శ్రీ యోగ వాసిష్ఠ సారము - 65 / YOGA-VASISHTA - 65
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 65 / YOGA-VASISHTA - 65🌹
✍️ . రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. మనస్సును జయించు - 2 🌻
ఈ దృశ్య మానమగు ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు, దేహసంబంధములగు, గృహ, ధన, క్షేత్రాదులే, మనస్సు యొక్క వివిధ అంగములు. ఈ అంగములు భావింపబడకయున్న ముక్తియె! శరత్కాల మేఘముచే, వాయువు నశించునట్లు, సంకల్ప రాహిత్యముచే మనస్సు నశించుచున్నది.
ఏ మహాత్ములీ మనస్సును, నశింపజేయుదురో వారే సర్వోత్తము లనబడుదురు. విపత్తులకు మూలకారణము సంకల్పములే. ప్రళయవాయువులు వీచినను, సముద్రములన్నియు పొంగి ఏకమైనను, అమనస్సునకేమియుకాదు. మనస్సను బీజము నుండియె, సఖదు:ఖరూపములగు శుభాశుభములు, సంసార వృక్షము ఆవిర్భవించుచున్నది.
ఐతే ఓరామా! కేవలము మన స్సంకల్ప సామ్రాజ్యమున, ఉత్తమ ఆత్మ పదమను సింహాసనము నధిష్టించుము. మనస్సు సంకల్పించిన లక్షల కొలది బ్రహ్మండములను, కుటీరములను, చిదణువునందు, వేర్వేరుగ, విస్వష్టముగ, గోచరింప జేయగలదు.
ఓరామా! సంకల్ప మాత్రమున, అనేక బ్రహ్మండముల నుత్పన్నము చేయునదియు జనన మరణాది పెక్కు అనర్ధములను కలుగజేయునదియునగు నీ మనస్సును సంతత అభ్యాసముచే సిద్ధించు, తృష్ణా రాహిత్యముచే జయించి, సర్వోత్తమమగు జయమును పొందుము. కావున ఓరామా! నీవు పరమ పవిత్రమును అమనస్కమును, అ హంకార వర్జితమును, దు:ఖ రహితమును, శాంతమును, జన్మాది వికార శూన్యమును అగు ఆత్మ పధమును పొందెదవుగాక.
ఓరామా! జలము నందు బుద్బుదములు నిమిత్తము లేకయె స్వభావముగ నుత్పన్నమగుచు, నశించుచుండును. అట్లు మనస్సు యొక్క తీవ్ర వేగత్వమున్ను, యుత్పన్నమగుచు నశించుచుండును. శీతలత్వము మంచు యొక్కయు, నలుపు తనము కాటుక యొక్కయు గుణమగునట్లు, సంకల్పముయొక్క తీవ్రత తీవ్రమగు చంచలత్వమే, మనస్సు యొక్క రూపము. అగ్నికి ఉష్ణత్వమువలె, చంచలత్వమే మనస్సు యొక్క ధర్మము. చైతన్యము యొక్క స్వరూపమగు, చిత్తతత్వ మందున్న, జగత్కారణమగు చంచల క్రియా శక్తియె.
మానసిక శక్తి చంచలత్వ రహితమైన చిత్తము, నశించినట్లే. మనోనాశమే తపస్సునియు, మోక్షమనియు, శాస్త్ర సిద్ధాంతము. మనస్సులయింపగనే, దు:ఖము నశించును. మనస్సు స్పురించిన దు:ఖము మొదలగును. వాసనలకు తావగు ఈ మనో చాంచల్యమే యవిద్య. ఇద్దాని నాత్మ విచారముచే, నీవు నాశన మొనర్చుము. సత్ అసత్తులను; జఢ చైతన్యములకు మధ్య రూపమే మనస్సు. చిద్వస్తు చింతన యొక్క దృడాభ్యాసము చేత, చిత్తము చైతన్యముతో నేకమగును. పురుష ప్రయత్నముచే, చిత్తము దేనియందు నియోగింపబడుచున్నదో, అది దాని రూపమునే అభ్యాసమున పొందుచున్నది.
అందువలన పురుష ప్రయత్నముచే చిత్తమును, చిత్తముచేజయించి, దు:ఖ రహిత ముగు, నాత్మపధóమును ఆశ్రయించి, నిశ్చలముగనుండుము. సదా మనో నాశన క్రియయందే, సం లగ్నుడవై యుండుము. బలాత్కారముగ మనస్సును విషయములనుండి, విముఖమొనర్చుట వలలనే, మోక్ష ప్రాప్తి లభించును. రాజును జయించుటకు రాజే కావలయును. అట్లే మనస్సును జయించుటకు మనస్సే కావలయును.
మనస్సు ఆత్మకు బంధనము. ఆ బంధమును విడిపించునది కూడ మనస్సే. ఉష్ణత్వము శమించిన, అగ్నియు శమించునట్లు, వాసనలు నశించిన మనస్సు నశించును. అట్టి వాసనా క్షయ మొనర్చవలెనన్న, ఆత్మసాక్షాత్కారమే మార్గము. చిత్తము ద్వారా పొందే అనుభవములను, అనుభవించకుండుటయే మనోనాశమునకు మార్గము. ఈ విషయానుభవ రాహిత్యము, స్వప్రయత్నముచే క్షణములో సిద్ధించును.
కాన అట్టి ప్రయత్నము, నిత్యము అభ్యసించవలెను. మనస్సు యొక్క అజ్ఞాన వాసనల బీజము కూడ త్యజించి, నిత్యతృప్తుడవై, యిక విషయ జనిత హర్షశోకములను ఎన్నటికి పొందవలదు. ఈ ప్రపంచమున బ్రహ్మతత్వ మొక్కటి తప్ప అన్యముగు భావము, అభావములు ఏవియు లేవు. తరంగయుక్తమగు విశాల సముద్రమున జలము తప్ప మరియొక పదార్ధమేదియు లేదుకదా!
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 65 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 35 🌴
🌻 7. THE STORY OF A BALA (LAD) 🌻
🌷 Summary:
Through this story, it is sought to be shown that persons without Atmic enquiry will see, as real this world which is nothing but of the nature of Sankalpa.
The stainless mind of Jnanis is no other than the ever-imperishable Brahman that has all saktis (potencies) and is ever full. Nought else is but that One. There is nothing which is not found in this Brahmic Reality. This indescribable Reality manifests itself as the many. Out of the infinite potencies in it, arises at one time one potency. This Jnana Sakti of the stainless Brahman then manifests itself as in the perishable bodies.
The different Saktis producing fluctuation, hardness, heat, voidness, moisture and destructiveness in Vayu, stone, fire, Akasa, water and Pralaya are no other than the one Brahmic potency latent in Brahman like trees in seeds. They appear multiform like the plants, etc., on this earth variegated by dint of time, space, etc. It is only the Brahmic Reality that is always and everywhere.
It is only that Brahman which manifests itself as Manas through contemplation or as the Jivatman subject to bondage or as the emancipated Paramatman as well as the universe and the many Saktis in it. All the Vikalpas of the world seem to be as real to men as the tales narrated to a fickle child by its mother.
At these words of Vasistha, Rama of lotus-hands who was like a cloud raining his bounty upon all, wished to be acquainted with that story. Whereupon the Rishi of rare Tapas began thus this story of mind s illusions:
A certain lad that had not yet attained discretion prayed to his mother to tell a tale for his diversion. Whereupon she related, as if true, the following entirely mythical story. Once upon a time three princes of unflinching bravery and good qualities resided in a city called void.
Of these three, two were never born and the third never went into any womb to be generated. These triumvirs bent upon the acquisition of all, rested in the forest of Akasa, full of countless fruits and having allayed their keen hunger by feeding themselves upon the delicious fruits therein, went on their way up- There they witnessed three rivers with dashing waves, winding their way on the out-skirts of that forest.
Of these three rivers with speedy current, two had no water in them, while in the third the dry white sands were quite visible on its surface. In this last river they bathed and drank its waters. At sun set they retired to a town to rise thereafter (and not then in existence) and there built three houses. Of these three houses, two did not at all exist. The third one did not rejoice in the possession of any encircling- walls or wooden superstructure.
The three princes went to reside in these three contiguous houses without any wall (or support). These three persons who abode in the three buildings in an invisible town in the Akasa, found three golden vases by them there. Two were tiles only, while the third was a mere pulverised one. They deposited, in this formless vessel, a quantity of rice equal to 6 measures minus I0 measures and cooked the same. Having done so, they meted it out to innumerable mouthless Brahmins.
After the Brahmins had thus filled their stomach to the brim, the three princes partook of the remaining meal as a God-send. Then delighting themselves with hunting and other pursuits, they spent their rime most joyfully therein.‟ When the mother thus concluded her story, her innocent child rested in the profound conviction of the genuineness of the mother s tale. Similarly do the ignorant conceive and observe this world to be really existent. The expansion of this mind alone is Sankalpa; and Sankalpa, through its power of differentiation, generates this universe. Therefore, Oh Rama, may you divest yourself of all Sankalpas and be a Nirvikalpa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment