శ్రీ యోగ వాసిష్ఠ సారము - 55 / YOGA-VASISHTA - 55
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 55 / YOGA-VASISHTA - 55 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. మనస్సు - దృడ సంకల్పము 🌻
పరమాత్మచే మొదట కల్పింపబడిన మనస్సు, కర్మ లేక యుండదు. మొదట సూక్ష్మ రూపమున, మనస్సు కర్మలు కలసి, సంస్కారములుగ రూపొంది, తదుపరి స్ధూల కర్మలు ఆచరించబడును, ఎవరు ఎచట ఏ రూపమున నున్నట్లు కల్పన చేయునో అట్టి రూపమును పొందును.
కర్మయే బీజము. మనోగతియే శరీరము మనస్సు, అహంకారము, చిత్తము, కర్మము, సంస్కృతి, వాసన, విద్య ప్రయత్నము, స్మృతి, ఇంద్రియములు, ప్రకృతి, మాయ, క్రియలు అనుపదునైదును పరబ్రహ్మము యొక్క, బాహ్య విషయక, చిత్ శక్తి నామాంతరములే. మిధ్యయగు దేహ మాత్మాభి మానము కల్గి, స్వయముగ కల్పన ఎపుడొనర్చునో అపుడది అహంకారమై, బంధహేతువగును.
మనోరూపము పొందిన చైతన్యము; వినుచు, స్పృజించుచు చూచుచు, ఆస్వాదించుచూ, సంకల్పించు చున్నట్లు, భోగాను భవ కార్యములు ద్వారా జీవత్వమును పొంది, ఇంద్రుడను పేర పరమేశ్వరుని తృప్తి పర్చునవియె, ఇంద్రియములు. సత్యమును మిధ్యగను, మిధ్యను సత్యముగను దోపింపజేయు చైతన్యమే మాయ.
దర్శన, శ్రవణ స్పర్శ, రస, ఘ్రాణాది కర్మలు ఒకే రూప మొందునది క్రియ. జీవుడు మనస్సు, బుద్ధి, చిత్తమను దేహ సంబంధములు కల్గిన చిద్వస్తువు. ఈ మనస్సు జఢము కాదు, చేతనము కాదు. దీనిని అహంకారమనియు, బుద్దియనియు, జీవుడనియు నందురు. మనస్సొకని మతము ననుసరించి జడమును, మరియొక మతము ననుసరించి, జీవునకు భిన్నమును అగుచున్నది.
మనస్సు ఏకరూప మెపుడగునో, అనగా భ్రాంతులను త్యజించి, బ్రహ్మాకారమగునో, అపుడే జగత్తు కూడ నశించును. జీవునకు చిత్తము లయించిన, జగత్తున్ను నశించును. కాల మొక్కటేయైనను, ఋతుభేదముచే, వివిధ రూపములు ధరించినట్లు మనస్సు వివిధ కర్మలచే వివిధ నామములు ధరించుచున్నది.
బ్రహ్మరూపమే అయిన ఈ మనస్సు, జగదాకృతిని బడసె, ఒక చోట మనుష్య రూపము వేరొక చోట, దేవతా రూపమును పొందుచున్నది. అలానే దైత్యరూపమును, యక్ష రూపము, గంధర్వ, కిన్నెర రూపములను పొందుచున్నది.
ఆత్మ సర్వ వస్తువుల కతీతము, సర్వవ్యాపియునై, దాని కృప వలననే మనస్సు లోకమున పలువిధముల విజృభించుచున్నది. ఆత్మ విచారముచే, మనస్సు లయించును. తదుపరి మోక్ష ప్రాప్తి కల్గును.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 55 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 25 🌴
🌻 3. THE STORY OF KARKATI 🌻
At these words of the king, the lady came to understand that they were persons of unlimited Jnana, knowledge, power and quiescence of mind. Then in extreme marvel at their noble words and stainless truth, she muttered to herself thus „A stainless mind can be judged through speech, face and eyes.
Through those expressions, can their opinion also be well gauged. Those, whose doubts (about the higher spiritual path) have not been cleared along with the love of wealth, should be classed under the inferior class of the ignorant.‟ Then addressing these two grandees, she queried them as to who they were.
The minister replied thus to the questions put by Karkati „(Pointing to the personage near him), he is the King of hunters and I am his Minister. Nightly do we patrol everywhere to punish the vicious and protect the virtuous. On that mission it is, we have wended our way thither.‟
Whereupon Karkati said thus „With the counsels of a wicked minister, a good king too is turned into bad ways; even a bad king becomes virtuous, if counselled by an honest and virtuous statesman. Conversely, a wise King generates a good minister.
Therefore when a king is counselled by a statesman of great discrimination, what blessings will he not achieve? As is the king, so will be his subjects. Those only are qualified to be kings or ministers who have developed nobleness of disposition, equal vision over all and a profound study of Jnana works. Otherwise they are not worthy of discharging such duties.
Therefore, if you are not well versed in these Jnana books, you will have to replenish my stomach and thus forfeit all chances of enjoying your youth. I will now enmesh you both, who are like two lions, in the cage of my questions. Now try to unlock their portals with the keys of your discrimination. Else, you will not be able to outlive that period.‟ On the King asking her to state the questions, the lady rained her queries on them both like ambrosia.
Muni Vasistha continued Oh Rama! Listen attentively to the questions proposed by the Rakshasa lady. They are the following:
(1) What is that atom which is the cause of the origin, preservation and destruction of the myriads of heterogeneous universes springing up like so many bubbles on the surface of the ocean?
(2) What is that which is Akasa and yet is not?
(3) What is that which, though it is unlimited, has yet a limit?
(4) What is that which though moving, yet moves not?
(5) What is that which, though it is, yet is not?
(6) What is that, which manifests to itself as Chit (con sciousness) and is yet a stone (or inert)?
(7) What is that which portrays pictures in the Akasa?
(8) What is that atom in which are latent all the microcosms, like a tree in a seed?
(9) Whence do all things originate, like volatility in water, being non-different from that cause like the tidal foams in the ocean?
(10) And in what will these two (volatility and water) become merged as one?
„If you are able to solve these riddles through your intelligence, then you can aspire to a seat on my head, like fragrant blossoms gracing my locks. Otherwise, if you muddle yourself over these questions through your obtuse head, you will but serve as a fuel for the gastric fire blazing in my stomach.‟
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment