🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 13 / YOGA VASISHTA -13 🌹


🌹.  శ్రీ యోగ వాసిష్ఠ సారము - 13  / YOGA VASISHTA -13 🌹
✍️.  రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻.  బంధము 🌻

బంధమునకు కారణము దృశ్య ప్రపంచము. దృశ్యము నశించిన బంధములు తొలగిపోవును. స్వప్నము సుషుప్తి యందు నశించునట్లు, ఈ దృశ్య ప్రపంచము ప్రళయమున లీనమైపోవును. అపుడు మిగిలిన సత్‌ పదార్ధమునకు నామ రూపములుండవు. నిష్క్రియము కాని లోక వ్యవహారము నిమిత్తము ఆ పరమాత్మ సత్యము, బ్రహ్మము మొదలగు నామములు కల్పించిరి. చైతన్యమైన ఈ బ్రహ్మ పదార్ధము మనస్సుగాను, క్రమముగా ప్రాణులుగ, అనగా జీవులుగా క్రమముగా పరిణామము చెంది సృష్టి, స్ధితి, లయములకు హేతువగుచున్నవి.

ఇంద్రజాల మయమగు యీ జగత్తు అసత్యమయ్యి, మనస్సు యొక్క ప్రభావమున సత్యముగనున్నట్లే ప్రకటితమగుచున్నది. అందువలన పండితులు ఈ జగత్తును మాయ, మొహము, తమస్సు, అవిధ్యయని పిలుచుచున్నారు.

ద్రఫ్ణ యొక్క ప్రతిబింబ చైతన్యమునకును, దృశ్య పదార్ధమునకును గల సంబంధమే బంధము అని చెప్పబడుచున్నది. దృశ్య భావమే బంధమునకు కారణము. దృశ్యము తొలగిపోయిన బంధము నశించును. తర్కము వలన గాని, తీర్ధయాత్రల వలన గాని, సత్యము వలె తోచు ఈ జగత్తు నాశనము గాదు.

అద్దమునందు కనిపించు ప్రతిబింబములు, అడవులు, పర్వతములు, నదులు, వస్తువులు బ్రహ్మము యొక్క సృష్టి స్ధితి, లయలు మాత్రమే. యదార్ధములు కాదు. యదార్ధ జ్ఞానము పొందినపుడు అవన్ని భ్రమలే అగును.

సమాధి స్ధితి యందు బాహ్య వస్తువు అదృశ్యమైనప్పటికి సవికల్ప సమాధి స్ధితిలో, అంతర్‌దృష్టి వలన సూక్ష్మశరీరము చిత్‌ రూప వస్తు ప్రపంచమును దర్శించును. కాని నిర్వికల్ప సమాధి స్ధితి యందు, సర్వదృశ్యములు అంతమై ఆత్మ నిశ్చలమై గాఢ సుషిప్త నిద్రలో వలె సర్వము అభావమై బ్రహ్మభావమును పొందును. కాని సమాధి నుండి బయటకు వచ్చిన వెంటనే మరల దృశ్య ప్రపంచములో, మాయలో దగుల్కొనును. మనస్సను మూల దృశ్యమున్నంత వరకు యోగులు సహితం సంపూర్ణ స్ధితిని పొందరు. ద్రష్ట తాను పాషాణముగా భావించినంత కాలము అట్లే యున్నప్పటికిని, ఆ స్ధితి నుండి తేరుకొనిన పిదప దృశ్యము మరల దర్శనమగును. కనుక దృశ్యము సత్యమైన అది ఎన్నటికీ నశించదు. తపోధ్యాన తపస్సుల వలన కూడ అది నశించదు. మర్రి విత్తు యందు వృక్షమున్నట్లు దృశ్యము కూడ సంస్కార రూపమున అణగియుండును. అలానే నువ్వుల యందు నూనె, పువ్వుల యందు వాసన దాగి యున్నట్లు, ద్రష్ట యందు దృశ్యమిమిడి యున్నది. చిత్తుతో కూడియున్న చిత్తమున సంస్కార రూపమున నున్న దృశ్యజ్ఞానము కూడ, దేశ కాల పరిస్ధితులననుసరించి వృద్ధి చెందును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Yoga Vasishta - యోగ వాసిష్ఠ సారము Channel 🌹
🌹 YOGA-VASISHTA - 13 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 VAIRAGGYA-PRAKARANA 🌴

🌷 Dotage  -  
The  never-ending  stage  of  infancy  is devoured  (or  succeeded)  by  the  stage  of  youth;  the latter  is,  in  its  turn,  devoured  by  that  of  old  age with  its  great  changes.  If  dotage  sets  in, accompanied  as  it  is  by  delusion,  diseases,  pains, etc.,  then  one  s  ripe  intelligence  bids  adieu  to  him, like  the  affection  of  a  husband:  -  towards  his  first wife  after  marrying  a  second  one.  With  dotage, there  ensue  manifold  pains,  such  as  decline  in  this body  of  nine  gates,  forgetfulness,  inability  to gratify  the  desires  or  perform  the  requisite  actions, dire  diseases,  complete  helplessness  in  getting  at things  required  and  the  scorn  heaped  upon  him  by his  sons  and  others.  

Friends,  issues,  relatives, servants  and  others  will  laugh  at  the  poor  man who  is  quivering  with  old  age.  Like  owls  resting  in the  hollows  of  a  tree,  his  desires  will  abide  in  this uncouth  form  of  his,  full  of  pains  and  greyness  and devoid  of  strength  and  good  qualities  In  this  old age  beset  with  frailties  and  imbecility  when  all dangers  having,  as  their  hand  maids,  desires  burn one  s  hearts,  all  imaginary  fears  arise  in  him  as  he is  unable  to  cope  with  the  desires  which  arise  in voluntarily  in  him  and  to  contemplate  upon  the beneficial  nature  of  the  existence  in  the  higher world.  Thirst  of  joy  in  material  objects  will  increase with  old  age;  but  the  person  will  be  powerless  to gratify  that  thirst.  

Being  unable  to  enjoy  them,  all his  thoughts  will  droop  and  wither.  Death  lays  its hand  on  grey  heads  which  are  like  ripe  pumpkins of  the  genus  that  become  grey  at  their  proper  time. It  is  before  the  king  called  Death  that  the  armies  of mental  and  physical  diseases  march  in  procession in  this  world,  having  the  insignia  of  the  Chamara 6 called  greyness.  

In  the  tabernacle  of  this  body white-washed  by  greyness,  there  live  the  dames called  dangers,  imbecile  mind  and  diseases  that make  one  droop.  What  bliss  can  we  expect  to derive  from  association  with  this  the  old  grey  hag of  dire  dotage?  It  is  very  difficult  to  do  away  with the  desires  of  old  age  by  getting  rid  of  the  three kinds  of  desires  (of  son,  wife  and  wealth)  very easily.   
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹