శ్రీ యోగ వాసిష్ఠ సారము - 71 / YOGA-VASISHTA - 71

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 71  / YOGA-VASISHTA - 71 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. సప్త జ్ఞాన భూమికలు - 3 🌻

పూర్వము లవణుడను రాజు, ఇంద్రజాల ప్రభావమున భ్రమను పొంది, కిరాతునిగా అరువది సంవత్సరముల, గడిపిన తరువాత భ్రమనుండి విముక్తుడై తాను చూచిన కిరాత రాజ్య ప్రదేశమును దర్శించుటకు, ఆ అరణ్యమునకు బోవ నిశ్నయించుకొనెను. వింధ్య పర్వత ప్రాంతములో, ఆ ప్రదేశమును వెదకుచు సంచరింపసాగెను. అంతట ఒక చోట, తాను క్రితము దర్శించిన, భీకరా రణ్యము కన్పించెను. 

అచట రాజు విచారించి, అచట గల చండాలురను గుర్తించి, ఆశ్చర్యచకితుడై ఇంకను అచట సంచరించ దొడగెను. చివరకు అడవి చివర భాగమున తాను నివసించిన, గ్రామము కనుగొనెను. అట గల వృక్షములు, జనులు స్త్రీలు, కుటీరములు, సహచరులను, బంధువులను, పుత్రులను గూడ గాంచగల్గెను. వారిలో మిక్కిలి విశారగ్రస్తురాలై, విలపించుచున్న, తన అత్తగారు కనపిపించిరి. ఆమెను పరామర్శించి, తన పిల్లలను, భర్తను గూర్చి అడిగెను. 

తన మామ తన అల్లుని గూర్చి విచారించు చుండెను. తన కుమారుని గూర్చి వివరించుచు, గురుగింజలమాలను ధరించినదియు, విశాలమైన స్ధనములు గలిదియు. కాటుక వలె నల్లనిదియు, నార వస్త్రములు ధరించినదియు, జంబూఫలముల వలె నల్లని దంతములు గలదియునగు తన పుత్రికను గూర్చి విచారించుచుండెను. 

అటులనే, తన అత్త తాను అనాధ నైతినని, నీచులచే అవమానింప బడుచుంటినని, ఇట్లు విలపించుచున్న, ఆ వృద్ధురాలిని గాంచి రాజు, నీ వృత్తాంతమేమి, నీ పుత్రిక ఎవరు అని ఆమెనడిగెను. అంత ఆమె తమకు ఒక కుమారై గలదనియు, ఆమె దైవ యోగముచే,ఒక రాజును తన పతిగా పొందెననియు, చిరకాలము తనతో జీవించి, సంతానమున బడిసి, ఈ అరణ్యమందే నివసించినదని తెల్పెను. కొంత కాలమునకు ఒక భయంకర కరవు ఏర్పడి, వారు మృత్యువాత బడిరని తెల్పెను. ఆ వృత్తాంతము విని రాజు, ఆచ్చెరువంది, ఆ చండాలురకు, సముచిత దాన సన్మానములచే, వారి దు:ఖమును తొలగించి, తిరిగి తన రాజ్యమునకు చేరెను. 

మర్నాడు ఉదయమున రాజు సభాస్ధలిలో, ఆ స్వప్నము ప్రత్యక్షముగ, ఎట్లు కనిపించినదని నన్నడిగెనని, వసిష్టుడు శ్రీరామునకు తెల్పెను. తాను అందుకు తగిన సమాధానమొసగి, అతని సంశయమును తొలగించితినని తెల్పెను. ఈ విధముగా, అవిద్య భ్రమను కలుగ జేసి క్షణములో; సత్తును, అసత్తుగను, అసత్తును సత్తుగను చేసి వేయుచున్నది. అంతట శ్రీరాముడు, స్వప్నము సత్య మెట్లయ్యెనని దెలుపగోరెను. 

అందుకు వసిష్టుడు, అవిద్య యందు, ఇదంతయు సంభవము కాగలదని తెల్పెను, అద్ద మందు కనిపించు ప్రతిబింబము దూరమందున్నను, సమీపమున కనిపించునట్లు, భ్రమ వలన, అసత్తు సత్యముగ గోచరించును. పదార్ధము సత్యమైనను, అసత్యమైనను, వాసనా వేష్టితమగు చిత్తమద్ధానిని తీవ్రముగభావించును. అహంకార యుతమగు, ఈ అవిద్య యెపుడుదయించునో అపుడే భ్రమ, అనంతత్వమును ప్రదర్శించును. 

వింధ్య పర్వత సమీపత్వ గ్రామ మందట్టి వ్యవహారము జరుగుచున్నదని, స్వప్నమందలి పూర్వానుభవము వలె రాజు మనమున ప్రతి భాసించెను. లేక లవణుడు గాంచిన స్వప్న భ్రమ, ఛండాలుని చిత్తమందును స్ఫురించెను. లవణుని, చండాలుర వృత్తాంతము, పరస్పరము వారి హృదయము లందు రూడిపడియున్నది. 

జాగ్రత్తు స్థూల దృష్టి యందు సత్యముగను, పరమార్ధ దృష్టి యందు అసత్యముగను యుండును. సమస్త పదార్ధములునూ, చైతన్యమయములేగాన, సాదృశ్య సంబంధముచే చైతన్యము వలననే అవన్నియు ప్రకాశించుచున్నవి. శిలాది పదార్ధములు యదార్ధముగ చైతన్యమే, ఆ రూపమును ధరించుచున్నది. అందువలన కాష్టాది పదార్ధము లన్నియు, చైతన్య మయములే అగును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 71 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 41  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 2  🌻

If  all  doubts  vanish  through  the  discus  of  spiritual know  ledge  arising  through  the  meditation  of Jnana  in  the  heart,  then  it  is  the  mind  will  be destroyed.  All  the  excessive  afflictions  will  cease with  its  destruction.  The  (ideas  of)  differentiations of  that  or  this  person,  or  „I‟  or  „You‟  or  that  or  this object  are  (or  do  pertain  to)  mind  only.  

May  you put  an  end  to  that  mind  with  the  sword  of Abhavana  (non-thought).  Like  thick  clouds  that  are dispersed  through  stormy  gales,  the  mind  will  get absorbed  into  Chit  (absolute  consciousness) through  the  extinction  of  Kalpanas  (thoughts).  

If one  s  mind  is  destroyed,  then  will  one  not  suffer from  pains  even  though,  as  at  the  end  of  a  Kalpa, the  fierce  winds,  the  Pralaya  ocean  with  its  furious bubbling  waves  and  the  twelve  Adityas  (suns) smelting  even  the  earth  with  their  heat  should  all combine  together  to  simultaneously  play  their havoc  on  the  surface  of  the  earth?  If  the  (lower) mind  is  done  away  with  through  the  (higher)  mind alone,  then  will  one  become  his  own  Self  and perennial  happiness  will  flow  therefrom  as  in  the case  of  the  Universe.  

Then  will  you  be  in  the  full acquisition  of  Moksha  and  reach  the  Brahmic  state unshakable  in  bliss.  Now  the  enemy  of  Atman  is this  impure  mind  only,  which  is  replete  with  the wealth  of  excessive  delusion  and  hosts  of  thoughts. 

Lest  this  enemy  of  mind  should  spoil  you  in diverse  ways  through  the  enjoyments  of  the  many pleasures  in  this  world,  slay  it  in  the  hope  of getting  contentment  in  the  long  run  which  will pave  your  way  towards  spiritual  illumination. Then  will  the  immaculate,  cool  and  all-full  Bhava (state),  dear  unto  the  wise  never  be  affected  by  the idea  of  „I.‟  

Though  this  all-full  Bhava,  which  is neither  capable  of  increase  nor  diminution,  the Brahmic  State  free  from  births  and  conferring supreme  bliss,  becomes  the  imperishable  one.  It  is indeed  rare  to  find  a  mind  that  is  not  affected  by  its contact  with  fluctuation.  Like  heat  inseparable from  fire,  fluctuation  which  debases  the  mind  is inseparable  from  it.  

The  power  of  fluctuation  or motion  of  Jnana  is  the  mind  itself.  And  this fluctuating  mind  alone  is  this  universe;  devoid  of this  fluctuation,  the  mind  ceases  to  exist.  It  is  this certain  conviction  that  constitutes  a  Tapas  without a  desire  of  its  fruits,  the  underlying  meaning  of  all Atma-Jnana  books  and  the  immaculate  Moksha  or the  illuminated  One  Principle.  

The  fluctuating power  of  the  mind  is  called  by  several  names  such as  Maya,  the  impure  Vasanas  and  others.  The flitting  mind  is  no  other  than  the  fluctuating  Sakti itself.  It  is  this  fluctuating  potency  of  the  mind  that you  should  destroy  through  ceaseless  Atma-Jnana enquiry.   

Supreme  bliss  will  flow  from  the  renunciation  of all  attractions  towards  the  much-longed  for  paltry objects.  The  mind  which  occupies  an  intermediate state  between  Brahman  that  ever  is  and  the universe  that  is  not,  ever  oscillates  gravitating towards  the  one  or the  other.  

This  mind  becomes  of the  nature  of  Jnana  through  dint  of  the  efforts towards  spiritual  direction;  but  becomes  of  the nature  of  the  universe  through  Ajnana.  Through  its own  efforts,  the  mind  assumes  the  shape  of  any object  it  concentrates  itself  upon.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31