శ్రీ యోగ వాసిష్ఠ సారము - 72 / YOGA-VASISHTA - 72
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 72 / YOGA-VASISHTA - 72 🌹
రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సప్త జ్ఞాన భూమికలు - 4 🌻
అపుడు తుర్యగ్ అను ఏడవ భూమికను పొంది, యోగి అభిలషిత పదార్ధ ప్రాప్తిచే ప్రసన్నుడగును. ఇచ్చారహితుడై ప్రారభ్ధ కర్మానుసారము లభించిన దానిని మాత్ర మనుభవించును.
ఓ రామా! నీ వెల్లపుడును సమాధి స్ధితుడవై యుండుము లోకసంగ్రహార్ధము, వ్యవహార మొనర్చుము. అట్టి ఆత్మ స్వరూపము గల నీకు దు:ఖముగాని, విషయ సుఖముగాని, జనన మరణములు గాని లేవు. పంచ జ్ఞానేంద్రియములకు, తోచున దంతయు ఆత్మయె. ఆత్మకు అన్యమేవియు, ఈ ప్రపంచమున లేదు.
ఈ పరాత్మయె, సర్వప్రాణి కోట్ల యొక్క, అంతరాత్మయగు బ్రహ్మమని చెప్పబడును. అతని నెరింగిన ఈ జగ మంతయు, యెరుంగ బడును.
ఆకాశము కంటె అతి నిర్మలమగు, ఈచిదాత్మ యందె ఈ జగత్తు ప్రతిభింబించుచున్నది. దేహము ఛేదింపబడినను, అఖండ మగు చైతన్యము ఛేదింపబడదు. జ్ఞాని యొక్క, అజ్ఞాని యొక్క ఆత్మ, దేహముండినను, నశించినను, ఆత్మ ముల్లోకము లందును, యధారీతతిగ నుండును. సంకల్ప నాశముచే చిత్తము క్షయించగా, ససార మోహమును, స్వయముగ నశించును.
ప్రధమమున సమస్త ప్రాణుల యొక్క సమిష్టి కర్మరూపమును, సమిష్టి క్రియాశక్తికి, ప్రధానమగు మనస్సు ఆవిర్బవించుచున్నది.
పిదప బ్రహ్మ దేవుని మనంబు నుండి, యుత్పన్నమైన, మనస్సాదులు, దేహము ధరించి, వివిధ నామ యుక్తమగు, యీ మిధ్యా జగత్తును విస్తరింప జేయుచున్నవి. కాన సమిష్టి వ్యష్టి భేదములచే కల్పిత మగు నీ జగత్తంతయు, మనో మాత్రమే అగును. ఈ మనస్సు అసత్తగు అజ్ఞానము యొక్క కార్యముగాన, నదియు అసత్తే అగును.
కాన వాక్కునకు విషయమగు ఈ దృశ్య మాత్రమంతయు, మిధ్యయె యగుటచే, సచ్చిదానంద స్వరూపమగు పరిపూర్ణ బ్రహ్మమే, అవికృత రూపమున, సదా నెలకొనియున్నదని తెలియుచున్నది.
🌻. ఉత్పత్తి ప్రకరణము సమాప్తము 🌻
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 72 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 42 🌴
🌻 9. THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 3 🌻
Therefore you should, through your Atma-Jnana mind, avoid the mind which runs in the direction of objects; and progressing higher up, should, without any despondency of heart, accumulate wealth for that imperishable Supreme Seat. Like an emperor who brings under his sway all kings on earth, the fluctuating mind should be brought under the perfect control of the non-fluctuating mind and then the latter reaches its own state which is the Supreme one.
In this ocean of Samsara, those only find a safe asylum in the vessel of their mind who are conscious of their being- whirled about in this Maelstrom of life with the grip of the crocodiles of desires fully upon them.
Let not your heart give away under your trials; but having- done away with the impure mind through the pure mind, befriend the latter and make your Atman rest in its blissful state. Will your mind progress through anyone else? Certainly not! Whatever pains or impediments to progress arise in the mind, there at the very moment they should be crushed out of existence; then is the destruction of Maya accomplished.
Having divested yourself of all longings for enjoyments and conceptions of heterogeneity as well as the two, Bhava (existence) and Abhava (non-existence), may you enjoy Elysian bliss without any the least stain. Should all longings for visibles cease, then such an abnegation of mind is itself the destruction of Ajnana or the mind. Desires of objects are themselves pains; but non-desires are themselves Nirvanic bliss.
Such bliss is generated through one s efforts only. The knowledge of the ignorant which makes them conceive the world to be real, while it is illusory and exists but in name, is dissipated as unreal when they cognize all things to be Consciousness per se.
At these words of Vasishta, Rama queried him thus „How can this ignorance which fructifies out of the wealth of Avidya in this world, be effaced clean off from here? Please favour me with your elucidation on this point.‟ To which Vasistha of powerful Tapas replied thus. If the eternal Atman is hurled on the slopes of the hills of dire re-births, beset with the sharp thorns of excruciating pains, and if Maya which is associated with the Atman there be seen as real, then it is certain that no Tatwic Vision (or vision of the Reality) will arise.
If the allpervading transcendent Reality, after the Avidya of re-birth is crossed, should begin to illumine a person, then it is he will perceive objectively that desires are the form of perishable Maya and that the mere extinction of Maya is Moksha. With the extinction of the base Sankalpas, there is the extinction of Avidya. With the drawing of the sun of Jnana in the heart, the gloom of Ajnana is at once dispersed.
Here Rama interposed and said, „You were pleased to say that all visible things are but Maya; also that Maya will perish without any hindrance through Jnana or Atmic meditation. What is Atman?‟
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment