శ్రీ యోగ వాసిష్ఠ సారము - 40 / YOGA-VASISHTA - 40

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 40  / YOGA-VASISHTA - 40🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. కర్కాటియను రాక్షసి కధ  🌻
  
వసిష్ఠుడు శ్రీరామునకు కర్కటి యను రాక్షసి యొక్క యితిహాస కధ చెప్పుచున్నాడు.

 హిమాలయముల కుత్తరభాగమున కర్కటి యను ఒక భయంకర రాక్షసి నివసించు చుండెను. ఆ రాక్షసికి విషూచిక, అన్యాయ బాధిక అను పేర్లు కూడ కలవు. కాటుక వర్ణముతో భయకర కార్యములకు కారణభూతమై యుండును. దాని శరీరము కృశించి నట్లున్నను, అసామాన్య బలవంతురాలు. నీలవర్ణ దుస్తులు ధరించి రాత్రి యందు, ఎవరికి కన్పించని రీతిగ సంచరించు చుండెను. వెంట్రుకలు నీలి వర్ణముతో నుండి పైకి రేగుచుండెను. 

కండ్లు ప్రకాశవంతముగా మెరయుచుండును. నర కంకాళముల మాలలో, భేతాళునితో నాట్యమాడుచు భీతిగొల్పు చుండెడిది. దానికి తగిన ఆహారము అభించనందున, దాని జఠరాలనము సర్వదా బడబాలనము వలె, తృప్తి లేకుండెను. ఆకలితో అది ఇట్లు భావించెను. తాను జంబూద్వీపమున నున్న జీవులన్నింటిని ఒకే తడవ మ్రింగిన, తన ఆకలి కొంత వరకు తగ్గునని భావించునది. కాని యాజీవులలో కొన్ని మంత్రౌషధ, నీతి, దాన, పూజాదుల నొనర్చిన మానవులుందురు. వారిని మ్రింగుట వీలు కాదు. అందుకు తగిన శక్తి సంపాదించుటకై, తపస్సు నాచరించెదనని తలచి, స్ధిరచిత్తముతో, హిమాలయము లందు, ఒంటి కాలిపై నిలచి ఉగ్రమైన తపస్సు బహుకాలము, ఆచరించెను.

అంతట బ్రహ్మ, రాక్షసికి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనెను. అపుడు ఈ రాక్షసి, బ్రహ్మను స్తుతించి, అనాయసి ఆయసియు నగు జీవసూచికగ నొనర్చుమని కోరెను. అపుడు బ్రహ్మ అతి సూక్ష్మమగు మాయతో, నిషిద్ద, అపక్వ, అకాల, అతిభాజులను, కుకర్మ రతులును, కుదేశ వాసులును నగు వారిని, హిసించుమనియు, వాయు, పరమాణు తుల్యమై నాసా రంధ్రము నుండి ప్రవేశించి జనుల అపాన హృదయ మధ్యదేశమును ఆక్రమించు మనియు, వాత లేఖాత్మికమగు, విషూచిక వ్యాధిపై, గుణవంతుని, గుణహీనుని గూడ బాధించగలవని వరమొసగెను.

తదుపరి బ్రహ్మ గుణవంతుల చికిత్సార్ధము, ఓంకారాది బీజ రూపమైన మంత్రమును తెల్పెను. దాని వలన సాధకుడు విషూచికారోగము నుండి, విముక్తుడగునని తెల్పెను. ఆ మంత్రమును ఇంద్రున కొసగెను. అంతట ఆ రాక్షసి, పర్వతాకారము, క్రమముగా వృక్షాకారమును, మనుజాకారము ఇంకను సూక్ష్మమై, హస్తాకారము, అంగుళీయక మంతయు, మినప గింజంతయు తదుపరి సూదిగ మారెను. ఆ రాక్షసి అదృశ్యదూపమున సర్వ ప్రదేశము లందు సూక్ష్మరూపమున విస్తరించి హానికరమై యండును.

సూచీ రూపము (సూది) ధరించినప్పటికి, దేహరహితమగు ఆ రాక్షసి జగత్తును ఎట్లు, భక్షించగలదు. స్వార్ధముచే, మూఢబుద్ధియగు ఆ రాక్షసి స్ధూలశరీరము వదలి, సూచీ రూపము పొంది, ఆకటిచే, తన దేహమును తృణము వలె విసర్జించెను. కాని ప్రశాంతిని పొందెను. దాని రెండవ సూచిక ఆకాశమును, నిరాకాశమును, లింగశరీరధారియునయి సమస్త పద్ధాము లందు ప్రవేశించి, వ్యాధి రూపమగు జీవ సూచిక రూపము పొందెను. 

అది ప్రకాశవంతమై, పాపయుక్తమగు, క్రూరమనో వృత్తి రూపమై, పుష్పగంధము వలె, ప్రాణుల శరీరము లందు ప్రవేశించి బాధించుచు, పర ప్రాణ హరణమే తన మనోరధముగ గల్గి యుండెను. ఈ ప్రకారముగ, ఆ రాక్షసి వస్త్రమువలె సూక్ష్మమును, కోమలమునగు రెండు దేహములు గలదాయెను. అది రెండు దేహములతో, మనుజుల హృదయములందు ప్రవేశించి, బాధ కలుగజేయుచు, అన్ని దిక్కుల దిరుగసాగెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 40 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 10 🌴

🌻 2. THE STORY  OF LILA 🌻

Then  having  visited  many fertile  tracts  of  earth,  hills,  cities,  towns,  many  holy rivers  and  others,  she,  sparkling  like  lightning, returned  unto  her  abode  and  entered  her  body lying  entranced  in  her  harem,  where  she contemplated  with  great  love  upon  Saraswati  of white  complexion.   

Having  saluted  Saraswati  who  made  herself  visible as  seated  in  her  supreme  throne,  Lila  questioned her  thus,  „How  is  it  that  my  lord  even  after  his death,  has  subjected  himself  to  another  Amurta (formless)  creation  which  is  as  illusory  and bondage-giving  as  the  present  state?  Please  remove my  doubts  with  reference  to  this,  so  that  I  may know  the  real  truth.‟  To  which  Saraswati  replied thus  „

The  original  evolution  of  the  supreme Brahmin  differentiated  out  of  the  one  Jnanakasa brought  about  in  its  turn  through  delu  sion  of (mental)  regality  the  Padma  creation  and  thus  it  is, a  fresh  creation  arose.  Similarly  has  your  husband now  a  second  birth  as  Viduratha.  Therefore  after giving  your  ears  to  what  I  am  going  to  relate  to you,  you  shall  have  your  doubts  therein  cleared  by me.   

In  the  stainless  and  immaculate  Chidakasa,  there is,  on  one  side  of  it,  a  Mayavic  dome.  This  vault  is covered  by  countless  pea  cock  s  feathers,  viz.,  the immeasurable  Akasa.  On  its  golden  pillars,  large and  small,  viz.,  Mahameru,  are  engraved  the picturesque  beauties  of  Indrani  and  others,  the spouses  of  Indra  and  the  regents  of  the  quarters. 

On  one  side  of  that  dome  are  hillocks  called  (the elements),  Prithivi  (earth)  and  others  as  well  as  the tiles  called  the  seven  mountains.  It  is  the  seat  of  the residence  of  the  revered  and  old  Brahma surrounded  by  his  sons,  Marichi 29  and  others  full of  desires.  It  is  ever  reverberating  with  the  songs  of Devas,  roving  on  their  beautiful  vehicles  which songs  vibrate  from  the  Vina  (lute)  of  Akasa.  It  is ever  resonant  with  the  buzzing  sounds  of  the  gnats of  Siddha  hosts  living  in  the  Akasa.  

It  resounds with  the  never  ceasing  sound  arising  out  of  the strife  between  Devas  and  Asuras,  the  mischievous imps  of  great  egoism.  It  is,  in  such an  incomparable Mayavic  dome,  that  there  was  a  town  called Girigrama  in  the  midst  of  a  certain  tract  on  one side  and  that,  in  a  certain  spot  of  that  dome.  That town  was  a  fertile  tract  boasting  of  the  possession of  hills,  rivers  and  forests.  

There  lived  in  it  a  great Brahmin  householder  who  had  sacrificial  fire  and was  well  versed  in  Sastras  and  Dharmas,  away from  the  reach  of  kings.  He  equalled  Vasistha  in beauty,  wealth,  age,  humility,  actions,  and education,  but  could  not  be  called  Vasistha  himself in  real  knowledge.  

In  name  at  least,  this  Brahmin may  be  called  Vasistha.  The  name  of  her  who worshipped  his  feet  (as  his  wife)  was  equal  unto Arundhati  but  had  not  her  knowledge;  yet  she passed  by  the  name  of  Arundhati.  The  wife  of Vasistha  was  this  lady  on  Bhu  loka  (earth)  but  the true  Arundhati  in  Deva  loka.  No  compeers  to  these two  ladies  could  be  found  in  all the  three lokas.   

Note 29 : Marichi  and  other  Rishis  are  associated  here  with  desires,  in accordance  with  the  doctrine  of  „The  Secret  Doctrine‟  which  calls  them as Barhishads yielding to  humanity their  bodies  of  desires. 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31