శ్రీ యోగ వాసిష్ఠ సారము - 60 / YOGA-VASISHTA - 60

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 60  /  YOGA-VASISHTA - 60 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 లవణోపాఖ్యానము - 1 🌻
  
వసిష్టుడు శ్రీరామునకు లవణోపాఖ్యానము నిట్లు చెప్పుచున్నాడు. హరిశ్చంద్ర వంశజుడు, మహాధార్మికుడు అయిన లవణుడను భూపాలుడు ఉత్తర పాండవమను రాజ్యమును పాలించుచుండెను. అతడు మహా పరాక్రమవంతుడు, శతృభయంకరుడు, ఐనను వినయము ఉదారత్వము గల్గి ప్రజారంజకుడై పాలించు చుండెను.

 ఒకానొక దినమున, ఆ లవణ భూపాలుడు, సింహాసనముపై అధిష్టించి; మంత్రి, సామంతాదులు పరివేష్టించి యుండ, రాజ కార్యములు నిర్వహించుచుండెను. వంది మాగదులు వినమృలై రాజు ఎదుట, స్తోత్రము చేయుచుండిరి. అత్తఱి మేఘ గర్జనచే విద్యుత్‌ ప్రకాశముతో గూడినట్లు, ఆడంబర సమేతుడై, అనేక వస్తు సముదాయములతో, యింద్రజాలికు డొకడు, ఆరాజ సభ యందు ప్రవేశించెను. అతడు రాజుకు ప్రణమిల్లి యిట్లు పల్కెను. తాను ఇంద్రజాలికుడనని, తమకు ఒక గొప్ప ప్రదర్శన నివ్వగలనని చెప్పి ఒక నెమలి పింఛమును గైకొని దాని నటు నిటు త్రిప్పెను.

రాజు అప్పుడొక అశ్వపాలకుని గాంచెను. అతడు తనతో ఒక గుఱ్ఱమును ఒకదానిని వెంట తెచ్చెను. అది అతివేగవంతము, శాంతము గలది. అతడు ఆరాజుతో నిట్లనియె. ఓరాజా! ఇది అశ్వములలో కెల్ల శ్రేష్టమైనది. అతివేగము గలది. మా ప్రభువుదీనిని తమ కొరకు పంపెను. తమరు ఈ గుఱ్ఱముపై విహరించుచు, వివిధ లోకములను సంచరించుడు అని పల్కెను. 

అంతట రాజు తదేకదృష్టితో దానిని వీక్షించగా, చిత్రముగా సతడు కనులు మూసుకొని, స్ధంభించినట్లు, చేష్టారహితుడై యుండెను. నాల్గు ఘడియల వరకు, ధ్యానాసక్తుడై నిశ్చేష్టుడై యుండెను. ఆ సభలోని, సభాపదులు కూడ, చలన రహితులై యుండిరి. అంతట నిశ్చబ్ధమావరించెను. మంత్రులందరు, సంశయార్ణవమున విషాదము పొందెను. తన శరీరము కదిలించెను. సింహాసనముపై యూగెను. అచట నుండి క్రింద పడుచున్న రాజును, యెదుట నున్న వారు పట్టుకొనిరి. అపుడు రాజు నేనెటనున్నాను. 

ఈ సభ ఏమిటని పల్కెను. అంతట మంత్రులు రాజు నిట్లు ప్రశ్నించిరి. రాజా! మీరేల ఇటుల విషణ్ణ హృదయులై యుండిరి. వివేక వంతులైన మీరుఇట్లేల యున్నారు. అని ప్రశ్నింప, రాజు అశ్చర్యము నుండి తెరుకొని తనలో ఏర్పడిన భీతిని గాంచి, యింద్రజాలికుని గూర్చి ప్రశ్నించెను. ఈ ఇంద్రజాలికుడు క్షణములో యీ మాయాజాలము నెట్లు చూపించగల్గెను. మేమేల మోహప్రదమగు, ఆపదలనెదుర్కొన వలసి వచ్చినది అని ఆశ్చర్యమగు వృత్తాంతము నిట్లు చెప్పెను.

నేనింద్రజాలమున అనేక కార్యములను, పెక్కు చంచల పరిస్ధితులను గాంచితి ననెను. సభాసదులు దానిని గూర్చి విన కుయుహలురై యుండిరి. అంతట రాజు నేనేనిచట, ఈ సభలో ఆసీనుడనై యున్న సమయమున, ఆ ఇంద్ర జాలికుడు, నెమలి పించమును నా యెదుట త్రిప్పినపుడు భ్రాంతుడనై, యెదట నున్న గుఱ్ఱముపై ఎక్కితిని. 

ఆ గుఱ్ఱము అతివేగమున పయనించి, శీతల వాయువులతో నిండి, వృక్ష, జల, శూన్యమై విశాల మైన, ఒక వనమున ప్రవేశించితిని. గుఱ్ఱము అలసిపోయెను. అచట ఆహార మేమియు లభించలేదు. ఆకలితో ఆ ప్రదేశమంతయు సంచరించుచూ చివరకు ఆ వనమును దాటి మరియొక వనమునకు గుఱ్ఱముతో చేరితిని అచట వృక్షములతో పక్షులతో పాంధులకు బింధువు వలె కన్పించెను. కాని అచట కోమల తృణ సమూహములే నుండెను. వెనుకటి అరణ్యము కంటె ఇది కొంత సుఖకరముగ నుండెను.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 60 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 30  🌴

🌻 5. THE STORY  OF  THE DECEITFUL INDRA - 1 🌻

Summary:  Having  shown  that  the  universe  is nothing  but  the  mind  manifesting  as  such  only through  the  potency  of  Brahman,  the  author  now proceeds  to  illustrate,  in  this  story,  the  fact  that  the body with  its  organs,  etc.,  is no other  than mind.   

The  creator  of  the  incomparable  worlds  and  the slayer  of  Atman  (the  Real)  is  the  mind  only.  The actions  of  the  mind  alone  are,  indeed,  actions;  but not  so,  those of  the  body.   

In  the  previous  narrative  of  the  ten  Brahmins related  by  the  sun,  they  became  Brahma  after performing  Tapas  in  Padma  posture  and  created the  worlds.  Who  else  than  Brahma  can  easily  and truly  understand  the  wonderful  potency  of  the mind?  The  mind  contemplating  upon  the  body, becomes  the  body  itself  and  then  (enmeshed  in  it), is  afflicted  by  it.  The  all-full  Jnanis  through  the contemplation  of  Brahman  within,  are  never affected  by  the  pains  assailing  this  body  of  nine gates.  So  indeed  were,  in  days  of  yore,  Indra  and Ahalya  who were guilty  of  adultery.   

Here  Rama  asked  Vasistha  as  to  who  these  two were.  On  which  Vasistha  continued  thus  In  former times,  there  lived  a  King  by  the  name  of Indradyumna  reigning  over  the  country  of Magadha.  The  lady  that  ministered  to  his enjoyment  like  his  Prana,  was  called  Ahalya.  In that  town  abode  a  person  named  Indra.  

True  to  the tradition  of  the  adulterous  intercourse  which occurred  in  former  times  between  the  once  Ahalya and  Indra 44  which  the  present  couple  of  the  same name  had  heard,  the  living  couple  began  to  have criminal  intimacy  with  one  another.  Like  two lovers  who  come  in  contact  after  long  parting,  she passed  some  days  alone  in  the  enjoyment  of  the company  of  her  paramour.  The  King  s  subjects who  were  eye  witnesses  to  this  scandalous  affair reported  it  to  the  just  King.  

On  hearing  which,  he waxed  exceedingly  wroth  and  caused  the  stray couple  to  be  sunk  into  deep  waters.  Finding  that this  did  not  affect  them  in  the  least,  he  caused  them to  be  subjected  to  many  ordeals,  such  as  trampling them  with  rutting  elephants  of  fierce  tusks,  bathing them  in  flames  of  fire  and  beating  them  with hammers,  etc.  In  spite  of  the  infliction  of  all tortures,  they  did  not  evince  the  least  symptoms  of pain  but  merely  laughed  at  them,  eying  one another  with  one-made mind  as  they  sat  opposite.   

Note 44 :  It  may  be  remembered  that,  in  Ramayana,  Rama  revives  Ahalya  from the  state  of  stone  to  which  she  was cursed  by  her  husband  Gautama.   

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹