🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 30 / YOGA VASISHTA - 30 🌹


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 30  / YOGA VASISHTA - 30 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. ప్రేతములు 🌻


ప్రేతములు ఆరురకములు

(1) సామాన్యపాపి 

(2) మధ్యపాపి 

(3) స్ధూలపాపి 

(4) సామాన్యదర్మి 

(5) మధ్యదర్మి 

(6) ఉత్తమదర్మి. 

వీరిలో గొప్ప పాపము చేసిన వాడు, పాషాణమువలె జడుడై, సంవత్సరకాలము మూర్చననుభవించును. తదుపరి వాసనా గర్భమున ప్రవేశించి, నరకయాతన లనుభవించి నూర్లకొలది జన్మల ననుభవించి దుఃఖితుడగును. మరి కొందరు మరణానంతరము, వృక్షాదిజఢ భావమును పొందుదురు. పిదప వాసనా రూప నరకము ననుభవించి, భూమిపై నానావిధ యోనులందు పరిభ్రమించును, మధ్యపాపులు కొంతకాలము పాషాణము వలె జఢులై పిదప దర్ములు పశ్వాది యోనుల దిరుగాడుదురు.


సామాన్యపాపులగు వారు మరణించి అతివాహిక దేహము పొంది, స్వప్న సంకల్పమువలె జనన మరణాదులు పొందుదురు. ఉత్తములు మహా పుణ్యశీలురగు వారు, మరణానంతరము, పూర్వస్తృతిననుసకించి స్వర్గ సుఖముల నుభవించెదరు. తదుపరి మనుష్యలోకమున జన్మించుచున్నారు. మధ్యధర్ములు. మరణానంతరము, ఆకాశ వాయువుచే గొనిపోబడి, ఓషధుల వలన; కిన్కెర, కింపురుషాది జన్మలు పొంది, పుణ్యముల ననుభవించి, ఆహారాది ద్రవ్యముల ప్రవేశించి, రేతస్సుగ యధా తధోచిత జాతు లందు స్త్రీ గర్భమున ప్రవేశించుచున్నారు.


మృతుడు మరణ మార్గము నుండి తేరు కొనిన పిదప ''నేను మరణించితిని'' అని భావించుకొనును. పిండప్రధానానంతరము, శరీరరము వచ్చినది అని తలచుకొనును. యమభటులు వచ్చి తనను యమలోకమునకు గొనిపోవుచున్నట్లు తెలుసుకొనును. పుణ్యవంతులు, దివ్యవిమానములలో పయనింతురు. ఇవన్నియు వారి వారి కర్మలనను సరించి జరుగుచున్నవి. అందరును ఈ విశాల సంసారము సత్యమని తలతురు.


ఆత్మదర్శులు, ఆత్మ ఒక్కటియెయని, ఈ దృశ్యములన్నియు అసత్యములని గ్రహింతురు. యమలోకములో వారు, వారి కర్మానుసారము జన్మ లభించునని తలతురు. ధాన్యాంకురములో ప్రవేశించిన వారు, రేతస్సుగ మారి, పిదప యోని ద్వారా మాతృగర్భమున ప్రవేశింతురు. తదుపరి బాల్యం, యవ్వనము, ముదుసలి, వ్యాధులు, మరణము, మరల యమలోకము ఇలా అంతయు భ్రమయే.


నానావిధ యోనులందు పరిభ్రమించుచున్నారు. విశుద్ధ చైతన్యమే వివిధ రూపములు పొందుచున్నట్లు, మాయ వలన జరుగుచున్నది. ఈశ్వరుడు సర్వ వ్యాపియై యున్నాడు. (ఆయా రూపములలో) ఈశ్వర సృష్టిలో స్ధావరములు (వృక్షాదులు) జంగమములు (జీవకోటి) ఉపాధి భేదమునను సరించి, వివిధ పేర్లతో పిలువబడుచున్నారు. చక్షురాది ఇంద్రియములు, చేతనము కానప్పటికి, చిత్‌ సంకల్పము వలననే పని చేయుచున్నవి.


శూన్యాకారమగు, చిత్‌ సంకల్పము, ఆకారము, భూమ్యాకాశమున చిత్‌ సంకల్పము భూమిగను, అలాగే జలము, అగ్ని, వాయువులు చిత్‌ సంకల్పములే.


బంగారపు వస్తువులకు వివిధ పేర్లున్నట్లు, వివిధ వస్తువు లన్నింటికి మూలము బ్రహ్మమే అగుచున్నవి. విధూరధుడు మూర్చితుడగుటచే చైతన్యరహితమై యున్నాడు, అతని శరీరము, మరణించిన ఆత్మ ఆకాశమున వాయువుతో కలసి, వాసనల ననుసరించి సంచరించుచు, తన పూర్వపు శరీరములో ప్రవేశించినవి. ఇదంతయు లీలావతి, సరస్వతులు గాంచుచుండిరి. ఇదంతయు బ్రాంతియెయైనను, అతనికి సత్యము వలె భాసించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 30 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 MUMUKSHU PRAKARANA - 7  🌴


🌷 Turya  State:  

A  person,  who  gets  quiescence  in  this Turya  state  devoid  of  all  Bhavanas  (thoughts)  and thus  crosses  the  ocean  of  Samsara,  will  attain  the Seat  of  Moksha.  Such  a  one  will  never  be  affected by  anything,  whether  he  is  in  a  state  of  Jiva  or  Siva devoid  of  the  Jiva  state,  whether  he  moves  in  a family  or  is  a  solitary  recluse,  whether  he  is  bound by  the  delusions  of  Srutis  and  Smritis  or  not,  or whether  he  per  forms  all  actions  or  not.  He  will then  be  in  the  one  Reality  of  Atman  as  in  one  vast ocean  without  (any  intercepting  object  as)  the Himalayas.     


🌷 The  proper  path  of  enquiry:  

You  may  place  your credence  in  the  words  of  even  a  child,  if  they  are consistent  with  the  Srutis,  Guru‟s  words  and  your self-experience.  Otherwise  you  should  reject  as straw  the  utterances  of  even  Brahma  himself. Know  also  that  the  many  analogies  given  out,  in order  that  Brahma  Jnana  may  arise  in  you,  are  for the  purpose  of  exemplifying  the  One  Principle.  The ignorant  assert  that  the  formless  and  real  Jnana  is subject  to  no  analogies  involving  form  and  name (and  hence  should  not  be  made  the  subject  of enquiry);  but  such  a  mischievous  argument  will only  be  subversive  of  the  good  results  of  the intellectual  acumen  arising  from  Jnana  enquiry. Therefore,  oh  Rama,  you  should  not  let  your  mind take that  groove of  thought.   


🌷 On  the  development  of  Jnana: 

 "The  sound  of  Atman Jnana  will  vibrate  only  on  the  strings  of  Santi  and other  qualities.  Jnana  and  the  above  four  good qualities  shine  mutually  in  best  relief  only  in juxtaposition.  Both  these  flourish  well  like  a  tank and  the  lotuses  growing  in  it.  Should  they  be developed  equally,  then  the  result  will  be  the attainment  of  Brahman;  but  if  separately,  no  results will  accrue.  A  hearing  of  the  (following)  real stories (and  an  acting  up  to  them),  will  confer,  on  one,  the virtues  of  true  renunciation,  imperishable  wealth, eternal  bliss,  the  glorification  by  the  wise  and  a happy  life.  Moreover  a  mind  illumined  thereby, will  attain  Moksha  of immutable bliss."

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31