శ్రీ యోగ వాసిష్ఠ సారము - 59 / YOGA-VASISHTA - 59

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 59  / YOGA-VASISHTA - 59 🌹
✍️ . రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. బాలకోపాఖ్యానము - 2 🌻
  
ఆత్మ దేహ రహితమైనను, దేహముతో నున్నట్లు భ్రాంతి చెందుచున్నది. అట్టిచో నీ దేహము చిన్నాభిన్నమైనను, ఆత్మకేమి హాని.

భేదాభేదములు, వివాదములు శరీరమునకే గాని ఆత్మకు కాదు. ఘటము నశించిన ఘటాకాశము, మహాకాశము నందు యధారీతిగ నుండునట్లు, శరీరము నశించినను, జీవాత్మ, చిత్తాకాశము నందు, యథాప్రకారముగ స్థితి కల్గి యుండును. ఈ మనస్సే యిష్టానిష్ట వస్తువులందు, రాగ ద్వేషములుగలదై తద్వారా బంధమున తగుల్కొనుచున్నది. ఇదంతయు భ్రాంతియె యగును. మానసిక శక్తియె దీర్ఘ స్వప్నము వంటి, మిధ్యారూపమగు, జగత్‌ వైచిత్య్రము నంతను, సత్యంగానే కల్పనమొనర్చినది.

ఓ రామా! సూర్యుడెట్లు తన వేడిమిచే, మంచును కరిగించి వైచి, నశింప జేయునో, అట్లే నీవును ఆత్మ విచారణచే, మనస్సు ఆత్మను దర్శంచుచున్నది. కాని తన నాశనమును తాను ఎరుగకున్నది. మనోనాశము నాశించు వివేకుల యిభీష్టము, సంకల్ప మాత్రమేననే సిద్ధింపజేయును. మనస్సు నశించిన పరమ పురుషార్ధమగు, మోక్షము లబించును. కాన మనోనాశము కొరకు ప్రయత్నింపుము.

సముద్ర మందు తరంగములవలె, యీ చిత్తము ప్రకటితమై క్రమముగ జగత్‌ విస్తార మొనర్చుచున్నది. దృష్టము గాని వస్తువును కూడ, ఈ మనస్సు సుమేరు పర్వతమువలె, ప్రకాశింపజేయుచు, ప్రత్యక్ష మొనర్చు చున్నది. బ్రహ్మ చైతన్యము నుండి, వికాసము పొందిన, ఈ మనస్సు ఒక్క నిముషములో అనేకబ్రహ్మండములను నిర్మించుచు, నాశన మొనర్చు చున్నది.

స్ధావర జంగమాది ఈ దృశ్య ప్రపంచమంతయు, చిత్తము నుండియె యావిర్భవించుచున్నవి. సత్యమును మిధ్యగను, మిధ్యను సత్యముగను, ఈ మనస్సే చేయుచున్నది. మృత్తికచే బాలుడెట్లు బొమ్మలు చేయునో అట్లే మనస్సును, ఈ జగత్తే కల్పనలు చేయుచున్నది.

ఈ మనస్సు క్షణమును కల్పముగను, కల్పమును క్షణముగను చేయుచున్నది. మనస్సు యొక్క ఏకాగ్రత వలన ఏ కార్యమైనను అవశ్యము సిద్ధించును. భ్రమ, వ్యామోహము మొదలైన యనర్ధములు, వృక్షము నుండి పత్రము లావిర్భవించునట్లు, చిత్తము నుండియె కల్గును.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 59 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 29  🌴

🌻 4.  THE STORY  OF AINDHAVA  THE  SON OF INDU OR THE MOON - 2 🌻

Where  upon  Parama  Siva was  greatly  pleased  with  them  and  having approached  them,  demanded  of  them  what  they wanted.  With  head  prostrate  on  the  ground,  they entreated  to be  blessed  with  ten  erudite  sons  to  free them  from  all  pains.  

The  boon  having  been granted,  both  the  husband  and  wife  lived  in  joy and  were  blessed  with  ten  goodly  babes.  These babes  grew  up  with  age,  well  versed  in  all departments  of  knowledge.  

In  course  of  time,  the parents  died  and  their  sons  retired  to  the  Kailasa hills  where  they  began  to  soliloquise  within themselves  thus  „Shall  we,  to  relieve  ourselves from  this  indigency  which  is  afflicting  us,  become  a leader  of  men?  

As  even  this  situation  is  but  a  paltry one,  Jet  us  become  a  king  or  rather  an  emperor ruling  over  all  worlds.  Even  this  is  insignificant, when  compared  with  the  status  of  Devendra,  the lord  of  nine  types  of  wealth.  This  too  will  not suffice  us.  

Therefore  let  us  become  the  lotus-seated Brahma  wherein  we  can  enjoy  all  kinds  of  stainless wealth.‟  With  this  fixed  resolve,  all  the  ten personages  seated  themselves  in  Padma  posture and  with  one  concentrated  and  same  purposed mind  were  engaged  in  a  non-fluctuating meditation  thus  „We  alone  are  Brahma;  all  the creations  are  out  of  ourselves  only.‟  

Thus  did  they pass  long  aeons  of  time,  oblivious  of  their  body and  immovable  as  a  wood.  When  thus  their  mind‟s thoughts  (were  perfected  and)  concreted themselves  (into  a  solid  mass),  all  the  ten  became Brahma  himself.  Then  the  ten  lokas 43  were  created. Ten  kinds  of  creations  were  generated  by  these  ten personages  in  their  Manasakasa.  Out  of  the  ten creations  of  ten  Suns,  I  am  one.‟  So  saying,  he  (the sun) vanished  out of sight.   

Said  Vasistha  to  Rama  As  all  the  visible  universes are  existent  only  through  the  expansion  of  this crass  mind,  the  swan-seated  Brahma  created,  in accordance  with  this  law,  all  the  worlds  through his mind  only.   

Note 43  : This  stands  for  the  3  worlds  of  Brahma,  Vishnu  and  Rudra  besides the  Bhu,  etc.,  up  to  Satya  or  for  the  ten solar  systems.   

End of Chapter 4

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31