శ్రీ యోగ వాసిష్ఠ సారము - 66 / YOGA-VASISHTA - 66

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 66  / YOGA-VASISHTA - 66 🌹
✍️ . రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. అజ్ఞానము, అవిద్య. - 1🌻
    
ఓరామా! అభిమాన రహితుడవై కార్యము లాచరించినచో, ఆసక్తి లేమిచే నీవు కర్తవు కాదు. అట్టిచో నిష్ట్రియుడవు ఆత్మదర్శినివి అగునీకు, కర్తుత్వమెట్లు కల్గును. కర్తృత్వము సత్యమైనచో గ్రహింపదగినది.

అసత్యమైనచో, త్వజించదగినది అగును. సంసారమునకు బీజమగు అవిద్య లేనిదే, అయినను ఉన్నట్లు తోచుచు, విశాల రూపమును పొందియున్నది. సత్య వస్తువగు బ్రహ్మము ఒక చోట వక్రముగను, మరొకచోట, స్వచ్ఛముగను, ఒక చోట దీర్ఘముగను, ఇంకొకచోట లఘువుగను భాసించుచున్నవి. ఇది జఢమైనను, చైతన్యము వలె; నిలకడలేనిదైనను స్ధిరముగను తోచుచున్నది. సత్వ గుణముచే శుద్ధముగను, తమోగుణముచే మలినముగను కనబడుచున్నది. పరమాత్మ సాక్షాత్కారముచే, భేదము నశించుచున్నది. ఈ అవిద్య వలన, కల్పనచే విశాలమగు త్రిలోకమును గూడ ముహుర్త, మాత్రమున, సృజించుచున్నది. 

లవణుడను రాజు మహూర్తమున ననేక సంవత్సరములుగ నున్నట్లు, ఇదియె సృజించుచున్నది. అవిద్య వలనే కాలము, సుఖవంతునికి అల్పముగను, దు:ఖితునకు, దీర్ఘముగను కన్పట్టుచున్నది. భ్రాంతిచే రెండు చంద్రులగు పడునట్లు, అవిద్యచే, ఒకే వస్తువు రెండుగ తోచుచున్నది. 

ఈ అవిద్య వలన దుష్టాచారము, నీచ స్వభావము గలది, అజ్ఞుల వరించునది, అయి, లోకమును మోహవంతము జేసినది. ఆత్మ జ్ఞానమెరుగని అజ్ఞుల హృదయమందు వసించునది, దు:ఖముచే, అతి దీర్ఘముగను జేయు, ఈ అవిద్య, జగత్తును అంధప్రాయముగ జేసినది. చైతన్య శక్తి యొకింతయులేనిది, నశింపనిదైనను, నాశనము నొందునదియునగు ఈ అవిద్య, స్త్రీ, పురుషులను, అంధునిగ చేయుచున్నది. 

అంతటశ్రీరాముడు ఈ అవిద్య నశించుమార్గమును తెలుపుమని వసిష్టుని కోరెను. సూర్య ప్రకాశముచే మంచు బిందువు ఎట్లు ఒక్క క్షణములో నశించునో, ఆట్లే ఆత్మావలోకముచే, ఈ అవిద్య వెంటనే నశించును. ఆత్మదర్శనమును గూర్చిన తీవ్రేచ్చ యుత్పన్నమయిన, ఈ అవిద్య నశించును. పరమాత్మను సందర్శించుటతోనే ఈ అవిద్య నశించును. ఇచ్చయె అవిద్యకాన, ఇచ్చనాశనమే మోక్షము. సూర్యోదయము వలన చీకటి నశించునట్లు, వివేకముచే అవిద్యయు నశించును. 

ఆత్మ స్వరూపమును తెలుపుమని శ్రీరాముడు కోరగా వసిష్టుడిట్లు చెప్పుచున్నాడు. విషయ వర్జితమును, ఆవరణ విక్ష్షేపములు లేనిదియు సర్వ వ్యాపియు, వాగతీతమును అగు చిత్‌తత్వమే ఆత్మయగు పరమేశ్వరుడు. బ్రహ్మాది తృణ పర్యంతము గల, ఈ జగత్తంతయు సర్వదా ఆత్మ స్వరూపము. అవిద్య అనునది లేదు. ఈ దృశ్య ప్రపంచమంతయు, చిద్‌ ఘన స్వరూపమే, నాశన రహితము, నిత్యమునగు బ్రహ్మమే. మనస్సను మరియొక కల్పన ఏదీలేదు. 

పరమార్ధమున, ఈ మూడు లోకములు ఉత్పన్నమగుట లేదు, నశించుట లేదు. పదార్ధ వికారములు, సత్యములు కాదు. ఈ జగత్తు కేవలము, అద్వితీయము, స్వప్రకాశము, సర్వవ్యాపకము, నాశరహితము, విషయ వర్జితమునగు చైతన్యమే. అట్టి ఆవరణ యుక్తమై, చిత్‌ స్వభావ విరుద్ధమగు, జడత్వము గ్రహించి, విచ్ఛిన్నములగు విషయములను సంకల్పించి, వాని వైపునకే పరుగిడుచున్నది. మలిన మగు ఈ విక్షేపిత శక్తియె మనస్సు. ఈ మనస్సు సర్వ వ్యాపకము, సర్వశక్తి వంతమై మహత్తరమును అయి పదార్ధము లన్నింటి యొక్క కల్పనా శక్తియై, సముద్రమునందలి తరంగముల వలె, యుత్పన్నమాయెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 66 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 36  🌴

🌻 8.  THE STORY  OF A SIDDHA  🌻

🌷 Summary:  
Having  shown  that  persons  who  have not  cognised  the  seer  believe  the  visual  to  be  real, the  author  now  proceeds  with  this  story  to exemplify  the  fact  that  time  is  but  a  mode  of  the mind;  the  visible  though  illusory  being  nothing  but a  manifestation  of  Chit.  

Ajnanis  (the  ignorant)  will  fluctuate  greatly  in mind  through  their  Sankalpa;  but  Jnanis  will  never do  so  through  the  Jnana  of  Atmic  enquiry.  May you,  after  clearing,  through  your  discrimination, your  mind  free  of  all  illusions  cognize  the  pure Truth.  Do  not  be  appalled  at  the  idea  that  you  are under  trammels,  while  in  fact  you  are  not  so.  

Is  it possible  for  the  immaculate  and  indestructible Brahmic  Principle  to  be  bound?  While  Brahman alone  is  that  which  is  not  subject  to  the  limitations of  Time,  Space  and  Substance,  is  non-dual  and  is Absolute Consciousness devoid of all heterogeneity,  what  is  there  in  this  world  to  be bound  or  to  gain  salvation?  All  are  nothing  but  the expansion  of  Sankalpas  (and  Vikalpas).  The expansion  of  the  mind  s  thoughts  (towards  objects) is  bondage;  while  the  abandoning  of  the  same  is emancipation. 

 Through  the  play  of  the  mind  in objects,  proximity  appears  to  be  a  great  distance and  vice-versa.  Through  the  force  of  the  mind,  a Kalpa  is  reckoned  by  it  as  a  moment  and  viceversa.  There  is  a  story  current  which  illustrates  this idea  well.  Thereby  it  will  be  quite  apparent  to  you that  this  legerdemain  of  the  world  is  enacted  by  the mind  and  the  mind  alone.  

Vasistha  continued:  A  King  who  traced  his  lineage to  Harischandra  ruled  over  the  country  of  Uttara Pandava.  He  commanded  the  eulogies  of  Lakshmi (the  goddess  of  wealth)  and  Saraswati  (the  goddess of  knowledge).  On  his  arms  rested  Vijaya-Lakshmi (the  goddess  of  victory).  

This  personage,  who  bore the  appellation  of  Lavana,  was  once  seated  on  his throne  bedecked  with  the  nine  gems  and  encircled by  his  sagacious  statesmen.  Into  that  stately assembly,  stalked  in  majestically  one  who  was  well versed  in  the  art  of  Indra  Jala  (psychological tricks).  Having  paid  due  respects  to  and  eulogised the  King,  he  entreated  him  to  witness  his  feats.  So saying,  he  waved  his  bunch  of  peacock  s  feathers dotted  with  moon-like  eyes.  

Like  Maya  which, through  the  immaculate  Para  Brahm,  deludes  as real  men  with  the  variegated  creations  of  the world,  this  Siddha  played  several  feats  before  the King  by  waving  the  large  circle  of  peacock‟s feathers,  which  the  King  no  sooner  saw  than  lo! Before  his  mental  vision  he  saw  the  following events  enacted.  

A  messenger  despatched  by  the king  of  Sindhu  entered  upon  the  scene  with  a  high mettled  charger  like  unto  Indra‟s,  and  said  that that  victorious  one  was  intended  by  his  master  for the  king  Lavana.  Whereupon  the  Siddha  asked  the king  to  mount  upon  the  same,  since  no  other  horse could  vie  with  it.  

In  obedience  to  the  words  of  this great  personage,  the  king  stared  like  a  statue intently  in  the  direction  of  the  horse  and  lay entranced  for  a  Muhurta,  like  yogis  in  Samadhi. Then  those  assembled  before  the  king,  became seized  with  doubt  and  surprise  with  their  faces contracted  like  lotuses  with  closed  petals.  After  the courtiers  were  thus  in  a  state  of  mental  perplexity and  fear  for  about  four  Muhurtas,  the  king‟s  body relaxed  its  rigidity  and  began  to  fall  prostrate before  the  throne,  when  those  hard  by  propped  it up.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31