🌹. యోగ వాసిష్ఠ సారము - 1 / Yoga Vasishta - 1 🌹
🌹. యోగ వాసిష్ఠ సారము - 1 / Yoga Vasishta - 1 🌹
✍. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
1. వైరాగ్యము
మోక్షము లభించాలంటే కేవలం కర్మయోగము లేక కేవలం జ్ఞానయోగము సరిపోదు. ఆ రెండు పరస్పర ఆధారములు. ఎట్లనిన పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు అవసరం.
విష్ణుమూర్తంతటి వాడే భక్తుల శాపవశంబున రామావతారమెత్తి సతీవియోగ దుఃఖమనుభవించె. సనత్కుమారుడు బ్రహ్మలోకమందున్నపుడు విష్ణువు అచట కరుదెంచగా బ్రహ్మదులెల్లరు విష్ణువును పూజించ, సనత్కుమారుడు నిష్కాముడగుటచే విష్ణువును పూజించలేదు. అందుకు విష్ణువు కోపించి సనత్కమారుని కుమారస్వామివై జన్మించి, కామపీడితుడ వగుమని శపింప, సనత్కుమారుడు విష్ణువుపై అలిగి విష్ణువుని శపించెను. అపుడు విష్ణువు శ్రీరామునిగా జన్మించి సర్వజ్ఞత్వమును కోల్పోయి కొంతకాలము జీవించమనెను.
భృగువు భార్య విష్ణువుని పూజించి అతనిలో లీనమయ్యెను. అపుడు భృగువు తన భార్య మరణమునకు విష్ణువు కారణమని భ్రమించి విష్ణువును, భార్యావియోగముతో జీవించమని శపించె.
అలాగే రాధ శాపము వలన కృష్ణుని సఖుడైన సుధాముడు మరు జన్మములో జలంధరునిగా జన్మించినపుడు అతనిని వధించుటకు కృష్ణుడు జలంధరుని భార్య బృంద యొక్క పతివ్రతాధర్మమును మాయతో తప్పునట్లుగా చేయగా, బృంద కోపించి, భార్యావియోగముతో జీవించమని శపించెను.
ఇంకొక పర్యాయము దేవదత్తుని భార్య నృసింహ రూపి, విష్ణువుని చూచి భయంతో ప్రాణములు విడువగా దేవదత్తుడు కోపించి విష్ణువును భార్యావియోగము పొందుమని శపించె. ఈ విధముగా వివిధ భక్తుల శాప కారణమున విష్ణువు శ్రీరామునిగా అవతారమెత్తి శాప ఫలితము అనుభవించె. దేముడంత వానికే కర్మఫలిత మనుభవింప తప్పలేదు. మానవులమైన మనకు తప్పునా! (తప్పదు అని భావము) యధార్ధముగా వాస్తవము కాని ఈ జగత్తు బ్రహ్మము వలన ఆరోపించబడుచున్నది. ఇట్టి కల్పిత ప్రపంచము మరల మనస్సు నందు ఉదయించకుండునట్లు విస్మరింపబడుటమే ముక్తి స్వరూపము. కనబడే ప్రతి వస్తువు స్థిరత్వము లేనిది, ఆశాశ్వతమైది, బ్రహ్మ మొక్కటే స్థిరత్వము కల్గినది. మిగిలిన ప్రపంచము భ్రాంతి మాత్రమే. వాసనలు అనగా సంస్కారముల త్యాగమే మోక్షము.
సంస్కారములు రెండు రకములు (1) మలిన సంస్కారములు (2) శుద్ద సంస్కారములు. మలిన సంస్కారములు జన్మకు కారణము. శుద్ద సంస్కారములు జన్మ నాశనమునకు తోడ్పడును. మలిన సంస్కారములు అహంతో కూడి పునర్జన్మకు కారణమైన, శుద్ద సంస్కారములు పునర్జన్మకుపయోగ పడే అంకురములను దగ్ధము చేయును. ఇవి వేయించబడిన గింజల వంటివి. శ్రీరాముని చరిత్ర తెలుసుకున్న అతడు సంస్కారములనెట్లు తొలగించుకొనెనో తెలియగలదు.
శ్రీరాముడు గురుకులము నుండి విద్యార్జన చేసి తిరిగి వచ్చి కొంత కాలమున్న తదుపరి తీర్ధములు, పవిత్ర ఆశ్రమములు జూడ కోర్కెగల్గి తండ్రి అనుమతి పొంది, వశిష్ఠుని ఆశీస్సులతో ఒక శుభదినమున కొందరు ముఖ్యులతో కూడి అడవులు దాటి పోవుచూ, మధ్యమధ్య వచ్చు ఆశ్రమములను, పర్వతములు, నదులు, ప్రయాగ, నైమిశారణ్య, వారణాసి, గయ, కేదార, శ్రీశైల, మానస సరోవరములు మొ|| సకల తీర్థములు సేవించి అనుజులతో గూడి పరిభ్రమించె. తిరిగి నిజపురికేతెంచి, బంధుమిత్రులందరితో ఎనిమిది దినములు ఉత్సవములు జరుపుకొని సుఖముగా గృహముననుండెను.
తదుపరి రాముడు దైనిక కృత్యములు నిర్వహించుచు తమ్ములతో గూడి పితృగ్రహమున వాసమొనర్పసాగెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 1🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA PRAKARANA 🌴
Salutations to the Non-Dual Principle - through the three organs (of mind, speech and body) - that is the eternal Jnana (wisdom) Light illuminating (the three worlds) Bhu (earth), Antariksha (intervening space) and Swarga (heaven), as also our hearts and their exteriors and that has manifested itself everywhere as visible forms.
Persons qualified to read this work called Vasishta (the work of Vasistha) should neither be Ajnanis (the ignorant or the worldly wise), nor those Jivanmuktas (liberated ones), who have reached their Jnana-Atman, freeing themselves from all pain, but only those who, conscious of being under bondage, long after freedom from it, and are in that vacillating position, from which they contemplate attaining Moksha.
Muni Bharadwaja having prostrated before his omniscient Guru, Muni Valmiki addressed him softly thus How did Sri Rama of rare Satva guna come to be in this terrestrial Samsara (mundane existence) full of pains and generative of dire rebirths.
To which Valmiki replied thus: My son 2 Bharadwaja, your question is fraught with incalculable happiness (to you and the entire world). You art in possession of the four-fold 3 means of salvation which entitle you to question me about Nirvanic bliss. Hence hearken to what I am going to say to you. Thereby you will be able to master Ajnana which is the source of all pains.
This illusion of the universe manifests itself, though it really is not, in Para Brahm (the one Reality), like the blue colour which is unreal, though it appears in the sky overhead. The Supreme Nirvanic bliss is attained the moment when one, after having: decided in himself, that it will be decidedly beneficial to, not in the least, bring to recollection and to forget this illusion of the universe, cognizes, through intuitive spiritual perception, the unreality of the universe which appears, as real, to the mind that is of the nature of Samskaras (selfreproductive thoughts).
This Supreme Bliss is evershining, not created by any, self-existent and imperishable. But it will not be cognized and enjoyed by those ignorant persons who wallow in the mere pitfalls of the Sastras (book-learning) inculcating the lower (terrestrial) wisdom, as contra-distinguished from the higher (Divine) wisdom, which sets its face against the recollection of things; visible. The wise say that the best thing for a man to do in this world is to give up, without the least longing, Vasanas, (all affinities for objects) which cause the mind to fluctuate, and that such abdication constitutes the Eternal Moksha (salvation) and the stainless path.
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment