శ్రీ యోగ వాసిష్ఠ సారము - 50 / YOGA-VASISHTA - 50

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 50  / YOGA-VASISHTA - 50 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. ఐందవో పాఖ్యానము - 2 🌻 
 
ఇహ పరలోకములలో సర్వశ్రేయస్సు నొసగున దేది, అని తలచుచు సకల ఐశ్వర్యములను పొందు, మండలాధిపతి, అంతకు మించి రాజు, చక్రవర్తి, ఇంద్రుడా, బ్రహ్మత్వములను గూర్చి ఆలోచించు చుండగా, వారిలో జ్యేష్టుడు ఇట్లు చెప్పెను. సమస్త ఐశ్వర్యములలోను, కల్ప మందు కూడ నశింపని బ్రహ్మమే యుత్తమ మైనదని చెప్పెను. తక్కిన అందరును, అందుకు సమ్మతించి దానిని పొందు మార్గమును ఇట్లు నిర్ణయించిరి. అగ్రజుడు ఇట్లు చెప్పెను.

''పద్మాసనాదీనుడును ప్రకాశవంతుడును అగు బ్రహ్మయే నేను నాశక్తిచే బ్రహ్మండమునంతయు సృజించుచు మరల సంహార మొనర్చుచున్నాను''. ఇట్లు భావన చేయుచు, చిరకాలము భ్రమర కీటక న్యాయము వలె బ్రహ్మ పద ప్రాప్తి గల్గు వరకు, నిశ్చలముగ ధ్యానము చేయుడని పల్కెను. 

అంతట వారుధ్యాన నిష్ణులై బాహ్యవృత్తుల నిరోధించి, చిత్తమునంతర్ముఖ మొనర్చి, బ్రహ్మపదమును గూర్చి చింతించసాగిరి. నేను యజ్ఞ స్వరూపుడను, వేదములు, మానవకోటి, సిద్ధులు, స్వర్గము, భూమండలము, పాతాళ లోకము, ఆకాశము, ఇంద్రుడు అన్ని నాయందే వున్నవి. సృష్టి యంతయునాచే నిర్మింపబడుచున్నది. నేనే దీనిని సంహరించుచున్నాను. ఇట్లు ఆ ఐందవులు నిశ్చలముగా ధ్యాన మగ్నలై యుండిరి. ఇట్లు వారు బ్రహ్మాపాసనలో కొంతకాలమున్న తదుపరి వారి శరీరములు శుష్టించి, క్రిందికి వ్రాలెను. 

వారి శరీరములు, వన్యమృగములచే భక్షింపబడెను. అట్లు వారు కల్పాంతము వరకు ధ్యాననిష్ణులై ఇప్పటి వరకు అలానే వుండిరి. అని చెప్పుచూ సూర్యుడు, బ్రహ్మ భావనలో నున్న వారు కాల క్రమమున బ్రహ్మలైరి అని, పది బ్రహ్మండములు వారి చిత్తాకాశము చేతనే ప్రతిష్టిమైనవి. అందు ఒక దాని యందు నేను సూర్య రూపమునని, ముక్తుడనైతినని పల్కి వివిధ కల్పనలచే, నాకసమున పరివేష్టించి, మెహదాయకమైన, ఈ దృశ్యమంతయు, కేవలము చిత్త భ్రాంతియేగాని యదార్ధము కాదని చెప్పెను.

అంతట బ్రహ్మ సూర్యు నుద్ధేశించి, తానేల మరొక సృష్టి గావించవలెను. ఈ దశ బ్రహ్మండము లుండగా, వేరు సృష్టి ఏల అనగా, సూర్యుడు సంకల్ప రహితుడును, ఇచ్చా రహితుడునునగు నీకు సృష్టిచే ప్రయోజన మేమి. ఈ సృష్టి యంతయు, నీ యొక్క లీలయె గదా! ఐనను సృష్టికావింపక యదాప్రాప్తకర్మల ద్యచించి యుండిన దానిచే నీవే అపూర్వవస్తువును పొందెదవు. నిష్కాముడవై నీకు ప్రాప్తించిన కార్యములు చేయుమనెను.

 కర్నేంద్రియములచే నొనర్పబడు కార్యమును నిరోధించవచ్చును గాని మనో నిశ్చయముచే గావింపబడు దాని నెవ్వరు నిరోధింపరు. ఓ బ్రహ్మదేవా! జగత్తు లన్నింటిని సృష్టించునదీ మనస్సే. ఈ మనస్సు యొక్క సామర్ధ్యము వలన ఐందవులు సామాన్యులైనను, బ్రహ్మపదమును పొందిరి. జీవుడు మనస్సు వలననే దేహత్వము పొందినాడు. అంతర్ముఖుడైన వానికి దేహ సంబంధ సుఖదు:ఖము లుండవు. అని పల్కెను. అంతట బ్రహ్మ సూర్యుని; అహల్య ఇంద్రుల వృత్తాంతము తెలుపు మనెను.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 50 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 20 🌴

🌻 2. THE STORY  OF LILA 🌻

The  two Lilas (36) bearing  thus  the  company  of  Saraswati,  the latter  let  slip  the  grip  she  had  on  the  Jiva  of Viduratha  which  therefore  entered  into  the  nasal orifice  of  Padma  s  body  in  the  form  of  Prana  and permeated  the  whole  parched  up  body. Whereupon  blood  began  to  circulate  freely throughout  its  fleshy  tenement  and  the  deceased king  woke  up,  rubbing  his  eyes.  With  a  thundering noise,  Padma  asked  the  bystanders  who  those were,  that  were  there.  

Whereupon  the  old  Lila prostrated  herself  before  the  king  and  saw  that  she herself  was  the  wife  congenial  to  him,  that  the  new Lila  was  the  offspring  of  his  mind  which  thought of  a  form  similar  to  hers  and  came  to  enjoy  with him,  and  that  the  third  person  age  was  no  other than the  immaculate Saraswati.   

Note 36 :  It is thus clear  that the  two  Lilas represent no  other  than  the  astral and the  physical bodies of  beings  which  are  counterparts of  one  another. 

After  she  had  pronounced  these  words,  Padma  fell at  the  feet  of  Saraswati  who,  laying  her  beautiful hands  on  the  head  of  Padma,  blessed  him  with  a long  life  with  his  wives,  an  exalted  fame  and  an ever  increasing  wealth  in  order  to  render  people happy  by  extirpating  vices  and  peopling  the  world with  the  great  wise  men.  

With  these  words, Saraswati  withdrew  unto  her  silent  abode,  when the  king  praised  her  with  the  following  words „May  Saraswati,  the  Goddess,  who  presides  over the  tongues  of  all  men  and  the  departments  of  all knowledge,  prosper  long  in  this  world.‟  Then  the Emperor  Padma  along  with  his  wives  wielded  the sceptre  over  the  earth  for  80,000  years.  

With  the blessing  conferred  by  Saraswati,  he  shortened  then and  there  the  seven  kinds  of  births  and  attained  on earth  the  Jivanmukti  State.  At  last  he  attained  the state  of  Videhamukti  which  never  perishes,  even though  great  Kalpas  come to  an end.

End of Chapter 2 - The Story of Lila. 

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹