🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 23 / YOGA-VASISHTA - 23 🌹


🌹.  శ్రీ యోగ వాసిష్ఠ సారము  - 23  / YOGA-VASISHTA - 23 🌹

✍️. రచన : పేర్నేటి గంగాధరరావు

📚.  ప్రసాద్ భరద్వాజ 


🌴.  ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻.  చిదాకాశము - 1  🌻


అంతట సరస్వతి ఆకాశము, చిత్తాకాశము, చిదాకాశములలో నీ భర్త శూన్యమై చిదాకాశములోనే, అతని ఆత్మ వున్నదని ఆ చిదాకాశమును ధ్యానించి, నీవచటకేగి దానిని అనుభూత మొనర్చుకొనమని పల్కెను. ఆ చిదాకాశమే బ్రహ్మము. దానిని దర్శించిన, నీకంతయు అవగాహన యగునని పల్కెను. అపుడు లీలాదేవి ధ్యానమగ్నమై, స్థూలదేహాభిమానమును వదలి, క్షణంలో చిదాకాశమున కెగసిపోయెను. 


అచట రాజభవనములో తన భర్త పద్ముడు అసంఖ్యాకమైన రాజగణసమేతుడై సభాస్ధలమున రాజకార్యములు నిర్వర్తించుచుండెను. యధాతధముగ, సామంత రాజులు, పురోహితులు, బ్రాహ్మణులు, భృత్యులు వార్తాహరులు తదితరులు, ఎవరి కార్యములు వారు నిర్వర్తించుచుండిరి. లీలాదేవి ఆ సభాస్థ్ధలికి అరుదెంచి, అటునిటు తిరుగాడు చుండుట ఎవ్వరును చూడజాలకుండిరి. తాను చూచిన వారందరు, తనకు తెలిసిన వారే అయియుండిరి. పద్ముడు వృద్ధ శరీరమును వదలి, షోడశవర్షీయ యువకుడై రాజ్యమును పాలించుచుండెను.


లీలాదేవి తన భర్త వలె తన రాజ్యములోని వారందరు చనిపోయినారా! అని తలంచుచుండ, తన సమాధిభగ్నమై, తన పరిచాలికలందరు, మునుపటియట్లే వుండుట గాంచి తదుపరి సభను సమావేశపర్చి, సభాసదులందరను పిలువనంపెను. అంతట సభ ఏర్పాటు కాగా లీలావతి మునుపటి వలె గురువులు, స్త్రీలు, స్నేహితులు, సభాజనము, బంధువులందరిని గాంచెను. మహారాజు తప్ప, అందరు జీవించియున్నారని తలచి సంతసించెను.


మాయ చాల విచిత్రమని తలచి స్ధూలదేహమున నున్నట్లే, సూక్ష్మదేహముతో చిదాకాశములో నున్నారని లీల తలంచెను.


అద్దమున, వెలుపల కొండ ఒకే లాగనున్నట్లు, చిదాకాశమునకు వెలుపలను సృష్టి ఒకే తీరుగ కనబడుచున్నదని తలచెను. అపుడు దేవి ప్రత్యక్షమై, నీ భర్త చిదాకాశములో, సూక్ష్మ శరీరముతోను, భూమండలములో, స్థూల శరీరముతోను వున్నప్పటికి, స్థూలశరీరము కేవలము భ్రమ లేక మాయ మాత్రమే. పూర్వపు సృష్టులయందలి కామ కర్మ వాసనలే, ఈ స్థూల శరీరమునకు కారణమని చెప్పెను. లీలావతి, ఆ సృష్టి విధానమును తెలుపుమని కోరెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 23 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 VAIRAGGYA-PRAKARANA 🌴


🌻 THE STORY OF  SUKA 🌻


Having  spoken  these  words,  Viswamitra  looked  at Vasistha  s  face  and  reminded  him  by  saying  that Rama  should  be  taught  those  Jnana  stories  which Brahma  residing  in  the  lotus  had  been  pleased  to favour  them  with,  in  order  to  put  an  end  to  the dissensions  between  them  and  liberate  all  the virtuous  from  their  Sanchita  Karma  and  attain Moksha.  Initiation  into  the  Mysteries  of  Brahman will  fructify  only  in  that  disciple  s  mind  which  is desireless  and  will  produce  Jnana  (spiritual wisdom)  in  it.  This  is  what  the  Sastras  (books)  say. And  herein  lies  the  glory  (of  the  higher spirituality).  But  the  initiation  imparted  to  a vicious  disciple,  full  of  desires  will  become  defiled like  the  pure  milk deposited  in  a  sable  dog s skin. 

Note : 

16. The  dissensions between  Vasistha  and  Viswamitra  are  related  at great length  in  Mahabharata.  

17. The  accumulated  Karmas  which  are  yet  in  store,  to  be  enjoyed  in future  births.  


Thus  did  Viswamitra  expatiate  in  various  ways when  the  unsullied  Narada,  Veda  Vyasa  and  other Munis  assembled  there,  heard  all  of  Viswamitra  s words  and  eulogised  him  unanimously  for  his noble  utterances.  Thereupon  Muni  Vasistha,  son  of Brahma  and  equal  unto  him,  addressed Viswamitra  thus  „Oh  Muni,  well  versed  in  all departments  of  know  ledge,  I  will  do  according  to your  bidding.  Whoever  will  go  against  the  words of  the  Great  Ones  that  have  known  really  who  „the knower‟  is?  I  will  now  recite  the  pure  Jnana  stories meant  for  the  non-fluctuating  and  the  pure  minded and  given  out  by  the  lotus-residing  Brahma  on  the Nishada  hills  in  order  to  liberate  them  from  the cycles  of re-birth.‟   


Therefore  Vasistha  with  a  concentrated  and  pure mind  related  the  following  to  make  Ajnana (ignorance)  perish,  and  the  Supreme  Seat  of  All  full Jnana  dawn,  in  men s minds.   

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31