శ్రీ యోగ వాసిష్ఠ సారము - 68 / YOGA-VASISHTA - 68

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 68  / YOGA-VASISHTA - 68 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. లవణుని చిత్తభ్రమ 🌻

పూర్వకాలమున, హరిశ్చంద్రుని వంశమున జన్మించిన లవణచక్రవర్తి, ఒక దినమున, ఏకాంత ప్రదేశమున గూర్చున్నవాడై, ఇట్లు మనంబున చింతించెను. 

నా పితామహుడు పూర్వకాలమున రాజసూయయాగమొనర్చి పేరువడసెను. నేనును అట్టి యాగమును చేయవలయునని, తగిన యజ్ఞ సామాగ్రి లభించకుండుట, రాజాదులను భాధించవలసి వచ్చుట. మంత్రులు ఇతరుల అసమ్మతి వలనను, నేను మానసికముగనే రాజసూయ యాగమును సల్పెదనని నిశ్చయించి, మనంబుననే యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకొని, యజ్ఞ దీక్షకు పూనుకొనెను. 

మనంబుననే బుత్విజులను పిలచెను. మౌనులను పూజించెను, దేవతలనాహ్వనించెను, హవిస్సుల ద్వారా అగ్నిని, ప్రజ్వలింపజేసెను. ఇట్లు యజ్ఞ వాటికను భావించి తన కోర్కె మేర యజ్ఞము నొనర్చెను. ఇట్లు ఒక సంవత్సరము గడచెను. తన సర్వస్యమును బ్రాహ్మణాదుల కొసగి రాజు తన యుధ్యానవనమున, మానసిక యజ్ఞము నుండి మేల్కొనెను. అంతట సంతుష్ణుడై యుండెను. అట్టితరి అతనికి యజ్ఞఫలము ఏమండీ లభించవలసియున్నది. 

ఓరామా! ఆ ఇంద్ర జాలికుడు, లవణుని రాజసభయందు ప్రవేశించినపుడు, నేనచటనే యుంటిని గాన ప్రత్యక్షముగ నవలోకించితిని. ఈ ఇంద్రజాలికుడు ఇంద్రజాల మంతయునైన తదుపరి వెడలిపోగా, సభాసదులు, రాజు ఈ చిత్రమునకు కారణమేమియో తెలుపుడని నన్నడిగిరి. అపుడు నేను యోగబలముచే, నంతయు నెఱిగి, వారలకా వృత్తాంతమును తెలిపితిని. రాజసూయ యజ్ఞ మొనర్చినవారు, పలు విధముల ఆపవాదులు దు:ఖములు పండ్రెండు సంవత్సరములు వరకును పొందుదురు. 

కాన ఓ రామా! రాజసూయ మొనర్చిన, ఆ లవణునకు దు:ఖమును కలుగజేయుటకు గాను ఇంద్రుడు ఆకాశము నుండి, ఇంద్రజాలకుని, వాని చెంతకు పంపెను. ఆ దేవదూత లవణునకు, అరువది సంవత్సరముల వరకు, గొప్ప ఆపద గలగజేసి, ఆకశమున అంతర్గతుడయ్యెను. ఇందంతయు ప్రత్యక్షముగ జరిగియుండెను. 

కావున ఓ రామ! మనస్సే విలక్షణమగు ఈక్రియలన్నింటియొక్క కర్తయు, భోక్తయునగును. కావున ఈ చిత్తమే జీవులందరను మోహపర్చు అవిద్యయని యెరుంగుము. వృక్షము, తరు, శబ్దములవలె అవిద్య, చిత్తము, జీవుడు, బుద్ది మున్నగు వానియందు భేదము లేదు. ఇది తెలుసుకొని నీవు చిత్తమును సంకల్ప రహిత మొనర్చుము. చిత్త నైర్మల్యమను, సూర్యుడుదయించిన, అజ్ఞానాంధ కారమంతయు, సమసిపోవును. కావున స్వాత్మ దర్శనముచే నంతయు, యెల్ల కాలమందును, సర్వరూపమగు ఆత్మయె వెలగుచుండును. ఇదియె పరమార్ధ స్దితి. కాల్చని మట్టి పాత్రలు, నీటి యందు కలసిపోవునట్లు, ఈదృశ్య ప్రపంచము, అందలి జీవులు, బ్రహ్మైక్యము పొందును. 

అంతట శ్రీరాముడు, చంచలమగు ఈచిత్తమును ఎట్లు బ్రహ్మతత్వము వైపు మరల్చవలెనని అడగెను. అంతట వసిష్ఠుడు బ్రహ్మతత్వమును పొందవలెనన్న, మనస్సును బాహ్య వృత్తుల నుండి యింద్రియములను మరల్చి, బ్రహ్మత్వ మందు చేర్లి, మనోలయమును పొందవలెనని చెప్పెను. 

ఈ బ్రహ్మండమున సాత్విక, తామసికి రాజసములని మూడు విధములగు జీవులు, బ్రహ్మ వలన సృష్టించబడుచున్నారు. ఇట్లు అనేక బ్రహ్మండములందు, అనేక జగత్‌ స్వరూపములు నుత్పన్నమగుచున్నవి. ఈయుత్పత్తి ఎల్లపుడును జరుగుచునే యుండును. కల్పాంతము నందు లయమగుచుండును.

అలానే ప్రతి పరమాణువునందు, అసంఖ్యాకములగు జగత్తులు కలవు. ఈ జగత్తులలో మొదట శబ్ద తన్శాత్రమైన ఆకాశము, అందుండి స్పర్శ తన్శాత్రమైన వాయువు, అందుండి రూపతన్శాత్రమైన అగ్ని, అందుండి రుచి తన్శాత్రమైన జలము, అందుండి, వాసన తన్శాత్రమైన భూమి యుత్పన్నమగును. 

తదుపరి మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారములు నగు అంత: కరణ చతుష్టయము లేర్పడును. ఇవి జీవకోటి యుత్పత్తికి కారణమగుచున్నవి. హిమవర్షాదుల ద్వారా ఔషద రూపమున, అన్న మందు ప్రవేశించి, పురుషులచే భుజింపబడి, క్రమముగ గర్బదశను పొందుచున్నవి.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 68 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 38  🌴

🌻 8.  THE STORY  OF A SIDDHA - 3 🌻

Then  she  took  hold  of  my  hand,  saying  I  was  a good  fellow  and  led  me  on  to  her  parents,  like  the subtle  body  of  a  person  conducted  to  the  terrific hell.  There  she  asked  leave  of  her  father  to  bestow her  hand  upon  this  lover  of  hers.  Finding  no obstacles  in  the  way  on  the  part  of  the  father,  the pair  left  this  forest  laden  with  ghosts,  and  were taken  over  to  the  village  by  this  dark  Neecha (outcaste)  of  a  father  who  was  like  Yama  s  servant the  village  which  was  redolent  of  the  stench  of flesh. 

 In  order  to  celebrate  their  marriage,  he  killed for  flesh  the  bodies  of  monkeys,  horses,  fowls, crows  and  pigs  and  dried  them  like  festoons  in  the strings  of  nerves.  Birds  were  pouncing  upon  them as  they  were  exposed.  Swarms  of  flies  were buzzing  in  the  pieces  of  flesh  held  by  boys  in  their hands  as  they  trudged  along  in  the  streets.  In  this hamlet  bespattered  with  blood  and  bones,  a  shed was  erected  with  plantain trees  as  the  four  pillars.‟   

„Then  with  great  hilarity,  the  marriage  festivities began.  The  old  hunch-backed  grand-mother  of  the house  surveyed,  through  her  large  fleshy  eyes,  me, her  son-in-law  and  was  greatly  pleased  with  the choice.  All  the  out-castes  being  assembled  on  the occasion,  the  drums  were  caused  to  be  beaten. Toddy  and  flesh  were  distributed  freely  among  the audience.  

Like  sin  which  produces  a  Yathanasarira  (body  of  suffering)  for  men  in  hell,  the Neecha  father  gave  me  this  girl  in  marriage.  As usual  with  these  low-caste  people,  the  wedding lasted  seven  days (46).  After  it  was  over,  I  passed eight  months  in  the  company  of  this  lady  who  was as  if  all  sins  had  solidified  themselves  in  her. Through  my  union  with  this  lady  of  budding breast,  a  child  was  born  like  pains,  the  offspring  of dire  accidents.  

The  complexion  of  this  child  was like  that  of  a  burnt  brand  and  it  grew  up  like  the minds  of  the  ignorant.  Then  in  the  course  of  three years  she  bore  me  a  son,  like  birth  generating ignorance.  Then  again  another  child  was  born  of her  through  me,  as  if  human  miseries  arising  out  of excessive  desires  incarnated  in  the  form  of  that child.  With  these,  spouse  and  children  I  lived  for  a long  time.  Then  what  with  the  cares  of  Samsara and  the  pains  I  and  my  family  had  to  undergo,  my body  became  old  and  emaciated.  

And  when  I  was thus  enfeebled,  the  whole  earth  near  the  base  of  the Vindhya  Mountains  became  parched  up  through drought  and  all  there  suffered  through  hunger. Verdant  foliage  of  trees  with  long  branches, creepers,  grass,  etc.  were  not  to  be  seen.  The  air was  saturated  with  volumes  of  dust  raised  through heat.  Then  one  by  one  began  to  perish  my  new relatives,  and  a  few  that  were  alive  fled  to  foreign dominions.‟  
 
Note 46 : Among Brahmins it lasts  4  days  generally.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31