శ్రీ యోగ వాసిష్ఠ సారము - 36 / YOGA VASISHTA - 36
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 36 / YOGA VASISHTA - 36 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚 . ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. జీవుడు 🌻
నిర్మలము స్వప్రకాశ్రము, ఆనంద స్వరూపము, ఆద్యంత రహితము, విశుద్ధము, చిన్నాత్ర స్వరూపము, సర్వత్రా విస్తరించియున్న పరమాత్మ నుండియె చిత్తయుతుడైన బ్రహ్మ ఉత్పన్నమగు చున్నాడు. అతని చిత్తము నుండి జాగ్రత్తు సృష్టింపబడు చున్నది. ఉపాధి రహితము, సత్వ మయమునగు బ్రహ్మము శాంతిమయము. ఇది పరమాత్మ యొక్క అదృశ్య రూపము. బ్రహ్మ ఉపాధితో కూడి, ప్రాణమును ధరించి, ముక్తి నందు వరకు జీవుడని చెప్పబడుచున్నది. చిదాకాశమగు ఈ బ్రహ్మము నందు అసంఖ్యాకములగు జగత్తులు ప్రతిబింభించుచున్నవి. ప్రాణస్పందనతో, క్రియాత్మకముతో అహంభావముతో జీవుడు వ్యక్తమగుచున్నాడు. నిప్పున వేడిమి, మంచున చల్లదన మున్నట్లు, ఈ బ్రహ్మమున చాంచల్య రూపమైన జీవుడు ముక్తినందు వరకు ఉండును.
ఈ జీవుడు దృఢములగు వాసనా బలమున అహంభావి యగుచున్నాడు. ఆకాశమున నీలిరంగు లేకున్నను, ఉన్నట్లు తోచును. అనగా జీవుని యందు అహంభావము లేకున్నను, సంస్కార ప్రభోదితుడై అహంకారిగ మారుచున్నాడు. సంకల్పాను సారము చిత్తము, జీవుడు, మనస్సు మాయ ప్రకృతి అనునామముల పేర్కొనబడునది బ్రహ్మమే. ఈ జీవుడు సంకల్ప బలమున పంచతన్మాత్రలుగ మారుచున్నది. ఈ పంచతన్మాత్రలు తేజ కణ భావము పొంది బీజ అంకురముగ క్రమముగ మారుచున్నది. ఈ అంకురమున బ్రహ్మము ప్రకాశింప అండత్వము పొందుచున్నది. తదుపరి దివ్య దేహమును, అహంభావమును పొంది వివిధ లోకములలో, స్ధావర జంగములుగ మారుచున్నవి.
ఈ జీవులు బ్రహ్మభావము పొంది జగత్తుకు కారణమైన కర్మలను నిర్వహించును. జీవుడు మొదట సంకల్ప రహితుడు, నిష్క్రియుడైనప్పటకి, క్రమముగా సంకల్పములు, క్రియలతో బీజము, పత్ర, కాండ, శాఖల వల్ల పుప్పాది నానా రూపముల ప్రకాశించుచున్నాడు. పిదప జనన మరణ కారణమగు కర్మల ననుసరించి స్వర్గనరకాదులు పొందుచున్నారు. ఈ కర్మలు కేవలము సంకల్పములే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 36 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 6 🌴
🌻 1. THE STORY OF AKASAJA, THE SON OF AKASA 🌻
How all can enter into Brahman? Here Rama asked Vasistha thus „I may rather believe the entire Mahameru mountains to enter a mustard seed than the whole of Brahma s egg to merge into Brahman which is (said to be) the atom of atoms. To which, Vasistha of rare Tapas replied thus „This doubt of yours can be removed only after a study of Atma- Jnana Sastras and the association with the wise for a number of months and not days. The conclusion of all Sastras points to this only.
Those who have with great pains understood clearly this abstruse account (of evolution, etc.,) go into Samadhi and who through it, attain a direct cognition of the allfull Jnana, will reach the supreme state of a Jivanmukta, devoid of this illusory universe, though existent to others; and then this Jivanmukti state is no other than the Videhamukti state, the progress to the latter state being a mere matter of course.
Then Rama asked the Muni to enlighten him as to the efforts that should be made by him to tread the path laid down by the Sastras to attain the Jivanmukti and Videhamukti states.
Vasistha replied thus „Such persons, though moving in worldly objects, do not participate in them like the Chidakasa, which though permeating all objects, yet appears not to be so (to our visible eyes). Such Jivanmuktas are persons of transcendental nature in the enjoyment of eternal bliss. They are immaculate like Akasa and undefiled by love and other desires, though associated with their modifications.
Whether performing Karmas or not, they are not enmeshed by them, as they have no egoism. Though acting up to the worldly observances of life, they remain cool and unaffected by them, like utter strangers. Notwithstanding the possession of a full-shining mind and attention, they have not the least of longings-for objects.
The certitude of their conviction is of such a nature that they neither sink under any load of grief nor rejoice at any pleasures. They are in that undisturbed state of mental equilibrium when they enjoy the Jagrat (waking) state in Sushupti or the Sushupti state in Jagrat, devoid of all Vasanas, Neither are they afraid nor do they instil fear into the hearts, of any in the universe.
The great ones who conduct themselves thus, are called the Jivanmuktas and do not break loose from the bonds of Samsara though in possession of minds, since their minds are above the worldly things.
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment