శ్రీ యోగ వాసిష్ఠ సారము - 52 / YOGA-VASISHTA - 52

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 52  / YOGA-VASISHTA - 52 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. అహల్య, ఇంద్రుల వృత్తాంతము  - 2  🌻
 
బ్రహ్మండము లన్నింటిని సృజించునది మనస్సే. కావున బ్రహ్మదేవా, నీవు నీ చిత్తాకాశమందు ప్రజలను సృష్టించుము. నీ మనస్సుకు తోచినట్లు, అనేక సృష్టులు చేయుమని తెల్పెను. సూర్యుడిట్లు చెప్పగా బ్రహ్మ చిత్తాకాశము, మనస్సహిత, చిదాకాశములు అనంతములు. భూతాకాశము సృష్టియందే యంతర్భూతమైనది. బ్రహ్మకాశము అసంగమై యుందును. కాన నా కభిమతమగు సృష్టినొనర్తును అనెను.

సామాన్య బ్రాహ్మణులైనను ఐందవులు, మనోభావము చేతనే బ్రహ్మ పధము నొదగల్గిరి. చిత్తము వివిధ కల్పనలతో కూడియున్నది. మిరప గింజాకారముగను, ద్రాక్ష మధురముగను, తమ తమ సంస్కారముల ననుసరించి యెట్లు వ్యక్తమగునో, అట్లే కామ, కర్మ వాసనల ననుసరించి, జీవుని యందు చిత్తము ఎపుడే విధమున నుండునో, అపుడా విధముగనే నయ్యది, వాని యందు ఆయా స్వభావ సంస్కారముల ననుసరించి వ్యక్తమగుచున్నది. 

చిత్తము మన స్వరూపమైనను, ఐందవుల జీవ చైతన్యము వలె సత్తను పొందుచున్నది. ఐందవుల మనస్సే బ్రహ్మమైనట్లు, మనము కూడ మన స్సంకల్పము చేతనే, బ్రహ్మలైయున్నాము. మనస్సు బ్రహ్మ స్వరూప మగుట చేత జగముగను, దృశ్య రూపమగుట చేత జడమును అగును. భేద దృష్టిచే చైతన్యము, అన్య రూపమును ధరించుచున్నది.

అహంభావముచే నుత్పన్యమగు వస్తువులన్నియు, యెండమావు లందు నీటి వలె మిధ్యయె. వైరాగ్యాలు యుత్తమ గుణములు గల జీవుడు స్ధూల, సూక్ష్మ, కారణ శరీరముల భ్రాంతిని త్యజించి, చిత్తమును గూర్చి, చిత్తముచేతనే విచారించవలెను. శాప, మంత్రములను గూర్చి ప్రశ్నించుచూ, శాపము వలన మనస్సు ప్రభావితము కాదనియు, శరీరమే ప్రభావితమగుట ఎట్లని అడుగగా బ్రహ్మదేవుడిట్లు చెప్పెను.

శుద్ధమగు పురుష ప్రయత్నముచేత, శుభ కర్మల చేత, జీవులకు జగత్తున పొందరాని దేదియులేదు. ప్రతి ప్రాణికి రెండు శరీరములు గలవు. ఒకటి మనస్సు శ్రీఘ్రముగ కార్యముల నొనర్చును. రెండు, మాంస నిర్మితమగు దేహము. మాంస నిర్మిత దేహము, ప్రత్యక్షముగ అందరికి, కనిపించును.

అదిశాపములచే, శస్త్రాదులచే బాధింపబడును. మనస్సు స్వతంత్రమును, అస్వతంత్రమును అయినది. ధృడమైన పురుష ప్రయత్నము, ధైర్యముతో మనసు దు:ఖము పొందలేదు. పురుష ప్రయత్నము వలననే, మాండవ్య మహర్షి, శూలాగ్రమున నుంచబడినను క్లేశమును పొందలేదు. ఐందవులు సామాన్యులైనను, పురుష ప్రయత్నము చేత, మనోబలము చేత, బ్రహ్మత్వమును పొందగల్గెను. వారిని ఆపదవి నుండి నేను కూడ తొలగింపలేనని బ్రహ్మ చెప్పెను. దీర్ఘ తపుడను బుషి, యజ్ఞము చేయనెంచి, యజ్ఞ సామగ్రి కొరకై బయలుదేరి, త్రోవలో ఒక అంధ కూపమున బడగా అచట మానస యజ్ఞము చేసి, ఇంద్ర పదవిని పొందెను. 

సావధాన చిత్తలీ ప్రపంచమున, స్వప్నమునగాని, జాగ్రద్దశ యందుగాని దోషములచే ప్రమాదమును, పీడింపబడకయు యుందురు. ఈ మనస్సు దేనిని భావించునో దానిని శీఘ్రముగ పొందును, అనుభవించును. కాన కర్తయగు మనస్సే, భోక్తయగును ఈ విధముగా, మనస్సు తాను కల్పించిన ఇంద్ర జాలమును తానే శీఘ్రముగ వీక్షించుచున్నది.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 52 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 22 🌴

🌻 3.  THE STORY  OF KARKATI  🌻

She afflicted  the  minds  of  all  creatures  on  the  face  of the  earth  with  her  insatiate  gastric  fire  of  hunger which  was  blazing  day  and  night  like  the Manvantaric  flames.  Even  were  all  creatures  of Jambu-dwipa  fall  a  prey  to  her  capacious  stomach, she  would  yet  find  them  a  scanty  meal,  like  an ocean  in  spite  of  its  receipt  of  river-waters,  and crave  for  more.  Her  gastric  fire  would  be  but slightly  appeased  like  an  autumnal  heat  with  slight showers.  Now  she  wanted  to  appease  this  fire without  any  injury  to  herself  and  so  made  Tapas by  propitiating  Brahma  for  aid.  

For  this  purpose, she  resorted  to  the  Himalayas  and  having  bathed, stood  on  one  leg  on  the  ground  and  concentrated her  eyes  upon  the  sun  shining  in  the  sky.  After  she had  performed  such  a  painful  Tapas  for  1,000 years,  the  Lotus-seated  Brahma  appeared  visibly before  her.  Are  there  any  objects  which  cannot  be acquired  in  this  world  even  by  the  vicious  through the  performance  of  uncommon  Tapas?‟  With  the arrival  of  Brahma  before  her,  she  made  obeisance to him  mentally  without  stir  ring from  her  spot  and reflected  thus,  ‟In  order  to  assuage  my  everincreasing  fire,  if  I  transform  myself  into  the  form of  an  iron-like  Jiva-Suchika  (living  needle). 

 I  can enter  into  the  bodies  of  all  in  the  world  and consume  as  much  food  as  I  require.‟  Whilst  these thoughts  were  revolving  in  her  mind,  Brahma asked  her  the  object  of  her  wish.  Karkati  replied thus  „Oh  Lord  that  favours  those,  your  devotees who  contemplate  upon  you  and  praise  you,  your servant  wishes to  become  a  Jiva-Suchika.‟   

You  shall  become  Suchika  having  the  prefix  „Vi’ attached  to  your  name  and  hence  be  called Vishuchika 37. You  shall  afflict  those  who  feed themselves  on  unwholesome  food,  who  betake themselves  to  vicious  courses,  who  are  ignorant  or ferocious,  who  live  in  insanitary  places,  and  who are  wicked.  

You  shall  commingle  with  Prana  Vayu in  the  heart  and  afflicting  people  with  the  diseases Padma,  Pleeha 38  and  others  shall  be  (the  disease) Vishuchika.  You  shall  enter  both  Saguna  and Nirguna 39  people.  But  in  the  case  of  entry  in Saguna  men,  to  remedy  the  above  disease,  the following  Mantras 40  will  have  to be  uttered: 

ॐ ह्रां ह्रं  श्रीं  रां  विष्णशक्तय नमो  भगिवि  विष्णशवक्त  एवह  ।  एनां  हर हर  दह  दह  हन  हन  पच पच मथ मथ उत्सादय उत्सादय दर करु करु स ् वाहा  ।  विषवचक  त्वं वहमिन्तं  गच्छ  गच्छ,  जीिसार  चन्द्रमंडऱं  गिोवस स ् वाहा  ॥ 

The  reciter  of  the  above  Mantra  should  write  it  on the  left  hand  (with  the  left)  and  should  pass  it  (the left  hand)  over  the  body  of  the  diseased  person. Then  he  should  contemplate  upon  Karkati,  who  is crushed  with  the  pestle  of  the  Mantra  and  hence angry,  as  having  departed  for  the  Himalayas.  

Then he  should  regard  the  diseased  person  as  bathing  in the  ambrosia  of  the  moon  and  as  free  from diseases,  mental  or  physical.  Being  pure  and having  duly  performed  Achamana  (sipping  water) with  all  his  senses  under  perfect  control,  he  will destroy  all  Vishuchikas  through  the  due performance  of the  above  mentioned  means.‟  

Note : 37  Vishuchika  is  the  disease  called  cholera.  The  word  is  compounded  of „Vi‟  and  Suchika.  Suchika  is  from  „Such’  to  make  known. 
38  These  are  splenetic  diseases.  
39  Saguna  men are  the  wise  while  Nirguna  are  the  ignorant.
 
Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31