శ్రీ యోగ వాసిష్ఠ సారము - 74 / YOGA-VASISHTA - 74

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 74  / YOGA-VASISHTA - 74 🌹 
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴. 2. స్థితి ప్రకరణము 🌴
🌻. శుక్రాచార్యుడు భృగు, యముల వృత్తాంతము - 1 🌻
 
శ్రీరాముడు వసిష్టు నుద్దేసించి, మనస్సు ఈ ప్రపంచ మందు ఎట్లు గలదో తెలుపుమని యడిగెను. అంతట వసిష్టుడు; ఐందవులు స్ధూల శరీరులైనప్పటికి, సమాధి స్ధితులై యుండి, వారి మనంబున పెక్కు జగంబులు కనిపించునట్లు, ఈ మనస్సు నుండియె జగత్తు స్ధితి, గల్గియున్నది.

అటులనే యింద్రజాలముచే వ్యాకుల మొనర్చ బడిన చిత్తము గల లవణునకు, చండాలత్వము ఎట్లు సంభవించెనో అట్లే, ఈ మనంబున, జగత్తు ప్రతిష్టితమై యున్నది. అలానే భృగు మహర్షి పుత్రుడైన శుక్రాచార్యుడు, చిరకాలము స్వర్గ సుఖ మనుభవించ వలెనను ఇచ్చయు, అప్సరసను పొంద వలయునను తలంపును. గలుగుటయు, అపుడు స్వర్గమునకు జని, జన్మాంతరము స్వర్గమున, స్వర్గ సుఖమున, అప్సరసలతో భోగము ననుభవించుటయు సంభవించిన రీతి, ఈ జగత్తున సంభవించుచున్నది.

అపుడు శ్రీరాముడు, శుక్రాచార్యుని స్వర్గ సుఖము, అప్సరసను ఎట్లు పొందగల్గెనో తెలుపుమని చెప్పెను. అంతట వసిష్టుడు, భృగు యముల సంవాద మను వృత్తాంతము నిట్లు చెప్పెను.

మందర పర్వత శిఖరముపై, పూర్వకాలమున భృగు మహర్షి ఘోరతపం బొనరించెను. అతని కుమారుడు శుక్రాచార్యుడు, వాని నుపాసించుచుండెను. శుక్రాచార్యుడు, విద్య, అవిద్యల యొక్క, అనగా జ్ఞాన అజ్ఞానముల మధ్య స్ధితుడై యుండెను. అపుడు భృగు మహర్షి, నిర్వికల్ప సమాధి యందు స్ధితుడై యుండగా, శుక్రాచార్యుడు ఏకాంత ప్రదేశమున, ప్రశాంతముగ స్ధితుడై వుండగా ఆకాశమున, ఒక అప్సరస, శుక్రచార్యుని గాంచెను.

అప్సరస అందమైన కేశములతో, సుగంధ యుక్తమగు శరీముతో వున్నది. శుక్రాచార్యుడు ఆమెను గమనించగా పరస్పరము మొహ పరవశులైరి. అంతట శుక్రాచార్యుడు, ఆ అప్సరస ధ్యాసలో, నిమగ్నుడై అమెనే మనంబున ధ్యానించుచు మనో రాజ్యమున కల్పన మొనర్చ నారంభించెను. ఆకాశ మార్గమున యీలలన స్వర్గమునకు వెళ్ళుచున్నది. 

నేను తనతో స్వర్గమునకు చేరితిని. అచట దేవతలను గాంచి తిని. దేవతా స్త్రీలు, ఆకాశ గంగ, తదుపరి యమ, చంద్ర, సూర్య, అగ్ని, జల, వాయువులు, ఐరావతము, కల్పవృక్షము, నందనవనము, నారద, తుంబురులు మొదలగు దేవతలు అందరిని శుక్రాచార్యుడు చూడగల్గెను. ఇట్లు చింతించుచు శుక్రుడు మనంబున ఇంద్రునికి ప్రణమిల్లెను. 

అంతట ఇంద్రుడు, శుక్రాచార్యుని ఆదరముగ పూజించి తన చెంత కూర్చుండ బెట్టుకొనెను. తదుపరి ఇంద్రుడు శుక్రాచార్యుని స్వర్గమందు చిరకాల ముండమని కోరెను. అంతట శుక్రాచార్యుడు అచట నివసించసాగెను. అచట శుక్రాచార్యుని ఇంద్రుని పుత్రునివలె ఆదరించిచుండిరి. శుక్రాచార్యుడు అచట అందరిచే ఆదరింపబడుచు స్వర్గ సుఖములను అనుభవించుచు, తన పూర్వ భావమును మరచెను. 

కొంత సమయము తరువాత శుక్రాచార్యుడు స్వర్గమున విహరింపదలచి, అచట నుండి లేచెను. శుక్రుడు స్వర్గ మందలి అప్సరసలను, వీక్షించుటకై తిరుగుచుండెను.అంతట శుక్రాచార్యులు, దేవతా స్త్రీల మధ్య తాను పూర్వము జూచిన అప్సరసను గాంచెను. ఆ అప్సరసయు, శక్రాచార్యుని గాంచి, పరవశురాలయ్యెను.

శుక్రాచార్యులు అప్సరసయు పరస్పరము, ప్రేమాధిక్యముచే, మన్మధా వేగమును పొందిన వారై, అప్సరస శుక్రాచార్యుని వద్దకుచేరి. శుక్రాచార్యుని రెండు చేతులను పట్టుకొని, ప్రేమ పూరిత వాక్కులతో, నాథా యీ మన్మథుడు నన్ను తన పూబాణముతో సంధించి, బాధించుచున్నాడు. తమరే నన్ను రక్షించవలెను అని పల్కెను. 

ప్రధమానురక్తులగు స్త్రీ పురుషులు ఆనంద ప్రదమగు ప్రేమచే, ఏసుఖము లభించునో, అయ్యధి త్రైలోకాధిపత్యముచే గూడ లభించదు. అలా వారిరువురు పరస్పర ఆలింగనముతో మైమరచిరి. తదనంతరము, సరోవర మందలి భ్రమరముల వలె సుఖభోగము లనుభవించిరి.

ఇట్లు ఓరామా! చిత్త విలాసమున, చిరకాల కల్పిత ప్రేమ భావ వశంబున సమాగమము వలన శుక్రాచార్యుడు, ప్రసన్న చిత్తు డాయెను. అంతట శుక్రాచార్యులు, ఆ అప్సరసతో, మందాకినీ తట ప్రదేశంబున విహరించసాగెను. అలానే మేరు పర్వత మందు, సరస్సు లందు, సంచరించుచు అనేక రాత్రులు గడిపిరి.

అట్లు ఆరువది సంవత్సరములు శుక్రాచార్యుడు అప్సరసతో గడిపెను. తదుపరి శ్వేత ద్వీప వాసము, గంధర్వ నగర ఉద్యాన వనములందు గడుపుచు, తన పుణ్యక్షయము కాగా, దివ్య శరీరము నశింప, శుక్రాచార్యుడు, అప్సరసతో కూడ, భూమండలముపై బడెను. శుక్రాచార్యులు చింతాక్రాంతులై, తమ సూక్ష్మశరీరములను వదలి, వారి లింగ శరీరములు రెండును, ఆకాశమున చంద్రకిరణము లందు, అచట నుండి, వాయు, జల రూపమున ధాన్యము నందు ప్రవేశించెను. 

అనంతరము దశార్ణవమను దేశ మందొక బ్రాహ్మణుడా పక్వమగు ధాన్యమును భుజించెను. అంతట శుక్రాచార్యుడు వీర్యరూపము పొంది, వానికి పుత్రుడై జన్మించెను. అంతట మునుల సంసర్గమున, యుగ్ర తపమొనర్చి, పిదప మృగ రూపము నొంది, అప్సరస వలన మనుజాకారము గల పుత్రునిగ జన్మించెను. ఈ పుత్రుని యంద పరిమితమైన మమకారముచే పెంచబడగ, లౌకిక వ్యవహరము లందు మునిగి, వేదవిహితమగు తపోధ్యానములను త్వజించెను.

ధర్మమార్గము నుండి పతితుడై చింతించుచు, ఆయువు క్షీణించి మృత్యువాత బడెను. తరువాత వాని లింగ శరీరము భోగచింతతో కూడియుండి, మద్ర దేశాధశునికి పుత్రుడై జన్మించి రాజయ్యెను క్రమముగా, అతడు వృద్ధుడై వాన ప్రస్తాశ్రమమున, తప స్సంస్కారము గల వాడై, తన రాజ్యమును త్వజించి, తాపసి ఆయెను.

ఇట్లు అనేక జన్మ పరంపరలు పొందుచు పిదప ఒక నదీతటమున, స్ధిరాసీనుడై తపమాచరించుచు సుఖముగ నుండెను.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 74 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 44  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 5  🌻

Why  should  you  pine  like  the ignorant,  being  bewildered  in  the  illusions  of  son and  others  who  are  not  your  Self?  What  is  this body  which  is  dull  and  inert?  Who  is  that  „you‟ which,  on  account  of  this  body,  is  drowned  amidst pleasures  and  pains  and  is  ever  chafing  therein without  the  least  avail?  Truly  a  wondrous  riddle  is it?  

You  have  not  cognized  these  diversified  things in  their  true  state  of  unity.  While  the  self-shining Brahman,  which  is  non-dual  and  true,  is  pervading everywhere,  this  painful  and  illusory  Maya, though  uncreate,  yet  manifests  itself.  Like  a  crystal which,  though  tinged  by  the  five  colours,  is  yet unaffected  by  them,  you  should  perform  all  actions by  associating  with  them  and  yet  be  untainted  by the  desires  therein.  So  said  at  great  length  Rishi Vasistha.   

Valmiki  said  „Oh  Baradwaja,  hearken  to  what passed  between  Sri  Rama  replete  with  good qualities  and  with  his  heart  like  a  full-blown  lotus and  Rishi  Vasistha.‟  

Rama  remarked  thus  „Really passing  all  belief.  How  is  it  possible  for  the universe  to  be  affected  with  manifold  pains through  this  illusory  Maya,  like  a  series  of  hills bound  and  crushed  by  the  filament  of a  lotus?  I  can rather  believe  a  straw  to  assume  the  density  of adamant  than  this  universe  to  become  concreted into  its  present  shape,  through  the  power  of  Maya which  is  unreal.  Still  another  doubt  has  flashed across  my  brain.  Whence  the  pains  of  King  Lavana previously mentioned  by  you.‟   

Lavana’s  mental  Yajna:  Vasistha  answered  his queries  thus  As  Lavana  performed  actions  through a  stainless  mind,  his  body  did  not  share  in  their fruits.  This  King  was  one  day  spending-  his  time solitarily  in  his  pleasure  garden  and  then  began  to fall  into  the  following  profound  reverie.  He thought  of  performing  mentally  the  Raja-Suya 49 Yajna  which  his  ancestor,  Harischandra  had  done with  his  physical  body. 

 Through  his  Sankalpa,  he willed  the  existence  of  ploughs  and  other  utensils and  things  necessary  for  Yajna  and  entering  the place  of  Yajna  according  to  Vedic  recitals  and observances,  appointed  and  worshipped  Munis  for the  same.  Then  rearing  up  a  large  fire  and  having invoked  the  Devas  through  the  chanting  of  Vedic Mantras,  he  conducted  the  worship  of  Devas, Tapaswins  and  Brahmins  for  one  year  by  feeding them  and  justly  distributing  to  them  all  his  wealth. 

Thus  did  he  conclude  his  Yajna  and  awake,  from his  intense  reverie,  to  find  the  night  approaching. Therefore  you  should  gather  from  this  episode  that it  is  the  mind  alone  which  brings  on  pleasures  or pains  to  itself  and  enjoys  them  through  its excessive inclination towards  any  particular  object. 

Note 49 : This  is  a  sacrifice  done  by  Emperors  as  a  mark  of  their  undisputed sovereignty  over  the  whole  world.   

I  will  here  supplement  to  you  some  information about  Sambarika,  the  Siddha.  When  he  appeared before  the  King  Lavana  seated  in  a  conclave  of  his courtiers,  he  deluded  the  King  with  his  Indrajala and  then  disappeared.  I  was  one  among  the  group and  witnessed  all  these  things.  Being  questioned  as to  the  mysterious  disappearance  of  this  Siddha  by the  powerful  King  and  courtiers  as  well  as  others,  I dived  into  my  heart  to  probe  into  the  three  periods of  time  and  gave  the  following  explanation.  

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹