శ్రీ యోగ వాసిష్ఠ సారము - 57 / YOGA-VASISHTA - 57

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 57  / YOGA-VASISHTA - 57  🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. చిత్తాఖ్యానము - 2  🌻
 
అనంతరము ఒక ప్రదేశమున అట్టి వానినే మరొకరిని గాంచితిని. అతడును అట్లే తనపై తాను ప్రహార మొనర్చు చుండెను. వెనుకటి వాని వలె సంచరించుచుండెను వానిని ప్రశ్నింప, వెనుకటి వానివలె, అంగములు వదలి అదృశ్యమయ్యెను. మరల ఇంకొకడట్టి వాడె కనబడెను. ఆ విధముగా అరణ్య మందు అట్టి పాపు లనేకులనుకాంచితిని. వారు వారి దేహములను త్యజించి శాంతులైరి. కావున వారు బుద్ది హీనులై అలా వర్తించుచున్నారు. అజ్ఞానమున వారు సంసారారణ్యమున చరించుచున్నారు. 

నిజానికి అట్టి అరణ్యమే లేదు. ఆ అరణ్యమున భీకరాకృతి గల్గించు పురుషులు భ్రాంతిచే, దుంఖితులగు వారి చిత్తములు, అగాధములగు అంధకూపములు, నరకములు కదళీ వనమందు సంచరించువారు, స్వర్గాసక్తులగువారు, వన సంచారులు, మనుజు రూపము పొందిన వారు. వారిలో అనేకులు జ్ఞాన సంపన్నులై సంసార బంధముల నుండి తప్పించుకొని ముక్తులైరి.

ఇట్లు అనేక ఉపాధులు పొందుచు, ఒక యోని నుండి మరియొక యోనికి ప్రవేశించుచు, నరకమున పడుచు, స్వర్గమునకు పోవుచు, ఎందరో పరిభ్రమిస్తున్నారు. వివేక ప్రాప్తిని బడసి బ్రహ్మపధమును పొందుము. అజ్ఞానము యొక్క విచిత్ర లీల, తన కోర్కె చొప్పుననే చిత్తము తన్ను తాను బాధించికొనుచు పరివెత్తుచున్నది. 

పట్టుపురుగు, తనచే నిర్మింపబడిన గూటి యందు తానే చిక్కుకొనునట్లు, మనస్సున్ను సంకల్ప, వాసనాధులచే, తన్నుతానే బాధించుకొను చున్నది. బాలుడెట్లు భవిష్య దు:ఖ మెరుంగక, చపలత్వముతో గూడి ఆడుచు, అనర్ధములు పొందునో, అటులనే మనస్సును గూర్చి ఎరుంగుము. 

చిరకాలము సమాధి నభ్యసించుటచే, ఆత్మభావన దృధ పడుట వలన, మనస్సు తన చాపల్యమును వీడి, దు:ఖము నుండి విముక్తి పొందును. పరమాత్మ సర్వశక్తి వంతుడును నిత్యుడును. సర్వత్రపూర్ణమై యుండి వెలుగుచున్న పరబ్రహ్మమందు లేని వస్తువే లేదు.

ఓ రామా! బ్రహ్మము యొక్క చేతనాశక్తి అండజాది చతుర్విధ ప్రాణులన్నింటి యందు కలదు. మరియు నది వాయువు నందు చలన శక్తిగను, శిలయందు జడత్వముగను, ఆకాశమున శూన్యశక్తిగను, సంసార స్ధితి యందు వ్యవహార శక్తిగను, బ్రహ్మము విస్తరించియున్నది. బీజమందెట్లు ఫల, పుష్పములతో, వృక్షముండునట్లు బ్రహ్మము నందు ఈ జగత్తు గలదు. మనన శక్తిగల్గి యుండు చైతన్యమే, మనస్సన బడును. 

ఈ సమస్తమును, బ్రహ్మము యొక్క శక్తియేగాన, బ్రహ్మాండ మంతయును, బ్రహ్మ స్వరూపముగ నెఱుంగుము యీ జగద్వై చిత్రము లన్నియును, మనస్సు చేతనే కల్పింపబడి, వివర్త రూపమున బ్రహ్మము నుండె అగుచున్నవి గాన యవియును బ్రహ్మమే యనియెరుగుము.

 ఉత్పన్న మగుట నశించుట, పోవుట వుండుట మొదలగు దృశ్య వికారములన్నియు, కర్త, కర్మ, క్రియలు; జనన మరణములు ఆ పరమాత్మయె, అతని కన్యముగ ఏకల్ప నయూ లేదు కదా! అజ్ఞాన మందలి బంధము, జ్ఞానముచే విచ్చేదమై, బంధ రహితమగుచున్నది. ఎవనికి బంధము కల్పితమో. స్వప్న పద్ధాములు, జాగ్రత్‌ దశయందు ఎట్లు మిధ్యమగునో అట్లే బంధమును గూర్చి అజ్ఞాన కల్పన, మిధ్యయె. కావున జ్ఞానుల దృష్టిలో మోక్ష కల్పనయు మిధ్యయె. బంధ మోక్షముల గూర్చి, వ్యామోహము, తత్వవేత్తలకు లేదు. అజ్ఞానికి మాత్రమే కలదు. 

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 57 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 27  🌴

🌻 3.  THE STORY  OF KARKATI  🌻

At  these  words  of  the  king,  the  Rakshasa  woman felt  her  whole  body  cooled  as  if  showers  of  nectar were  rained  on  it.  Having  steadied  herself  after  her exultation  was  over,  she  gave  vent  to  the  following words:  „Do  not  all  men  wear,  as  their  crown,  the feet  of  such  holy  personages  like  yourselves  who have  rare  intelligence,  like  unto  a  Jnana-sun,  which has  neither  degree  nor  stain,  neither  setting  nor rising?  

Will  despondency  ever  rise  in  the  breasts  of those  who  associate  with  Atman  Jnanis,  being,  as they  are,  invincible  conquerors  of  Moksha-loka? Despite  your  acquisition  of  all  things  through Atman,  please  lay  your  commands  on  my  head,  so that I  may serve  you  in  some  respect?‟   

To  which  the  king  said  thus  „Oh  wench,  that  is  like a  poisonous  fruit  in  the  forest  of  Vishadhruma  (or the  poisonous  trees)  of  the  Rakshasa  race,  desist from  your  massacre  of  all  lives  in  this  world.  ‟The lady  having  nodded  assent,  the  king  queried  her  as to  what  such  a  carnivorous  person,  as  she  was, would  do  to  appease  her  hunger.  

The  lady  said that  she  would  resort  to  Nirvikalpa  Samadhi  as  she did  before  to  alleviate  her  gastric  fire.  She remarked  further  that  she  would  thus  pass  a  long time  in  the  state  of  Jivanmukti,  tasting  the ambrosia  flowing  within  and  then  reach Videhamukti.  Then  she  promised  on  her  honour not  to  hurt  any  creatures,  now  that  she  had developed  Jnana.   

While  she  was  meditating  upon  beating  a  retreat, the  king  said  „We  have  encompassed  our  object very  smoothly.  If  you  will  choose  to  accompany  us to  our  palace  and  there  remain  as  one  of  our family,  we  will  bestow  upon  you  plenteously  the bodies  of  those  villains  who  betake  themselves  to murder  and  other  crimes.  

So  long  as  this  body endures,  thoughts  and  other  pains  incidental  to  it will  not  bid  adieu  to  it.  Therefore  you  can  devote yourself  to  Nishta  (meditation)  after  quenching  the fire  in  your  stomach  with  the  victuals  supplied  to you  in  the  form  of  the  bodies  of  the  vicious.  Thus shall you  act in this  world  with  true love.‟ 

Thereupon  the  lady  with  great  exultation  walked along  with  the  leonine  King  and  his  minister  to their  golden  palace  when  the  sun  rose.  In  six  days after  their  arrival,  three  thousand  wretches  were handed  over  to  her  by  the  King.  Discarding  during nights  the  resplendent  form  of  Lakshmi  with which  she  shone  during  the  day  in  that  palace,  she transformed  herself  into  a  Rakshasa  woman  and piled  upon  her  shoulders  the  ignorant  suicides. 

Then  having  taken  leave  of  the  King  and  his counsellor,  she  fled  for  meditation  to  the  golden Himalaya  Mountains.  Even  to  this  very  day,  both the  King  and  Karkati 42  are  thus  moving  friendly towards  one  another.  So  said  Vasistha  to Ramachandra.  

Note  42 :  Karkati means a  snake  in  one  sense.   

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹