శ్రీ యోగ వాసిష్ఠ సారము - 39 / YOGA-VASISHTA - 39

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 39  / YOGA-VASISHTA - 39🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. సృష్టిక్రమము, చైతన్యము - 3 🌻
  
బీజము నుండి అంకురము, పత్రములు, ఫలములు ఉత్పన్నమగునట్లు, చిత్తు నుండి చిత్తము, జీవులు, మనస్సుగల్గుచున్నది. భీజము యొక్క వృక్ష జననశక్తి, బ్రహ్మము యొక్క జగజ్ఞనని శక్తి ఒకే తీరుగ సమానములైనను, రెండింటి మధ్య భేదము, శక్తిపరంగ గోచరించుచున్నది. అద్దములో అరణ్యము, భూమి, వృక్షాదులు కన్పించుచున్నట్లు, బ్రహ్మము కూడ, దృశ్యమున, ప్రపంచమట్లు భాసించుచున్నది. అలానే పూర్వ కల్పిత జీవసంసారము ననుసరించి, పరబ్రహ్మమున జీవభావము ప్రకాశించుచున్నది.

అందువలన జీవుడు ఒకపక్క శుద్దుడయ్యు, వాసనోద్ఛవుడుగను, సత్యముగను, అసత్యముగను, పరమాత్మ కంటె అభిన్నుడయ్యు భిన్నుడుగను, పరమాత్మ యందు స్పురించుచున్నాడు. 

మనస్సు, తన్మాత్రలను గూర్చి చింతించి తన్మాత్రలుగ మారుచున్నది. సూర్య మండలాకాశమున లెక్కకు మించిన మంచు తుంపురులు ప్రకాశించునట్లు, సమిష్టి మనో రూపుడగు హిరణ్యగర్భుని యందు అసంఖ్యాకములైన బ్రహ్మండములను, తదంతర్గతములునగు సూక్ష్మ దేహములును ప్రకాశించుచున్నవి. మనోచైతన్యము పొంది, తన స్వరూపమును గుర్తింపజాలకనే నెవ్వడను అను సందిగ్ధ జ్ఞానమును పొందును. పిదప పురుషార్ధ విభాగమున, జగత్‌ తత్వము గ్రహించి, తనకు బ్రహ్మమునకు భేదము లేదని గ్రహించును.

జీవాత్మ క్రమముగా; రుచి, దృశ్యము, వాసన స్పర్శ, వినికిడి అను పంచతన్మాత్రలు పొంది, వాటికి అధీనుడగు చున్నాడు. ఇట్లు భావనా మయములగు పంచేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనునవి ఏర్పడుచున్నవి. ఇట్లు సమిష్టి జీవుని యొక్కయు, వ్యష్టి జీవి యొక్కయు భావమయ అతివాహిక, దేహములుత్సన్నమగుచున్నవి. అవ్యక్తమగు పరమాత్మయె అజ్ఞానముతో చేరి, అతివాహిక దేహమును పొందుచున్నవి. ఆ పరమాత్మయె, బ్రహ్మభావము వలన, బ్రహ్మస్వరూపముగను, అన్యభావము వలన అన్య స్వరూపముగను, ప్రతిభాసించుచున్నది. బ్రహ్మము అజ్ఞాన భావము అసంభవ మైనప్పటికి, అది స్వత:సిద్ధమైనప్పటికిని, మోక్షము, విచారము అను భేదముల విచార మేమిటని శ్రీరాముడు వసిష్ఠుని ప్రశ్నించెను. అందుకు వసిష్ఠుడిట్లు చెప్పెను. ఈ జగత్తు వాస్తవమున జన్మించుట లేదు, మృతి చెందుట లేదు, బ్రహ్మమే జగత్తు రూపమున, ఇతర వస్తు రూపమున ప్రకాశించు చున్నది. బ్రహ్మ కీటక పర్యంతము, అందరి సృష్టియు సమానమే.

 విశుద్ధ, సత్వ ప్రధానుడగుట వలన, బ్రహ్మ గొప్పవానిగ, మలిన సత్వ ప్రధానుడగుట వలన కీటకము తుచ్చమునై యున్నవి. కీటకము దుష్కృత ఫలితముగ, బ్రహ్మము సహజత్వము వలనను భేద మేర్పడుచున్నది. జ్ఞాన బోధ వలన ఈ భేగములు తొలగిపోవును. ఆనంద స్వరూపుడయిన బ్రహ్మము, తన మాయ వలన, ద్వైత బంధము అనుభవించు చున్నాడు. వట బీజము నుండి వట వృక్షము, అన్యభజముల నుండి, అన్య వృక్షములును జన్మించునట్లు; బుద్బుదములు క్షణకాలము, బ్రహ్మండములు మహాకల్పపర్వంతము వెలయుట, నియతి స్వభావము ననుసరించియె జరుగుచున్నది. అందువలన సృష్టి సత్యము కాదు. జ్ఞానము వలననే సృష్టి, అశుద్ధము, అసత్తు పరిమితము, అనేక రూపములైనట్లు గోచరించును. మూఢులు నీటిని, అలలను వేరువేరుగ బావించునట్లు, రజ్జు సర్ప భ్రాంతివలె, ఈ భేదములు కల్పింపబడు చున్నవి. ఒకనియందే సంబంధ భేదము ననుసరించి, పరస్పర విరోధములగు శతృత్వ మిత్రత్వ గుణములు ఏర్పడుచున్నవి. ఇట్లు ఆత్మ మనస్సుగా, అహంకారిగా, తన్మాత్రలు, పంచభూతములు, చివరకు జీవునిగా రూపొంది జగత్తును దర్శించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 39 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 9 🌴

🌻 2. THE STORY  OF LILA 🌻

 Whereupon  the  spouse  of  Padma  saluted  her  and ad  dressed  her  thus  „Oh  you,  who art like the  moon s  rays  which  do  not  disappear  before  Agni  (the fire)  or  like  the  sun  s  light  which  dispels  the  gloom of  mental  grief,  please  grant  me  the  two  boons: firstly  of  allowing  my  lord  s  Jiva  (ego)  to  remain  in my  house,  even  after  his  death,  and  (secondly thyself  appearing  before  me  visibly,  whenever  I should  think  of  thee.‟  

These  boons,  the  noble Saraswati  conferred  upon  her  with  good  grace  and returned  happily  unto  her  seat.  Then  the  wheel  of time  rolled  on  rapidly  with  its  nave  of  Paksha (fortnight),  month  and  Ritu  (seasons,  each  of  two months), its  spokes  of days, its axle  of years,  and  its axle-hole  of  moments.  

When  thus  Lila  had  passed her  days  in  the  company  of  her  lord  in  illimitable bliss,  he  suddenly  in  a  short  time  died.  Fearing  lest the  elegant  Lila  should  pine  away  under  the  fire  of her  excessive  grief,  Saraswati  stayed  in  the  Akasa invisibly  prior  to  the  separation  of  the  king  s  Jiva (from  his  body);  and  in  order  to  dissipate  her delusion,  gave  vent  (on  her  husband‟s  death),  to the  following  words  „Cover  up  your  deceased husband  s  body  with  flowers.  

Then  the  flowers only  will  fade  and  not  the  body.  The  (king  s)  Jiva without  quitting  the  body  will  rest  in  the  golden harem.  Then  resting  on  the  arms  of  the  king,  you shall  assuage  your  grief.‟  So  saying,  Saraswati vanished  from  view.  According  to  the  words  of  the „Voice  of  Silence,‟vis.,  Saraswati,  Lila  buried  her husband  s  body  amidst  flowers.   

Then  fainting  at  the  separation  from  her  lord,  Lila contemplated  internally  upon  Saraswati  who,  no sooner  appeared  before  her  than  she  addressed  her thus  „I  can  no  longer  endure  the  parting  from  my lord;  you  should  take me  soon to  where he is.‟   

Thereupon  Saraswati  said  thus  „Of  the  three kinds 28  of  Akasa,  vis.,  Chit-Akasa,  (Chidakasa  or Spiritual  Akasa),  Chittakasa,  (or  mental  Akasa) and Bhutakasa  (or  elemental  Akasa),    Chittakasa  is  that intermediate  state  in  which  the  mind  is,  when  it flits  from  one  object  to  another  in  the  elemental Akasa  of  objects.  

When  the  hosts  of  Sankalpas  (in us)  perish,  then  it  is  that  the  light  of  Chit  will  shine in  us  which  is  \  quiescent  and  immaculate  and manifests  itself  as  the  universe.  If  one  becomes convinced  of  the  unreality  of  the  visible  objects, then,  through  that  Jnana,  he  will  attain  at  once Chidakasa.  May  you  attain  through  my  grace  that Chidakasa.‟  Through  this  blessing,  Lila  went  into Nirvikalpa  Samadhi  and  was  able  to  escape,  like  a bird  from  its  cage,  out  of  her  body  which  is generally  replete  with  stains  and  desires  through the  longing  mind.  

There  in  the  heart  of  Jnanakasa (or  Chidakasa),  she  saw,  in  a  large  town,  a  much beloved  valiant  prince  six  teen  years  old,  reclining on  a  soft  cushion  and  surrounded  and  extolled  by innumerable  kings,  women  of  intense  desires  and the  four-fold  armies.  Having  recognized  him  to  be her  dear  lord,  she  entered  the  king  s  synod  which she  found  graced  on  the  eastern  side  by  Munis  and Brahmins  well  versed  in  Vedas,  on  the  southern side  by  handsome  ladies,  on  the  western  side  by kings,  and  on  the  northern  side  by  the  four  fold armies  and  others.  complexion.

Note 28 : These  three  kinds  of  Akasa  correspond  to  the  three  halls  or  bodies referred  to  in  our  books,  namely  the  Karana,  subtle  and  gross. 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹