🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 20 / YOGA-VASISHTA - 20 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 20  / YOGA-VASISHTA - 20 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 దృశ్య జగుత్తు ఉద్భవించుట - 2 🌻

సృష్ట్యాదిలో తన్మాత్ర పంచకము, జగత్తును సృష్టించుచున్నది.

లింగదేహము, జ్ఞాన, చిత్త కల్పనలు, స్థూల శరీరమునకు కారణమగుచున్నది. పురుషుడు స్వప్నమున తన్ను పాంధునిగ తలచుచున్నట్లే, జీవుడు తన్ను శరీరిగ భావించుచున్నాడు. చిత్తము ఏ విషయముల ఆకారమును దాల్చుచుండునో, జీవుడు కూడ అట్టివేయగు ఉపాధుల ధరించుచుండును. సర్వగామియగు ఆత్మ, జ్యోతిర్మయమగు లింగ శరీరమున ''అహం'' అభిమానమును దాల్చి వెలయుచున్నది.

స్వప్నమున, సంకల్పమును, ఈ శరీరమునకే జరుగుచున్నట్లు, జీవుడా స్వలింగ రూప యుపాధి శరీరము యందు అహంకారముతో కూడి, దాని యందు వున్నవానిగ భావించుకొని, కల్పనామయ దేహమును, అనుభవించుచున్నాడు. చిత్తము జీవుని నిజ గర్భ గృహము. అందుండియే కల్పనానుసారముగ కాలము, కార్యము, కల్పన, ద్రవ్యముల అనుభవము పొందుచున్నాడు. ఇది స్వప్న కల్పన వలె అసత్తు అగుట వలన అనుత్పన్నము. పరమాత్మ వాస్తవానికి వుత్పత్తి లేకున్నను, ఇట్లు యుత్పన్నమగుచున్నాడు. అతివాహిక దేహియగు ప్రభువు, దేహస్వరూపమై ప్రజాపతిగ పిలువబడుచున్నాడు. నిజానికి ఇందు ఏదియు ఉత్పత్తి అగుట లేదు, అగుపించుట లేదు.

ఉన్నదంతా అనంతాకాశము వలె బ్రహ్మకాశమే, మహా ప్రళయ సమయమున బ్రహ్మదులు లయమగునట్లు, వారిచే సృష్టింపబడిన ఈ ప్రపంచము లయముగునదియె కదా! ఇవి బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచున్నవి. మరల విలీనమగుచున్నవి. స్వప్నానంతరము అదంతయు లేనట్లే.

జ్ఞానము కల్గిన ఈ సంసారము మిథ్యయని బోధపడును. అందువలన జ్ఞానాకాశమున అఖండము, అనాదియు అయిన బ్రహ్మమునే ధరించగలము. అది పాంచభౌతికము కాదు. దాని వలన ఉత్పన్నమయిన పంచభూతాలు కేవలము అసత్యములే.

నిశ్చలమగు సముద్రమే తరంగములుగా మారునట్లు పరమాకాశము ఆ రూపమును త్యజింపకుండగానే జీవరూపముగా ప్రకాశించుచున్నది. కారణము సంకల్ప రూపమగు చిద్‌వృత్తియె. దీపము నుండి, దీపము వెలిగింపబడునట్లు, బ్రహ్మం నుండియె, జీవ సమూహము లన్నియు యుత్పన్నమగుచున్నవి. వృక్షము నుండి శాఖలు వెలువడునట్లు, అతని స్పందన వలనే జీవుడుతృత్తి అగుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 20 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 VAIRAGGYA-PRAKARANA 🌴

🌻 THE STORY OF  SUKA 🌻

The  Muni  replied  thus  „Brahmarshi‟ Suka  who was  replete  with  Jnana  (spiritual  wisdom)  which,  if developed,  puts  an  end  to  a  series  of  seven  rebirths  at  once,  enquired,  like  you,  into  the  origin  of things.  In  doing  so,  he  became  seized  with  doubts as  to  the  certainty  of  his  convictions  and  his equilibrium  of  mind  was  disturbed.  But  with  a non-fluctuating  mind  freed  from  the  thraldom  of sensual  objects,  he  approached  his  father  Vyasa living  on  the  mountains  of  Mahameru  and  asked him  for  a  solution  of  the  following  questions „Whence this Maya  generating  great  pains?   

How  does  it  perish?  Who  had  it  as  its  originator? What  part  of  it,  if  any,  does  endure?  When  did  all the  things  of  the  universe  originate?‟  After  Vyasa had,  given  suitable  replies  to  the  many  questions proposed  by  Suka,  the  latter  simply  remarked  that his  (father‟s)  explanation  had  not  dispelled  his doubts,  he  having  been  aware  of  the  same  before. Finding  it  was  not  possible  for  him  to  convince Suka  (his  son),  Vyasa  asked  him  to  apply  for solution  to  King  Janaka  of  stainless  and  supreme spiritual  wisdom.  Where upon  he  descended  from Mahameru  down  to  earth  and  reached  the  gates  of the  golden  palace  of  Janaka.  Though  apprised  of the  arrival  of  Suka,  the  Brahmarshi,  he  king  did  not go  in  advance  to  meet  him  as  he  wished  to  test  the new-comer‟s  equilibrium  of  mind.  Yet  Suka  was not  in  the  least  disconcerted  and  waited  at  the gates  of  the  king  for  seven  days.  Then  after  being detained  and  tested  in  another  place  for  seven days,  he  was  con  ducted  to  the  harem  in  the  palace and  was  there  sumptuously  fed  upon  the  choicest viands  of  six  tastes  and  treated  with  flowers, sandal  and  other  objects  of  enjoyment  by handsome  ladies  of  slender  waist.  And  yet  Suka who  was  like  a  cool  full-moon  was  indifferent  to the  dark  or  bright  aspect  of  these  enjoyments.  So that  neither  the  happiness  arising  from  the enjoyments to which Suka  was  exposed  by the  king nor  the  pains  flowing  out  of  the  disgrace  to  which he  was  subjected  did  affect,  in  the  least,  the  mind of  this  great  Muni.  Will  ever  the  soft,  noble  zephyr be  able  to agitate  Meru,  the  grandest  of  mountains? Observing  the  internal  exultation  of  the  Muni  s heart  (unruffled  by  the  externals),  the  king  saluted and  eulogised  the  Muni  and  then  addressed  him thus:  „Oh  Brahmarshi,  who  has  attained  the  highest fruit,  having  given  up  all  worldly  concerns,  please tell  me  what  business  has  wafted  you  here.‟
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31