శ్రీ యోగ వాసిష్ఠ సారము - 67 / YOGA-VASISHTA - 67
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 67 / YOGA-VASISHTA - 67 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. అజ్ఞానము, అవిద్య. - 2 🌻
యదార్ధముగ లేనిదియగు ఈ అవిద్య, సంకల్ప మాత్రముననే, యుత్పన్నమగు చున్నది. సంకల్పముచే ఉత్పన్నమై, సంకల్పముచేతనే నశించుచూ, ఈ అవిద్య దేనిచే యుత్పన్న మగునో దాని చేతనే నశించును. విషయ భోగాభిలాషచే రూపము గ్రహించిన యీ అవిద్య, ధృడ నిధిధ్యాస రూపమగు, పురుష ప్రయత్నముచే నశించుచున్నది. సంకల్పమే బంధము, అసంకల్పమే ముక్తి. చిదాకాశమున లేనిదేయగు నీ అవిద్య, వినోదమునకై బాలుడు, కల్పన చేయునట్లు, అజ్ఞానులు దు:ఖము కొరకే, దృడముగ కల్పన చేయుదురు.
నేను దుఖి:తుడను, దుర్భలుడను, బద్దుడను అని భావించుచు జీవుడు బంధముల తగుల్కొనుచున్నాడు. అవన్ని నేనుకాననుకున్నచో బంధ విముక్తుడను కొనుచున్నాడు. ఆకాశమును నీలత్వముగ భావించుట అజ్ఞానము. కేవలము శూన్యము. నేనజ్ఞుడను అను సంకల్పముచే క్షణములో, అవిద్య యుద్భవించును. ఈ సంకల్పమును ఛేదించిన , అది నశించును.
రాజాజ్ఞను మంత్రులు పాలించునట్లు, మనస్సు చింతించిన దానిని ఇంద్రియ వృత్తులన్నియు వెంటనే సిద్ధింపజేయును. ఏ జగత్తు సృష్టికి పూర్వము లేదో, అది ఇపుడును లేనిదియే అగును. ఈ జగత్ రూపమున భాసించున దంతయు బ్రహ్మమే శాస్త్ర విహితమైన యుత్తమ బుద్దిచే, పురుష ప్రయత్నము నాశ్రయించి, విషయ భోగభావమును, చిత్తము నుండి సమూలముగ నాశనముచేయుము. ఆశాపాశములు, వార్ధక్యాది వికారములు, అజ్ఞానమగు మోహమే, వాసనా విజృంభణమగును.
నా యిల్లు, భార్యపిల్లలు, నాదేహము, ధనము మొదలగునవి ఇంద్రజాలము వంటివే. ఈ అవిద్య అజ్ఞానికేగాని జ్ఞానికి కాదు. వికారరహితమగు, పారమార్ధ దృష్టియె, జ్ఞానికెల్లెడల నిర్మితమై యున్నది. కొలిమి తిత్తి నశించిన, అందలి వాయువు నశించదు. అట్లే దేహము నశించినను, ఆత్మ నశించదు.
అవిద్యవలననే నరక స్వర్గాదులు, సుఖదు:ఖములు, స్వప్నమున అనుభూతమగుచున్నవి. చిత్తమును సంస్కార వాసనలతో నింపకున్న, జాగ్రత్ స్వప్న విషయములు, ఆత్మ నేమిచేయగలవు? కాన ఈ ప్రపంచమున, బంధహేతువు రాగ మయము, అవిద్యామయమునగు వాసనను వదలి, రాగ రహితుడవై యుండుము. బ్రహ్మజ్ఞునుల, తత్వవేత్తల సంసర్గముతో, బ్రహ్మ భావము ధృడ పర్చుకొనుము అని వసిష్టుడు పల్కెను.
అంత శ్రీరాముడు, ఈ అవిద్యవలన ముల్లోకములందు, కేవల తృణప్రాయమైనను వజ్రప్రాయమై కన్పడుచున్నది. అట్టి యీ అ విద్య యుత్తమ భాగ్య శీలుడగు లవణున కేల తటస్ధించిదనని వసిష్టుని ప్రశ్నించెను. ఆ ఇంద్రజాలికుని గూర్చి తెల్పుమని కోరెను. అంతట వసిష్టుడు చిత్త భ్రమచే లవణుడెట్లు చండాలత్వ మందెనో, ఆ వృత్తాంతమును చెప్పెద వినమనెను.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 67 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 37 🌴
🌻 8. THE STORY OF A SIDDHA - 2 🌻
Then the king gradually recovered consciousness and the obedient ministers asked him as to how it was his pure mind had lost its equilibrium. After shaking off his stupor fully, the king replied thus When the Siddha revolved the circle of peacock s feathers and uttered some words; I got giddy and noticed a horse which I ascended with full memory and journeyed on speedily a long distance on account of chase.
Like Ajnanis who wallow amidst their painful wealth through a non-discriminative mind, I entered, on horseback, a desolate waste with a seething heat that scorched all things and even the senses. There I and my charger became quite jaded through our peregrinations in the forest with despondent heart and ceaseless pains, till the sun set in the west.
Like a Jnani who frees himself from the load of Samsara and proceeds onward in his path, I after crossing the waste reached a delicious forest teeming with many kinds of trees such as Jambu, Kadamba and lime and reverberating with the songs of feathered songsters. Whilst I was thus riding on the horse, a creeper high up in a tree twined round my neck and immediately the speedy horse bolted out of my sight, like sins from a bather in the Ganges, leaving me rocking to and fro aloft in the air with the creeper encircling my neck.
Thus dangling down, my body became stiffened with the cool winds blowing on it and my mind became paralysed. Without bath, worship, meditation or food during the day, I saw night approach with her grim attendants of darkness, pains and extreme shivering which set my teeth against one another.‟
„At dawn of day the glorious orb arose, dispelling that darkness like Jnanis driving away their mental gloom. Then I cast my eyes around and cut asunder the creeper that twined round my throat and then having descended from there, looked about for some living person but in vain. After an hour and a half had elasped, an outcaste girl quite an alien to me arrived on the scene, like darkness facing the moon.
This girl, who had a dark skin and sable vesture, approached me with some delectable food in her hand. Unable to control my hunger, I entreated of her thus, „Oh Swan-like one, please bestow on me that which you have in your hand‟. But I paid the penalty of all those poverty stricken persons who go and beg of another in haste through their extreme hunger; for this girl did not vouchsafe to give it to me, as if I had not earned the right to get it through my Tapas, and took to her heels. Then ensued a chase in which I hunted her throughout the forest and after getting at her, piteously complained to her of my extreme hunger.
To which the dark skinned one replied thus „I am an outcaste and it is not meet that you should taste the food I have. But if you deign to do so, you should first promise to wed me in my own place before my parents and live with me there. If so, I will give you this very instant what I have in my hand. To which I nodded assent reluctantly; and instantly she handed to me with great avidity what she had. After having partaken of a half of this nectar and tasted the juice of Jambu fruits to quench my thirst, my sharp appetite was appeased.
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment