శ్రీ యోగ వాసిష్ఠ సారము - 63 / YOGA-VASISHTA - 63
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 63 / YOGA-VASISHTA - 63 🌹
✍️ . రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. మనస్సు 🌻
అంతట వసిష్ఠుడు రామునుద్దేశించి, ఇట్లు వివిధ రచనలచే వృద్ధినొందు ఈమనస్సే యన్నింటికన్నా ప్రధానమైనది. జ్ఞానవిచారముచే, ఇయ్యది వాసనారహితమై ఆత్మైక్యము పొంది పరమ శాంతిని పొందు చున్నది. ఇట్టి మిధ్యావ్యాపారమునే, భ్రాంతి ధృడ పడగా, చైతన్యము తన పూర్వరూపమును మఱచి, మనో రూపము నొంది, అనాది కాలము నుండి, జనన మరణాదులచే, విమోహిత మగుచున్నది.
ఓరామా! ఈ మనస్సు దూరమును సమీపముగను, సమీపమును దూరముగను నొనర్చుచున్నది. ప్రభలమగు వాసనయె, జీవుని మోహమునకు కారణము కావున, అట్టి వాసనను సమూహలముగ ఛేదించి పెరికి వేయవలెను. కావున నోరామా! మనస్సే మానవుడు కాని, తుచ్చమగు ఈ దేహము కాదు. దేహము జడము. మనస్సు జడము గాక చైతన్యముగాక, రెండిటికి విలక్షణమై యున్నది. ఈ జగత్తంతయు మనస్సే భూమండలము, ఆకాశము, పృధివి, వాయువు, మహత్తున్ను మనస్సేయగును.
ఎవని మనస్సు అజ్ఞానము చెందునో, యాతడే మూఢు డనబడుచున్నాడు. నాటక మందనేక రూపములు, నటుడు ధరించునట్లు, మనస్సు దేహమందు ఇంద్రియముల రూపమున వర్తించు చున్నది. ఈ మనస్సు అల్పమును అధికముగను; అధికమును అల్పముగను చేయుచున్నది. సత్యమును అసత్యముగను; శత్రువులను మిత్రులుగను చేయుచున్నది. ఇట్టి స్పురణవశముననే స్వప్నమందు, వ్యాకుల చిత్తుడై యున్న హరిచ్చంద్రున కొకే రాత్రి పండ్రెండు సంవత్సరములుగ తోచెను.
మనస్సు జయించబడిన, ఇంద్రియములన్నియు జయింపబడును.
మనస్సు తన కిష్టమైన వస్తువులు, తుచ్చమైనవి అయినను, అమృతతుల్యముగను; అమృతము వంటి అనిష్టవస్తు విషతుల్యముగను తోచుచున్నవి. మనస్సు ఇతర చోట్ల నిమగ్నమైయున్న, పంచ భష్యములైనను, రుచి తెలియుట లేదు. మనోరహితులగు మహాత్ములకు, అనగా వాసనలు నశించినవానికి, అప్సరస వంటి స్త్రీ సంయోగము సంభవించినను, వికారమేమియు కలుగకుండును.
సముద్రము నుండి తరంగాదు లుత్పన్నమగునట్లు, దేహాంతర్గతమున, మనస్సు నుండియె స్వప్నావస్తయందు పర్వత, నగరాదులుత్పన్నమగు చున్నవి. ప్రవాహము, బిందువు, తరంగము, నురుగు మొదలగునవన్నియు జలమునుండియె గలిగినవి. ఈ మనస్సు, జీవులంత రంగము లందు నున్నదై, జాగ్రత్, స్వప్నమయమగు, ఈజగత్తును విస్తరింప జేయుచున్నది.
లవణుడు రాజత్వము నుండి చండాలత్వము పొందినట్లు, చిత్తము దేవత్వము నుండి, యసురత్వమును; సర్పత్వము నుండి వృక్షత్వమును పొందుచున్నది. ఒక్కడే తన పత్ని యొక్క దృష్టి యందు పతిగను, తండ్రిదృష్టి నుండి పుత్రునిగను యగునట్లు; ఈ మనస్సు అభిలషిత రూపమును పొందుచున్నది. మనస్సు సంకల్పము చేతనే యుత్పన్నమగుచున్నది.
మనస్సు ఆకార రహితమైనను, చిరకాలాభ్యాసముచే జీవాకారమగుచున్నది. ఇది సంకల్పము నుండి జీవించి, సంకల్పము చేతనే, సుఖదు:ఖములను, భయాభయములను, ప్రాప్తినొందుచున్నది. ఎవడు తన మనమున, విషయ చింతనయను చాపల్యము లేక యుండునో. అట్టివాని మనస్సు బంధింపబడిన ఏనుగువలె, శాంతిచును. విషయభోగము లందు ప్రవర్తించు మనోవృత్తులే సంసారమను విషవృక్షము యొక్క అంకురములు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 63 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 33 🌴
🌻 6. THE STORY OF MANAS (MIND) - 2 🌻
Seeing him reel thus giddily many times, we (Brahma) caught him under our grip to free him from all fears and questioned him thus. „Who are you that thus art groaning under pains? What are you about here? And what is your intention?‟.
To which that person replied thus „All persons having the concept of I (and other differences) are nonexistent to me. I have not been able to find any actions for me to perform in this world. I am quite pained by the heterogeneous differentiations set up by you. You are my enemy, though paltry. It is only through you, that I have identified myself with the pains and pleasures, I have been suffering from.‟ Having said so, he cast a survey over his body.
His heart began to melt and he cried aloud with a thunder like sound. Desisting, in a moment, from his loud wails, he again cast his eyes over his beautiful form and laughed aloud for a long time, as if to burst open his belly. Then, in my very presence, he freed himself from the many fat bodies he had assumed (in the many births).
Through the force of dire destiny, another person was born in another spot. Like the former person, he appeared before us in a plight similar to the other and scourged himself, when I consoled him as previously. Then this wayfarer passed along his path and gave up that body.
Again did he come in another guise and in this life of his, he fell into that deep unfrequented well. We did not see him emerge out of that well for a long time. Then there appeared on the stage of this ever perturbed forest (this person as) another who, though he was greatly checked in his path and shown the road to true knowledge by us, spurned our advice and still persisted in his obstinate course of lashing himself as he went along.
Even now do such ferocious persons exist writhing under great pains and dwelling in such dire forests replete with sharppointed thorns and enveloped in such a thick gloom as to instil fear into all hearts. But wise men, even should they live in the midst of a fiery burnt-up forest, will regale and rejoice in it as in a cool flower garden wafting sweet odours.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment