శ్రీ యోగ వాసిష్ఠ సారము - 61 / YOGA-VASISHTA - 61

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 61  / YOGA-VASISHTA - 61🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 లవణోపాఖ్యానము - 2 🌻
  
అత్యంత దు:ఖదాయకముగా మరణము కంటే రోగమే యుత్తమమమని జీవులు తలంతురు కదా! అంత నేనొక నిమ్మ వృక్షతలమును చేరితిని. అచట చిక్కుబడితిని. అంతట సూర్యుడస్త మించెను. అంధకారము వ్యాపించెను. ఆ రాత్రి అతి దీర్ఘముగ అనిపించెను.

అన్నపానీయములు లేవు. నిద్రలేదు. కడకు తూర్పు తెల్ల వారినది. అంతట నేను అచటి నుండి బయలుదేరి, ఆ అరణ్యమంతట విహరింపసాగితిని. ఫల రహిత వృక్షములపై పక్షులు కనిపించినవి. నాల్గు ఘడియల సమయము గడిచినది. అపుడు ఒక స్త్రీ చేతియందన్నము గైకొని కనిపించెను. చంచల నేత్రియు మలిన వస్త్రధారి అయిన ఆమె వద్దకు పోయి, నా కాకలి అగుచున్నది. అన్నము పెట్టమని అడిగితిని. కాని నేనెంత ప్రార్ధించినను, ఆమె ఏమియూ నొసంగలేదు.

ఆమె వెళ్ళుచుండ, ఆమెను వదలక, వెంట వెళ్ళుచుంటిని. అంతట ఆ స్త్రీ తానొక ఛండాల కన్యనని, మాంసభక్షినని, నా వెంటరావద్దని పల్కెను. ఐనను నేను ఆమెను వదలక వెంట బడుచుండగా, అపుడు ఆ స్త్రీ కొంతసేపటికి, తన్ను వివాహమాడుమని, అపుడు భోజన మిడుదునని పల్కెను. నా తండ్రి చండాలుడు, పొలముదున్నుచున్నాడు. 

అతనికై తీసుకొని వెళ్ళుచున్న, ఈ అన్నమును, నీవు వివాహమాడిన నీకిచ్చెదనని పల్కెను. నేను అందులకు సమ్మతించి, ఆపద్కాలమున, కుల, జాతి, ధర్మములను విచారించకూడదనెను. ఆ స్త్రీ అన్నములో సగభాగమొసంగెను. ఆ అన్నము తిని నేరేడు ఫలరసము ద్రాగి కొంచెము విశ్రమించితిని. 

ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి తన వివాహమును గూర్చి తెల్పెను. అతడు అందుకు అంగీకరించగా, ముగ్గురు కలసి వారి గృహమున కఱిగితిమి. అచట, కోతులు, కోళ్ళు, కాకులు, ముక్కలు ముక్కలుగా కోయబడి పడియుండెను. నేలపై రక్తములో, దోమలతో, ప్రేవులు కనబడినవి. క్రొవ్వు ఎండబెట్టబడినది. బాలుర చేతి యందున్న, పచ్చి మాంస ముక్కలపై దోమలు, ధ్వని చేయుచుండెను. అట్టి గృహమునకు మేము వెళ్ళితిమి.

అచట ఆదరముతో నాకు అరటి ఆకుల ఆసన మేర్పరచ బడినది. అత్తగారి కంటి యందు, రక్త బిందువులతో, తన అల్లుని గూర్చి సంతసించెను. తదుపరి కొంత సేపటికి, ఆ ఛండాలునిచే గొని తేబడిన పదార్ధములను భుజించితిని. పిదప ఒక శుభ ముహూర్తమున, మంధ్య మాంసాది వస్తువులతో, వివాహ యోగ్యమగు సమస్త పదార్ధములను సిద్ధము చేయగా భీతి గొల్పుచూ, కృష్ణ వర్ణముగల, ఆ కన్యను ఆమె తండ్రి నాకు సమర్పించెను. 

ఆ వివాహ మహోత్సవమున యచట నున్న చండాలు రందరు, మధ్యపానముచే ప్రమత్తులై, పెద్ద పెద్ద వాధ్యములను వాయించిరి. ఆడుచూ, పాడుతూ, విలాసముతో వారందరు, నలువైపుల పరుగిడుచూ శబ్ధ మొనర్చిరి. ఆ వివాహ మహోత్సవమునకు వశుడనై నేను, అది మొదలు పూర్తి చండాలత్వమును బడసితిని.

ఏడు రాత్రులు వివాహ మహోత్సవములు సాగినవి. తదుపరి క్రమముగా గర్భము ధరించి ఆడబిడ్డను కనెను. ఆ పిల్ల క్రమముగా పెద్దదయ్యెను. మూడు సంవత్సరముల తదుపరి పుత్రుడుగల్కెను. తదుపరి మరియొక ఆడ, ఇంకొక మగబిడ్డ, ఇట్లు నా సంసారము వృద్ధి చెందినది. బ్రహ్మహలెల్యు యెనర్చినవాడు, నరకమున పలుయాతనలు పడునట్లు నేను ఆమెతో చాలా యేండ్లు దు:ఖముతో గడిపితిని.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 61 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 31  🌴

🌻 5. THE STORY  OF  THE DECEITFUL INDRA - 2 🌻

Extremely  bewildered  at  the  marvellous  manner  in which  they  baffled  all  his  attempts  to  make  them feel  pain,  he  asked  them  the  why  of  their  being proof  against  all  tortures.  At  which,  the  exulting pair  breathed  the  following  words  „Oh  you  of broad  shoulders,  as  our  eyes  are  regaling themselves  with  the  lunar  ambrosia  of  one  another s  face,  we  revel,  within,  in  unimpeded  bliss  and hence  are  entirely  oblivious  of  our  body.  

While  so, is  it  possible  for  us  to  (feel  any  pain  or  see  our body)?  We  never  experience  the  slightest  pain, even  when  the  body  is  ripped  open.  When  the mind  is  intensely  fond  of  anything,  there  will  be  no perception  of  pain,  even  when  destruction  awaits the  body.  When  the  mind  is  completely  drowned in  any  object,  who  else  is  there  to  observe  (and  feel from)  the  actions  of  the  body?  Even  the  curses  of Munis  and  the  many  Karmas  will  not  be  able  to divert  that  mind  from  its  beloved  seat  within. 

There  is  no  end  to  the  bodies  which  perished, beyond  number,  but  in  vain  (in  the  many  previous births.)  All  these  bodies  have  their  seat  in  (or originate  from)  the  mind  only.  Without  water,  can a  forest  exist?  It  is  the  mind  which  transacts  all business  and  is  the  highest  of  bodies.  Even  should this  gross  body  be  dissolved,  the  mind  will  assume fresh  bodies  to  its  liking,  as  speedily  as  actions done  in  dreams.  Should  this  mind  be  paralysed, then  the  body  will  not  evince  any  intelligence.‟  

So said  the  adulterous  couple,  on  hearing  which,  the King  eyed  them  with  pleasure.  Muni  Bharata  close by  him  remarked  that  the  two  gave  vent  to  words of  wisdom,  notwithstanding  their  minds  being under  the  thraldom  of  passions.  Therefore  he banished  them  both  from  his  realms,  so  that  they might  enjoy themselves in  foreign  lands.   

End of Chapter 5

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31