🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 21 / YOGA-VASISHTA - 21 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 21  / YOGA-VASISHTA - 21 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. సమిష్టి జీవనము, వ్యష్టి జీవనము  🌻

బ్రహ్మము చుట్టును ఆవరించి యుండు అజ్ఞానమును, ఆత్మజ్ఞానము వినాశన మొనర్చుచున్నది. బ్రహ్మమే సమిష్టి జీవ రూపము దాల్చి పిదప వ్యష్టి జీవ రూపమును, దాల్చుచున్నది. వ్యష్టి జీవి ఇఛ్చకు కారణము, సమిష్టి జీవేచ్చ.ఈశ్వర నియమమునకు వ్యతిరేకముగ ఏ కార్యము సిద్ధింపదు.అనగా సమిష్టి జీవి ఇచ్చ ఫల సిద్దికి అనుకూలముగ నున్న కార్యము సిద్ధించును. వ్యష్టి జీవి ఇచ్చ వలన నేదియు సిద్దింపదు.

సమిష్టి జీవికి (బ్రహ్మ) కారణ,సూక్ష్మ శరీరములున్నవి. వ్యష్టి జీవికి ఈ రెండును కాక, క్రియాశీలమగు, స్థూల శరీరము కూడ వున్నది. అందువలన వృత్తి, ఇచ్చ ఫలముల తారతమ్యమునకు, స్థూల శరీరమే కారణమగు చున్నది.

చైతన్య శక్తి వలన చిదాభాస చైతన్యము అభిన్నమైనను, పరిణామాది శబ్ధముల వలన విభిన్నమైనట్లు తెలియబడుచున్నది. జలము తరంగములు అభిన్నము. అలాగే చైతన్యశక్తి తనంతట తానే, అహంకార మూలక బ్రహ్మండమును, తనయందే ధరించుచున్నది. బుద్ధి లేక అహంకారము, చిత్‌శక్తి యొక్క కల్పన మాత్రమే. వాస్తవము కాదు.

అలానే పంచతన్మాత్రలు, పంచభూతములు కూడ. కావున వాసనలు, కర్మలు పరిత్యజించి, నీవు, నేను అను భేదము త్యజించిన, సత్యము మాత్రమే మిగిలియుండును. మేఘములు ఆకాశమును కమ్మిన, ఆకాశము కనిపించనట్లు, మేఘములు తొలగిన ఆకాశము స్పష్టము. అట్లే దృశ్య ప్రపంచము తొలగిపోయిన, చిత్‌శక్తి యొక్క మూలస్ధితి అవగతమగును.

మనస్సు, కర్మ, స్థ్ధూల దేహము, దేవతలు నివసించు బ్రహ్మండము, ఇవన్నియు శూన్యములే. చైతన్యము యొక్క మార్పులే. ఏ పదార్ధము ఎద్దాని నుండి ఉత్పన్నమో, దానికి భిన్నము కాదు. చిత్‌శక్తి స్వయం ప్రకాశము. దీనికి నామరూపములు లేవు. అహంకారము, ప్రాణము, కర్మలతో కూడినపుడే జీవుడు ఏర్పడుచున్నాడు.

అజ్ఞానికి మాత్రమే దృశ్య ప్రపంచము వికారములతో గోచరించుచున్నది. జ్ఞానికి అంతా భ్రాంతియని తెలుసు. జాగ్రత్‌, సప్న, సుషిప్తులందు బ్రహ్మమే స్ఫురించుచున్నది. ఆకాశము, వాయువు, భూమి, జలము, చంద్రుడు, సూర్యుడు మొదలగు రూపముల ద్వారా బ్రహ్మము ప్రకటితమగుచున్నది.

దీపశిఖ ఆరిపోయిన మసి మిగిలినట్లు, జగత్తు నశించిన బ్రహ్మమే మిగిలియుండును. జగత్‌ చిత్‌ స్వరూపము యొక్క స్పందనము. ఆకాశమున నీలిరంగు కన్పించినను, అదిలేన్నట్లే, బ్రహ్మమున జగత్తు కన్పించుచున్నది. బీజము నుండి అంకురము వెలుడునట్లు, త్రిభువనములు బ్రహ్మము నుండే ఉద్భవించుచున్నవి. జగత్తు అజ్ఞాన దృష్టి యందు స్థూలమైనను, జ్ఞాన దృష్టి వలన జగత్తు యొక్క సూక్ష్మ జ్ఞానము తెలియగలదు.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 21 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 VAIRAGGYA-PRAKARANA 🌴

🌻 THE STORY OF  SUKA 🌻

At  which  Suka  questioned  him  thus , How  did Maya  arise?  How  does  it  grow?  And  how  is  it destroyed?  Please,  oh  guru,  explain  them  to  me truly.‟  

At  these  words  of  Suka,  Janaka  explained  in the  same  manner  as  Vyasa  did,  which  the Brahmarshi  no  sooner  heard  than  he  said;  „Thus had  I  known  previously  and  you  gave  the  same explanation,  my  father  gave  me.  The  significance  of the  holy  sentences,  given  out  in  the  sacred  books, point  only  to  the  non-dual  Atman.  

If  Maya  which originates  as  differentiated  out  of  the  one  Atman  in the  nature  of  breath  or  vibrations  is  again  merged into  it,  there  seems  not  to  be  even  an  iota  of  benefit derivable  from  this  perishable  Maya.

 Oh  Guru, who is  able  to  remove  the  delusion  off the  minds  of men,  please  throw  light  upon  the  nature  of  this incomparable  real  Atman?‟  To  which  the  king  thus replied  „Though  you  have  known  everything definitely,  still  you  have  asked  me  in  spite  of  your father‟s  words.  

The  state  given  out  (by  us)  is  the real  one.  Atman  alone  is  which  pervades  as  the  allfull  Chidakasa  everywhere.  Nought  else  is  but That.  That  Jnana  is  bound  by  its  own  Sankalpa

12. With  the  liberation  from  that  Sankalpa,  there  is freedom  from  the  trammels  of  bondage.  As  you have  now  clearly  cognized  that  Atman  Jnana,  you have  abandoned  all  longing  for enjoyments and  the sight  of  the  visibles.  

You  have,  through  your  allfull  mind  and  without  pains,  attained  all  that  could be  got  at,  vis.,  Brahman  itself.  You  have commingled  with  that  secondless  Principle  which is  above  the  reach  of  all  vision.  You  have  become  a Jivanmukta

13.  But  there  is  one  thing  which  you have  yet  to  do,  w  0.,  the  giving  up  of  the  delusion of  Maya  which  has  arisen  in  your  mind  (the  giving up  of which,  will  entirely  free  you  and  not  bar  your further  progress).‟
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31