🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 10 / Yoga Vasishta - 10 🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 10 / Yoga Vasishta - 10 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 ఆత్మ దర్శనము - 2 🌻
శమము ద్వారా శత్రువులు కూడ మిత్రులగుదురు. శమము వలన లభించు సుఖము, ఇంద్ర పదవియందు కాని, విష్ణు పదవియందు కాని లభించదు. శ్రమశాలియగు పురుషుని పిశాచములు, రాక్షసులు, దెయ్యాలు, విరోధులు, పాములు, పులులు గూడ ద్వేషింపవు. అలాగే విచారము వలన సంసారమను భూతము, మనోమోహము వలన కల్పింపబడినదని, దుఃఖమును కల్గించునవని తెలియుచున్నది. ఆత్మదర్శనము పొందిన యోగులు, జీవన్ముక్తులై సంచరించుచూ చాలా కాలము జీవించి పిదప ఉపాధి లేశమును కూడ పరిత్యజించి విదేహ ముక్తిని పొందుదురు.
విచారము నుండి తత్వజ్ఞానమును, అందుండి ఆత్మ విశ్రాంతియు, తద్వారా మనశ్యాంతి లభించి దుఃఖము నశించును. మిగిలినది సంతోషమే. సంతోషము వలన మనోవ్యాధులు, శారీరక వ్యాధులు కలుగవు. ఇట్టి వారు నిరుపేదయైనను సామ్రాజ్య సుఖమనుభవించును.
సాధుసంగమము కూడ నరులకు సంసార సాగరమును దాటుటకు తోడ్పడును. సాధు సంగమము వలన బుద్ధి వర్ధిల్లును. అజ్ఞానమను చెట్టు ఛేధించబడును. మనో వ్యాధులు నశించును.
ఈ విధముగా సంతోషము, సాధుసంగమము, విచారము, శమము, ఇవియే నరులకు సంసార సముద్రమును దాటుటకు ఉపాయములు. ఈ నాల్గింటిలో ఏ ఒక్కటైన అభ్యసించిన మిగిలినవన్నియు లభించినట్లే భావించాలి. ప్రతి వ్యక్తికి వివేక అభ్యాస మొక్కటియే అవసరము. అభ్యాస రహితమైన ఏ విద్యయు ఫలము నొసంగజాలదు.
శాస్త్రము పఠించిన వాని మనస్సు బుద్ధి రత్న దీపశిఖవలె ప్రకాశించి, మోహమును, అజ్ఞానమును బాపి బ్రాహ్మ పదార్ధమును తదితరమును చక్కగ తోపింపజేయును. కవచ ధారిని బాణములు కొట్టజాలనట్లు, దైన్య దారిద్య్ర దోషములలో నిండిన సంసార సృష్టి, ఈ శాస్త్రవేత్తను ఛేదింపజాలవు.
జన్మ ముందా? కర్మ ముందా? దైవం ముందా? లేక పురుషాకారము ముందా? విత్తు ముందా? చెట్టు ముందా? మొదలగు సంశయములు పగటి యందు రాత్రివలె, తత్వజ్ఞుని ముందు దూరమగును. ఈ గ్రంథమును విని మనన పూర్వకముగ అర్ధము గ్రహించగల్గిన, మోక్ష విషయమున ధ్యాన జపాదులు వుపయోగబడవు. సంసారతాప శాంతి నొసగు జ్ఞానమును, పొందగోరు వారు, ఈ శాస్త్రముతో పాటు, సుఖాసనము, లభ్యభోగము, సదాచారములు సత్సంగము, ఇతర శాస్త్రములైన ఉపనిష్పత్తులు, మోక్ష ధర్మము మొదలగునవి పఠించుట వలన, గొప్ప జ్ఞానము లభించి పునర్జన్మ తొలగును. మరల యోని యంత్రమునబడ నక్కరలేదు.
🌷. యోగ వాసిష్ఠ సారము / YogaVasishta Album 🌷
https://m.facebook.com/story.php?story_fbid=1763817640420416&id=100003765914812
🌹 Visit Yoga Vasishta page 🌹
https://www.facebook.com/యోగ-వాసిష్ఠ-సారము-Yoga-Vasishta-113428903390192/
My Facebook group :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://www.facebook.com/groups/465726374213849/
My Blog page
🌹 చైతన్య విజ్ఞానం - Teachings of Wisdom 🌹
https://www.facebook.com/WisdomClassRoom/
Telegram group :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://t.me/joinchat/Aug7plAHj-Ex1nwp4bfuEg
Telegram Channel :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://t.me/Spiritual_Wisdom
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 10 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
It is these ever-waxing desires that bring on the pains of re-birth, the heaviest of all pains. The Devas (celestials) extol disinclination of the mind (towards desires) as the greatest panacea for the remedy of the disease of desires which afflict even those living in palatial mansions guarded by forts.
It is desires that make the deep inner man manifest itself externally, like radiant damsels wearing golden bracelets or diseases or the rays of the sun which make the lotus bud blossom forth (and appear externally).
These desires of the mind which are like a diamond point or a sharp-poinetd sword or like the sparks of iron emitted out of fire will, in one moment, reduce to nothing those men great as Mahameru or the handsome wise men or the courageous or warriors or any others.‟
This body which is composed of the cool intestines, muscles, etc., and is subject to changes, being at one time fat and at another time lean, shines in this mundane existence simply to undergo pains. What more palpably fruitless, paingiving and degraded thing could be conceived of than this body which oscillates with pains or pleasures through the increase or decrease of the experiences of objects? Of what avail is this body whether eternal or otherwise, liable to pains and pleasures which house is tenanted by Ahankara, the householder having the ten mischievous cows of Indriyas (or the organs), the servant of Manas (mind) producing San- kalpa, and his partner of desires with the portals of the mouth wherein are adorned the festoons of many teeth and the monkey of the tongue?
If this body which is the medium of the enjoyment of wealth, kingdom, actions, etc., exist always, then no doubt it is one that should be longed after; but all these will vanish with the advent of Yama (Death) at his appointed time. What beauty is there to be enjoyed in this body which is composed of blood and flesh, has the tendency to rot, is the same for the rich as well as the poor and, being without discrimination, is subject to growth and decay. Only he who relies with certainty upon a lightning flash or an autumnal cloud or a vast Gandharva (illusory) city will cling to this body as true.‟
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment