శ్రీ యోగ వాసిష్ఠ సారము - 54 / YOGA-VASISHTA - 54
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 54 / YOGA-VASISHTA - 54 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సాత్విక, తామస, రాజస గుణ భేదములు 🌻
వసిష్టుడు రామునితో సాత్విక, రాజస, తామస గుణములు గల యుత్తమ, మధ్యమ, అధమ జీవుల యుత్పత్తిని గూర్చి తెలుపుచున్నాడు. పూర్వ కర్మ మందలి అంతిమ జన్మమందు జీవుడు శమ దమాది యుక్తుడైనను, బలవత్తరమైన విఘ్నముల వలన, జ్ఞాన ప్రాప్తి బడయకయున్న, ఈ జన్మలో జ్ఞాన ప్రాప్తికి యోగ్యులై, ఈ జన్మములోనే ముక్తి పొందుదురు.
వీరు ఉత్తమ జీవులు. తీవ్ర వైరాగ్యము లేని వారై పుణ్య లోక ప్రాప్తికి యుపాసనాదులు జేయుచు, శుభ కర్మలను జేయువారు. పది లేక పదిహేను జన్మలలో ముక్తిని పొందుదురు. వీరు మధ్యమ జీవులు. ప్రాపంచిక వాసనలు కల్గి, మలినాంత:కరణులై, సుఖదు:ఖములు, ధర్మాధర్మములను ఆచరించుచు, వేల కొలది జన్మలు ఎత్తువారు, అధములు.
వీరు క్రమముగా మార్చు చెందుచు సాత్విక, రాజస లక్షణములు కలవారు; రాజస, తామస లక్షణములు గలవారు, కేవలం తామసులైనవారు, వారి వారి కర్మానుసారము జన్మల నెత్తుదురు. చలించు సముద్ర జలమందు, తరంగము లుత్పన్నమగునట్లు, బ్రహ్మము నుండి జీవరాసులన్నియు, యుత్పన్న మగుచున్నవి. అలానే వృక్షము నుండి వివిధ శాఖలు యుత్నన్నమగునట్లు, సువర్ణము నుండి ఆభరణములు, సెలయేటి నుండి, నీటితుంపరలు, ఉత్పన్నమగునట్లు, బ్రహ్మము నుండి, జీవులుత్పన్న మగుచున్నవి.
ఇవ్విధముగ, ఉపాధి ననుసరించి, వివిధ జీవులు, బ్రహ్మము నుండి యుత్పన్నమగుచు, లయమగుచు, స్వర్గ నరకాదులు పొందుచు పరిభ్రమించు చున్నవి. కాని ఇదంతయు మిధ్యయె యగును. యదార్ధముగ యుత్పన్నముగాకున్నను. దైత్య, నాగ, మనుష్య దేవతలు వాసనా నిర్మితములగు, పాంచ భౌతిక విధులతో కూడి మరల మరల జన్మించుట జరుగుచున్నది.
కర్మ నిష్ఫలమైన, నరకాదుల భయము లేకపోవుటచే, మత్య న్యాయము అనగా బలమైన చేప బలహీనమైన వాటిని మ్రింగుట ద్వారా సర్వనాశనమగును. అందువలన కర్మ ఫలవంతమగునా లేదా అను విషయమును గూర్చి తెలుసుకొనుము అని ఇట్లు చెప్పెను. ప్రధమ సృష్టియందు పరబ్రహ్మము నుండి, మనోరూప మావిర్భవించి, తదనుగుణమయిన, వ్యష్టి సమిష్టి జీవుల కర్మలు ప్రకటితమయ్యెను.
మరియు జీవులు, పూర్వ కల్ప వాసనానుసారము, దేహ మందహంభావము కల్గి యుండిరి. పుష్పము, గంధములు వేరు కానట్లు; మనస్సు కర్మలు వేరు కావు. వాటి యందు భేదము లేదు. కర్మఫలము, పర్వతముపైన, ఆకాశము, సముద్రము, స్వర్గముపైనను తప్పదు. పురుష ప్రయత్నమొనర్చు కర్మ నిష్ఫలముకాదు. కాన కర్మ నశింపకుండుట నశించుట శాస్త్ర ప్రమాణము. నలుపు దనము లేనిచో, కాటుక లేనట్లు, కర్మ నశించిన, మనస్సు శాంతించును.
కర్మ నాశమే, మనోనాశము. మనస్సు నశించుటచే, కర్మ క్షయమగును. ముక్తులకే మనోనాశము కల్గును. అగ్ని వేడి కలిసియున్నట్లు, చిత్త కర్మలు విడదీయ రానివి.మనస్సు భావనా మాత్రము, చలస్వభావి. మొదట మనస్సుచే, నిషిద్ధ కార్యము లాచరించబడి, సంస్కారములుగ రూపొందుచున్నవి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 54 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 24 🌴
🌻 3. THE STORY OF KARKATI 🌻
As soon as Karkati saw these two passing in the forest, she reckoned upon a good repast in them. At first, she thought that they were ignorant persons without true Jnana and as such were productive of pains both in this and the higher worlds as also everywhere. On further reflection, she soliloquised to herself thus „According to the direction of Brahma, those who are not content with any things that come in their way are of weak minds only.
On the other hand, will anyone be so foolish as to injure those who are of illuminated mind and good qualities? Besides, will such virtuous persons suffer thereby? Such Illumined persons have undying fame, long life, and impartial bliss, worthy of being venerated by all. As they are more endearing to one another in their ranks than even their own lives, they will, even at their own risk, protect another amongst themselves. They have even the power to make their devotees get into the good graces of Yama and thus overcome him.
While even a Rakshasa lady like myself goes the length of worshipping the wise, who else will not do the same, like a fond dog? Like the full moon which protects this earth (and makes it appear gay), the wise will gladden the hearts of those visiting them. Persons not associating with such wise men will de base themselves and be but as men dead; otherwise they will attain the good effects of Moksha and others.‟ Thus therefore she came to the conclusion of testing them as to whether they were Jnanis or not.
With this purpose, she roared aloud (unperceived) in the Akasa outvying the thunder, with the following words „Oh ye who resemble the sun and the moon in the ineffable forest of Akasa, showering rain like clouds, Oh ye who are like the countless hosts of vermin writhing and perishing underneath the dark and terrible stone of Maya, have ye come here simply for the purpose of falling a prey to me this very instant?
Ye seem to me to be the wise ones, and yet it strikes me ye belong to the other class also. To which class then do ye belong?‟ At which the king thus addressed her „Oh Rakshasa lady, ever prone to injure all creatures, hear me. But where are you now? We listened to all the sounds you uttered like the buzzing of a young bee.‟
Thereupon the lady exclaimed „well done‟ and laughed aloud, standing before them. The king, observing her large form through the intense lustre of her large teeth, was not in the least appalled at the sight and said to her thus „Do not open wide agape your capacious mouth like the Mainaka (mountain) and afflict yourself thereby.
Whatever may be said by persons, who do not long after the fruits of actions, that such fruits are baneful and do not really exist, the light-minded are ever engaged in such light ones only; but the wise of great quiescence are bent upon the transcendent spiritual actions through their subtle intelligence.
Our valour is such as to blow away, like mosquitoes, persons of vicious proclivities like yourself. Therefore abandon all your impetuous foolhardiness. Please apprise us of your real intentions. We are able to confer, even in dream, any objects begged of us through intense desire by any person approaching us then.‟
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment