శ్రీ యోగ వాసిష్ఠ సారము - 38 / YOGA VASISHTA - 38
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 38 / YOGA VASISHTA - 38 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚 . ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సృష్టిక్రమము, చైతన్యము - 2 🌻
బ్రహ్మము, అనాదికాలము నుండి, ప్రకటితమగుచున్న చేతన శక్తినే జీవుడందురు. సంకల్ప స్వరూపమును, చిత్త సంస్కార మయమునగు చిచ్చకతనంతటతానే సంకల్పించుకొని, ద్యైతభావమును జనన మరణాది భావమును పొందుచున్నది. ఈ సృష్టి జగత్తు చైతన్యము యొక్క సత్తయె, ఈ చైతన్యము రజోపాధితో కూడినపుడు సృష్టి జరుగును. అది దూరమైనపుడు శాంతమగును.
చైతన్యము అజ్ఞానము వలన, తన చిద్భావమును, చిత్తమని తలచుటనే, చిత్‌స్పందనమని పండితుల భావము. దాని వలనే, జగత్తు బ్రహ్మము, జీవుడు, కర్మలు, దైవము అను వేర్వేరు అవస్ధలు, నామములు ఏర్పడినవి. స్వ విషయకము అజ్ఞానము వలన, నానా రూపములు ధరించి సృష్టి యందగపడుచు, సంకల్పానుసారము నానావిధ యోనుల నందుచున్నవి.
చైతన్యము సూక్ష్మ భూతములతో నేకమై పితృ శరీరము నుండి శుక్రరూపము వెలువడి శరీరమును పొందుచున్నది. సువర్ణ మొకటియేయైనను, వివిధ ఆకారములుగ మారుచున్నట్లు, చైతన్యము వేరువేరు శరీరములనాశ్రయించి భిన్నమైనట్లు అగపడుచున్నది. శరీరఉపాధానములగు పంచభూతములు వికారగ్రస్తమగుటచే, అవి నానావిధముల భేదించుచున్నవి.
అందువలన నిత్యమైన చిద్వస్తువు ''నేను జన్మించితిని, మరణించితిని'' మున్నగు బ్రాంతులను పొందుచున్నవి. పరబ్రహ్మమున, స్వాభావికముగనున్న మాయ యొక్క విజృంభణమే, జీవరూపమున వెలయుచు, దృశ్య రూపమున ప్రకటితమగుచున్నది. మనస్సే తన్మాత్రాదులను గల్పించుకొని, మిధ్యయగు జగత్తును సత్యమువలె విస్తరింపజేయుచున్నది. శుద్దమును, శాంతమును అగు ఆత్మ స్వమాయా రచితమగు, ఈచిత్త భ్రమను అనుభవించుచున్నది.
ఈ ఆత్మమే ఇంద్రియ ద్వారముల ద్వారా, జాగ్రదవస్ధ అనియు, అవాంభావముతో హృదయ మందు భరించుటను స్వప్నమనియు, స్మృతిబీజముల వాసనతో హృదయ మందు సంచరించుటను స్వప్నమనియు, ఈమూడవస్ధలు దాటి, చిత్‌స్వరూపము నందుట తురీయమని చెప్పబడుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 38 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 8 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
🌷 Summary: 🌷
Having shown that it is Paramatman, the Self-Consciousness, which manifests itself as Jiva, Iswara and Universe and which is identical with them, though appearing different, the author deals in this story with the heterogeneous actions of the Manas Maya arising out of the One Consciousness and the means of arresting that Maya.
🌷The Story of Padma: 🌷
Now, oh Rama, in order to relieve you from this dubious predicament of thine and to attain quiescence of mind, I shall relate to you an archaic story which you shall hear. There reigned, upon the earth, a king named Padma. He rejoiced in the possession of Satva guna and ripe discrimination. On his puissant arms rested Vijaya Lakshmi (or the Goddess of Victory). His royal partner went by the name of Lila and had the good qualities of strictly con forming to her husband s mind. She lived inseparable from him, like his shadow and mind.
🌷 Lila’s doings: 🌷
In this state, a thought flashed across her mind to adopt some means by which she could ever perpetuate the youth of her lovely lord, free from dotage and death and so enjoy his company always. For this purpose, she consulted with the Brahmins well versed in all the ancient four Vedas. They were unable to hit upon any means of arresting death in this world; Japa (utterances of Mantras), Tapas (religious austerities) and others conducing to the mere development of Siddhis (psychical powers).
Thereupon Lila thought to herself: „If I should predecease my lord, then I shall enjoy Nirvanic bliss unattended by any pains. But if he should die before me, I can be happy only in the event of his Jiva living in my house and casting it s gladsome glance on me. To this end, I shall worship the feet of Saraswati, the imparter of the Vedas and eulogise her.
So, without apprising her lord of her intentions, she strode the path pointed out by those great men, the masters of powerful Mantras and Sastras and worshipped the Devas and Brahmins. Having refrained from tasting food for three nights together, she took slight refreshment on the fourth day and that only once.
Thus she was engaged in sweet Nishta (meditation) for ten months, when Sarasvati overjoyed (at her meditation), appeared visibly before her with the radiance of a full moon in the sky and said „Oh Lila, what is your desire?‟
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment