🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 28 / YOGA VASISHTA - 28 🌹


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 28  / YOGA VASISHTA - 28 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. యుద్ధము - 2 🌻


ఇక్ష్వాకు వంశీయుడైన కుందధరుడను రాజు బాహుబలమున పృధివినంతటిని జయించెను. అతనికి భద్రుడను పుత్రుడుండెను. భధ్రుని పుత్రుడు విశ్వధీరుడు, అలా అతని వంశస్తులందరి పేర్లు తెల్పి చివరకు నభోరధుని పుత్రుడే ఈ పద్ముడని పల్కెను. ఇతడు 11వ ఏటనే రాజై, ఈరాజ్యమును ధర్మానుసారము పాలించుచున్నాడు. అంతట సరస్వతి రాజునుద్ధేసించి, తన పూర్వజన్మను స్మరింపమని పల్కి అతని మస్తకమును స్పురించెను. ఆ స్పర్మ వలన అతని హృదయము వికసించెను. అతడు రాజగురు, తన పత్ని లీల అని గ్రహించి ఆశ్చర్యము నందెను. తాను మరణించి ఒక్క రోజే అయినను, తన వయస్సు డెబ్బది ఏండ్లయినదని తాను బంధుమిత్రులను స్మరించగల్గినాడు. తన గత జీవితమును, రాజ్యపాలన, శతృవులతో దారుణ యుద్ధము, అన్నియు గ్రహించి, తనస్మతికి కారణమైన దేనిని స్తుతించెను. మరణ సమయమున, ఈ జగజ్జాలములన్నియు, అసత్‌ స్వరూపములని స్వప్నమున ఒక్క నిమిషములో, పెక్కేండ్లు గడిచినట్లు భ్రమ కల్గునవి, ఇదంతయు మిధ్యయని గ్రహించెను. వాస్తవమునకు జన్మలేదు, మృత్యువులేదు. స్వప్నానంతరము అంతా భ్రమయే అని, తెలిసినట్లు జ్ఞానికి ఇదంతా భాంతియని గ్రహించెను.


అహంకారము, మూఢత్వము, అజ్ఞానము కల్గిన పురుషునికి ఈ జగత్తు దీర్ఘ స్వప్నము వంటిది. సృష్ట్యాదియందు స్వయంప్రభువు, స్వప్నతుల్యుడు, అనుభవాత్మకు డునై ప్రకాశించును. అతని సంకల్పమున జన్మించిన ఈ జగత్తు కూడ స్వప్నతుల్యమే. స్వప్నమున గనపడు నగరవాసులు, సత్యము గానిచో, ఈజగత్‌ ప్రపంచమునగల పురుషులు కూడా సత్యము కాదు. అలానే ఇపుడు నీవునేను సత్యమైనట్లే, ఇతరములు కూడా సత్యములే. అది ఈక్షణము మాత్రమే, తదుపరి అసత్యమగును.


జాగ్రదవస్త అని తలచునది కూడా స్వప్నమే. స్వప్నస్త్రీ సంగమమువలె మోహమును కలుగజేయుచున్నవి. ఇట్లు సరస్వతి విధూరధునకు బోధించెను. అంతట తామున్న కోట శత్రుసైన్యముతో, చుట్టు ముట్టి నగరమును తగులబెట్టు చుండి రని తెలిపెను. 


అపుడు తగల బడుచున్న పట్టణమును గాంచిన, రాజు, మంత్రి తదితరులు, మరణించు చున్న సైనికులను, కాలు చున్న భవనములు, మంటలతో పొగతో కప్పబడియున్న రాజభవనమున, పురజనులటు నిటు పరవెడు చుండిలి. అంతట భయవిహ్వల అయిన రాజమహిషి,చెలికత్తెలను, పరిచారికలను కనుగొనెను. వారు యుద్ద విశేషములను రాజుకు తెల్పు చుండిరి. 


అంతట వారు లీల సరస్వతులను గాంచి అచ్చరువంది, ఈ లీల అచ్ఛముగా తనవలె నున్నదని ఆశ్ఛర్యం చెందెను. అంతట సరస్వతి ఇట్లు చెప్పెను. స్వప్న జాగ్రత్‌ అవస్తలందు ఒకే వ్యక్తి, ఇద్దరిగవున్నను, ఆ ఇద్దరు ఒకే రూపమును కల్గియుందు రనియు, జాగ్రదవస్తలోని వ్యక్తులు స్వప్నము గాంచినట్లు, స్వప్నములో జాగ్రత్తు కూడా అలానే కనబడుచున్నది.


హృదయమున జ్ఞానముదయించిన , క్షణకాలము అనుభూతికల్గును, చిత్‌ శక్తి చిత్తము యెక్క ఆకారమును పొందును. జన్మసమయమున, మృత్యువు వెంటనంటి యున్నట్లు, మృత్యు సమయమున, జన్మకూడ తప్పని సరిఅగును. కైవల్యము నందిన వారు మాత్రమే జన్మనొందరు. జగత్తు సత్యము కాదు, అసత్యము కూడ కాదు. కేవల భాంత్రి మాత్రమే.


మహా ప్రళయానంతరము, కేవలము బ్రహ్మము మాత్రమే మిగులును. సముద్రమున తరంగములు లేచునట్లు బ్రహ్మము మాత్రమే మిగులను, సముద్రము నతరంగములు లేచునట్లు బ్రహ్మమున ఈ జగత్తులు లేచుచున్నవి. గాడాంధ కారమున బాలకుడు భూతభ్రాంతిని పొందునట్లు, వాస్తవమునకు అది గాడాంధకారమే. జగత్తు సత్యమే కావచ్చు. మిధ్యయేకావచ్చు, ఇయ్యది చిదాకాశముననే యున్నది. జీవుని భోగేచ్చయె సంసారోత్పాదనకు కారణమగుచున్నది..


జీవుడు తాను కోరుకొను విషయమున రంజితుడగును,. పిదప అనుభవమునకు వచ్చును. కాని అదిమిధ్యయె కాని అవి జీవాకాశము నా శ్రయించి వుండును. అవియె సంస్కారములు. సంకల్పము మొదట జీవాకాశమున నుదయించిన పిదప ప్రకాశించెను ఇవన్నియు అహంభావముననే స్ఫురించుచున్నవి.


 లీలావతి భర్త రణంగమున, శరీరము పరిత్యజించి, అంతఃపురమున ప్రవేశించి మరల పద్ముడగును. జీవులు స్పయముగనే తమ తమ కార్యములు నిర్వహించు కొందురు. ఎవరును వారిని తమ కనుకూలముగ మార్చలేరు. జీవశక్తి స్వరూపమగు చిత్‌శక్తి అందరికిని వున్నది. దైవము జీవుల కోరికలను కేవలము ప్రకాశితముచేయును. నీసంకల్ప బలమే కేవలము నిన్ను శక్తివంతునిగ లేక ముక్తునిగ చేయును. దైవమువలనే, సంకల్పమునకు బలముచేకూర్చును. స్వీయ, చిత్‌శక్తి లేక తపస్సు దేహభూతమై ఫలముల నొసంగును. బలము చేకూర్చును. అందువలన మంచి చెడును బాగుగ విచారించి పవిత్రమైన దానినే ఆచరించవలెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 28 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 MUMUKSHU PRAKARANA - 5  🌴


🌷 Santi :

Now  listen,  oh  Rama,  to  the  ineffaceable characteristics  of  the  four  sentinels  placed  at  the gate  of Moksha.  If  the  supreme  „sweet  patience  that nought  can  ruffle‟  be  mastered,  then  all  desires  and sorrow  will  fly  like  gloom  before  the  rising  sun. 


Being  confided  in  (and  loved),  like  a  mother,  by  the virtuous  as  well  as  the  vicious,  such  persons  of sweet  patience  will  never  be  ruffled  in  mind, whether  they  get  nectar  to  drink and  enjoy  the  bliss of  Lakshmi  residing  in  the  luxuriant  lotus  flower, or  are  engaged  in  great  wars,  entailing  excessive carnage,  or  whether  they  are  born  or  dead.  They  never  rejoice  or  grieve  through  the  enjoyment  of pleasures  or  pains  arising  from  sensual  objects. 


These  pure  men  of  sweet  patience  will  shine  aloft far  higher  than  such  persons  as  men  of  mere  ripe intelligence,  performers  of  sacrifices,  men  well versed  in  all  departments  of  knowledge,  puissant kings,  virtuous  men  and  others  (not  possessing  this one  attribute).  Great  men  having  quaffed  this ambrosia  of  sweet  patience  which  is  rare  for  all intelligent  men  who  long  after  it,  have  attained  the glorious  Moksha.  May  you  too,  oh Rama, act in this virtuous  path.


🌷 Atman  Vicharana :

If  along  with  this,  you  should develop  fully  Atmic  enquiry  through  your  subtle pure  intelligence  after  a  study  of  the  holy  Sastras, then  such  an  incomparable  intelligence  will  reach the  Supreme  Seat.  It  is  this  enquiry  alone  that enables  one  to  differentiate  causes  from  effects  and constitutes  the  rare  remedy  for  the  cure  of  the disease  of  re  births.  Having  cleared  oneself  of  all doubts  through  this  discriminative  power  which gets  not  blurred  even  in  the  midst  of  the  intense darkness  (of  ignorance)  shines  with  undiminished lustre  even  in  the  midst  of  any  light  and  through which  all  things  are  visible,  one  should  always  be engaged,  even  when  threatened  by  dangers,  in  the enquiry  of  whence  am  I?  Whence  came  this universe  of  Samsara?  And  of whom  is  this  universe an  attribute?  Such  an  enquiry  averts  the  dangerous disease called  the  gloom  of  Ajnana.


🌷 Santosha :

Now  to  noble  contentment.  It  is  the  bliss arising  from  the  enjoyment  of  objects,  good  or  bad, without  any  longing  or  aversion  and  the  non-grief (or indifference)  shown  towards  objects  not obtained.  Should  this  incomparable  ambrosia  of contentment  become  permanently  settled  in  one, then  all  enjoyment  of  objects  will  become  a  poison to  him.  Then  the  mind,  which  was  immersed  in sensual  objects  raises  up  its  eyes  towards  Atmic wisdom  and  sees  not  a  distorted  image  as  in  a stained  glass.  Such  a  person  of  true  contentment will  be  revered  by  the  great  Tapaswins  and  the chief of  men.


🌷 Sadhu  Sangha:

To  all those who wish  to master  this world  of  Maya,  the  association  with  the  wise  is  the unfailing  means.  Like  the  Ganges  which  yields  its fruits  to  those  who  bathe  in  its  cool  waters,  the association  with  the  wise expands  the  poor  intellect of  men,  transmutes  the  accidents  arising  out  of material  objects  into  a  real  wealth  (for  progress) and  converts  a  mind,  which  is  miserable  amidst any  objects,  into  one  which  sees  happiness everywhere.  To  such,  neither  sacrificial  fires,  nor Tapas,  nor  bounteous  gifts  nor  holy  waters  are indispensable.  One  should,  at  any  cost,  long-  to approach  those  great  personages  replete  with wisdom  who  are  friendly  to  all,  relieving  them from  bondage  and  form  the  ferry  to  cross  the  ocean of rebirths.

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31