🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 15 / YOGA-VASISHTA - 15 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 15  / YOGA-VASISHTA - 15 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. మనస్సు 🌻

శూన్యమగు ఆకాశమునకు పేరు మాత్రమే కలదు. వేరే రూపములేనట్లు, మనస్సుకు కూడ ఎటువంటి రూపము లేదు. అయినను ఆకాశము వలె మనస్సు సర్వత్ర విస్తరించి యున్నది. చంచల శక్తితో కూడిన మనస్సొక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది, స్వర్గ, నరకములకు పోవుచున్నది, యోచించుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది, పతనమగుచున్నది లేక ముక్తి పొందుచున్నది. ఇదంతయు మనస్సు యొక్క పనియే గాని, జగత్తు వేరుగ లేదు. సంకల్పమే మనస్సు.

చలనము నుండి వాయువు, ద్రవ్యము నుండి నీరు వేరుకానట్లు, మనస్సు సంకల్పము కంటే వేరు కాదు. దేహ రూపియగు బ్రహ్మమే మనస్సనిజెప్పబడి, అది భౌతిక బుద్ధిని సృష్టించుచున్నది. దృశ్య ప్రపంచమే మనస్సు. చిత్త మాలిన్యముల వలెనే నీకీ దృశ్యమగు విశ్వము కనిపించుచున్నది. ఈ మాలిన్యం తొలగినచో, దృశ్యము అగుపడదు. అపుడు నిర్మల దర్పణము వలె స్వచ్ఛమగుదుము.

గాలి వీచనిచో లతాదులు కదలవు. అలానే ఆత్మలో ఏకత్వముఏర్పడిన, చిత్త స్పందన ఆగి, రాగ ద్వేషములు వాసనలు దొలగిపోవును. అద్దము నందు ప్రతిబింబము లేకున్న అద్దము స్వచ్చమగునట్లు, నీవు ఈ జగత్తు కాదు అని భావించిన ద్రష్ట కూడ కేవలుడగును.

ఇదంతయు విన్న శ్రీరాముడు, వసిష్ఠు నీవిధముగా ప్రశ్నించెను. సత్తునకు వినాశము లేదు. అసత్తునకు ఉత్పత్తి లేదు. ఎడతెగక దోషములతో నిండి సద్వస్తువు వలె ప్రకాశించు ఈ జగత్తు, అసత్యమని ఎట్లు తెలుసుకొనగలమో తెలుపు మనగా, వసిష్ఠుడు ఇట్లు పల్కుచున్నాడు. ఈ దృశ్య ప్రపంచము శాంతించు మంత్రమును చెప్పుచున్నాను. దీని వలన దృశ్య భావము నశించును. ఆకాశాది భూతములు, వ్యవహారమందు మాత్రమే జగత్తు అనబడును. కాని పరమార్ధ దశ యందు బ్రహ్మమే కలదు. ఈ ప్రపంచము స్వప్నమున గాంచు గృహాదుల వలె, మనస్సు యొక్క కల్పనమే. ఈ మనస్సుకు యుత్పత్తి లేదు, శరీరము లేదు.

స్వప్నము, స్వప్నమును గాంచలేనట్లు మనస్సు అసత్తయ్యి, నిజేచ్చ వలన, నిజ శరీరమును కల్పించుకొని, దాని వలన, ఇంద్రజాలము వలె జగత్తును విస్తరించుచున్నది. చంచల శక్తితో కూడిన మనస్సోక్కటియే స్ఫురించుచున్నది, భ్రమించుచున్నది. స్వర్గ నరకములకు బోవుచున్నది. సంసారమున నిమగ్నమగుచున్నది. ముక్తి నందుచున్నది. ఇదంతయు మనస్సు యొక్క పనే. మనస్సు గాక మఱి జగత్తులేదు. మహాప్రళయమున దృశ్య సృష్టి అంతయు లయమగును. అప్పుడు మిగిలేది బ్రహ్మ మొక్కటియే.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 15 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 VAIRAGGYA-PRAKARANA 🌴

🌷 Destructive  Sakti  –
This  invulnerable  and destructive  Sakti  (potency  of  Brahman)  does  away with  the  universe  with  all  its  moving  and  fixed objects  and  reigns  triumphant  like  a  tigress  in  the forest  of  delusion  along  with  her  attendants  the goddess  Durga  and  others.  Having  put  an  end  to all  living  beings  and  the  universe,  she  holds  up  in her  hand  a  honeyed  vessel  which  is  this  earth  and wears  on  her  breast  the  three  Lokas  (worlds),  as  a garland  composed  of  the  three  lotuses,  blue,  red, and  white.*  

In  her  arm,  she  carries,  like  a  sportive par  rot  in  a  cage,  a  man-lion  thundering  with  the sound  of  a  thunder-cloud.  On  her  stainless  body, still  as  the  autumnal  sky,  she  has  sportively,  like the  young  cuckoo,  the  great  Time  with  his  sweet voice  like  that  of  the  melodious  flute.  Her victorious  bow  is  the  non-existence  of  all  and  her arrows,  the  created  pains.

 Thus  (at  the  time  of Pralaya  or  deluge),  does  she  dance  and  reel everywhere  at  her  sweet  will  and  pleasure  with great  radiance.  Besides,  she  wears  on  her  head Swarga  as  her  head  ornament  and  on  her  feet, Patala,  the  many  hells  strung  as  her  leg  ornaments. The  sun  and  the  moon  are  her  ear  ornaments,  the Himalayas,  her  bones  and  Mahameru,  her  golden ornament  and  the  Chakravala  Mountain,  her girdle.  Sometimes  she  will  ride  on  the  peacockvehicle  of  Subbaramania  (the  son  of  Siva)  inclining backwards  and  moving  to  and  fro.  

Sometimes  she will  assume  the  head  of  the  Rudras,  having  three eyes  and  the  terrible  moon  on  their  head. Sometimes  she  will  wear  (on  her  person)  as  a Chowrie  the  beautiful  locks  of  the  Goddess Parameswari  or  the  writhing  headless  living  trunks of  the  mighty  and  terrific  Bhairavas 9 ;  or  she  will carry  as  an  alms-  bowl  the  body  of  Devendra shining  with  a  thousand  eyes.  Wearing  (on  her neck)  the  garland  of  skulls  strung  together  by  the bodily  muscles,  she  will  annihilate  all  the  worlds  in a  manner  terrific  even  unto  herself  and  stay  in  the one  shining  Akasa.  It  is  this  terrific  woman  that  at the  time  of  the  great  Pralaya  dances  with  joy  with the  garlands  in  her  breast  composed  of  the  lotuses (w#.),  the  round  heads  of  the  all-  pervading Vishnu.‟   
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹