శ్రీ యోగ వాసిష్ఠ సారము - 69 / YOGA-VASISHTA - 69
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 69 / YOGA-VASISHTA - 69 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సప్త జ్ఞాన భూమికలు 🌻
అంతట శ్రీరాముడు సప్తజ్ఞాన భూమికలను గూర్చి వసిష్టుని ప్రశ్నించెను.
వసిష్టుడు యేడు అజ్ఞాన భూమికలు, యేడు జ్ఞాన భూమికలు కలవని చెప్పెను స్వాభావిక ప్రవృత్తి రూపమగు, పురుషప్రయత్నము, విషయ భోగములను రెండు అజ్ఞాన భూమికలు స్థితికి కారణమని, అవి క్రమముగ సంస్కారమునకు కారణమగును. అధోలోకములు యేడును, సంసార, దుఖ:స్థితికి; ఊర్ధ్వలోకములు యేడును, సత్వగుణ ప్రధానులై, జ్ఞానముతో ఆనంద స్థితిని పొందును.
అజ్ఞాన భూమికలు, బాహ్య విషయ ప్రవృత్తిగల్గి, దేహమందు, అహంభావమును పొంది యుండుటయె అజ్ఞానము, ఇది దు:ఖ హేతువు.
స్వస్వరూపమైన, ఆత్మ స్థితి నుండి మరలి, విషయములందు లగ్నమగుటయే అజ్ఞానము. చిత్తము ఒక పదార్దము నుండి మరి యొక పదార్దమునకు, మరలినపుడు, మధ్యనుండు స్థితి, అనగా మనన రహితమగు శుద్ద చైతన్యము యొక్క స్థితియె, స్వస్వరూప స్ధితి. ఆస్థితిలో సంకల్ప వర్జితము, నిద్ర, జడత్వ రహితము, అచంచలమునగు చైతన్య స్థితియె స్వస్వరూప స్థితి. అదే ఆత్మస్థితి.
అజ్ఞానము యొక్క వివిధ భూమికలు (1) బీజ జాగ్రత్తు (2) జాగ్రత్తు (3) మహాజాగ్రత్తు (4) జాగ్రత్ (5) స్వప్నము (6) స్వప్న జాగ్రత్తు (7) సుషుప్తి అను ఈయేడును అజ్ఞాన భూమికలు. ఇవి పరస్పరము మిళితములై అనేక విధములుగనున్నవి.
(1) బీజ జాగ్రత్తు: జాగ్ర దవస్థకు బీజభూతమును అగు ప్రధమ చైతన్యమే బీజ జాగ్రత్ అనబడును. అనగా జాగ్రదవస్త యొక్కయు, సుషుప్యాంతము వరకు, అజ్ఞానోపహితమగు చైతన్య స్థితియె బీజ జాగ్రత్త అనబడును. ఇయ్యది జ్ఞప్తి యొక్క నూతన అవస్థయగును.
(2) జాగ్రత్‌స్ధితి : బీజ జాగ్రతస్ధితికి పూర్వము, ఈ భోగ పదార్థములు నావియనునట్టి, ప్రతీతియె జాగ్రత్ అనబడును. దీని యందు జీవునకు పూర్వకాల స్థితిని గూర్చిన భావన లేదు. ఈ దేహము, ఈగృహములు నావియను జాగ్రత్ ప్రత్యయములు, పూర్వ జన్మపు ధృఢ సంస్కారములచే నుదయించును.
3. మహాజాగ్రత్ : ఈ జన్మమందుగాని, పూర్వ జన్మ మందుగాని గావింపబడిన అభ్యాసముచే దృఢపడిన సంస్కారములచే స్ఫురించునది జాగ్రత్ అనబడును.
4. అభ్యాసము లేకపోవుట లేక అధృడ అభ్యాసముచే, లవణుడు పూర్ణముగ తన్మయుడైనట్లు గల్గు జాగ్రత్ స్ధితి యందలి, మనో రాజ్యమే జాగ్రత్ స్వష్టి మనబడును. అభ్యాసముచే ఈ స్ధితి క్రమముగా జాగ్రత్ దశ నొందును గాన నిది జాగ్రత్ స్వప్నమనబడును.
5. స్వప్నము నిద్రామద్యమునగాని, నిద్రాంతరమునగాని, నిద్రయందుగాని, అనుభవించిన, పదార్ధములను గూర్చి నేను దానిని స్వప్నములో గాంచితిని, అది ఆసత్యము కాదు. అనుభవమునకు హేతువే స్వప్నము.
6. స్వప్నజాగ్రత్, చిరకాల స్ధాయిత్వ కల్పనచే హరిచ్చంద్రునకు, ఒక రాత్రి పండ్రెండు సంవత్సరములుగ తోచినట్లు, జాగ్రత్ రూపముగ, వృద్ధి పొందినదియు మహాజాగ్రత్ స్ధితిని బడసి నట్టిదియునగు స్వప్పము, స్వప్న జాగ్రత్ అనబడును.
7. పైన తెల్పిన ఆరవస్ధలను పొందిన, జీవుని యొక్క జడస్ధితి భావికాలమున దు:ఖమును కలుగజేయు వాసనలచే పూర్ణమై యుండి సుషిప్తియనబడును. ఈ స్ధితి యందు జీవుడు తృణ, శిలాది, పరమాణు వస్తువుల వలె జీవుడా జఢరూపమున నుండును.
పలువిధ రూపములు గల్గిన వీనిలో మరలనొక్కొక్కటి అనంతశాఖలుగ నుండును. చిరకాలము రూడి చెందిన జాగ్రత్ స్వప్నము, జాగ్రత్ అవస్థ యందే పరిసమాప్తిని పొందును.
సంసారము దీర్ఘ కాల పర్వంతము స్వప్న జాగ్రత్ రూపమున నుండును. అఖండమగు బ్రహ్మము, ఆత్మ దర్శనముతో అజ్ఞానం తొలగించి, జ్ఞానము నొసంగుటకు ఈ సప్త భూమికలు తోడ్పడును.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 69 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 39 🌴
🌻 8. THE STORY OF A SIDDHA - 4 🌻
„In order to survive this shock, I and my wife abandoned my country under the scorching rays of the sun, myself bearing two of my children on my two shoulders and the third on my head. Having crossed my country I saw a big Palmyra tree under the shadows of which I dismounted my children and rested myself along with my wife for some time, like one who, having crossed the terrible hell of vicious deeds, enjoys the happiness resulting from his past good deeds.
There my wife expired in the very embrace of her children, having been quite jaded through dotage and the efforts of a long travel under a tropical sun, though to all appearances she was like one, faint or asleep. At this, my heart gave away. One of my younger children mounted on my lap without a wink of sleep and weeping incessantly with his two eyes ever trickling down tears, demanded of me flesh and blood to eat, as he was unable to endure his hunger. Unable to find out any means to appease the hunger of him who was greatly distressed with it in my very presence, I was like a lifeless carcase ignorant what to do.
Thus did the piteous and incessant weeping of my boy break my heart and the misgivings about his life rise to a certainty in m?. Therefore I resolved to put an end to my life, by rearing a great forest fire and falling into it. Thus I approached the flames and rose up to fall into it, when I tumbled down from the throne here and woke up to see you, courtiers, uplifting me and pronouncing the words Jaya, (victory to you) Jaya (victory to you) and to hear the sound of musical instruments herein. Thus did I find myself here not as a Neecha but as the king Lavana.
I lost my senses only through the fascinating power of this Siddha. Now I have learnt that the ego of man has different states of experiences to undergo.‟ Whilst he was saying thus, the ministers in Court enquired as to who this Siddha was, whereupon Sambarika, the Siddha disappeared from view then and there, in the twinkling of an eye.
Vasistha continued.
This personage is no other than the Divine Maya, sent here to illustrate clearly the fact that this universe is no other than the mind itself. Know also, oh valiant Prince, the wise say that the self-light of Parabrahman alone is, appearing as mind or this universe.
End of Chapter 8
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment