శ్రీ యోగ వాసిష్ఠ సారము - 37 / YOGA VASISHTA - 37

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 37  / YOGA VASISHTA - 37 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
సమర్పణ 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. సృష్టిక్రమము, చైతన్యము  - 1 🌻

  
పరమ కారణమైన బ్రహ్మము నుండి, మొదట మనస్సు ఉదయించినది. మనస్సు నుండి భోగవస్తువులు ఏర్పడుచున్నవి. దృశ్యపదార్ధముల స్ధితి, మనస్సున ఆక్రమించియుండును. మనస్సు బ్రహ్మము కంటె వేరుగాదు. మనస్సు తరంగములవలె ఇటునటు మారుచున్నది. ప్రపంచములోని భేదములన్నియు, మనస్సు కల్పితములు. మనస్సు నాశనమైన భేదములు తొలగి, బ్రహ్మ యొక్కటియె మిగులును. 


అపుడు జీవుడు, మనస్సు, కర్త, కర్మ జగత్తు అను భేదము లుండవు. ఈ జగత్తు, చిత్తములు అనిత్యములై యున్నవి. అందువలననే అసత్యములు, అజ్ఞానికి సత్యముల వలె ప్రతిభాసించుచున్నవి. బాలుడు, భూతమును భావించుకొని భయపడినట్లు, అజ్ఞాని మనస్సు, జగత్తును గాంచుచు భ్రమించుచున్నారు. 


పరమాత్మ సృజనేచ్చ నుండి చిత్తమును, చిత్తము నుండి జీవత్వము, అందుండి అహంకారము, అహంకారము నుండి విషయ తన్నాత్రలు, అందుండి ఇంద్రియములు, ఇంద్రియముల నుండి దేహములు, దేహముల నుండి శోక మోహములు, వీని వలన స్వర్గనరకములు, బంధమోక్షములు బీజాంకురముల వలె గల్గుచున్నవి. 


చిన్మాత్ర, బ్రహ్మ, జీవుడు వాస్తనమునకు భిన్నములు కావు. అట్లే జీవుడు, చిత్తము, దేహము, కర్మలు వేరుకావు. దేహమునకు కర్మలు సహజము. అందువలన కర్మలే చిత్తమును, అహంభావమును, జీవుడు. ఇవన్నియు బ్రహ్మమే. ఒక దీపము నుండి పెక్కు దీపములు వెలిగించబడినట్లు, ఆ పరమాత్మ ఒక్కటియె నానా రూపముల వెలియుచున్నది. 

పరమాత్మ జ్ఞానము లభించిన, తక్కిన వన్నియు మిధ్యయని బోధపడగలదు. అపుడు శోకము తొలగి ముక్తి లభించును. భ్రాంతికిలోనై, చిత్తమే జనన మరణములను; బాల్య, యవ్వన, వార్ధక్యములను, స్వర్గనరకములను గాంచుచున్నది. బాలురు గుండ్రముగ తిరిగి ఆడుకొనుచు, జగత్తు తిరుగుచున్నట్లు భావించును. చిత్తపరివర్తన వలెనే ఈ విచిత్ర దృశ్యములు కనిపించును. 


కట్టెలు లేకున్న నిప్పు ఆరిపోవునట్లు, సమాధి అభ్యాసమున విషయ దర్శనము తొలగిపోవ చిత్తము నశించును. అపుడు జీవుడు కర్మల నొనర్చుచున్నను. ముక్తుడని చెప్పబడును. నిర్వికల్ప సమాధి యందు, చైతన్య ప్రకాశ మధికమై, చిత్తము నిర్విషయమగుచున్నది. అపుడు కర్తృత్వ భావము తొలగిపోవును. గాలికి స్పందన, చిత్తమునకు విషయములు సహజములు. విషయములు తొలగిన, చిత్తము నశించును. ఆత్మజ్ఞాన మొక్కటియె సంసారవ్యాధికి తగిన మందు.


ఆత్మజ్ఞాన మొక్కటియె సంసారవ్యాధికి తగిన మందు. బాహ్యదర్శనములు, అంతర వాసనలు, సమాధి వలన నశించి ముక్తిలభించును. కోరుకొను వస్తువులు బొందుటకు, ప్రాణములనే త్యజించునట్లు, యోగులు కోరికలను త్యజించి ముక్తులగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 37 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 7 🌴

🌻 1.  THE STORY  OF AKASAJA, THE  SON  OF AKASA 🌻

🌷 On  Videha  Muktas:  🌷

(Now  about  the  Videhamukti state).  Should  the  above  certain  state  be  bridged and  the  body  perish,  then  one  will  attain  Salvation in  a  disembodied  state,  like  the  all-permeating  air in  the  immovable  Akasa.  Its  nature  is  such  that  it  is imperishable,  unveiled,  invisible,  remote,  endless and  fluctuationless.  


It  is  neither  „I‟  nor  any  others nor  anything  else  (we  know  of).  It  is  neither  light nor  darkness  nor  motion  nor  evidence  nor  gunas nor  the  heterogeneous  objects  of  the  world compounded  of  the  five  elements.  May  you, through  they  discrimination,  cognize  clearly  and unfailingly  that  Non-dual  state  which  is  in  the midst  of  (or  above  the  knower,  knowledge  and  the known,  being  the  all-  full  reality,  neither  Rupa (form)  nor  Arupa  (non-form),  neither  Sat  (being) nor  Asat  (non-being) and  yet  one.   

On  being  questioned  by  radiant  Rama  as  to  a clearer  elucidation  of  Brahmic  Reality  replete  with Chidananda  (conscious  bliss)  in  order  that  Jnana may  develop  in  him  to  the  uttermost,  Muni Vasistha  went  on  thus  „During  the  period  of Mahakalpa,  the  cause  of  all  (imaginable)  causes, vis.,  the  Brahmic  Reality  shines  alone.  If  the modifications  of  the  mind  which  lean  to  sensual pleasures  be  destroyed,  then  Atman  divested  of  its Ahankara  (egoism)  becomes  the  unnameable Brahmic  (or  the  all-pervading)  Reality.  

The  Jivic consciousness  which  does  not  regard  (as  real)  the universe  before  it,  may  truly  be  stated  to  be Brahman  itself.  A mind  which,  though  enjoying  the diverse  objects,  does  not  yet  enjoy  them  may  be stated  to  be  Brahman  itself.  

That  consciousness which  is  a  witness  to  all  thoughts  of  objects,  the light  of  the  Sun?  etc.,  mind  and  the  other  visibles may  be  said  to  be  Brahman  itself.  This  Principle may  be  said  to  be  the  long  Yoga  sleep  devoid  of end,  dream  or  non-intelligence.  It  is  „that‟  from which  evolve  and  into  which  merge,  the  trinity  of the  knower,  knowledge  and  the  known.  It  is  the immutable.  

Jnanakasa  and  not  the  Bhutakasa (composed  of  the  elements.)  The  internal  state  of self-cognition  devoid  of  the  modifications  of Manas,  Buddhi  and  Chitta 27 and  being  as imperturbable  as  a.  block  of  wood,  may  also  be likened  to  that  Brahmic  Reality.  

When  Brahma along  with  Vishnu,  Rudra,  Sadasiva,  Deva,  Indra, Sun  and  others  are  absorbed  (during  Pralaya),  this one  Fount  of  Ommiscience,  viz.,  the  Brahmic Reality  free  from  the  base  Upadhis  (or  vehicles  of matter,  etc.),  and  devoid  of  the  desires  of  the universe,  will  alone  shine  effulgent,  stain  less,  all full and  ever  blissful.   (27)  These  are  aspects  of  Antahkarana,  the  lower  mind,  producing- uncertainty,  certitude  and  fluctuation  respectively.

Note 27  : These  are  aspects  of  Antahkarana,  the  lower  mind,  producing- uncertainty,  certitude  and  fluctuation  respectively. 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31