శ్రీ యోగ వాసిష్ఠ సారము - 46 / YOGA-VASISHTA - 46
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 46 / YOGA-VASISHTA - 46 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సమాధానములు - 2 🌻
ఆత్మ జడమును చైతన్యమును గూడనైయున్నది. ఓ రాక్షసీ, రాతి యందును చిద్వస్తువు వ్యాప్తియై యున్నందున, ఆ చేతన పదార్ధము రాతి వలె ఘనమని వచింపబడినది. అనాదియు అనంతమును అగు, చిదాకాశ మందు, చిత్ స్వరూపుడగు పరమాత్మయె, త్రిలోకములను, చిత్రవిచిత్రముల చిత్రించుచున్నాడు.
కాని అన్నియు మిధ్య అగుటచే, అకృతములే అగును. అగ్ని సత్త, ఆత్మసత్త కధీన మగుట చేత, ఆత్మ సర్వ వ్యాప్తియై నందున, జగత్తును అగ్ని వలె ప్రకాశింప జేయు నా యాత్మ దేనిని దహింపదు. దేదీప్తి మానమును, ప్రకాశవంతమును, ఆకాశమువలె నిర్మలమగును, ఆత్మ చైతన్యము నుండియె, జ్వలన శక్తి గల అగ్నియుత్పన్న మగుచున్నది. అనుభవ రూపమగు, నీ ఆత్మయె చంద్ర సూర్యులను కూడ ప్రకాశింపజేయుచున్నది.
ఆ ఆత్మ ప్రకాశము మహాకల్పము లందును, మేఘములచే గూడనశింపబడదు. ఆత్మయె హృదయ గృహమును ప్రకాశింపజేయు దీపము. పర ప్రకాశ స్వరూపమును, అనుభవ రూపమగు ఆత్మయె, తరుగుల్మాదులను కూడ పోషించు చున్నది. అనుభవ స్వరూపమగు అట్టి ఆత్మ యందే, దేశ కాలాదులును, జగత్తంతయు గలవు. జగత్పతియై యొప్పుచు, అన్నింటికిని కర్తయు, భోక్తయు,ప్రభువునగుచు పరిశుద్దాత్మ స్వరూపుడగుటచే, నేమియుగాక యుండును.
ఈ చిదణువే, ఇంద్రియాతీత మగుటచే దూరమునను, ఆత్మ స్వరూప మగుటచే సమీపమున నున్నది. అనేక కోట్ల యోజనముల దూరమున నున్నదైనను ఒక గొప్పనగరము మనస్సు నందు భాసించులాగున,కల్పమందలి క్రియ లన్నింటితోను కూడియున్నదై ఒక్క నిముషము నందే, ఆత్మ ప్రతిభాసించుచున్నది. నిర్మలదర్పణమున, విశాల నగరము స్ధితి గల్గియున్నట్లు, నిముషమందును కల్పము సంభవించుచున్నది.
సూర్య కిరణముల సంయోగముచే సూర్యునియునికి, స్ధాపితమగునట్లు, దాని యందస్తిత్వ నాస్తి కత్వములు రెండును కల్పితములే అగుచున్నట్లు, బ్రహ్మమందును కల్పాదులతో గూడిన, ఈ జగత్తు కల్పింపబడినదై భాసించుచున్నది.
ఇట్లు జగన్మిధ్యాత్వమును, సూచించు యుక్తులను, మరల చింతన జేయుచు, క్రమముగ అభ్యసించుచుండగా, ముముక్షువు యొక్క చిత్తము, నిర్మలమై, యవిద్య యంతయు నశింప, చిదాకాశము మాత్రమే శేషించుటచే, మరల వానికి సంసార దు:ఖ ముదయించదు. ఏకమగు బీజము, భిన్న రూపములుగ, వృక్షమును తన యందు, ధరించునట్లు, నిర్మలాకాశము వంటి బ్రహ్మమును, అసంఖ్యాకములైన జగత్తు లన్నింటిని తన యందు కల్గి, అంతట వ్యాపించియున్నది.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 46 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 16 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
Then in order to acquaint Lila with the glorious lineage of this race, Saraswati willed that the minister lying hard by the king should wake up from his deep sleep. Instantaneously, the minister shook off his lethargy and seeing Saraswati saluted her. At which she asked him to trace from the beginning, the history of the king s family.
The minister then began thus In the race of Manu Vaivasvata 34, the most esteemed of kings, there was born a king of the name of Kumbaratha (or Kundharatha) who had a son Bhadraratha, the king of kings. The last had in his turn Akhilaratha (or Viswaratha) as son and through him a grandson by the name of Manoratha. This grandson brought forth Vishnuratha who, in his turn, had as his offspring Brihadratha.
This last king, had, in his line of descendants, Sindhuratha, Sailaratha, Kamaratha and Maharatha, till at last the last king Maharatha begat, in this place, the present king of kings, Viduratha. The mother who begat the present king, went by the appellation of Sumitra. His father, having controlled his mind, abdicated his kingdom in favour of his son, then ten years old, and led the life of a recluse in the forest. Now Viduratha, our king, reigns with perfect justice‟.
Note 34 : The Manu of this Manwantara or Round.
As soon as the minister had finished these words, Saraswati, in order to enable the king to easily know the events of his former births through his Jnana (spiritual) vision, touched lovingly, with the palm of her hand, the king s head and blessed him with Divine vision.
Whereupon the gloom of Maya that had obscured his mind like a great antagonist flitted away from it and he was able to recognise himself in the previous body of king Padma sporting with Lila. Then the pleasant sensation of marvel and joy arose in him, the former on account of the diverse workings of Maya, and the latter, since the knowledge of Maya he derived through the grace of these, the (world s) mothers.
With these thoughts in his mind, he wore their feet on his head and said „In the one day that passed from the extinction of my former body up to now (as seen through my Divine vision), I have spent seventy years with this my present body. I have also known all the events that transpired during that period. Whence are all these curious anomalies of Maya?‟
Thereupon Saraswati of the form of Divine grace vouchsafed the following reply, ‟the trance called Death is always accompanied at that very spot and in that very instant, by the great delusion of rebirths (and vice versa).
Now the conception of the duration of 70 years arose only through the delusion of the Karmas performed by you, while in life. Know therefore and perceive for yourself that when your mind was rendered immaculate like Akasa free from all illusions, such conceptions of time vanished, (as all conceptions of time arise through the Vikalpas of the mind only). They the events of seventy years) are only like long-drawn dreams of many events enacted in one Muhurta (48 minutes).
Even our life during the waking state appears prolonged in diverse ways through the many unreal events performed. To tell you truly, there is no such thing as births or deaths to you. You are the true Jnana alone. You are the eternal supreme Seat.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment