🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 18 / YOGA-VASISHTA - 18 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 18 / YOGA-VASISHTA - 18 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. జీవన్ముక్తుడు - 2🌻

ఇంకను ఎవ్వని ముఖము సుఖము లభించిన వికసింపక, దుఃఖము లభించిన దుఃఖించక అన్ని సమయముల ఒకేరీతిగ నుండునో, లభించిన దానితో తృప్తి నొందునో అతడే జీవన్ముక్తుడు. అహంభావము లేనివాడు, కార్యము లొనర్చుచున్నను, ఒనర్పక పోయినను, కర్తృత్వాభిమానములు అంటని వాడు జీవన్ముక్తుడు. ఇంకను లోకమునకు భీతి కల్గించని వాడును, భీతినొందని వాడును, సుఖదుఃఖముల ననుభవించని వాడును, సంసారాసక్తి లేని వాడును. దేహియైనను నిరాకారుడు, చిత్త సహితుడయ్యు అమనస్కుడు , జగత్‌ వ్యాపారముననున్నను, కామమునకు లొంగనివాడు, పదార్ధములన్నింటియందు, ఆత్మ యొక్క పూర్ణత్వమును గాంచువాడు, జీవన్ముక్తుడనబడును. వాయువు స్పందనను వీడి నిశ్చలమగునట్లు, విదేహముక్తుడు మరల జన్మింపడు, మరణించడు, వ్యక్తము కాడు, అట్టివాడు బ్రహ్మమగుట వలన సృష్టి, స్ధితి, లయమొనర్చగల్గును. అతడు ఆకాశము, మేరు పర్వతము, భూమి, జల, అగ్ని, చీకటి వెలుగు, సముద్రమై యున్నాడు.

 భూత,భవిష్యత్‌ వర్తమాన కాలములందు, అతడే యున్నాడు. అట్టిముక్తిని పొందుటకు ఈ జగత్తంతయు బ్రహ్మముతో నిండియుండునని గ్రహించవలెను. అట్టి జ్ఞానము పొందుటకు అభ్యాసము, యుక్తి, ఉపదేశము అవసరము. ఖేచర ముద్రలో భూమధ్యమున జగత్‌ స్వరూపమును కాంచునట్లు, జీవన్ముక్తుడు, బ్రహ్మమై సర్వమును గ్రహించును. ఈ బ్రహ్మము సర్వదా పవిత్రము, జాగృతమునైనను, మరల అలా కాకుండ వున్నది. నానావిధ రూపములుగ వేర్వేరుగనున్నది. ఈ బ్రహ్మమే నీటి యందు అలలు లేచునట్లు, ఈ బ్రహ్మ వస్తువునుండియె, ఈ దృశ్య జగత్తు ప్రభవించినది. రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలు, క్రియలు వీటి జ్ఞానము కూడ ఈ బ్రహ్మము వలననే గల్గుచున్నది.

ప్రకాశ స్వరూపమగు ఈ బ్రహ్మము స్వయం ప్రకాశమే. బుద్దిగుహ యందుండి దానిని ప్రకాశింపజేయుచున్నది. దీనినెవ్వరు ప్రకాశింప జేయలేరు. చిత్త వృత్తుల నిరోధించి, మనస్సును కూడ లయమొనర్చిన, మిగిలియుండు అవర్ణనీయ సాక్షి చైతన్యమే అయ్యది. శరీరమునకు వాతాది స్పర్శలు తగిలినను, చిత్తమునకు, స్పర్శ జనించి, వికారము కలుగునట్లు బ్రహ్మమున్నది. అచల స్వభావులగు స్ధావర పదార్ధములకు మనోబుద్యాది ఇంద్రియములు లేకున్నను, చైతన్యమున్నట్లు, పరమాత్మస్ధితి సర్వత్ర విస్తరించియున్నది. బ్రహ్మ, సూర్య, విష్ణు, హరాధి దేవతలు లయమైనను, ఈ బ్రహ్మ మొక్కటియె మిగిలియుండును. దీనికెట్టి యుపాధి లేనందున, నిర్వికల్ప స్వరూపమగును.

ఈ జగత్తు బ్రహ్మమున నున్నను, దీనికి వేరు రూపము లేదు. కాటుక కును నలుపునకును భేదము లేనట్లు, బ్రహ్మమునకు జగత్తుకు భేదము లేదు. అలాగే మంచుకు చల్లదనమునకు భేదము లేదు. నీరు ద్రవ భావమును, వాయువు స్పందన రూపమును, ప్రకాశము కాంతి ఆకారము దాల్చుకున్నట్లు, బ్రహ్మము జగదాకారము వహించియున్నది. దృశ్యమున్నను ద్రష్టయుండును. దృష్టి యుండిన దృశ్యముండును. ఈ రెంటికిని బంధమున్నది. వీటిలో ఏ ఒక్కటి లేకున్న, రెంటికి ముక్తి కల్గును.

 దృశ్యబుద్ధి సంపూర్ణముగ నశించు వరకు, దృశ్యమగుపించు చుండును.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 18 🌹

✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 VAIRAGGYA-PRAKARANA 🌴

Pleasures,  pains,  relatives,  friends,  life,  death  and others  will  in  no  way  enthral  the  mind  of  the (emancipated)  Wise.  

To  them,  this  passing  life  is like  water  drops  sprinkled  by  the  wind  and  the sensual  enjoyments  are  like  a  lightning  flash.  Also the  period  of  youth  which  is  conducive  to  men  s salvation  (if  properly  utilized)  is  only  ephemeral. Having  reflected  well  upon  these  things,  quiescent sages  like  yourselves  are  ever  engaged  in  deep.- Samadhi  (meditation).  

The  proclivities  of  my discriminative  mind  are  also  towards  the identification  of  myself  with;  Kutastha  (Brahman); but  like  a  lady  separated  from  hen  deaf  lord,  my mind  will  neither  attain  the  certainty  of  Brahman nor  incline  towards  material  desires.  Therefore  in this  dilemma  of  mine,  please  point  out  to  me  that ever  resplendent  and  eternal  seat  devoid  of  pains, frailties,  Upadhis  (or  vehicles  of  matter),  doubt  or delusion.  What  is  that  eternal  state  unapproachable by  pains  wherein  I  shall  remain  unscathed  by  the fire  of  sensual  objects,  though  moving  in  them,  like a  ball  of  mercury  exposed  to  fire?  Like  the  ocean which  is  nothing  else  but  its  waters,  Samsara (mundane  existence)  rests  on  words  only, proceeding  from  the  power  of  speech.  

How  did  the righteous  Great  Ones  manage  to  avoid  the  pains  of this  world?  Please  be  gracious  enough  to  import,  to me  that  certainty  of  yours.  Does  not  this  supreme state  exist?  Is,  there  not  this  state  (sthiti)  of quiescence?  If  so,  will  not  any  one  unlock  to  me  the real  mysteries?  Otherwise  I  shall  not,  through  my efforts  alone,  be  able  to  attain  the  quiescent  state.

For  being  devoid  of  doubt  and  Ahankara,  I  shall not  perform  any  duties.  Neither  food  not  sweet water  nor  fine  clothes  will  I  long  for.  I  shall  not perform  the  daily  ceremonies  of  bathing,  giving, etc.  My  mind  will  not  incline  towards  wielding  the regal  sceptre  or  towards  pleasures  or  pains. Without  love  or  hatred,  I  shall  only  remain  silent and  be desireless,  statue-like‟.

Thus  did  Rama,  with  a  face  like  the  stainless  cool full  moon,  a  sweet  accent  and  a  mind  now  full blown  through.  Atmic  discrimination,  deliver himself  before  the  assembly  of  the  joyful  Munis and  then  remained  silent  like  a  peacock  ceasing  its cry  at  the  sight  of the  sable threatening clouds.   
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31