🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 29 / YOGA VASISHTA - 29 🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 29 / YOGA VASISHTA - 29 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. మృత్యువు 🌻
మృత్యువు బాల్యమున మృత్యుదాయకములగు కార్యముల నాచరించిన బాల్యమునే మృత్యువు కలుగుచున్నది. అట్లే నిషిద్ద కర్మల నాచరించిన, తదను సారము, యవ్వన వార్ధక్యములందు మృత్యువు లభించుచున్నది. శాస్త్ర విహిత కర్మలనొనర్చిన తదనుగుణమగు ఆయుర్ధాయమును పొందును.
మరణానంతరము జీవుడు కర్మఫలముల నెట్లు అను భవించునో తెలుసుకొనుమని చెప్పెను.
కృత్యముగమున 400, త్రేతాయుగమున 300, ద్వాపరయుగమున 200 కలియగమున 100 సం.లు మనుష్యుల ఆయుర్ధాయము ముండునని సృష్ట్యాదియందు, నిర్ణయింపబడినప్పటికి, అది పెరుగుచూ తగ్గుచుండును. ఆయువు క్షీణించి అంతిమ కాలము అరుదెంచిన, కర్మాను సారము మర్మచ్చేదకమగు వేదన కలుగును.
మరణమున దు:ఖమెట్లుండును?
అపుడు సుఖమేమైన లభించునా?
మరణానంతర మేమి జరుగును? చనిపోవు మనుషులు మూర్ఖులు ధారణాభ్యాసులు యుక్తిపరులుగ విభజింపబడిరి. వీరిలో ధారణాభ్యాసులు, యుక్తి పరులునైనవారు, దేహమును పరిత్యజించునపుడుగాని, తదుపరి గాని దు:ఖమును పొందరు. సుఖమునే పొందుదురు, మూర్ఖులు మరణ సమయమున దు:ఖమును పొందుదురు. ప్రాణమును, మనస్సును; నాభి హృదయము, భ్రూ మధ్యము, బ్రహ్మరంధ్రమందు నిల్పగల్గినవారు ధారణాభ్యాసులనబడిరి, పరకాయప్రవేశము నొనర్చు, నాడీమండల మార్గమునెఱుగువారు, యుక్తివంతులనబడుచున్నారు. శాస్త్ర సంస్కారము లేనివారు, దుస్సాంగత్య పరులగువారు, నిప్పునబడిన వారివలె, మరణ సమయమున ఎడతెగని దుఖఃమును పొందుచున్నారు. వారికి దిక్కులన్ని అంధకార మయములగును. పగటి పూట నక్షత్రములు కనిపించును. అపరిమితమగు బాధను పొందుదురు. ళ్ళు తిరిగిపోవుచున్నట్లుండును దిక్కులు తిరుగుచున్నట్లు, ఆకాశమునకు గోనిపోబడినట్లు భావింతురు. చీకటి నుంచి క్రింద పడినట్లు, రాతిమధ్య కప్పబడినట్లు, ఏమియుచెప్పలేనట్లు, హృదయము చిన్నాబిన్నమై పోయినట్లుండును.
నాలుకను ఎవరో పట్టిలాగు చున్నట్లు, సుడిగుండమున తిరుగు చున్నట్లు, నీటిలో కొట్టుకొని పోవుచున్నట్లు భావింతురు. ఇంద్రియముల, వ్రణముల బాధలు అనుభవించు చుందురు. స్మృతి క్షీణించును, నాడుల వ్యాపారమును ఆగిపోవును. వాయుగతి నిరోధమై, మృతుడగును, కాని వాస్తవమున చైతన్య పురుషుడు జన్మించుట లేదు, మరణించుట లేదు. కేవలము స్వప్న భాంత్రి వలె దానిని గాంచుచుందురు. వాస్తవములు కావు. వాసనా వైచిత్రమములు కావున, జీవుడు మరణించుట లేదు, జన్మించుట లేదు. వైరాగ్యాది సాధనా సంపన్నుడు, అవికారియునగు జీవుడు భ్రాంతి సమేతమగు ఈ జగత్తును తత్వదృష్టి వలన మిధ్యయని గ్రహించ, భయము నుండి విముక్తుడగును.
వాస్తవమునకు చైతన్యము శుద్దము, నిత్యము, దీనికి క్షయము లేదు. ఉత్పత్తి లేదు, ఇది స్థావర జంగములందు, ఆకాశ వాయువు అగ్ని, మున్నగు పదార్ధము లన్నిటియందు వర్థిల్లు చున్నది. వాయు నిరోధమైన నాడీ స్పందన ఆగిపోవును. కేవలము జడదేహము మృతిచెందినదని చెప్ప బడుచున్నది. ఇయ్యదిశరీర ధర్మమేకాని ఆన్యధర్మము కాదు, వాయువున సుగంధము వ్యాపించినట్లు , చైతన్యము జీవుని వాసనలతో కలసియుండును, పరలోకమున వాసనా పరమైన భోగముల ననుభవించినను. అచట మరలజన్మపొంది ఇంకొక శరీరమును పొందినట్లు భావించుకొనును. నిజానికి ఇవి ప్రేతములు మాత్రమే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 29 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 MUMUKSHU PRAKARANA - 6 🌴
These are the four-fold means for getting rid of this oppressive Samsara. Those who have intimately befriended these four have crossed the ocean of Samsara. Oh Rama of sweet patience and other qualities, please hearken to the stories (narrated in this book) which will relieve your pining mind of its delusion.
Atman Jnana, the end of all Vedas, will dawn of itself in one who probes into their underlying meaning without caring for their (surface) attributes or meaning. All delusions, such as love and hatred, etc., will vanish; the mind will become as pellucid as the waters of a pool in the autumnal season. Such persons of adamantine armour will never be pierced by the arrows of pains, such as poverty and others.
🌷 The fruits of an enquiry without desires:
‟A mind engaged in (Atmic) enquiry will never be afflicted by the awe-inspiring Maya and will maintain the equilibrium of a waveless ocean. All persons of excessive enquiry will acquire the depth of the unfathomable ocean, the stability of Mahameru and the coolness of the noble moon. The virtuous who tread the path of Atman Jnana will take delight only in Samadhi and other Karmas congenial to their pursuits, like a spotless and chaste woman who contemplates upon her lord as God and rejoices in such thought.
🌷 The characteristics of a Jivanmukta:
‟Then the above- said rare Jivanmukti state will gradually ripen in him who is desireless and in whose eyes there is nothing supernatural. His state is indescribable and yet he will move in the world like anybody else. His mind will not be bound by any longings after Karmas. He will be indifferent to joy or pains arising from good or bad results.
He will preserve a pleasant position in the happy enjoyment of whatever he obtains. He will not in the least concern himself with the enjoyments foreign to the path of the wise. He will ever be engaged in the ceaseless enquiry into the path of salvation which arises through interrogating the wise without transgressing their words in order to enjoy bliss uninterruptedly and be oblivious of this body.
Having attained Atman Jnana, he will not be re born and subject himself to the pangs of delivery from his mother s womb. Those sinful men whose minds are reeling amidst sensual pleasures, being led away by them, can truly be said to be the mere vermin generated out of the offal in their mother s womb. In the absence of the company of those great men of supreme intelligence, one should be per forming those actions which fetch him food gotten through right-earned and well-spent wealth.
So long as he gets quiescence in his stainless Atman and the certain (mental) quiescence of the Turya (4th) state dawns in him, he should ever be engaged in Atmic enquiry through a study of Atman Jnana books, quiescence of mind, right conduct, acuteness of intellect and association with the wise. How can this certain and stainless Turya state, arising through Atmic enquiry, be described in words?
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment