🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 25 / YOGA VASISHTA - 25 🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 25 / YOGA VASISHTA - 25 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. చిదాకాశము - 3 🌻
కళ్ళు విప్పి చూసిన వివిధ రూపములు అగుపడునట్లు, జీవుడు మృతి చెందిన వెంటనే, అసంఖ్యాకములగు దృశ్యజగత్తు లగుపడును. కలలో ఒక నిముషములో అనేక దృశ్యములు అట్లే కనబడును. ఇదంతా భ్రాంతియె; తత్వజ్ఞానమే ముక్తికి కారణమని గ్రహించిన, ఈ సంసారము బ్రహ్మమే అని తెలియును.
తత్వమసి అనగా తత్; అది; త్వమ్ నీవు; అసి అయివున్నావు. అనగా తత్వమసి అయినది. ఆ బ్రహ్మమే నీవు అని తెలుసుకొనుటే తత్వము. బ్రహ్మము ముక్తుడగుట వలన పూర్వస్మృతి వుండదు. తదుపరి బ్రహ్మము నుండి యుద్భవించిన ప్రజాపతినని తెలియును.
సృష్టులన్నియు ఇట్లే, మిథ్యారూపమున, చైతన్యాకాశమున ఉదయించినట్లు కనబడుచున్నవి. కాని వాస్తవమున అట్లు కాదు.
కార్యము, కారణమునకు భేదము లేదు అని తెలియుటయె ముక్తి. బ్రహ్మమే బ్రహ్మమును గాంచుచున్నది. అభ్యాసమున బ్రహ్మవిషయకమగు ధృడ జ్ఞానము సంపాదించిన మనకు ఆ బ్రహ్మము దర్శనమగును. మానసిక శరీరమున, మానసిక నగరము, స్ధూల శరీరమున స్ధూల నగరము కన్పడును.
అంటత లీలాదేవి, దేవీ సమేతముగా గిరి గ్రామమును దర్శించనెంచి తాను స్థూల శరీరము వదలి సూక్ష్మశరీరముతోను, దేవి సూక్ష్మశరీరమున నున్నది కాన ఇరువురు సూక్ష్మశరీరులై అచటకరుదెంచిరి. అంత దేవి లీలావతి కిట్లు బోధించెను.
వాస్తవమునకు అవిద్య, బంధము, మోక్షము లేదు. నీవు ఈ విషయము గ్రహించి, ముక్తిని బడసితివి, వాసనలు నశించినవి. ఇపుడు నీకు ద్వైత భావము అంకురించదు.
నిర్వికల్ప సమాధి యందు ద్రష్ట దృశ్యములు నశించి పోవును. ఇవి స్వప్నమని గ్రహించిన అది మిధ్యమని తెలిసినట్లు, ఈ స్థూల దేహము వాసనాక్షయము వలన, అసత్తు అని బోధపడును. స్వప్నము తదుపరి స్ధూల దేహము అగుపించునట్లు, జాగ్రత్తు నుండి విడివడిన, అతివాహిక దేహము ప్రకాశించును. జాగ్రత్ సుషుప్తులు వాసనాశూన్యములైన స్ధితి, తురీయము. అదియె బ్రహ్మప్రాప్తి.
సంసారముననున్నను వ్యక్తి వాసనా శూన్యమైవున్న, దానిని జీవన్ముక్తి అందురు. మంచు గడ్డ వేడి వలన నీరగునట్లు, వాసనాశూన్య చిత్తము శుద్ద సత్వ స్వభావమున అతివాహికమగును. నిరంతర జ్ఞానాభ్యాసమున, వాసనాశరీరము క్షీణించి, ఈ దేహము అతివాహికమగును. మరణానంతరము ప్రతిజీవి అతి వాహిక దేహమునందును.
అపుడు లీలావతి, తాను ఏవిధంగా అభ్యాసము నాచరించవలెనో తెలుపుమని కోరగా శ్రీదేవి ఇట్లు చెప్పెను. ఏదైనా ఒక కార్యము సిద్ధించవలయునన్న అభ్యాసము అవసరము. అందుకు విషయమును గూర్చి చింతన, ప్రసంగము, తెలుసుకొనుటయె అభ్యాసమనిరి. ఎవరు సంసారమున విరక్తి చెంది జననమరణ శాంతికై భోగవాసనలను వదులుతారో వారే జయ మందుచున్నారు.
శాస్త్రాలోచన, దృశ్యజగత్తులు లేవనియు, నీవు నేను లేవను జ్ఞానమే బోధాభ్యాసమందురు. ఆ విధముగా నిత్యము ఆలోచించిన క్రమముగా ముక్తులగుదురని తెలిపెను. అంటత శ్రీదేవి, లీలావతి వారిరువురు, వారున్న చోటనే సమాధిస్ధితిని అభ్యాసము చేసిన పిదప, వారి వదనముల నుండి, పూర్ణచంద్రునివలె కాంతి వెలువడెను. అలా వారు ధ్యాన స్ధితిలో నిర్వికల్ప సమాధి స్ధితినందిరి.
సరస్వతిదేవి, లీలావతి దేవులిరువురు, ఆ గృహకాశము నుండియె చిదాకాశస్వరూపమును పొంది, ఆకాశమున విహరింపసాగిరి. అచ్చటచ్చట వారు సుందరమగు, దేవతల గృహములందు విశ్రమింపసాగిరి. వారు నలుదిక్కుల గల, హిమవత్, కైలాసాది పర్వతములు, సరోవరములు దర్శించిరి. ఆకాశ మధ్యమున, అనేక లోకములు వ్యాపించియుండెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 25 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 MUMUKSHU PRAKARANA - 2 🌴
May you, Oh Rama, remain immutably fixed in that state of direct cognition, after purging your mind of its impure Vasanas and making it, through the pure ones, attain the Atmic Seat, free of all stains and pains. Destroy all your illusory thoughts, so that they may not resurrect again.
Develop extreme quiescence of mind and bliss within yourself. And then through your intelligence freed from the longing after objects, you should, Oh Rama, commingle yourself with Brahman, engaged in the investigation of the significance of the holy sentence, Tatwamasi (That art You) and meditate upon such identity. Now listen to the utterances of Brahma seated on the honey-dropping lotus flower.‟
Vasistha’s own history: At which Raghava enquired of Vasistha the cause of such utterances when Vasistha went on thus „Out of Chidakasa which is the endless, the all-pervading, the seat of all and the illuminator of all objects, there arose Vishnu. Brahma arose out of the lotus of his heart and evolved, as so many creations of his mind, this earth and other diverse objects.
🌹 Note : There are three states of Akasa or planes of matter as mentioned in this work, of which Chidakasa or Jnanakasa is the third.
Now the author of the universe, Lord Brahma, (in the course of its progress), found the many noble souls in BharataVarsha (the portion of land including India) writhing under extreme pains and was moved to pity, like a father towards his afflicted son. Contemplating upon the salvation of these afflicted ones, he came to the conclusion that the cycle of births and deaths cannot be arrested by either Japas (uttering of Mantras) or Tapas (religious austerities) macerating the body or the many kinds of gifts or bathing in such holy waters as the Ganges and others or any other means except through Atman Jnana. Therefore, through his stainless mind, he created us all, like himself, with a bowl and, in the hand, a rosary of beads.
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment