శ్రీ యోగ వాసిష్ఠ సారము - 41 / YOGA-VASISHTA - 41

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 41  / YOGA-VASISHTA - 41 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. కర్కాటియను రాక్షసి కధ - 2 🌻
  
క్షుద్రబుద్ధి కలవారు నీచ వస్తువులనే ప్రార్ధింతురు. రాక్షసి తన తపస్సుచే, సూచియై, పిచాచత్వము నవలంభించెను. తపస్సులగు పవిత్రులు గూడ, తమ జాత్యానుసారముగ నుండు వాసనలు, కొన్ని క్షయ మొందవు. కర్కటి ఇతరులను బాధించుటయె యుద్ధేశ్యము కలది, కృశాంగులు, స్ధూలాంగులు అయినను, అస్వస్తుల దేహముల ప్రవేశించి, ప్రాణవాయువుతో కలసి, విషూచిక వ్యాధి కల్గించుచుండెను. ఆరోగ్యవంతులు, బుద్ధిమంతులను, దుర్భుద్ధులుగ నొనర్చుచుండెను. ఇట్లు అనేక సంవత్సరములు గడచెను. 

కర్కటి ధూళి యందు, చేతివ్రేళ్ళయందు, ఆకాశమందు, అగ్నియందు, వస్త్రదారములందు, శరీరములోని నాడు లందు, సూక్ష్మరూపములందు, ఈగలు చేరు దుర్గంధము లందు, ఎముకలందు, అపవిత్ర స్ధానము లందు, మలిన వస్త్రధారు లుండు ప్రదేశము లందు, చెట్టు తొఱ్ఱలందు, భీకరారణ్యము లందు, యాత్రికులు గుమిగూడు ప్రదేశములందు, దుర్గంధ మడుగులందు, మురికి కాలవలలోను, శరీరమంతటను వసించి యుండును; నగరము లందు, గ్రామములందు, పడియున్న వస్త్రములందు నాశ్రయించి, జ్వరాదులచే పీడితులగు వారిని నశింప జేయు చుండును. ఇతరులను బాధించుటయే దాని పని. 

ఈ విధముగా కర్కటి అన్ని ప్రదేశము లందు సంచరించుచు, తన ఆకలిని తీర్చుకొనుచు సంచరించుచుండెను. పిదప చాలాకాలమునకు, ఆ కర్కటి మనుజుల మాంసమును భుజించుచుండెను కాని, తృప్తిని పొందకుండెను. దాని తృష్ణ తీర లేదు. తన పూర్వపు విశాలమైన శరీరమున అంగములు నశించినవి. రుచికరమైన మాంసమును భుజించలేకున్నాను. నాకు మిత్రులు, బంధువులు లేరు. నాకు ఆశ్రమము లేదు. వాయువు వలె అటునిటు తిరుగుచున్నాను. నేను కోరుకున్న మరణము కూడ లభించుట లేదు.

మూర్ఖుడు తుచ్చమగు గాజు ముక్క కొరకు, చేతియందున్న చింతామణిని త్వజించినట్లు నేను నా నిజ శరీరమును వదిలి. అజ్ఞూనము వలన దుర్భుద్ది, దాని వలన అవస్ధలు ఏర్పడును. తుచ్చమగు రక్తమున గోరుచుంటినే. ఎట్టి దౌర్జన్యము. ప్రళయకాలమున సమస్త ప్రాణులను, సంహరించు శక్తి గల్గిన, పర్వతాకార శరీరమును ఎప్పుడు పొందుదును. మధ్య పూరిత ఘటములతోను, శవముల మాంసముతోను, ఎముకల తోను నా మనసైన దేహమును ఎపుడు నింపుదును.

ఆకాశమును సైతము నింపు నాశరీర మెచట, ఈ సూక్ష్మ సూచీ రూపమెచట. ఆహా! నేనెంత సూక్ష్మముగ నైతిని నా వినాశనమునకు కారణము నేనే అని భావించి, కర్కటి ఏకాగ్రచిత్తమై మవునం వహించి, పూర్వపు దేహమును పొందుటకు తపస్సు చేయ సంకల్పించెను. ప్రాణి హింసా కృత్యములు నిరోధించి, హిమాలయములపై తపస్సుకు పూనుకొనెను.

పర్వత శిఖరముపై జన సంచారము లేని, విశాలమగు భూమి యందు, తన అర్ధభాగముచే, భూమి నాశ్రయించి, తక్కిన అర్ధభాగమునట్లే యుంచి, ఊర్ధ్వముఖియె, తపమొనరించసాగెను. ఆ రక్కసి ధృడ సంకల్పముతో, పాదములను స్ధిరముగా నిల్పినదై, తపస్సు ప్రారంభించెను. ప్రకృతి తనకు సహకరించగా, ఆత్మబలముతో, ఇంద్రుడు కల్పించు తపో విష్నుములను తట్టుకొని నిలబడెను. నీటి యొక్క వాయువు యొక్క, అగ్ని యొక్క, మేఘముల యొక్క, విఘ్నములకు భయపడక, అనేక సంవత్సరములు తపమొనర్చెను.

బాహ్యచేష్టలుడుగుట చేత, ఆత్మవిచారము చేత,ఆత్మ సాక్షాత్కారము పొంది భూత, భవిష్యత్‌లను తెలుసుకొని, పవిత్ర అయ్యెను. పాపములు నశించెను. అట్లు ఊర్ధ్వముభియై, లోకముల తపింపజేయుచు ఏడు వేల సంవత్సరములు ఉగ్ర తపమొనర్చెను. ఆ తప: ప్రభావమున, హిమవత్పర్వతము, కూడ ప్రజ్వలింపబడి, జగత్తంతయు దహింపబడి నట్లయ్యెను. సమస్త లోకములు కలవరపడుచుండెను. ఇంద్రుడు, నారదుడు, కర్కటిని గూర్చి చర్చించసాగిరి.

అప్పుడప్పుడు ఆలోహ సూచిక తన యొక్క ఆలంబనము వీడి కర్కటి ఆకాశమందు, వాయువు ద్వారా, ప్రాణవాయు మార్గము గుండా దుష్టుల యొక్కయు, పాపుల యొక్కయు శరీరముల ప్రవేశించి, వారి ప్రేగులు, నాడులు, మేధస్సు, రక్తము లందు జొచ్చి, ఆయా ప్రాణుల శరీరమందు రంధ్రములు చేసి, చెట్టు తొఱ్ఱ లందు పక్షి వలె నివసించు చుండెను. ఆయా ప్రాణుల శరీర ఇంద్రియముల ద్వారా, వారి వారి భోజనములను, మరియు మనజుల మాంస విశేషములను ఆ జీవ సూచిక అనుభవించెను. 

పక్షులందు, భ్రమరము లందు, యుద్దవీరులు ఖడ్గము లందు, సమస్త యంగము లందు, నాడు లందు, ఆకాశ మందు, వాయువు నందు ప్రవేశించి క్రిందికి పైకి తిరుగు చుండెను. మరియు జలము లందు ద్రవత్వమును, అలల యందు తరంగములు, ఉదర మందు వాయువు స్ధితిని పొందును. అటు పిమ్మట జీవసూచిక నయ్యెదనని ధృడముతో తపమొనరించెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 41 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 11 🌴

🌻 2. THE STORY  OF LILA 🌻

„While  this  Vasistha,  the  lord  of  the  above mentioned  Arundhati,  was  residing  with  her  in  the valleys,  a  crowned  king  came  to  the  forest  there  on a  hunting  excursion  along  with  his  retinue.  The Rishi  saw  them  and  reflected  within  himself  thus (The  wealth  of  kings  is  indeed  beneficent  and enviable.  When  shall  I  be  able  to  be  the  ruler  of  the earth  with  retinues  encircling  me  and  with Chamaras  (chowries)  waving?  

When  shall  I  be  able to  reign  triumphant  as  a  monarch,  having  all  under my  sway  and  be  locked  in  the  embrace  of  sweet females  of  beautiful  breasts  bedaubed  with  red ointment?  From  that  day  forward,  Vasistha  was seized  with  intense  desires  and  though,  in  eager anticipation  of  the  realization  of  such  desires,  he went  on  performing  Karmas  regularly.  

Dotage having  come  upon  him  like  the  frost  upon  a  lotus, his  lady  implored  me  for  aid  like  yourself  and  was blessed  by  me  with  the  similar  boon  of  her husband  s  Jiva  not  leaving  her  house.  The Brahmin,  Vasishta  expired  thus  with  his  longing after  regality  ungratified.  Thus  was  he  of  the nature of Jivakasa  in his house.   

„Through  the  Sankalpa  of  the  mind  which  led,  into the  pleasures  of  regality,  Vasishta  who  was originally  of  the  nature  of  the  Jnanakasa,  he became  a  King.  In  that  state,  after  his  wife  found him  dead  who  was  a  Brahmin  of  great  Tapas,  there arose  a  two-fold  thought  in  her  of  leaving  the corpse  of  her  husband‟s  gross  body  and  joining him  in  his  subtle  body.  

While  the  Brahmin  s  sons, house,  lands,  forests,  mountains,  and  others  were thus  (in  the  gross  state),  his  Jiva  was  living separate  for  about  8  days  and  was  of  the  nature  of Chidakasa  in  that  very  house.  In  your  former  birth, this  Brahmin  of  I  your  husband  was  a  king.  Then you  were  his  wife,  going  by  the  name  of  Arundhati of  peacock-like  gait.  

Both  of  you  who  reign  here  as husband  and  wife,  like  the  loving  fresh Chakravaka 30  couples  or  Parvati  and  Parameswara, living  on  the  left  side  of  the  earth  are  no  other  than Arundhati  and  Vasistha.  Therefore,  oh  Lila,  who has  a  face like  unto  the  waxing  third  moon,  the  first creation  as  a  Brahmin  when  regality  was  longed for,  which  I  described  to  you  before  is  itself illusory.  Likewise  is  this  Padma  creation.  Even  the third  creation  of  Viduratha  birth  which  you  were  a witness  of,  is  also unreal,  like  the  reflected  image  in water.‟So said  Saraswati,  the  world  s mother. 

Note 30 : Chakravakas are  a  species  of  birds. 

On  hearing  these  words,  Lila  questioned  her  thus, „Oh  Goddess,  you  have  uttered  untruth  only.  How can  your  words  hold?  Where  is  the  Jiva  of  the Brahmin  that  lived  in  this  house?  Where  did  we, who  separated  here,  meet  together?  How  did  those who were  in  the  other  world  as  well  as  its  hells,  the ten  quarters 31  and  others  join  together  and  come  to this  pleasant  habitation  of  ours?  

Is  it  possible  to bind  the  infuriated  Indra  s  elephant  within  a  part of  a  mustard  seed?  Will  the  Mahameru  Mountain enter  a  lotus  seed  and  be  crushed  by  a  small  bee sitting  over  it?  Will  the  lions  be  vanquished  in  a war  with  the  angry  paltry  gnats  and  then  enter  an atom?  All  your  words  are  as  incredible  as  these and  will  not  fit  in  with  truth.‟   

Note 31 : Besides  the  eight  principal  and  intermediate  quarters,  the  Nadir  and the  Zenith  are  taken into  account.
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹