🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 24 / YOGA VASISHTA - 24 🌹


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 24 / YOGA VASISHTA - 24 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు

📚.  ప్రసాద్ భరద్వాజ 


🌴.  ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. చిదాకాశము - 2  🌻


అందుకు దేవి కృపతో ఇట్లు పలికెను. ఒకానొక చిదాకాశమున, ఒక మూల సంసారమను ఒక మండపమున్నది. అందు భూమండలములో వలె పర్వతాలు, దేవతా స్త్రీల బొమ్మలు, భవనాలు, మైదానములు మొదలైనవన్నియు గలవు. ఆ మండపమున నివశించు బ్రాహ్మణుడు, భార్య పుత్రులతో మంచి ఆరోగ్యముతో, రాజభయ రహితుడై, శాంత చిత్తుడై, ధర్మపరాయణుడై, అతిధి సేవాతత్పరుడై యుండెను.


ఆ బ్రాహ్మణుడు వశిష్టుని వలె సర్వ వైభవములతో విలసిల్లు చుండెను. అతని పేరు వసిష్టుడు. కాని ఇక్ష్వాకుల పురోహితుడు కాదు. అతని భార్య అరుంధతి, వసిష్టుని అరుంధతివలె వున్నప్పటికి, వసిష్టపత్నివలె జీవన్ముక్తినొందలేదు. ఆ భార్య, భర్తలిరువురు సకల ఐశ్వర్యములతో తులతూగుచుండిరి. అతడు ఒకానొక రోజు సైన్యముతో వేటకై అరుదెంచుట కాంచెను. ఆ రాజు తన పరివారముతో సకల వైభవములతో విలసిల్లుచున్న, ఆ రాజ పరివారమును గాంచి ఆ బ్రాహ్మణుడు ఇట్లు చిందించెను. ఈ రాజత్వమెంత వైభవముతోనున్నది. తాను కూడ ఇంతటి వైభవముతో, సకలైశ్వర్యములతో తులయాగ గలనని ప్రతి దినము భావించుచు, తన దైనందిన కార్యక్రమములను ఏమరక యుండెను. ఆ బ్రాహ్మణ పత్నియు లీలావతి వలె భర్తతో సర్వశుభములననుభవించు చుండెను. కాలక్రమమున భార్య,భర్తలిరువురు ముదిమి వయస్సును చేరిరి. ఆ స్త్రీ లీలావతివలె, శారదా దేవిని ఆరాధించి, లీలావతి కోరినట్లు, తన భర్త మరణించిన, అతని జీవము తన గృహము నుండి వెలువడ కుండునట్లు కోరుకొనెను.


ఆ బ్రాహ్మణుడు మరణించగా లీలావతి భర్త వలె ఆకాశములో తన కల్పనా బలమున పరమశక్తి వంతుడగు రాజయ్యెను. అతడు తన శక్తితో, పృధివిని జయించి, తదుపరి స్వర్గము నాక్రమించి, పాతాళమును కూడ తన అధీనము నొనర్చుకొని ముల్లోకములను పాలించుచు సర్వ సంపదలతో ధర్మాచరుణుడై పాలించుచుండెను. ఆ బ్రాహ్మణుడు, పాంచ భౌతిక దేహమును, పరిత్యజించి, గృహాకాశమునచిత్తాకాశమయ శరీరము దాల్చెను. అతని భార్య దుఃఖ విహ్వలయై తాను కూడ, దేహమును త్యజించి, అతి వాహిక దేహమును దార్చి భర్త ననుసరించెను. వారి జీవములు స్థూల శరీరమును త్యజించి, ఆ గ్రామమున వారి ఇంటనే వసించుచున్నవి. వారి గృహములు, స్ధిరచరాస్థులు అట్లే వున్నవి.


ఆ బ్రాహ్మణుడే నీ భర్తయగు పద్ముడు. ఇపుడు రాజత్వమును పొంది, రాజ్యమును పాలించుచున్నాడు. నీవే అరుంధతియను ఆ బ్రాహ్మణపత్నివి అని శ్రీదేవి లీలావతితో పల్కెను.


అందువలన పూర్వపు సృష్టి భ్రమయని, చైతన్యమే భ్రమ వలన, జీవ స్వరూపమును ధరించెనని చెప్పెను. కనుక ఎయ్యదిభ్రమయో, ఎయ్యది శూన్యమో గ్రహించగలవని చెప్పెను.


అంత లీలావతి తన భర్త పరలోకమున నున్నాడు. అచట పర్వతములు దిక్కులు, భూములు, ఈ గృహమున ఎట్లుండగలవు అని ప్రశ్నించగా ఆ బ్రాహ్మణుని జీవాత్మ ఆకాశ భనమున, ఆకాశ రూపము నందు ఆకాశ రాజ్యమును కాంచుచున్నది. స్వప్నమున జాగృతి లోపించినట్లు మరణించిన పూర్వస్మృతి లోపించును. అందువలన మీరు విప్ర దంపతులై యుండు జ్ఞానము కలుగలేదు. చిన్న అద్దములో కనిపించు పర్వతమువలె, సూక్ష్మ అంతఃకరణము నందు కనిపించు విశాల ప్రపంచము, మిథ్య అయినట్లు, పృధ్వాదులు మిథ్యలే. నిర్మలాకాశ స్వరూపమగు పరబ్రహ్మమున అసత్యమగు సృష్టి సత్యమువలె గోచరించుచున్నదని పల్కెను. అంతట లీల ఆ బ్రాహ్మణుడు మరణించి ఎనిమిది దినములైన, మేమిచట చాలా ఏండ్లు నుంచి వున్నామె అదెట్లు వీలగునని పల్కెను.


అపుడు దేవి క్షణములు, కల్పములు, త్రిభువనములే నీవు నేను మున్నగు వస్తు సమూహములన్ని పరమాత్మ యొక్క ప్రభావమే అని, జీవుడు ఇంద్రియాలతో కూడిన ఈ దేహమే తానని, తన బంధుమిత్రులు, బాల్యము యవ్వనము వృద్ధాప్యము తనవేనని భావించును. సర్వ వ్యాపియగు చిత్‌ శక్తియే ఈ స్వప్నమును గాంచుచున్నది. నీటికి, కెరటమునకు భేదము లేదు. అట్లే ఇహ లోక పరలోకములకు భేదము లేదు. అంతా భ్రమ. అంతా చిదాకాశమే. జీవుడు మరణించిన వెంటనే త్రిభువన దృశ్యము, పూర్వస్మృతి ననుసరించి కల్గును. అప్పుడాతడు, హరిశ్చంద్రుడు ఒక్క రాత్రిని ద్వాదశ వర్షములని తలచినట్లు, ఒక నిముషములో కల్పము జరిగిన దనుకొనును.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 24 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 MUMUKSHU PRAKARANA 🌴


Summary:  Of  the  four-fold  qualifications  required of  a  neophyte  on  the  Path,  the  last  one,  viz.,  the longing  after  emancipation  is  treated  of,  in  this chapter.   


Vasistha  said  „Now,  oh  Rama,  hearken  to  what  I am  going  to  say.  Through  right  endeavours  in  this life  (of  the  world),  all  the  ends  of  human  aspiration can  be  achieved  by  following  strictly  the  Sastraic (or  scientific)  injunctions.  Such  endeavours  are two-fold,  one  in  the  direction  of  Atman  Jn3na Sastras  (or  the  sciences  relating  to  divine  wisdom) and  the  other  in  the  direction  of  (ordinary)  Sastras (treating  of  terrestrial  wisdom).  The  former  is,  on account  of  Moksha  and  the  latter  which  is  not  the true  Sastraic  path  leads  to  bondage.  Those  virtuous persons  only  will  gain  Moksha  who  from  their early  boyhood,  train  themselves  up  in  the  Atman Jnana  (or  spiritual)  lore,  associate  themselves  with the un  flinching  great  men  and  develop benevolence and  other  good  qualities.‟   


At  which  Raghava  exclaimed  „Being  under  the control  of  Vasanas  generated  by  me  in  my  former births,  I  have  not  been  making  efforts  in  the direction  of  the  right  path.  Oh  Guru,  what  then  am I  to do?   


On  Vasanas  pure  and  impure:  To  which  Vasistha replied  thus, „Oh  Rama of  marvellous  qualities,  it  is through  one  s  efforts  alone  and  none  else  that  the Brahmic  seat  can  be  mastered.  Now  the  hosts  of Vasanas  may  be  divided  under  two  heads,  vis.,  the pure  and  the  impure.  Of  these  two,  those  alone which  were  generated  by  him  in  his  many  lives will  cling  to  him  (in  his  future  births).  Should  the pure  ones  cling  to  him,  he  will  easily  attain  the immaculate  Brahmic  Seat  through  them;  but  in  the case  of  the  impure  Vasanas,  pains  will  be generated.  You  should,  oh  Rama,  even  through dint  of  painful  efforts,  avoid  these  impure  ones. Through  the  two  ordained  paths  of  good  and  evil, the  current  of  Vasanas  swells  enormously.  May you,  after  straining  all  your  nerves  in  the cultivation  of  Brahma  vidya  (Brahmic  science), liberate  yourself  from  the  impure  Vasanas  and  rest firmly  in  the  (pure)  Vasanas  appertaining  to  the beneficent  Reality.  You  should,  through  your  equal vision  over  all  and  your  own  efforts,  play  fully check  the  lad  of  mind  from  getting  into  the  impure Vasanas  and  make  it  associate  with  the  pure  ones. If  after  annihilating  the  many  impure  ones  which are  the  products  of  the  many  previous  births,  you should  make  the  pure  ones  dawn  now,  then  they will  conduce  to  your  (future)  efforts.  Even  should any  doubt  arise  in  your  mind  as  to  what  the  pure ones  will  lead  you,  you  should  always  be cultivating  them  only,  as  any  excess  therein  is  not, in  any  way,  injurious.  Till  your  mind  is  illumined by  the  Reality  of  Brahman,  you  should  always  be following  the  path  of  initiation  into  Brahman  by the  Gurus  through  the  sacred  sentences  of  the Vedas.‟ 

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31