోగ వాసిష్ఠ సారము - 56 / YOGA-VASISHTA - 56
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 56 / YOGA-VASISHTA - 56🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. చిత్తాఖ్యానము - 1 🌻
ఆకాశములు మూడు రకములు
1) చిత్తాకాశము
2) చిదాకాశము
3) భూతాకాశము.
ఈ మూడును శుద్ధ చిత్ శక్తిచే స్ధితి గల్గుచున్నవి. చిదాకాశము సాక్షియై, సర్వభూతము లందు వ్యాపించి యున్నది. చిత్తాకాశము సర్వజీవుల వ్యవహారములను, సర్వహితమును. కార్యమున్నింటికి మూలము అయినది. భూతాకాశము దశ దిశల వ్యాపించి, వాయు, మేఘ, సూర్యుల ప్రకాశమై వెలయుచున్నది. భూతాకాశ, చిత్తాకాశములు రెండును, చిదాకాశము నుండి వెలువడినవి.
జ్ఞాన ప్రాప్తి కల్గనంత వరకు, ఈ మూడాకాశముల కల్పన వుండును.కాన లోకమందు అజ్ఞాన దోషముచే బంధమును, జ్ఞానముచే మోక్షమును కల్గుచున్నవి.
అందువలన చిత్తమును, ఆత్మ విముక్తి యందే నియోగింపవలెను. బ్రహ్మచిత్త మందు లగ్నమైన చిత్తము, వాసనా రహితముకాగా, ఆత్వస్వరూప ప్రాప్తియగును. ఈ చరాచర జగత్తంతయు, చిత్తమున కధీనమై యున్నది. కాని బంధ మోక్షములు చిత్తాధీనములు.
ఓ రామా! బ్రహ్మచే చెప్పబడిన చిత్తాఖ్యానమును గూర్చి చెప్పెద వినుము అని వసిష్టుడిట్లు చెప్పెను. అతివిశాలమైన భయంకర మహారణ్య మొకటి కలదు. అందు భయంకర ఆకృతి గల, విశాలదేహుడగు పురుషుడొకడుండెను. అతడు తన వేల కొలది చేతులతో పెక్కు గుదియలను గైకొని, వాటిచే తన వీపుపై, బాదుకొనుచు, ఆ అరణ్యమున బరువెత్తు చుండెను. అతడు చాలా దూరము పరుగెత్తి అలసి, ఒక అంధు కూపమున బడెను.
చాల సేపటికి అందుండి లేచి, మరల నట్లే బాధుకొనుచు పరుగెత్తి ఒక కంఠకావృత అరణ్య మందు ప్రవేశించి, అచటి నుండి బయల్పడి మరల బాదుకొనుచు అవయములన్నియు చిన్నాభిన్నము కాగా మరల ఆ అంధ కూపమున పడెను. మరల కదళీ వనమునకు, ఇట్లు పరుగెత్తు వానిని నేను ఆపి, ఏల ఇట్లు పరుగెత్తుచుంటివని ప్రశ్నింప, ఆ పురుషుడు నీకేమి కావలయునని ప్రశ్నింప, నతడు తానే మాయ చేయుట లేదనియు, నీవు నన్ను హింసించితివికాన, నీవు నాకు శత్రువు అని పల్కెను. తన శరీరము శిధిలమైనది, అని విలపించుట మొదలిడెను.
తదుపరి ఏడ్పు చాలించి తన అంగములను చూచి నవ్వి, అట్టహాస మొనర్చెను. తరువాత నతడు క్రమముగ తన అవయవము లన్నింటిని, త్యజించి వైచెను. అంతట అతడు అచటి నుండి వెడలుటకు, సన్నద్ధుడయెను.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 56 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 26 🌴
🌻 3. THE STORY OF KARKATI 🌻
Then the minister replied thus, „your questions point but to the non-dual Brahman. Being above the reach of mind and the five Indriyas (organs), it is the endless absolute Jnana more subtle than Akasa and the Supreme Atom of atoms (Paramanu). Out of that Atom, all the former Mundane eggs arose and into It were (or will be) all absorbed.
Question 2: As there is no such attribute as exterior (or interior) to this all-pervading- Brahman, it can be said to be Akasa itself; but yet it is not the Akasa of the elements, as it is pure Jnana itself.
Question 3: As there is no abode for it to abide in, it is not limited; and yet it abides in them ever as the Absolute Sat.
Question 4: Through its relationship with many objects, it moves about; and yet it is devoid of motion, as it has no space outside of itself to move.
Question 5: As it is not possible to be known by being pointed to (as this or that), It is not, and yet It w, as It is Being itself.
Question 6: As it is the self-shining Light, it is consciousness per se, and yet it is like the inert stone, since it has not the power of knowing, (being itself the All) (also since It is that which manifests itself in the two aspects of intelligence and matter.)
Question 7: This is it that depicts the pictures of the series of universes in the Chidakas which is very subtle, immaculate and self-existent. Question
8-10: As the heterogeneous universes are but the light or manifestation of that One, therefore nought else is but That; yet all the different worlds arising- out of the conception of I, You, etc. , are inseparable from It, being but Its aspect.
So replied the intelligent courtier standing by the side of his king, when Karkati became overjoyed with him and then addressed the king for a solution of her questions, in order to sound his depth of knowledge. The king there upon said thus „It is indubitably certain that this universe is not and it is also as certain that the partless One alone is. Now you shall hear an account of the nature of that one namely Brahman.
Brahman can be attained through the mind after abandoning its Sankalpas and Vikalpas. The origin and dissolution of this universe (which is nothing but a mode of consciousness), take place with the complete origination and destruction of the Sankalpas of the mind. Such a process is the real seat (or import) of the holy sentences in the Vedas; but yet it is exterior to them, as it is through self-experience alone that such a process can be developed.
It occupies a seat intermediate between Sat 41 (being) and Asat (non-being) and is the real state of the two. It is this Sankalpa of the mind that brings into play this world with all its moving and fixed creatures. You have in your questions referred to Brahman only which, manifesting itself as this universe, is yet the impartite plenum of Jnana through its being the non-dual Principle from of old. This is the one Reality cognized by men of true love.‟
Note : 41 Here Sat and Asat mean existence and non-existence or Purusha and Prakriti. Whereas Satta is applied to Parabrahma which is Be-ness as opposed to being- or non-being.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment