శ్రీ యోగ వాసిష్ఠ సారము - 58 / YOGA-VASISHTA - 58

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 58  / YOGA-VASISHTA - 58 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. బాలకోపాఖ్యానము - 1  🌻
  
ఒక అమాయక బాలుడు తన దాదిని ఒక మంచి కధను చెప్పమనెను. ఆ దాది యిట్లు చెప్ప దొడగెను.

ఒకానొక శూన్య నగరమున సౌందర్యవంతులు, ధార్మికులు, వీరులునగు మువ్వురు రాజపత్రులు గలరు. వారిలో ఇద్దరు ఇంకను జన్మించలేదు. మరియొకడు తల్లి గర్భమున ప్రవేశింపలేదు. దైవవశమున, బంధువులు మరణించుటచే, దు:ఖతులై అందలి శూన్య నగరము నుండి మరియొక నగరమునకు బయలు దేరిరి. ఆ సుకుమారులైన ముగ్గురు రాజకుమారులు, శూన్యనగరము నుండి ఎండలో బయలు దేరుటచే,అవేడికి తపించిరి కాళ్ళుకాలినవి. అప్పుడు కొంత దూరము వెళ్ళిన తదుపరి మూడు వృక్షములను జూచిరి. 

అందులో ఒకదానియందు వారు విశ్రమించిరి. అచట వారు దాని ఫలములను భుజించిరి. ఆకలి తీర్చుకొని కొంత విశ్రమించి, మరల బయలుదేరిరి. కొంత దూరమెళ్ళిన తదుపరి వారికి మూడు నదులు కనబడినవి. అందులో ఒక దాని యందు జలము శుష్కించియె యుండును. మిగిలిన రెండింటియందు అసలు జలమేమియు వుండదు. ఆ జలము లేని నది యందు, ఆ మువ్వురు స్నాన మొనర్చిరి. జలపానము చేసిరి.

సూర్యాస్తమయమున వారు ఒక భవిష్య నగరము, ఎత్తైన భవనములు గలది చేరిరి. అందు శ్రేష్ఠమైన మూడు భవనములు గాంచిరి. వానిలో రెండింకను నిర్మించ బడలేదు. మూడవ దానికి గోడలు లేవు. ఆ గోడలు లేని భవనమున ముగ్గురు నివసించి, అచట మూడు సుందరమైన పాత్రలు జూచిరి. రెండు కపాలముల వలెను. మూడవది చూర్ణమై యుండెను. 

ఆ చూర్ణ పాత్ర వారు అన్నమును ఇతర సంభారములు వండిరి. ముగ్గురు బ్రాహ్మలను భోజనమునకు పిలచిరి. ఇరువురికి దేహము లేదు. ఒకరికి తల లేదు. ఆ తల లేని బ్రాహ్మణుడు, ఆ మువ్వురు రాజ కుమారులు భోజనమును పూర్తి చేసిరి. తదుపరి రాజపుత్రులు, ఆనగరమున వేటాడబోయిరి. వారు నేటికిని సుఖముగ నుండిరి. 

ఆ కధ విని బాలుడు సంతసించెను. ఈ కథ వలన రామా! జగత్తంతయు, మనోవికల్పము మాత్రమే ననియు తెలియుచున్నది. ఈ కన్పించిన దంతము, సంకల్ప మాత్రమే కాని అన్యము కాదు.

వాస్తవమునకున్నది లేనిది కాని, అనిర్వచనీయము గాని, యగును. అలాగే స్వర్గ, పృధ్వీ, ఆకాశ, వాయువు, పర్వత, నదులన్నియు స్వప్నమువలె సంకల్ప రూపములే పరమాత్మ నుండి మొదట సంకల్ప మాత్రముదయించి, పిమ్మట ఈ జగత్తంతయు విస్తరించినది. కావున నిర్వికల్ప సమాధి నాశ్రయించి, సంకల్ప త్యాగమాచరించిన, నిశ్చయముగ, విశ్రాంతి లభించును.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 58 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 28  🌴

🌻 4.  THE STORY  OF AINDHAVA  THE  SON OF INDU OR THE MOON - 1 🌻

🌷 Summary:  
The  author,  having  in  the  previous  story shown  that  the  light  of  Brahman  alone  is  Jiva  and others  now  gives  this  story  to  exemplify  the  fact that  its  (Brahman‟s)  manifestation,  namely,  the mind  alone is the  universe.  

From  the  foregoing  story  it  is  evident  that  Brahmic Reality  which  is  the  one  Truth  alone  is.  All  the visible  objects  do  not  really  exist.  The  mind  alone shines  as  the  cause  of  all  the  manifold  created objects.  To  illustrate  this  (last  proposition  that  it  is the  mind  which  makes  the  universe),  I  shall  relate to  you,  Oh  Rama,  a  story  which  you  shall  presently hear.  You  shall  then  be  impressed  with  the  firm conviction  that  the  potency  of  Jnana  alone manifests  itself  as  this universe.  

This  puerile Manas which  ever  rises  and  falls  with  the  ebb  and  flow  of desires,  fancies  this  illusory  universe  to  be  true through  its  ignorance;  but  if  it  should  be  informed of  the  real  nature  of  this  world,  then  it  will  cognize it  to  be  Brahman  itself  and  pains  will  bid  adieu  to such  a  mind.  Should  the  mind  be  subject  to  the trammels  of  the  heterogeneous  modifications  of love  and  other  desires,  then  it  tends  to  rebirth,  but a  freedom  from  their  thraldom  is  emancipation.   

Once upon  a  time,  Lord  Brahma  rose  up  at  dawn of day  wishing  to  generate  afresh  a  new  creation, after  having  been  refreshed  by  his  sleep  over  a night  (of  his),  when  the  whole creation  was  merged in  the  one  Fount.  For  this  purpose,  he  surveyed  the Akasa  which  began  to  pervade  everywhere through  his  mind;  and  lo,  that  Akasa  became  filled with  all  kinds  of  motley  creations. 

 Marvelling  over the  event  and  longing  to  know  its  author,  he pointed  his  finger  at  one  of  the  suns  therein  to approach  him  and  inquired  of  him  as  to  the authorship  of  himself  and  all  the  universe.  Where upon  the  sun  paid  due  respects  to  Brahma,  and said  thus,  „If  even  you  Brahma,  the  cause  of  this endless  universe,  do  not  know  it,  I  shall  try  to  give it  out  as  far  as  I  can.  

There  is  a  noble  country answering  to  the  appellation  of  Suvarnatala (golden  seat)  in  a  part  of  the  extensive  Jambu- dwipa  situated  on  the  Kailasa  hills.  It  abounds with  creations  that  are  all  your  offspring.  In  it, there  lived  a  noble  Brahmin  rejoicing  in  the  name of  Indu  (the  moon)  and  tracing  his  lineage  to Kasyapa,  the  Rishi.  Not  blessed  with  any  offspring, he  and  his  spouse  with  an  agitated  heart  resorted to  Kailasa,  the  abode  of  Parameswara  and underwent  severe  Tapas,  tasting  water  alone  and being  as  fixed  as  a  tree. 

 Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹