శ్రీ యోగ వాసిష్ఠ సారము - 70 / YOGA-VASISHTA - 70
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 70 / YOGA-VASISHTA - 70 🌹
✍️ . రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సప్త జ్ఞాన భూమికలు - 2 🌻
ఆత్మ జ్ఞానము యొక్క ప్రధమ భూమిక (1) శుభేచ్చ అనబడును. (2) రెండవది విచారణ (3) తను మానసిక (4) సత్తాపత్తి (5) అసంపత్తి (6) పదార్ధాభావని (7) తుర్యగ.
ఈ సప్త భూమికలనంతరము ముక్తి స్ధితమైయున్నది. ఈ సప్త భూమికలను గూర్చి వినుము అనివసిష్ఠుడు శ్రీరామున కిట్లు బోధించెను.
🌷1. శుభేచ్చ : మూఢుని వలె నుండ నేల, శాస్త్రములను పరికించెద, సజ్జనుల మహత్ముల దర్శించెద, అను నిట్టి వైరాగ్య పూరితమగు సత్ సంకల్పమె శుభేచ్చయని నీతిజ్ఞులు పల్కెదరు.
🌷2. విచారణ : సజన సంపర్కముచే వైరాగ్యమొంది అభ్యాస పూర్వకముగ నొనర్పబడు, శ్రవణ మననాది, సదాచారము లందు గల్గు ప్రవృత్తియె విచారణ అనబడును.
🌷3. విచారణకు శుభేచ్చలచే గల్గు శబ్ధ స్పర్శాదులందలి అనాసక్తియె, నిధి, ధ్యాసనా రూపమగుటయె తనుమానస యనబడను.
🌷4. సత్తాపత్తి :- పై మూడు భూమికలను అభ్యసించగా బాహ్యవిషయముల నుండి చిత్తమువదలి, వికాసము చెంద, అట్టి స్ధితిలో అవస్తాత్రయ బంధము తొలగ, ఆత్మస్ధితి యందు స్ధితి కల్గి యుండుటయె సత్తాపత్తి యనబడును. సత్యమగు ఆత్మయందు స్ధితి గల్గి యుండుట ఇయ్యది నిర్వి కల్ప సమాధి స్ధితియగును.
🌷5. అసంసక్తి- ఈ నాల్గు భూమికలను లెస్సగ అభ్యసించుటచే బాహ్యాభ్యంతర విషయములచే గాని, తద్గత సంస్కారములచే గాని స్మృశింపబడక యుండు, అసంగ రూపమగు, నిరతిశయానంద రూపమగు బ్రహ్మాత్మా భావన గల, అనగా ఆత్మ సాక్షాత్కారము గల్గి యుండునట్టి స్థితియె అసంసక్తి అనబడును (అతడు బ్రహ్మవిదుడు)
🌷6. ఈ ఐదుభూమికలు, బాగుగ అభ్యసించుటచే యుపరతి గల్గి సదా ఆత్మారాముడై, బాహ్యభ్యంతర పదార్ధములేవియును, భావింపక దేహయాత్ర కొరకు మాత్రము, ప్రయత్నముచే, ప్రభోదితుడై ఆయా పదార్ధములను గూర్చి ఇంచుక భావించు యవస్థ ఆరవ దగు పదార్ధ భావన యనబడును. దీని యందు, జ్ఞానికి పదార్ధములను గూర్చి రాగయుక్త భావన యుండును. ఇతనిని బ్రహ్మవిద్వరీయుడందురు.
🌷7. ఈ ఆరవ భూమికనే చిరకాల మభ్యసించుటచే, భేదభావమంతయు సమసిపోవ, కేవలము స్వరూపమందు స్ధితి బడయుటయే ఏడవదగు తుర్యగనబడును.
ఇట్లు జాగ్రత్ తాది త్రివిధి అవస్ధల నుండి విముక్తుడై కేవలము శివము, అద్వైతమునగు తురీయస్ధితియందు నిలకడ జెంది యుండు జ్ఞాని బ్రహ్మ విద్వరిష్టుడనబడును.
ఈ తురీయ స్ధితి, జీవన్ముక్తులకే లభించును. విదేహముక్తికి సంబంధించిన తరీయాతీత స్ధితి దీనికి పరమై మొప్పును. ఎవరు ఇట్టి స్ధితిని పొందెదరో వారిని ఆత్మారాముడందురు.
జీవన్ముక్తులగు మహత్ములు సుఖదు:ఖములచే చలింపక, సమస్ధితి యందే యుందురు. ఆ స్ధితి యుదుండువారు, తమ దేహరక్షణ కొరకే కార్యములు చేయుచు లేక చేయకయె యుందురు. అట్టి వారు ఇతరుల ప్రభోధముచే, వర్ణాశ్రమోచిత కార్యములను, ఆసక్తి రహితులై పూర్ణముగ ఆచరింతురు. గాఢ నిద్ర యందున్న పురుషుని, సుందరీమణులైన స్త్రీలు ఎట్టి సుఖము కలుగజేయనట్లు, ఈ ఆత్మారాములకు, ప్రపంచమందలి క్రియ లేనియును, సుఖమును కలుగ జేయజాలవు.
ఈ ఏడు భూమికలు, ధీమంతులకే గాని పశుప్రాయులగు దేహత్మ బుద్ధులకు కాదు. కొందరు మహాత్ములు, ఈ భూమికలన్నింటిని ఒకే జన్మమున పొంద గల్గి యుందురు. మరి కొందరు, రెండవ మూడవ భూమిక వరకు వచ్చెదరు. కొందరు ఆరవ, ఇంకొందరు ఏడవ భూమికల వరకు వచ్చెదరు. ఈ వివేకులీ భూమిక లందు సంచరించుచు, విశాలమగు ఆత్మదృష్టి గల్గి, బాహ్యభ్యంతర ఇంద్రియములను, తత్ సంబంధ, ఆధ్యాత్మికాది రూపములను నివారింపజేయు, ఆత్మనిష్టయందు నిమగ్నులై యుందురు.
ఓరామా! ఈ ఏడు భూమికలను పొందినట్టి మహాత్ములు వందనీయులు. వారు విదేహకైవల్యా నందమును, ఈ లోకముననే పొంద గల్గి యుందురు.
పరమాత్మ ఎల్లపుడు తానున్న స్ధితిలోనే వుండి, ఎట్టిచ్యుతిని పొందక, సూర్యునివలె, ప్రకాశింప, సూర్య ప్రకాశమునకు తానే కారణమై, వివిధ రూపములుగల, యీ జగత్తును స్పురింపజేయుచున్నాడు.
అజ్ఞానికి ఈ సృష్టి భిన్నముగను, జ్ఞానికి నిత్యమగు పరబ్రహ్మముననే, సృష్టి ప్రతిష్టితమై యున్నట్లు అనుభూతమగుచున్నది. చిత్తముననే ఈ సృష్టిప్రతీతమగుచున్నది. చిత్తము పూర్ణముగ బ్రహ్మ మందు లయించిన, ఈ సృష్టియు లయించును. ఆత్మ విచారమను అగ్నిచే వాసనా స్థితమగు అవిద్యయను లత, సమూలముగ దహింపబడును.
లేనిచో క్రమముగ అనేక శాఖలు విస్తరించుచు, వానిచే వ్యాప్తమైన, సుఖదు:ఖ రూపములగు అనేక వనముల నుత్పత్తి చేయుచుండును. చిత్తము శమింప, నీ సృష్టియంతయు, పరబ్రహ్మమే అగును. చిత్త ముదయించిన, అసత్తగు నామరూపాత్మమగు, జగత్తంతయు సత్తను పొందును. అజ్ఞానుల దృష్టిలో అసత్తగు ఈ జగత్తు స్ధితిని పొందుచున్నది. జ్ఞానుల దృష్టిలో ఇది సత్య స్వరూపమే అగు బ్రహ్మమే అగును.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 70 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 40 🌴
🌻 9. THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 1 🌻
🌷 Summary:
This chapter summarises all that was said in the previous stories as to the origin of the mind and the universe. It is the actions of the mind that are truly termed karmas. True liberation results from the disenthralment of the mind.
Those who have freed themselves from the fluctuation of their mind come into possession of the supreme Nishta (meditation). Should the mind be purged of all its impurities, then it will become as still as the milky ocean undisturbed by the churning of Mandara hills; and all our Samsaric delusion attendant with its birth and deaths will be destroyed.
Muni Vasistha continued: The poisonous tree of the great Maya s illusion flourishes more and more, out of the seed of the mind s modifications full of Sankalpa, in the soil of the variegated enjoyments of the world. The panacea prescribed by the wise for the removal of the diseases of the mind can be got at very easily through the mind alone. Now hearken to what I say. Those who without longing for objects avoid them, can be termed the subjugators of their Manas (mind).
Those who do not develop the painless Vairagya inhering in one‟s Self and that with great facility and happiness, are at best but vermin in human shape. If the mind be divested of the Sankalpa of „I,‟ then through the meditation of Atman after being initiated by a guru and having known the real significance of the Vedas given out by Lord, the mind can be turned back from the pains generating externals into the internals where it can be made happy.
Like one iron shaping another iron, the pure mind of a person which makes efforts in the virtuous path, should correct and mould his impure mind. To lovers of Moksha in whom the invincible desires take a tangible shape and who try to win their way up to Salvation through their own efforts, the easy abandonment of their dire mind is itself their transcendental path and they then feel as if a great load were off their heads. No other path is truly beneficial.
If the mind which flits from one object to another, is slain with the sword of non-Sankalpa, then will, the self-shining Principle which shines as the all and permeates them all, be cognized.
May you, Oh Rama, tread this path and destroy, through your Jnana the much-longed for mind; and after attaining Atman Jnana through the renunciation of all, devoid of Samsara and Vikalpas, know your Reality wherein the mind is merged. May you rest in the self-existent Brahmic State which is neither Sat nor Asat, after developing with great difficulty the process of Sravana and others and destroying the mind.
It is only through dauntless energy that the painless wealth of Moksha can be acquired. With the destruction of the mind 47, the three periods of time vanish into nothing. If all objects which have an enchanting appearance become eyesores and present the very reverse of the former feelings, then is the mind destroyed.
Note 47 : The destruction of the mind does not mean an annihilation of the self; but the Vedantins divide the mind into the higher and the lower, of which the lower one leading- to desires is asked to be destroyed.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment