🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 26 / YOGA VASISHTA - 26 🌹


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 26  / YOGA VASISHTA - 26 🌹

✍️. రచన : పేర్నేటి గంగాధరరావు

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. చిదాకాశము - 4 🌻


ఆయా ప్రదేశములలో గల వివిధ వస్తు సముదాయములు తిలకించుచు, చివరిలో గిరి గ్రామమునకు విచ్చేసిరి. అచట గల కొండలు, జలములు, వివిధ ప్రదేశములను అవలోకించిరి. తదుపరి ఆ ఇరువురు, ఆ బ్రాహ్మణ గృహమున కరిగిరి. అచట అదృశ్య రూపమున, ఆ గృహమున గల దాసీజనము, ఇతరులు, బంధువులను దర్శించిరి. అపుడు లీలాదేవి, సరస్వతి సామాన్య స్త్రీ రూపములు ధరించిరి. వారిని చూచి, గృహజనులు వారి అందచందములకు అచ్చరువందిరి. వారిని ఆహ్వానించిరి. అచట గల మృత దేహమును దర్శించి విలపించుచున్న పుత్రునిగని, అతని మస్తకముపై చేతి నుంచి ఓదార్చెను. అంతట జ్వేష్టశర్మ తన తల్లి లీలాదేవి ఓదార్పు వలన తత్వజ్ఞానమును పొందెను.


లీల కాతని యందు పుత్ర బుద్ధిలేదు. అందువలన అతనికి మాతృ రూపమున దర్శన మొసగలేదు. కాని తన్ను తన పుత్రుడు గాంచ గల్గునట్లు నీవు సంకల్పించితివిగాన అతడు నిన్ను చూడగలెను. అందువలననే నీ భర్త కూడా నిన్ను గాంచగలడు అని సరస్వతి లీలకు తెలిపెను. అందుకు కారణము నీవు సంకల్ప సిద్దురాలవైతివి. ఇంకను శ్రీదేవి లీలావతికిట్లు చెప్పెను. నీకు పెక్కు మంది భర్తలు గలరు. ఇపుడు నీకు ముగ్గురు భర్తలు గలరు. వారిలో మొదటి వాడు వసిష్టుడు (బ్రాహ్మణుడు) భస్మమై పద్ముడను రాజైనాడు అతని శవమె పుష్పములతో గప్పబడి అంతఃపురమున నున్నది. అతడే ఈ సంసారమున మూడవ భర్తగా విధూరధుడను పేర రాజైనాడు. అతడు ఇపుడు సంసారమను మహా సముద్రములో భోగసమూహములలో మునిగి యున్నాడు. 


అతడు అస్వతంత్రుడై యున్నాడు. ఈ సంసార మండపములు ధ్యానదృష్టితో చూచిన సమీపముననే యున్నవి. సంసార దృష్టితో చూచిన కోటి యోజనముల దూరమున నున్నవి. భ్రాతి వలన ఈ ఆత్మయందు జగత్తు స్పురించుచున్నది. వాస్తవమునకు పదార్ధమే లేదు.


అంతట లీలావతి తన వివిధ జన్మలను తెలుసుకొనగల్గెను. ఆయా జన్మలలో స్త్రీగను, పురుషునిగను, లతలుగను, శబరిగను, వివిధ లోకములలోను, పక్షిగను, భ్రమరముగను, లేడిగను, అప్సరసగను, తాబేలుగను, దోమగను, ఇట్లు అనేక విధములగు సుఖదుఃఖములనను భవించి, నానా విధములగు యోనులందు దిరుగాడి, ఇట్లుంటినని తలచెను. 


ఈ విధముగ లీల సరస్వతితో గూడి, ఆ పరిమిత గృహముననే స్వప్నమును గాంచి, అందు మరొక స్వప్నమును గాంచినట్లు బ్రహ్మండమున కరుగుట, గిరి గ్రామమును గాంచుట, మరొక బ్రహ్మండము, మరల గిరి గ్రామము. ఇట్లు అనుభవించెను. ఇదంతా భ్రాంతియె. వాస్తవమునకు ఇది ఆకాశమే. లీలాదేవి అభ్యాస బలముననే, జ్ఞానదేహమును దాల్చి, భూతభవిష్యత్‌, వర్తమాన కాల విషయములను గ్రహించ గల్గినది. తదుపరి లీలావతి సరస్వతు లిరువురు, సూర్యచంద్ర లోకములు, ధృవలోకము, సాధ్యలోకము, సిద్ధ, భూలోక, స్వర్గలోక, బ్రహ్మలోకముల నతి క్రమించి, బ్రహ్మండమును చేరుకొనిరి. అచట వారు, చిదాకాశమును గాంచి, చివరకు సర్వభ్రమలు తొలగించుకొనిరి.


ఎవరికి ఎచ్చట వాసనా జ్ఞానము స్పురించునో వారికి ఆయా తావులందు, అట్టి రూపములే అగుపడుచుండును. కాన తత్వజ్ఞులకు, ఊర్ధ్వ, అధో, మధ్యదేశ కల్పనయే లేదు. అచట కరుగుట లేదు. వారు కేవలము ద్వైత విహీనమగు, బ్రహ్మమునే కాంచుచుందురు. ఈ పదార్ధము లన్నియు ఈశ్వరేచ్చవలననే ప్రవర్తించుచున్నవి. ఇవన్నియు చిదాకాశముననే యున్నవి. అటనే జన్మించి, అచటనే లీనమగుచున్నవి. దీనికి కారణము ఆత్మ వస్తువే కొన్ని బ్రహ్మాండములు, బ్రహ్మస్పష్టించినాడు, కొన్నింటిని విష్ణువు, మరికొన్నింటిని ప్రజాపతి రచించినారు. కొన్నింటికి కర్తయే లేడు. అచట కేవలము మృగ, పక్ష్యాదులు మాత్రమే వున్నవి.


ఇట్లు లీలయు సరస్వతియు నిశ్మంకగా కాంచిన ఆకాశమున సిద్ధులు, చారణులు, గంధర్వులు, విధ్యాధరులు, అప్సరసలు, పిచాచ, రాక్షస గణములు, యుద్ధములు గాంచి, అంతాభ్రమయని జ్ఞానదృష్టి యందు గాంచి స్ధిరచిత్తులయిరి.

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Yoga Vasishta - యోగ వాసిష్ఠ సారము Channel 🌹, [14.03.20 22:56]

🌹 YOGA-VASISHTA - 26 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 MUMUKSHU PRAKARANA - 3 🌴


So  was  I born  and  having  saluted  him,  I  was  shown  a  seat on  a  petal  on  the  northern  side  of  the  lotus  in which  he  was  gloriously  seated-  There  he pronounced  a  curse  on  my  mind  that  it  should  be enveloped  by  Maya  for  one  Muhurta  (or  48 minutes).  


There  at  my  mind  became  stupefied  and I  began  to  play  the  woman  like  an  illiterate  and ignorant  person  devoid  of  all  spiritual  wisdom. Observing  me  thus,  Brahma  questioned  me  as  to the  cause  of  my  dire  sorrow.  To  which  I  asked  him how  this  Samsara  arose  and  how  Moksha  can  be attained  after  freedom  from  existence.  Upon  which he  blessed  me  with  a  true  cognition  of  the  higher state.  As  its  result,  I  was  in  a  non-fluctuating  state, owing  to  my  cognition  of  Jnana  Atman  Reality. 


Upon  which  Brahma  remarked  to  me  thus.  „it  was we  that  enveloped  your  intelligence  by  the  base Maya  and  then  cleansed  it  of  Maya  after  having annihilated  the  latter.  We  have  ordained  that  all souls  shall  be  initiated  by  you  and  attain  Moksha- After  the  dawning  of  full  Jnana,  you  shall  soon  go to  Bharata  Varsha  in  Jambu  dwipa  which  is  the land  of  all  perishable  Karmas  (religious  works). There  shall  you  initiate  men,  having  the  four qualifications  (of  attaining  salvation),  into  Atman Jnana;  but  shall  initiate  lovers  of  (ritualistic) Karmas),  in  whom  the  conception  of  egoism  has not  vanished,  into  the  due  performance  of  such Karmas.‟   


„According  to  his  mandates,  I  go  to  Bharata  Varsha and  live  in  it  so  long  as  humanity  exists  there.  I have  no  longing  for  any  objects  in  this  world.  I shall  ever  be  in  the  Sushupti  (dreamless  sleeping) state  and  thus  be  able  to  overstep  the  limits  of  the painful  mind,  though  engaged  in  the  daily  actions of the  world  No  actions  of  mine  identify themselves  with  my  Self.  Oh  valorous  Rama,  those intelligent  disciples  alone  will  be  knowers  of Atman  who,  after  thoroughly  discriminating between  a  guru  of  all-full  Jnana  and  another  of Ajnana,  find  an  asylum  in  a  supreme  immaculate Guru.  


Those  only  who  understand  the  teachings  of their  Gurus  (from  all  aspects)  by  an  instantaneous apprehension  of  what  they  (the  Gurus)  mean  and at what  they  drive,  will  see  them  realised (afterwards)  as  in  an  objective  vision.  The  stainless Guru  will  never  initiate  into  Tatwa  Jnana  those who  are  weak-willed  and  addicted  to  sensual desires.   

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31